రాములు నాయక్
సాక్షి, హైదరాబాద్: కొత్త వా గ్దానాలతో ప్రజలను మోసం చేసేందుకు టీఆర్‌ఎస్ బయలుదేరిందని ఎమ్మెల్సీ రాము లునాయక్ పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకా లు అన్నారని.. కానీ టీఆర్‌ఎస్‌లోని కొందరికే నిధులు వచ్చాయని, నియామకాలు ఎటుపోయాయో తెలియదని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌కు మరోసారి అధికారం రావడం కల్ల అని జోస్యం చెప్పారు. ఇరవై ఏళ్ల అనుబంధాన్ని కేటీఆర్ ఇరవై నిమిషాల్లో బొందపెట్టారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాములునాయక్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘టీఆర్‌ఎస్ మేనిఫెస్టో అంతా పచ్చి అబద్ధం. మేనిఫెస్టోలో గిరిజన రిజర్వేషన్లు ఎటుపోయాయి. తండాలు, గూడే లకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పినా పట్టించుకోలేదు.
గోండులకు, లంబాడాలకు, యాదవులకు, కురుమలకు, బెస్తలకు, ముదిరాజ్‌లకు మధ్య ఈ ముఖ్యమంత్రి చిచ్చుపెట్టారు. నన్ను కిక్ ఆఫ్ అని సీఎం మాట్లాడారు. ఇది దళిత, గిరిజన, బీసీలను అన్నట్లే. నన్ను కాదు.. ఎన్నికల్లో ముఖ్యమంత్రిని, టీఆర్‌ఎస్‌ను ప్రజలు కిక్ ఆఫ్ చేస్తరు. 105 సీట్లలో టీఆర్‌ఎస్‌కు 25 నుంచి 30కి మించి రావు. టికెట్లు పొందిన అభ్యర్థుల్లో 70 మంది కుంటి గుర్రాలే’’అని ఎద్దేవా చేశారు. హరికృష్ణ చనిపోతే ముఖ్యమంత్రి కుటుంబం అంతా వెళ్లారని.. ఆలె నరేంద్ర, కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవ్‌రావు జాదవ్ చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదని విమర్శించారు. రేపటి నుంచి తనపై భౌతిక దాడులు చేయిస్తారని, తనకు, తన కుటుంబ సభ్యులకు ఏం జరిగినా సీఎందే బాధ్యత అని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment