గీత స్మరణం
పల్లవి :
బృందం: తకఝం తకఝం ఝం (2)
అతడు: కిలకిలకిలకిలకిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెళ్లికిలా
ఆమె: కలకలకలకలకల వలపు దాఖల
తెలిపె శుభలేఖల సరిగమలా
అ: మెరుపుల చెల్లి మా పిల్లకి
ఆ: మేఘాలన్నీ పూపల్లకి
ఏడేడు వర్ణాల ఆషాడవేళ
॥॥
చరణం : 1
అ: వేచి వేచి వేడెక్కే ఆ వేచి ఉన్న పండక్కే
నే పరుగులు తీస్తున్నా
ఆ: కాచుకున్న కానుక్కే నే కాచుకున్న వేడుక్కే
నేనెదురై నిలుచున్నా
అ: కాదే అవునై కవ్విస్తే...
బృం: తకఝం తకఝం ఝం
ఆ: కన్నే పిలుపై కబురొస్తే...
బృం: తకఝం తకఝం ఝం
అ: ఆ... కొమ్మచాటు కోకిలమ్మ గట్టిమేళాలెన్నో పెట్టి
కాళ్లు కడిగి కన్యనిచ్చి పేరంటాలే ఆడే వేళ
॥॥
చరణం : 2
ఆ: జాబిలమ్మ కన్నుల్లో ఓ సందె సూరీడున్నట్టే
నీ తహతహ చూస్తున్నా
అ: ఒంటినిండా ఊపొచ్చి ఒంపులెన్నో ఊరించే
నీ తకధిమి వింటున్నా
ఆ: కాయే పండై కలిసొస్తే...
బృం: తకఝం తకఝం ఝం
అ: అది పండే నోమై చిలకొస్తే...
బృం: తకఝం తకఝం ఝం
ఆ: తోటలోని పూలన్ని సిరి తోరణాలై దీవిస్తుంటే
గోరువంక పెళ్లి మంత్రాలెన్నో చదివే సుముహూర్తంలో
॥
చిత్రం : పెళ్లిసందడి (1996); రచన : వేటూరి, సంగీతం : ఎం.ఎం.కీరవాణి; గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర, బృందం
నిర్వహణ: నాగేశ్