MLC Ramulu Naik
-
టీఆర్ఎస్కు అధికారం కల్ల
సాక్షి, హైదరాబాద్: కొత్త వా గ్దానాలతో ప్రజలను మోసం చేసేందుకు టీఆర్ఎస్ బయలుదేరిందని ఎమ్మెల్సీ రాము లునాయక్ పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకా లు అన్నారని.. కానీ టీఆర్ఎస్లోని కొందరికే నిధులు వచ్చాయని, నియామకాలు ఎటుపోయాయో తెలియదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్కు మరోసారి అధికారం రావడం కల్ల అని జోస్యం చెప్పారు. ఇరవై ఏళ్ల అనుబంధాన్ని కేటీఆర్ ఇరవై నిమిషాల్లో బొందపెట్టారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాములునాయక్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘టీఆర్ఎస్ మేనిఫెస్టో అంతా పచ్చి అబద్ధం. మేనిఫెస్టోలో గిరిజన రిజర్వేషన్లు ఎటుపోయాయి. తండాలు, గూడే లకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పినా పట్టించుకోలేదు. గోండులకు, లంబాడాలకు, యాదవులకు, కురుమలకు, బెస్తలకు, ముదిరాజ్‌లకు మధ్య ఈ ముఖ్యమంత్రి చిచ్చుపెట్టారు. నన్ను కిక్ ఆఫ్ అని సీఎం మాట్లాడారు. ఇది దళిత, గిరిజన, బీసీలను అన్నట్లే. నన్ను కాదు.. ఎన్నికల్లో ముఖ్యమంత్రిని, టీఆర్ఎస్ను ప్రజలు కిక్ ఆఫ్ చేస్తరు. 105 సీట్లలో టీఆర్ఎస్కు 25 నుంచి 30కి మించి రావు. టికెట్లు పొందిన అభ్యర్థుల్లో 70 మంది కుంటి గుర్రాలే’’అని ఎద్దేవా చేశారు. హరికృష్ణ చనిపోతే ముఖ్యమంత్రి కుటుంబం అంతా వెళ్లారని.. ఆలె నరేంద్ర, కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవ్‌రావు జాదవ్ చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదని విమర్శించారు. రేపటి నుంచి తనపై భౌతిక దాడులు చేయిస్తారని, తనకు, తన కుటుంబ సభ్యులకు ఏం జరిగినా సీఎందే బాధ్యత అని స్పష్టంచేశారు. -
సేవాలాల్ మహారాజ్ చరిత్ర అందరికీ తెలవాలి
దేవరకొండ : సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చరిత్రను తెలంగాణలోని ప్రతి గిరిజ నుడు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉం దని సేవాలాల్ బంజార సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మోతీలాల్‌నాయక్ అభిప్రాయపడ్డారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఈనెల 12న దేవరకొండ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించనున్న నేపథ్యంలో వారు మహారాజ్ చరిత్రకు సం బంధించిన బ్రోచర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోతీలాల్‌నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ 278వ జయంతిని జరుపుకునే తరుణంలో తెలంగాణలోని ప్రతి గిరిజనుడు ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాంరావు మహా రాజ్, ఎమ్మెల్సీ రాములునాయక్, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎస్టీ సెల్ జిల్లా అ«ధ్యక్షుడు రాం బాబునాయక్, లాలునాయక్ తదితరులు హాజరవుతున్నట్లు ఆయన తెలి పారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు పెద్దసంఖ్యలలో తరలిరావాలని కోరారు. నాగునాయక్, సాయికుమార్, రాజు, రమేశ్, కె.సునీల్, కె.రమేశ్, కె.శరత్‌నాయక్, నాగరాజు పాల్గొన్నారు. -
తిట్టుకు పది కోట్ల రూపాయలా?
తిట్టే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి. మనుషుల మధ్య తగాదాలు పెట్టడానికి తప్పా దేనికి పనికి రాదని నిందించకండి. నోటి తీట తీర్చడానికే తిట్లున్నాయని అపార్థం చేసుకోకండి. తిట్లపురాణమే లేకపోమే వర్తమాన రాజకీయం చప్పాగా సాగుతుందని వేరే చెప్పక్కర్లేదు. తిట్టడం, తిట్టించుకోవడం తెలిసిన వాడే నయా రాజకీయ రంగంలో రాణిస్తాడని కళ్ల ముందే ఎన్నో రుజువులు సాక్షాత్కరిస్తున్నాయి. ఒక్కోసారి తిట్టు కూడా కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. సినిమాల్లో ప్రతినాయకుడిని కథానాయకుడు నోటికొచ్చినట్టు తిట్టి తన్నితే అభిమానులు పరమానందభరితులవుతారు. అత్తాకోడళ్లు, ఆలుమగల మధ్య తిట్లు సరేసరి. ప్రత్యర్థులను ఘాటు పదజాలంతో నొటికొచ్చినట్టు తిట్టకపోతే మన నేతాశ్రీల్లో చాలా మందికి తోచదు. కొంతమంది నాయకులు వ్యూహాత్మకంగా తమను తిట్టించుకుని ఓట్లు కొల్లగొడుతున్నారు. అధికారంలోకి వచ్చాక జనంతో తిట్టించుకుంటున్నారు. ఎన్నికల్లో నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడం సహజం. తిట్టుకోసం కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారని తాజాగా వెల్లడైంది. ఉద్యమనేతను విమర్శిస్తే కోట్లు కుమ్మరిస్తామని యువగాంధీ వారూ ఓ నాయకుడికి ఆఫర్ ఇచ్చారట. అయితే తాను సమ్మతించలేదని సదరు నేత సావధానంగా బయటపెట్టడంతో ఈ తిట్టు బాగోతం వెలుగులోకి వచ్చింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను విమర్శిస్తే రూ.పదికోట్లు ఇస్తామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తనకు ఆఫర్ ఇచ్చారని ఎమ్మెల్సీ రాములునాయక్ వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్ ను విమర్శించాలని రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేవీపీ రాంచందర్‌రావు, జైరాం రమేష్, దిగ్విజయ్‌సింగ్ పలుమార్లు ఫోన్ చేసి కోరారని తెలిపారు. కానీ తాను అందుకు తిరస్కరించడంతో ఫోన్ చేయడం మానేశారని రాములు నాయక్ వివరించారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా తిట్టు కూడా తక్కువది కాదని.