గీత స్మరణం
పల్లవి :
అతడు: ఏమని అడగనూ...
ఏ వరము నిను కోరనూ
నీ దాసదాసానుదాసుడనూ
నీ ఎదుట నే మూగనూ...
కృష్ణా... ఆ...
ఏమని అడగనూ...
చరణం : 1
అ: మొసలి బారిపడి
మొరలిడినా గజేంద్రుని బాధలు లేవు
రక్ష రక్షయని ప్రార్థించుటకు ద్రౌపది దుస్థితి లేదు
అటుకులిచ్చు సంపదలు తెమ్మనే అర్ధాంగలక్ష్మి లేనే లేదు
అడగకున్నా అన్నీ ఇచ్చేవాడే... నా వాడని తెలిసీ...
ఏమని అడగనూ... ఏ వరము నిను కోరనూ
కృష్ణా... కృష్ణా... కృష్ణా... ఆ... ఏమని అడగనూ...
చరణం : 2
ఆమె: బంధమే లేని భగవంతుడు
నీ అనుబంధానికి బంధితుడు
అందరిచేత అడిగించుకొనేవాడు నిన్నడుగుతున్నాడు
అంతా నువ్వే అంటాడయ్యా... ఆ ఒక్కటేదో అడగవా...
అ: (వచనం)- అమ్మా... ఈ కిష్టయ్య
చిన్నప్పుడు మన్ను తిన్నాడని తెలిసి నోరు చూపమంటే
తన నోట పదునాలుగు
భువనాలను చూపించాడు కదమ్మా
అప్పుడు ఆ యశోదమ్మ ఆశ్చర్యంతో
నోరు తెరిచి చూసేందే కానీ
నోరు తెరిచి ఏమైనా
అడిగిందా తల్లీ...
అ: మన్ను తిన్న ఆ నోట
అన్ని లోకాలను చూసిన యశోదమ్మ ఏ వరమడిగిందమ్మా...
వేణుగానమును విని ఆ గోవులు తరించినవి కానీ...
గోవిందుని ఏం కోరాయమ్మా
ముక్తికాంతుడగు ముకుందుడే...
ముక్తికాంతుడగు ముకుందుడే
నా ముందు నిలిచి ఉన్నాడు
నా పంచప్రాణాల తులసి దళాలతో అర్చన చేస్తున్నాను
ఇంతకన్నా కావలిసింది ఇంకేముందీ
అంతా తెలిసిన అంతర్యామిని అడిగేదేముందీ...
చిత్రం : పాండురంగడు (2008)
రచన : శ్రీవేదవ్యాస
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎస్.పి.బాలు, మాళవిక, సౌమ్య