mlc ummareddy
-
‘రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేశారు’
అమరావతి: ఏపీలో రాజ్యాంగం అపహాస్యమైందని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి అన్నారు. కొత్తగా మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసినా మార్పులపై ఈ విధంగా స్పందించారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను సైతం భాగస్వామ్యం చేసి బాబు రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేశారని ఉమ్మారెడ్డి విమర్శించారు. గతంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఎన్టీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఉమ్మరెడ్డి అన్నారు. -
హోదాపై బాబు సమాధానం చెప్పాలి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి దాచేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా అనే విషయం చర్చనీయాంశమైందని, హోదా వస్తుందా..రాదా అనే విషయంపై ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. దాచేపల్లి మండలం పొందుగల గ్రామంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని, ఈ అంశంపై ప్రజలకు బాబు స్పష్టమైన నిజాలు చెప్పాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ, టీడీపీల మ్యాన్ఫెస్టోలో కూడా పొందుపర్చారని, బీజేపీ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురాలేకపోతున్నారో ప్రజలు వివరించాలన్నారు. ఉత్తర భారతదేశంలోని 10 రాష్ట్రాలకు హోదా ఉండటం వలనే అభివృద్ధి చెందాయని, హోదా లేకపోతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు అభివృద్ధి చెందటం సాధ్యపడదన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్రంలో జరిగిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో హోదా వస్తుందనే భావనతో రూ4.65 లక్షల కోట్లతో పరిశ్రమలు స్థాపించేందుకు అంగీకారం తెలిపారని, హోదా రాకపోవటం వలన ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలో నెలకొల్పలేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రపతి నుంచి కేంద్రమంత్రులు, గవర్నర్‌ను కలిసి హోదా అవశ్యకతను వివరించారని, హోదా కోసం సభలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేపట్టారని ఆయన గుర్తుచేశారు. ప్రతిపక్షపార్టీగా హోదా కోసం శక్తికి మించి పోరాడుతున్నామని, హోదా వచ్చేంత వరకు పోరాటంను ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారపార్టీ అరచకాలు ఎక్కువైయ్యాయని, వచ్చే ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. -
హోదా కోసం ఎందాకైనా..
పట్నంబజారు(గుంటూరు) : పోలీసుల్ని అడ్డం పెట్టుకుని పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించినా భయపడే పరిస్థితి లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు, జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. గుంటూరుఅమరావతి రోడ్డులోని బత్తిన కల్యాణమండపంలో ఆదివారం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఈనెల 26 నుంచి జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా 27వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారని తెలిపారు. 22, 23, 24 తేదీల్లో గ్రామ, మండల, పట్టణస్థాయి సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని నియోజకవర్గ ఇన్చార్జిలకు సూచించారు. స్వార్ధప్రయోజనం కోసం పాలన చేస్తున్న చంద్రబాబు సింగపూర్‌లో వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల భవిష్యత్తు కోసం చేపడుతున్న ఈ దీక్షకు అన్ని వర్గాల మద్దతు కూడదీయాలని పిలుపునిచ్చారు. ప్యాకేజీల పాట సిగ్గుచేటు.. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హోదా కావాలని ప్రజలు కోరుతుంటే ప్రభుత్వం ప్యాకేజీల పాట పాడడం సిగ్గుచేటన్నారు. ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రత్యేక హోదా రాదని బాహాటంగా చెబుతున్నారని, చంద్రబాబుకు కూడా ఈ విషయం తెలుసన్నారు. రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఓటుకు కోట్లు వ్యవహారంతో చంద్రబాబునాయుడు ఎంత నిజాయితీపరుడో దేశ ప్రజలకు తెలిసిందని ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనేది సంజీవిని అని గుర్తుపెట్టుకోవాలన్నారు. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ స్వయంగా సీఎం హోదాలో ఉన్న మనిషి ఇసుక దోపిడీని అరికట్టండని చెప్పడం సిగ్గుచేటన్నారు. నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమలో కాలువల నీళ్లు కలిపి నదులు అనుసంధానం చేశానని సీఎం చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం నిలదీయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు మిన్నకుండిపోతున్నాడని విమర్శించారు. ప్రజల పక్షాన రాజీలేని పోరు.. పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ జగన్ చేపట్టనున్న దీక్ష రాష్ట్ర దశ, దిశను మార్చనుందన్నారు. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో దీక్షకు ముందుగా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆరేళ్లుగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం జననేత పోరాటబాట పట్టారని చెప్పారు. సీఈసీ సభ్యులు రావివెంకటరమణ మాట్లాడుతూ ప్రజల పక్షాన రాజీలేని పోరాటాలు చేస్తున్న ఏకైక నేత జగన్ అని కొనియాడారు. తెనాలి, తాడికొండ, వినుకొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, కత్తెర హెనిక్రిస్టినా, సురేష్‌కుమార్, బొల్లాబ్రహ్మనాయుడు మాట్లాడారు. పార్టీలో చేరిక.. సమావేశంలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలానికి చెందిన టీడీపీ నాయకుడు నన్నపనేని పూర్ణచంద్రరావు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సుబ్బారావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎం.డి.నసీర్ అహ్మద్, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, పలు విభాగాల నేతలు మామిడి రాము, కావటి మనోహర్‌నాయుడు, పోలూరి వెంకటరెడ్డి, మొగిలి మధు, దేవళ్ళ రేవతి, కొత్తా చిన్నపరెడ్డి, సయ్యద్ మాబు, బండారు సాయిబాబు, కోవూరి సునీల్‌కుమార్, ఉత్తమరెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, విజయలక్ష్మి, అంగడి శ్రీనివాసరావు, హనిమిరెడ్డి, కోటా పిచ్చిరెడ్డి, పల్లపు రాఘవ, శిఖా బెనర్జి, ఆవుల సుందరరెడ్డి, మండేపూడి పురుషోత్తం, దాది లక్ష్మీరాజ్యం, శానంపూడి రఘురామిరెడ్డి, జక్కింరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీక్షల సమావేశాలకు నియోజకవర్గాల పరిశీలకులు వీరే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26వ తేదీన చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షకు సంబంధించి 22, 23, 24వ తేదీల్లో జరగనున్న మండలస్థాయి సమావేశాల నిర్వహణ కోసం నియోజకవర్గాల పరిశీలకులను నియమించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పార్టీ కార్యాలయంలో ఆదివారం వివరాలను వెల్లడించారు. మాచర్ల నియోజకవర్గానికి పొందుర్తి గురవాచారి, గురజాల నియోజకవర్గానికి మర్రి వెంకటరామిరెడ్డి, వినుకొండ నియోజకవర్గానికి పిల్లి ఓబుల్‌రెడ్డి, చిలకలూరిపేటకు దేవళ్ల రేవతి, సత్తెనపల్లి నియోజకవర్గానికి కోవూరి సునీల్‌కుమార్, పెదకూరపాడుకు బసవ పూర్ణచంద్రరావు, నర్సారావుపేటకు సయ్యద్ మాబు, తాడికొండ నియోజకవర్గానికి బండారు సాయిబాబు, మంగళగిరి కొత్తా చిన్నపరెడ్డి, ప్రత్తిపాడుకు కావటి మనోహర్‌నాయుడు, పొన్నూరుకు ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, బాపట్లకు డాక్టర్ రూత్‌రాణి, తెనాలికి కొలకలూరి కోటేశ్వరరావు, వేమూరుకు జలగం రామకృష్ణ, రేపల్లె నియోజకవర్గానికి చందోలు డేవిడ్‌రాజులు నియమితులయ్యారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూచించిన కార్యక్రమాల్లో పాల్గొని సమావేశాలు, సమీక్షలు నిర్వహించటంతో పాటు ప్రజలకు హోదా వలన ప్రయోజనాలు వివరించాలని తె లిపారు. ప్రజలను చైతన్య పరిచే భాధ్యతను పరిశీలకులు చూసుకోవాలని సూచించారు. -
సమర్థతకు పట్టం
సాక్షి, గుంటూరు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఏకగ్రీవంగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభినందన సభ గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో ఆదివారం ఘనంగా జరిగింది. ఉమ్మారెడ్డిని అభినందించేందుకు ఆ పార్టీ రాష్ట్రస్థాయి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తరలి వచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. తొలుత నగరంపాలెం సెంటర్లో ఉన్న దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు అక్కడి నుంచి ర్యాలీగా సభా వేదిక వద్దకు వచ్చారు. సభలో ముఖ్యఅతిథి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పెద్దలసభకు అనుభవజ్ఞుడైన డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ఎన్నుకున్న జిల్లా ప్రజాప్రతినిధులకు, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాను వైఎస్సార్సీపీలో చేరిన తరువాత తొలిసారిగా ఉమ్మారెడ్డి అభినందన సభలో గుంటూరు ప్రజలను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు ఏడాదిపాలనలో రైతులు అధోగతి పాలయ్యారని మండిపడ్డారు. ప్రజాకంఠక పాలన సాగిస్తున్న టీడీపీని తుదముట్టించడానికి వైఎస్సార్సీపీ శ్రేణులు కలసి కట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.మరో ముఖ్యఅతిథి ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉమ్మారెడ్డిని ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం హర్షణీయమన్నారు. మండలిలో ప్రజా సమస్యలపై సమర్థంగా పోరాడగలిగిన వ్యక్తి ఉమ్మారెడ్డి అని కొనియాడారు. ఉమ్మారెడ్డి ఎల్లప్పుడూ ప్రజలతో మమే కమై ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారని, పార్టీ బలోపేతానికి సైతం ఆయన చేసిన కృషి అభినందనీయమని అన్నారు. రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉమ్మారెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జిల్లాకే గర్వకారణమని, ఆయనకు ఎమ్మెల్సీ పదవి చిన్నదే అయినప్పటికీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలపై ఆయన సమర్థంగా పోరాడగలరని అన్నారు.మరో అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తిని పెద్దల సభకు ఎన్నికైన ఉమ్మారెడ్డి తన అనుభవాన్ని జోడించి ప్రజా సమస్యలపై పోరాడగలరని చెప్పారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ గాడితప్పిన పంచాయతీరాజ్ వ్యవస్థపై ఉమ్మారెడ్డి ఎమ్మెల్సీగా పోరాటం చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిర్వీర్యం అవుతున్న స్థానిక సంస్థలను కాపాడగలిగిన అపార అనుభవం ఉన్న వ్యక్తి ఉమ్మారెడ్డి అని కొనియాడారు. అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును గజ పుష్ప మాలతో ఘనంగా సత్కరించి ఒక్కొక్కరుగా వచ్చి అభినందనలు తెలిపి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం సన్మానగ్రహీత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందిన స్థానిక సంస్థల ప్రజాప్రతిధులంతా సంఘటితంగా ఉన్నారనే సమాచారం తెలిసిన చంద్రబాబు పోటీ పెట్టకుండా వెనక్కు తగ్గారని చెప్పారు. తనకు సహకరించిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, తనను ముక్తకంఠంతో ప్రతిపాదించిన జిల్లా పార్టీ నేతలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్తఫా, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, నేతలు కావటి మనోహర్‌నాయుడు, బొల్లా బ్రహ్మనాయుడు, రావివెంకటరమణ, అన్నాబత్తుని శివకుమార్, ఆతుకూరి ఆంజనేయులు, గుదిబండ చిన వెంకటరెడ్డి, దుట్టా రామచంద్రరావు, మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, దేవెళ్ల రేవతి, లాల్పురం రాము, నసీర్ అహ్మద్, మిట్టపల్లి రమేష్, పోలూరి వెంకటరెడ్డి, కావూరి సునిల్‌కుమార్, మొగిలి మధు, సయ్యద్ మాబు, వెంకటరామయ్య, ఉత్తమ్‌రెడ్డి, జలగం రామకృష్ణ, యేళ్ల జయలక్ష్మి, పానుగంటి చైతన్య, బండారు సాయిబాబు, కొత్తా చిన్నపరెడ్డి, శిఖా బెనర్జీ, రూత్‌రాణి, మెట్టు వెంకటప్పారెడ్డి, పురుషోత్తం, కొండా రెడ్డి, అత్తోట జోసఫ్, చింకా శ్రీనివా సరావు, శ్రీకాంత్ యాదవ్, ఝాన్సీ రాణి, బాబు, షేక్ జానీ, యేరువ, ఉప్పుటూరి, కడియాల శ్రీనివాసరావు, తాడేపల్లి మణికంఠ, పాల్గొన్నారు.