fires on government
-
Lok sabha elections 2024: పార్టీని ఆర్థికంగా చిదిమేసే కుట్ర
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ సభలు, ర్యాలీలు, అభ్యర్థుల భారీ ప్రచార కార్యక్రమాలకు ఎంతో ధనం అవసరమైన వేళ ప్రధాని మోదీ వ్యవస్థీకృతంగా కుట్రలు పన్ని కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా చిదిమేసేందుకు బరితెగించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఢిల్లీలో పత్రికా సమావేశంలో సోనియా, పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాం«దీలు మాట్లాడారు. పార్టీలో ముగ్గురు అగ్రనేతలు ఒకేసారి మీడియాతో మాట్లాడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల ప్రచారఖర్చులు, ప్రకటనలకు భారీ మొత్తంలో నగదు అవసరమైన వేళ తమ బ్యాంక్ ఖాతాలను అదునుచూసి స్తంభింపజేయడాన్ని నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ‘కాంగ్రెస్‌కు ప్రజలిచి్చన నగదు విరాళాలను బలవంతంగా లాగేసుకున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. ఓవైపు ఎలక్టోరల్ బాండ్లపై నిషేధం, మరోవైపు ఖాతాల స్తంభనతో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు. ఇవి నిజంగా అనూహ్యమైన తీవ్ర అవరోధాలు. ఇలా అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటూ కూడా మా శక్తిమేరకు అద్భుతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేపట్టగలుగుతున్నాం. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారన్నది సుస్పష్టం. ప్రధాన ప్రతిపక్షం ఆర్థికమూలాలపై దాడి చేశారు’ అని సోనియా ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఫ్రీజ్ చేస్తేనే ఆరోగ్యకర పోటీ సాధ్యం: ఖర్గే ‘డీఫ్రీజ్ చేయడమే ఎన్నికల్లో ఆరోగ్యకర పోటీకి బాటలుపరుస్తుంది. సాధారణ ప్రజానీకం కాంగ్రెస్‌కు విరాళంగా ఇచి్చన మొత్తాలను ఫ్రీజ్ చేసి, ఐటీ శాఖతో బలవంతంగా రూ.115.32 కోట్లు నగదు విత్‌డ్రా చేయించి మమ్మల్ని బీజేపీ లూటీ చేసింది. స్వేచ్ఛాయుత, పారదర్శకమైన ఎన్నికలు అత్యావశ్యకమైన ఈ తరుణంలో రాజ్యాంగబద్ధ సంస్థలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలను డీఫ్రీజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అని ఖర్గే కోరారు. ‘బీజేపీ అధికారంలో ఉంది. పైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ తమ ఖాతాలను వేల కోట్ల రూపాయలతో నింపేసుకుంది. ఎన్నికల్లో దీటైన పోటీకి వీలు లేకుండా మా పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. అధికారంలో ఉన్న వారు ప్రత్యక్షంగాగానీ పరోక్షంగానీ రాజ్యాంగబద్ధ సంస్థలపై నియంత్రణ కల్గి ఉండొద్దు. వనరులపై గుత్తాధిపత్య ధోరణి అస్సలు మంచిది కాదు’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి: రాహుల్ ‘ప్రధాన ప్రతిపక్షం అన్ని అకౌంట్లను ఫ్రీజ్చేయడం అంటే అది కాంగ్రెస్‌పై మాత్రమే ప్రభావం చూపదు దేశ ప్రజాస్వామ్యానికీ అది విఘాతమే. ఎన్నికల్లో పోటీచేసే సామర్థ్యాన్ని దెబ్బతీశారు. మేం ప్రచార కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాం. ఫ్రీజ్ చేసి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరపూరిత చర్యకు పాల్పడ్డారు. ఇలాంటి చర్యలతో దేశంలో ప్రజాస్వామ్యం ఉందనడం అబద్ధమే అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థలేవీ ఇక్కడ పని చేయట్లేవు’ అని రాహుల్ అన్నారు. ‘ఖాతాల స్తంభనతో కరెన్సీ కష్టాలు విపరీతంగా పెరిగాయి. మా నేతలు, అభ్యర్థులు విమానాల్లో దేశంలోని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లలేని పరిస్థితి. విమానం సంగతి పక్కనబెట్టండి. కనీసం రైలు టికెట్ కొనేందుకు కూడా కష్టపడుతున్నాం. 20 శాతం ఓటుబ్యాంక్ మాకున్నా రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి. అదునుచూసి ఎన్నికలకు రెండు నెలల ముందు మోదీ పన్నిన కుట్ర ఇది. ఇంత జరుగుతున్నా ఈసీ మౌనంవహించడం విచారకరం. ఈ విషయంలో ఈసీ ఇంతవరకు స్పందించలేదు’ అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఓటమి ఖాయం కావడంతో కావాలనే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తోందని బీజేపీ ప్రతివిమర్శ చేసింది. అసుర శక్తిపైనే పోరాటం: రాహుల్ విద్వేషం నిండిన ఆసుర(రాక్షస) శక్తిపై తమ పార్టీ పోరాటం సాగిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ‘శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం’ అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్య లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్వేషం నిండిన అసుర శక్తిపైనే తమ పోరాటం అని రాహుల్ గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో స్పష్టం చేశారు. అసుర శక్తిని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. -
గిరిజనుల మనోభావాలను కేద్రం దెబ్బ తీసింది: మంత్రి హరీష్ రావు
-
అప్పులు 3 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, వివిధ కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారంటీలు కలిపి రూ. 3.03 లక్షల కోట్లు ఉందని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మొత్తం అప్పులు రూ. 1.92 లక్షల కోట్లు కాగా, కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారంటీ రూ. 77,304 కోట్లు అని అన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ అవసరమని పేర్కొన్నారు. ఖర్చులు ఇష్టారాజ్యంగా చేస్తే ప్రమాదంలో పడతామని హెచ్చరించారు. బంగారు తెలంగాణ బదులు అప్పుల తెలంగాణగా మారుతుందన్నారు. చేసే పనులు తక్కువ.. ప్రచారం ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. 2022–23 నాటికి ఇవి మరింతగా పెరుగుతాయని పేర్కొన్నారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. సన్నబియ్యం ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చినవి కావని వ్యాఖ్యానించారు. విద్యుత్ వెలుగులు కాంగ్రెస్ చలవేనని అన్నారు. కూకట్పల్లి మండలంలో దళిత మహిళలకు 4 ఎకరాల్లో పట్టాలిచ్చారని, వాటిని కొందరు పెద్దలు ఆక్రమించారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో అక్రమాలకు పాల్పడిన గ్లోబరీనా సంస్థపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధరణి వెబ్సైట్లోనూ గ్లోబరీనా జోక్యం ఉన్నట్లు చెబుతున్నారని, దాన్ని దూరం పెట్టాలని సూచించారు. ఎనిమిది, పదేళ్లుగా పనిచేస్తున్న హోంగార్డులను తీసేశారని, వారు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థులకు ఫెలోషిప్ రావడంలేదన్నారు. ఇంతలో అధికార పక్ష సభ్యుడు బాల్క సుమన్ అడ్డుతగలగా, ఆయన్ను సంక్షేమ మంత్రిగానో ఏదో ఒకటి చేయాలని భట్టి ఎద్దేవా చేశారు. ఏడెనిమిది నెలల నుంచి విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహకాలు రావడంలేదన్నారు. మున్సిపల్ పంచాయతీ కార్మికుల జీతాలను రూ. 18 వేలు చేయాలని డిమాండ్ చేశారు. పాలీహౌస్ రైతులకు డబ్బులు నిలిపివేశారని తెలిపారు. గతంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు బంగారు రుణం తీసుకుంటే, రుణమాఫీని వర్తింపచేయలేదని భట్టి స్పీకర్‌కు ఆధారాలతో సహా వివరించారు. రూ. 78 వేలు తీసుకుంటే మాఫీ కాకపోగా, ఇప్పుడది వడ్డీతో కలిపి రూ.1.47 లక్షలు అయిందన్నారు. ఇంతలో స్పీకర్ జోక్యం చేసుకొని.. ఏడు శాతం లోపు వడ్డీ ఉన్నటువంటి బంగారు రుణాలను మాత్రమే పంట రుణాలుగా పరిగణిస్తారని, అంతకుమించితే పరిగణించరని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనంపై అభ్యంతరం తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో కలుపుకుపోవడంపై భట్టి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకేసారి 12 మంది విలీనం కాలేదన్నారు. ఒకసారి ఒకరు, మరోసారి ఇద్దరు ఇలా వేర్వేరుగా చేరారని, ఆ సమయంలో స్పీకర్‌కు విన్నవించామని గుర్తు చేశారు. ఆ సమయంలో వారిపై చర్య తీసుకోకుండా కాలయాపన చేశారని, చివరకు వేర్వేరు సమయాల్లో చేరిన 12 మందిని విలీనం చేశారని ఆరోపించారు. తమ ఫిర్యాదు సమయంలోనే ఒకరిద్దరిపై వేటు వేస్తే తమకు న్యాయం జరిగేదని వాపోయారు. ఇది సమంజసం కాదన్నారు. పాతబస్తీకి మెట్రో నడపండి.. ఎంఐఎం సభ్యుడు ముజంఖాన్ మాట్లాడుతూ.. పాతబస్తీకి మెట్రోరైలును తీసుకురావాలని సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. జ్వరాల తీవ్రత ఉన్నందున వైద్య ఖాళీలను భర్తీ చేయా లని కోరారు. అవసరమైన మందులను సరఫరా చేయాలన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ సభ్యుడు ఆరూరి రమేశ్ మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన కుటుంబాల ను ఆదుకునేందుకు మంత్రులు అజయ్, ఎర్రబెల్లి దయాకర్లతో కలిసి ఏపీకి వెళ్లామన్నారు. అక్కడి సీఎం జగన్‌తో కలిసి పరిస్థితిని చక్కదిద్దామని తెలిపారు. అక్కడి ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ. 3 లక్షలు, సాధారణంగా బయటపడిన వారికి రూ. లక్ష ఇవ్వాలని నిర్ణయించామన్నారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. పీహెచ్డీ విద్యార్థులకు కేంద్రమే ఫెలోషిప్ ఇస్తుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఫెలోషిప్‌పై విద్యార్థులకు అన్యాయం చేస్తుందన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని మెదక్‌కు ఎప్పుడు తెస్తారో ?
సాక్షి, మెదక్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీటిని మెదక్‌కు ఎప్పుడు తెస్తారో.. టీఆర్ఎస్ నాయకులు చెప్పాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ డిమాండ్ చేశారు. మరో 20ఏళ్లు గడిచినా ఆ నీరు మెదక్‌కు వచ్చే ప్రసక్తి లేదన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో 70శాతం సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నయమంటూ కొందరు నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని, మొన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కనీసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు కూడా పోటీ చేయలేనివారు.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నయం ఎలా అవుతుందన్నారు. కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌పార్టీకి ఘనమైన చరిత్ర ఉందని, చిరంజీవిలా ఎప్పుడూ వికసిస్తూనే ఉంటుందననారు. మెదక్‌జిల్లాకు ఇందిరమ్మ పేరు పెట్టాలని కోరడం జరిగిందన్నారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల వల్ల కుదురలేదన్నారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి..డబ్బులు సంపాదించి నేడు పార్టీలు మారుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పేర్కొన్నారు. శనివారం మెదక్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక క్రిస్టల్ గార్డెన్స్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోసురాజు మాట్లాడుతూ పార్టీ మారిన నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లో చేరే విధంగా పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఇందుకోసం జిల్లా మండల, నియోజకవర్గ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల బీఫాంల విషయంలో పీసీసీ, ఏఐసీసీ తలదూర్చదని తెలిపారు డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన విధంగా కాంగ్రెస్‌లో అనేక పదవులు అనుభవించి, నేడు పార్టీ మారినవారు నీతిమాలిన వారన్నారు. కానీ నాయకులు మాత్రమే పార్టీలు మారుతున్నారు తప్ప..కార్యకర్తలు కాదన్నారు. పార్టీలో ఎలాంటి గ్రూప్‌లు లేవని, అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లా నుంచి అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఇతర జిల్లాలకు తరలిపోయాయని, ప్రస్తుతం మహిళా డిగ్రీ కళాశాల సైతం తరలిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. అదే జరిగితే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఐదేళ్లుగా మెదక్‌లో రోడ్డు పనులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. సింగూర్ జలాలను ఎలాంటి జీఓ లేకుండా కేటీఆర్ నియోజకవర్గంలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు తరలించి ఈ ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టారని విమర్షించారు. తాము అధికారంలోకి రాగానే ఎన్డీఎస్ఎల్ను స్వాధీనం చేసుకుంటామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరి మ్యాడం బాలకృష్ణ, నాయకులు మామిళ్ల ఆంజనేయులు, మధుసూదన్‌రావు, పోతరాజు రమణ, ఆవుల గోపాల్‌రెడ్డి, లక్ష్మి, కిష్టయ్య తదితరులు ఉన్నారు. -
టీఆర్ఎస్కు అధికారం కల్ల
సాక్షి, హైదరాబాద్: కొత్త వా గ్దానాలతో ప్రజలను మోసం చేసేందుకు టీఆర్ఎస్ బయలుదేరిందని ఎమ్మెల్సీ రాము లునాయక్ పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకా లు అన్నారని.. కానీ టీఆర్ఎస్లోని కొందరికే నిధులు వచ్చాయని, నియామకాలు ఎటుపోయాయో తెలియదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్కు మరోసారి అధికారం రావడం కల్ల అని జోస్యం చెప్పారు. ఇరవై ఏళ్ల అనుబంధాన్ని కేటీఆర్ ఇరవై నిమిషాల్లో బొందపెట్టారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాములునాయక్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘టీఆర్ఎస్ మేనిఫెస్టో అంతా పచ్చి అబద్ధం. మేనిఫెస్టోలో గిరిజన రిజర్వేషన్లు ఎటుపోయాయి. తండాలు, గూడే లకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పినా పట్టించుకోలేదు. గోండులకు, లంబాడాలకు, యాదవులకు, కురుమలకు, బెస్తలకు, ముదిరాజ్‌లకు మధ్య ఈ ముఖ్యమంత్రి చిచ్చుపెట్టారు. నన్ను కిక్ ఆఫ్ అని సీఎం మాట్లాడారు. ఇది దళిత, గిరిజన, బీసీలను అన్నట్లే. నన్ను కాదు.. ఎన్నికల్లో ముఖ్యమంత్రిని, టీఆర్ఎస్ను ప్రజలు కిక్ ఆఫ్ చేస్తరు. 105 సీట్లలో టీఆర్ఎస్కు 25 నుంచి 30కి మించి రావు. టికెట్లు పొందిన అభ్యర్థుల్లో 70 మంది కుంటి గుర్రాలే’’అని ఎద్దేవా చేశారు. హరికృష్ణ చనిపోతే ముఖ్యమంత్రి కుటుంబం అంతా వెళ్లారని.. ఆలె నరేంద్ర, కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవ్‌రావు జాదవ్ చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదని విమర్శించారు. రేపటి నుంచి తనపై భౌతిక దాడులు చేయిస్తారని, తనకు, తన కుటుంబ సభ్యులకు ఏం జరిగినా సీఎందే బాధ్యత అని స్పష్టంచేశారు. -
టీచర్లకు థ్రిల్లర్ సినిమా!
- ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మండిపాటు అనంతపురం ఎడ్యుకేషన్ : బదిలీలు చేస్తారో, లేదో చెప్పకుండా ప్రభుత్వం టీచర్లకు థ్రిల్లర్ సినిమా చూపిస్తోందని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మండిపడ్డారు. స్థానిక ఉపాధ్యాయ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల్లోనే చేపట్టాల్సిన రేషనలైజేషన్, బదిలీలకు పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత పూనుకోవడం వల్ల అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. పోనీ షెడ్యూల్ ప్రకారమైనా ఈ ప్రక్రియను పూర్తి చేస్తోందా అంటే అదీ లేదన్నారు. ఇప్పటికి మూడు జీఓలు, 12 సవరణ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ ప్రభావం పాఠశాలలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దశాబ్ధాలుగా పంచాయతీరాజ్ టీచర్లు ఎదురు చూస్తున్న ఏకీకృత సర్వీస్ రూల్స్ ఫైలుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంఈఓ, డీవైఈఓ, డైట్ అధ్యాపకులు, బీఈడీ కళాశాలల అధ్యాపకులు, ఎన్సీఆర్టీ, జేఎల్ పోస్టులు భర్తీ అవుతాయని, దీంట్లో జాప్యం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ విషయమై మంగళవారం విద్యాశాఖ మంత్రి, కార్యదర్శిని కలిసి చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందు, రామన్న, ఏపీటీఎఫ్(1938) వెంకటసుబ్బయ్య, పండిత పరిషత్ ఎర్రిస్వామి, తులసిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం పెద్దన్న, యూటీఎఫ్ ఎస్వీవీ రమణయ్య, బీఈడీ ఉపాధ్యాయ సంఘం నారాయణస్వామి, పీఈటీ సంఘం లింగమయ్య, మోడల్ స్కూల్ టీచర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు.