M.M. Keeravani
-
గీత స్మరణం
పల్లవి : బృందం: తకఝం తకఝం ఝం (2) అతడు: కిలకిలకిలకిలకిల పడుచు కోకిల పలికె ప్రియగీతిక పెళ్లికిలా ఆమె: కలకలకలకలకల వలపు దాఖల తెలిపె శుభలేఖల సరిగమలా అ: మెరుపుల చెల్లి మా పిల్లకి ఆ: మేఘాలన్నీ పూపల్లకి ఏడేడు వర్ణాల ఆషాడవేళ ॥॥ చరణం : 1 అ: వేచి వేచి వేడెక్కే ఆ వేచి ఉన్న పండక్కే నే పరుగులు తీస్తున్నా ఆ: కాచుకున్న కానుక్కే నే కాచుకున్న వేడుక్కే నేనెదురై నిలుచున్నా అ: కాదే అవునై కవ్విస్తే... బృం: తకఝం తకఝం ఝం ఆ: కన్నే పిలుపై కబురొస్తే... బృం: తకఝం తకఝం ఝం అ: ఆ... కొమ్మచాటు కోకిలమ్మ గట్టిమేళాలెన్నో పెట్టి కాళ్లు కడిగి కన్యనిచ్చి పేరంటాలే ఆడే వేళ ॥॥ చరణం : 2 ఆ: జాబిలమ్మ కన్నుల్లో ఓ సందె సూరీడున్నట్టే నీ తహతహ చూస్తున్నా అ: ఒంటినిండా ఊపొచ్చి ఒంపులెన్నో ఊరించే నీ తకధిమి వింటున్నా ఆ: కాయే పండై కలిసొస్తే... బృం: తకఝం తకఝం ఝం అ: అది పండే నోమై చిలకొస్తే... బృం: తకఝం తకఝం ఝం ఆ: తోటలోని పూలన్ని సిరి తోరణాలై దీవిస్తుంటే గోరువంక పెళ్లి మంత్రాలెన్నో చదివే సుముహూర్తంలో ॥ చిత్రం : పెళ్లిసందడి (1996); రచన : వేటూరి, సంగీతం : ఎం.ఎం.కీరవాణి; గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర, బృందం నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : అతడు: ఏమని అడగనూ... ఏ వరము నిను కోరనూ నీ దాసదాసానుదాసుడనూ నీ ఎదుట నే మూగనూ... కృష్ణా... ఆ... ఏమని అడగనూ... చరణం : 1 అ: మొసలి బారిపడి మొరలిడినా గజేంద్రుని బాధలు లేవు రక్ష రక్షయని ప్రార్థించుటకు ద్రౌపది దుస్థితి లేదు అటుకులిచ్చు సంపదలు తెమ్మనే అర్ధాంగలక్ష్మి లేనే లేదు అడగకున్నా అన్నీ ఇచ్చేవాడే... నా వాడని తెలిసీ... ఏమని అడగనూ... ఏ వరము నిను కోరనూ కృష్ణా... కృష్ణా... కృష్ణా... ఆ... ఏమని అడగనూ... చరణం : 2 ఆమె: బంధమే లేని భగవంతుడు నీ అనుబంధానికి బంధితుడు అందరిచేత అడిగించుకొనేవాడు నిన్నడుగుతున్నాడు అంతా నువ్వే అంటాడయ్యా... ఆ ఒక్కటేదో అడగవా... అ: (వచనం)- అమ్మా... ఈ కిష్టయ్య చిన్నప్పుడు మన్ను తిన్నాడని తెలిసి నోరు చూపమంటే తన నోట పదునాలుగు భువనాలను చూపించాడు కదమ్మా అప్పుడు ఆ యశోదమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచి చూసేందే కానీ నోరు తెరిచి ఏమైనా అడిగిందా తల్లీ... అ: మన్ను తిన్న ఆ నోట అన్ని లోకాలను చూసిన యశోదమ్మ ఏ వరమడిగిందమ్మా... వేణుగానమును విని ఆ గోవులు తరించినవి కానీ... గోవిందుని ఏం కోరాయమ్మా ముక్తికాంతుడగు ముకుందుడే... ముక్తికాంతుడగు ముకుందుడే నా ముందు నిలిచి ఉన్నాడు నా పంచప్రాణాల తులసి దళాలతో అర్చన చేస్తున్నాను ఇంతకన్నా కావలిసింది ఇంకేముందీ అంతా తెలిసిన అంతర్యామిని అడిగేదేముందీ... చిత్రం : పాండురంగడు (2008) రచన : శ్రీవేదవ్యాస సంగీతం : ఎం.ఎం.కీరవాణి గానం : ఎస్.పి.బాలు, మాళవిక, సౌమ్య