Veturi
-
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - వేటూరి
-
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - వేటూరి
-
ఆకాశం ఇల్లవుతుందా?
పాటతత్వం మనసు... పాతికేళ్లు పెంచిన ప్రేమను మరచి మూడు పాతికలు కావాల్సిన ప్రేమను వెతుక్కుంటుంది. తాము బతక్కగలమనే నమ్మకం బతుకునిచ్చిన వాళ్లను వదిలేస్తుంది. రెక్కలొచ్చిన పక్షుల్లా బిడ్డలు ఎగిరిపోతే... తెగిన గాలిపటంలా కన్న ప్రేమ కుప్పకూలిపోతుంది. ఆగలేని ఆదుర్దా ఒకరిది... ఆపలేని నిస్సహాయత మరొకరిది... తల్లిదండ్రుల్ని కాదన్నవాళ్లు తల్లిదండ్రులు అయ్యేదాకా... ఈ దుఃఖాన్ని ఊహించలేరు. అప్పుడు గుర్తొస్తుంది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ... అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటిది కాదనీ... లవ్ ఎట్ ఎవ్రీ డే అండ్ నైట్ అనీ... ఇదే సందర్భం నా ‘బస్‌స్టాప్’ సినిమాలో వచ్చింది. తల్లిదండ్రుల్ని కాదని ఇంట్లోంచి వెళ్లి పెళ్లి చేసుకుంటారు హీరో హీరోయిన్లు. వాళ్లకో పాప పుట్టాక తప్పు తెలిసి మళ్లీ ఇంటికొచ్చి తల్లిదండ్రులను క్షమించమని అడుగుతారు. వేటూరి గారి దగ్గరికి వెళ్లి పాట నేపథ్యం వినిపించా. ఆయన చివరి రోజుల్లో ఉన్నారు. అయినా ఓపిగ్గా విన్నారు. పాట గురించి వివరించి కిందకి వచ్చా... ఇంతలో ఆయన పాట పూర్తిచేసి వెనక్కి పిలిచారు. ఇంత త్వరగా పాట రాశారా అని ఆశ్చర్యం వేసింది. పాటలు రాయడంలో వేటూరిగారికున్న వేగం నమ్మలేకపోయా. పల్లవి చదువుతుంటే నా ఆలోచన అక్షరాల్లో చూసుకున్నట్లు అనిపించింది. రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరిందా... చుక్కలంటిన ఆశా నేలకు ఒరిగిందా... ఒక ప్రేమను కాదందమ్మా ఇపుడింకో ప్రేమా.. ఇక ఇంటికి రానందమ్మా ఎద రాజీనామా... కురిసే కన్నీరే వరదయ్యే వేళా... ప్రేమ గొప్పదే... అంతకన్నా గొప్పది అమ్మా నాన్నల ప్రేమ. అయితే ప్రేమ త్యాగాలు, తల్లిదండ్రుల మనసుకు గాయాలు లేకుండా ప్రేమను సాధించుకోవచ్చు. ఇలాంటి ఆలోచన ఏమాత్రం చేయని చాలా మంది ప్రేమికులు తొందరపాటులో ఇల్లొదిలి వెళ్లిపోవడమే ఏకైక మార్గమనుకుంటారు. రేపటికి పరుగులు పెడుతూ... నిన్నటివరకు కాపాడిన ప్రేమను మరిచిపోతుంటారు... కోరుకున్న వాళ్లు జీవితాంతం తోడుంటారా... అన్నది అనుమానమే. ఈ సందర్భాలనే వేటూరి మొదటి చరణంగా రాశారు... రేపటికే సాగే పయనం.. నిన్నటినే చూడని నయనం.. గమ్యాలే మారే గమనం ఆగదు ఏ మాత్రం బతుకంతా ఈడుంటుందా.. చివరంటా తోడుంటుందా.. నది దాటని నావల కోసం ఎందుకు నీ ఆత్రం ఆకాశం ఇల్లవుతుందా రెక్కలు వచ్చాక.. అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక... కలలే నిజమవునా... కలవరమేమైనా.. ఈ చరణంలో అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక అనేది అద్భుతమైన భావ ప్రదర్శన. జవాబు ఇవ్వాల్సింది అనుమానాలకు తావుండే విషయాలకు మాత్రమే... అమ్మా నాన్నల అనురాగానికి వంక పెట్టగలమా... ఒకవేళ ప్రశ్నిస్తే... దానికి బదులు ఉంటుందా..? చాలామంది యువత తల్లిదండ్రులు ప్రేమను తిరస్కరించగానే... అసలు మీకు నేనంటే ఇష్టం లేదు... నా సంతోషం మీకు అవసరం లేదు అంటూ నిందిస్తారు. అప్పటికి తాత్కాలిక శత్రువులే అవుతారు అమ్మా నాన్న. జీవితంలో ఏదో ఓ సందర్భంలో వాళ్ల ప్రేమ, అనురాగం గుర్తుకు రాకపోవు. దాన్నే వేటూరి పాటలో చెప్పారు. నీవే ఓ అమ్మాయ్యాక... నీ అమ్మే గుర్తొచ్చిందా... అంటూ ఇంటికి తిరిగొచ్చిన హీరోయిన్ గురించి రెండో చరణాన్ని రాశారాయన. నీవే ఓ అమ్మయ్యాక... నీ అమ్మే గుర్తొచ్చిందా.. నీ కథ నీకెదురయ్యాక... రగిలిందా గాయం... పువ్వులనే పెంచే మాలి... ముళ్లల్లో వెతకడు జాలి తిరిగిందా నిన్నటి గాలి.. ఇంత పొందికైన పదాలతో... భావయుక్తంగా... వేగంగా పాట రాయడం బహుశా వేటూరిగారికే సాధ్యమేమో! సినిమా చివరలో ఇంటికి తిరిగొచ్చిన బిడ్డను అమ్మా నాన్న గుండెలకు హత్తుకుంటారు. ఇళ్లు వదిలినప్పటి నుంచి ఆ అమ్మాయి గుండెల్లో దాచుకున్న బాధంతా వాళ్లతో చెప్పుకుంటుంది. కన్నోళ్లకు ఉన్న క్షమాగుణం మరెవరికి ఉంటుంది. గుండెల్లో ఉన్న ప్రేమ గూటికి చేరిందని... కంటిని వీడిన పాప... కన్నుగా మిగిలిందంటూ... పాటను ముగించారు ఆ సాహితీ మూర్తి.. గుండెను దాగిన ప్రేమా... గూటికి చేరిందా... కంటిని వీడిన పాపా... కన్నుగ మిగిలిందా... ఇండస్ట్రీలో ఒక తరహా సినిమాతో విజయం వస్తే... ఇక అలాంటి సినిమాలే చేయమని నిర్మాతలు అడుగుతుంటారు. ‘ఈ రోజుల్లో’ తర్వాత ‘బస్‌స్టాప్’ కూడా అలా వచ్చిన అవకాశమే. అయితే... ఈ సినిమాను మరికొంత పరిపక్వతతో తీయాలని ముందే అనుకున్న. అందుకే సినిమాలో మూడోభాగం వినోదాత్మకంగా ఉన్నా... చివర్లో మంచి ముగింపు ఇవ్వాలని అనిపించింది. ప్రేమ పేరుతో కన్నవాళ్లను వదిలేసిన పిల్లలు... వాళ్ల విలువ తెలుసుకుని మళ్లీ ఇంటికి చేరే సంఘర్షణను చివర్లో చూపించా. ఈ ఆలోచనకు తన పాటతో గొప్ప రూపమిచ్చారు వేటూరి. అప్పటిదాకా ఉన్న సినిమా నడకను మార్చేసి. ’బస్ స్టాప్’ స్థాయిని పెంచేసిందీ పాట. సేకరణ: రమేష్ గోపిశెట్టి - వేటూరి,గేయ రచయిత మారుతి దర్శకుడు -
విషాదామృతం..!
పాటతత్వం - జూన్ 2 మణిరత్నం పుట్టినరోజు మణిరత్నం, శంకర్ వంటి దర్శకులతో పని చేయడమంటే మన జర్నీ మళ్లీ మొదలుపెట్టినట్లు ఉంటుంది. ఎందుకంటే వాళ్లకున్న అనుభవం అపారం. అలాంటి దర్శకులతో పనిచేయడమంటే మనల్ని మనం మళ్లీ అన్వేషించుకున్నట్లే. మణిరత్నం గారి ‘రావణ్’ సినిమా వరకూ వే టూరిగారే పాటలు రాశారు. కానీ, ఆ తర్వాత ఆయన మరణించడంతో, ‘కడలి’ సినిమా తెలుగు వెర్షన్లో అన్ని పాటలూ రాసే అవకాశం నాకు దక్కింది. స్ట్రెయిట్ చిత్రాల్లోని పాటలకున్న వెసులుబాటు డబ్బింగ్ పాటలకు ఉండదు. నా దృష్టిలో డబ్బింగ్ పాటంటే చెక్కిన శిల్పానికి రంగులు అద్దడం అని నా ఫీలింగ్. ఇదే విషయాన్ని ఓ సందర్భంలో నా దగ్గర వేటూరిగారు ప్రస్తావిస్తూ- ‘‘డబ్బింగ్ పాట అనేది వేరే రచయిత మథనం నుంచి పుట్టింది. అతని భావాన్ని మార్చి, కొత్తగా రాయకూడదు’’ అని చెప్పారు. రాజశ్రీ గారి తర్వాత డబ్బింగ్ పాటలను కూడా అచ్చ తెలుగు పాటల్లా పొదగడంలో వేటూరి గారిని మించిన వాళ్లు లేరు. మణిరత్నం-వేటూరిగార్లది అద్భుతమైన కాంబినేషన్. ‘బొంబాయి’ లోని ‘ఉరికే చిలుకా...’, సఖి చిత్రంలోని ‘స్నేహితుడా...’, ‘పచ్చందనమే...’లాంటి పాటలు వేటూరి గారు రాసిన అనేక మైన ఆణిముత్యాల్లాంటి పాటలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మణిరత్నం దర్శకత్వంలో ‘కన్నత్తిళ్ ముత్తమిట్టాళ్’ అనే తమిళ చిత్రానికి అనువాద రూపంగా తెలుగులో విడుదలైన చిత్రం ‘అమృత’. తల్లిని వెతుక్కోవడానికి శ్రీలంక వెళ్లిన అమృత అనే చిన్నారి అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కొంటుంది. మరోవైపు తల్లిలాంటి దేశాన్ని వదలి వెళ్లిపోయే తమిళ లంకేయుల మానసిక సంఘర్షణ... ఈ నేపథ్యంలో వచ్చే పాటని హృదయం ద్రవించేలా తెరపై ఆవిష్కరించారు మణిరత్నం. తమిళంలో ‘విడై కొడు ఎంగళ్ నాడే...’ అంటూ తమిళ రచయిత వైరముత్తు గారు రాస్తే... తెలుగులో వేటూరి గారు ‘కడసారిది వీడ్కోలు...’ అంటూ ఈ పాటను ఇంకా అందంగా రాశారు. ‘‘కడసారిది వీడ్కోలు... కన్నీటితో మా చేవ్రాలు’’ అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో పుట్టిన ఊరిని, మట్టిని బలవంతంగా వె ళ్లాల్సి వస్తే అంతకు మించిన నరకం ఉండదు. దానికి తగ్గట్టుగా కడసారిది వీడ్కోలు... కన్నీళ్లతో చేస్తున్నాం మా సంతకాలు అంటూ ఆ బాధితుల మనోవేదన ను వర్ణించారు. తమిళ రచయిత వైరముత్తుగారు ‘‘ఉదట్టిల్ పున్నగై పుదైత్తోం... వుయిరై వుడంబుక్కుళ్ పుదైత్తోం’’ అని రాశారు. ‘‘ మా చిరునవ్వుల్ని పెదవుల్లో సమాధి చేశాం... మా ప్రాణాల్ని మా దేహంలో సమాధి చేశాం’’ అన్నది అర్థం. దీనిని యథాతథంగా కాకుండా ‘‘ఆశలు సమాధి చేస్తూ బంధాలు బలి చేస్తూ ప్రాణాలనే విడిచి సాగే పయనమిది’’ అంటూ వేటూరిగారు ఇంకా సులువైన పదాలతో తెలుగులో రాశారు. ‘‘తల్లి నేలనూ పల్లె సీమనీ విడతరమా ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా’’ ఎన్ని కోట్లు సంపాదించినా సొంత ఊరిలో ఉన్నప్పుడు ఉండే సంతోషమే వేరు. తరతరాల నుంచి సొంత ఊరినే ప్రపంచమనుకున్న ఆ ప్రజలకు నీడ కరువైతే పరిస్థితి మరీ దారుణం. ‘‘జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం....’’ జన్మనిచ్చిన ఊరికి దూరంగా వేరే ప్రాంతానికి వె ళ్లిపోతూ తాము కన్ను మూసే దేశం ఏది అనే ప్రశ్న సూటిగా గుండెల్లో గుచ్చుకుంటుంది. ‘‘పాడే జోలలు ఏడ్పుల పాలైపోతే ఉదయ సూర్యుడే విలయ ధూమపు తెరలో దాగే’’ సంగీతమనే జీవన రాగం పిల్లల ఏడుపుల్లో తప్పిపోయింది. ఉదయించే సూర్యుడే హింసకు సాక్ష్యంగా నిలిచిన పొగ చాటున కనుమరుగయ్యాడు. ‘‘పూలలోనా నిన్నటి నిదురా ముళ్లు కదా ఇప్పటి నడకా’’ నిన్న రాత్రి వరకూ పూల మీద నడిచాం. కానీ బతుకు బండి తలకిందులైంది. మరి రేపు రాత్రి ఏ ముళ్ల మీద నడవాలి? అంటూ రాశారు. ‘‘ఉసురే మిగిలుంటే మరలా దరిచేరమా మనసే మిగిలుంటే ఒడిలో తలదాచమా’’ ఓ అడవుల్లారా పువ్వుల్లారా... ప్రాణం మిగిలి ఉంటే మళ్లీ వస్తాం. సొంతూరితో మమేకమవుతామనేది ఆ వలస ప్రజల ఆకాంక్ష. ‘‘తలపే అల్పం... తపనే అధికం బరువెక్కిన హృదయంతో మోసుకెళ్లిపోతున్నాం’’ సముద్రం మీద వలస పక్షులు తీరం చేరే దాకా ప్రయాణిస్తూనే ఉంటాయి. ఆలోచన లు తక్కువే కావచ్చు. కానీ తపన మాత్రం అధికంగా ఉంటుంది. ఎన్నో ఆశలతో ప్రయాణిస్తాం. తలపై మోసే సామాన్ల బరువు కన్నా మనసులో ఇంకా భారాన్ని మోస్తూ వెళిపోతున్నాం. ఒక్కో భాషకు, ఒక్కో అందం ఉంటుంది. కొన్ని భావాలను ఈజీగా మాతృకలో ఒక పదంలో చెబితే.. మనం కొన్నిసార్లు అనువాద భాషా రచయితలుగా ఎక్కువ లైన్లలో చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు కొన్నిసార్లు లోతైన భావాలున్న పదాలు ఆ పాటలో పడకపోవచ్చు. అప్పుడే అనువాద రచయితలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మణిరత్నం- ఏఆర్ రె హమాన్ కాంబినేషన్లో పనిచేయడం ఓ అదృష్టం. ఎందుకంటే రచయితకు స్వేచ్ఛనిస్తారు. అందుకే వేటూరిగారు అంత అద్భుతంగా మాతృకకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ పాటను రాశారు. అందుకే ఈ పాట ఎప్పటికీ అలా సంగీత ప్రియుల గుండెల్లో నిలిచిపోతుంది. సేకరణ: శశాంక్.బి - వనమాలి -
వేణువై వచ్చాడు భువనానికి..!
-
రాసే కోయిల...
-
పాటసారి
-
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : జీవితమే ఒక ఆట సాహసమే పూబాట (2) నాలో ఊపిరి ఉన్నన్నాళ్లూ ఉండవు మీకు కన్నీళ్లు అనాధలైనా అభాగ్యులైనా అంతా నావాళ్లు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు (2) ॥ చరణం : 1 అనాధజీవుల... ఉగాది కోసం... అనాధజీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా గుడిసె గుడిసెనూ గుడిగా మలచి దేవుడిలా నే దిగి వస్తా ॥ బూర్జువాలకూ... భూస్వాములకూ... బూర్జువాలకూ భూస్వాములకూ బూజు దులపక తప్పదురా తప్పదురా తప్పదురా తప్పదురా... ॥ చరణం : 2 న్యాయదేవతకు... కన్నులు తెరిచే... న్యాయదేవతకు కన్నులు తెరిచే ధర్మదేవతను నేనేరా పేద కడుపుల ఆకలిమంటకు అన్నదాతనై వస్తారా ॥ దోపిడిరాజ్యం... దొంగ ప్రభుత్వం... దోపిడిరాజ్యం దొంగ ప్రభుత్వం నేలకూల్చక తప్పదురా తప్పదురా తప్పదురా తప్పదురా... ॥ చిత్రం : కొండవీటి దొంగ (1990) రచన : వేటూరి, సంగీతం : ఇళయురాజా గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం -
గీత స్మరణం
పల్లవి : బృందం: తకఝం తకఝం ఝం (2) అతడు: కిలకిలకిలకిలకిల పడుచు కోకిల పలికె ప్రియగీతిక పెళ్లికిలా ఆమె: కలకలకలకలకల వలపు దాఖల తెలిపె శుభలేఖల సరిగమలా అ: మెరుపుల చెల్లి మా పిల్లకి ఆ: మేఘాలన్నీ పూపల్లకి ఏడేడు వర్ణాల ఆషాడవేళ ॥॥ చరణం : 1 అ: వేచి వేచి వేడెక్కే ఆ వేచి ఉన్న పండక్కే నే పరుగులు తీస్తున్నా ఆ: కాచుకున్న కానుక్కే నే కాచుకున్న వేడుక్కే నేనెదురై నిలుచున్నా అ: కాదే అవునై కవ్విస్తే... బృం: తకఝం తకఝం ఝం ఆ: కన్నే పిలుపై కబురొస్తే... బృం: తకఝం తకఝం ఝం అ: ఆ... కొమ్మచాటు కోకిలమ్మ గట్టిమేళాలెన్నో పెట్టి కాళ్లు కడిగి కన్యనిచ్చి పేరంటాలే ఆడే వేళ ॥॥ చరణం : 2 ఆ: జాబిలమ్మ కన్నుల్లో ఓ సందె సూరీడున్నట్టే నీ తహతహ చూస్తున్నా అ: ఒంటినిండా ఊపొచ్చి ఒంపులెన్నో ఊరించే నీ తకధిమి వింటున్నా ఆ: కాయే పండై కలిసొస్తే... బృం: తకఝం తకఝం ఝం అ: అది పండే నోమై చిలకొస్తే... బృం: తకఝం తకఝం ఝం ఆ: తోటలోని పూలన్ని సిరి తోరణాలై దీవిస్తుంటే గోరువంక పెళ్లి మంత్రాలెన్నో చదివే సుముహూర్తంలో ॥ చిత్రం : పెళ్లిసందడి (1996); రచన : వేటూరి, సంగీతం : ఎం.ఎం.కీరవాణి; గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర, బృందం నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
నేడు కమల్‌హాసన్ బర్త్‌డే పల్లవి : ఆమె: దోర దోర దొంగ ముద్దు దోబూచీ హొయన హొయన అతడు: తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన ఆ: ఆగమన్నా నీమీదే పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా అ: వొద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా ఆ: దోర దోర దొంగ ముద్దు దోబూచి హొయన హొయన అ: తేర తేర తేనెబుగ్గ లాగించి... చరణం : 1 ఆ: నీ చలి నా గిలి ఓపలేను అందగాడా నీ శ్రుతి నా లయ ఏకమైన సందెకాడ అ: అంటినా ముట్టినా అమ్మగారు అగ్గిపై గుగ్గిలం నాన్నగారు ఆ: ఎంటపడి చస్తున్నాను వెంటపడి వస్తున్నాను తెలిసిందా ఓ కుర్రాడా దక్కనివ్వు నా మర్యాద అ: ఓకేలే ఒకే ముద్దిచ్చేసి ముద్రిస్తా మనప్రేమ చరిత ॥దోర॥ చరణం : 2 అ: వేళనీ పాళనీ లేనిదమ్మా వెర్రి ప్రేమ గుట్టనీ మట్టనీ ఆగదమ్మ కుర్ర ప్రేమ ఆ: అందుకే సాగాలీ రాసలీల అందమే తోడుగా ఉన్న వేళ అ: ఎంత కసి నాలో ఉందో ఎంత రుచి నీలో ఉందో తేలిశాకే ఓ అమ్మాయి కలిశాయి చేయి చేయి ఆ: కానీలే సరే కవ్వించెయ్యి కౌగిట్లో ప్రియా కమల నయన ॥దోర॥ చిత్రం : ఇంద్రుడు చంద్రుడు (1989) రచన : వేటూరి సంగీతం : ఇళయరాజా గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి నిర్వహణ: నాగేశ్ -
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది!
చందమామ సినిమాలో ‘సక్కుబాయినే...’ అనే పాటతో గేయ రచయితగా పరిచయమయ్యాను. దాదాపు 20కి పైగా పాటలు రాశా. వీటన్నింటికి పరోక్షంగా నాపై ప్రభావం చూపిన రచయిత వేటూరి. సాధారణంగా రచయితలందరూ మనకు తెలిసిన విషయాన్ని ఇంకొక కోణంలో చె బుతారు. తెలిసిందే కొత్తగా చెప్పడం కాదు... తెలియని విషయాలు కూడా కొత్తగా, అర్థమైనట్లుగా చెప్పడమే ఆయన కలం బలం. ఒక దళిత కులానికి చెందిన హీరో, ఒక అగ్రకులానికి చెందిన హీరోయిన్ల మధ్య జరిగే ప్రేమకథ ఆధారంగా డెరైక్టర్ కె.విశ్వనాథ్ కులమతాలకు వ్యతిరేకంగా తీసిన సినిమా ‘సప్తపది’. ఈ సినిమాలో వేటూరిగారి కలం కులాన్ని ఎండగట్టిందనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఆ మహానుభావుడి కలం నుండి జాలువారిన ఒక ఆణిముత్యం ‘ఏ కులము నీదంటే గోకులము నవ్వింది’ అనే పాట. ఈ పాట చరణాల్లో ఏడు వర్ణాలు కలిసీ ఇంద్రధనసౌతాది/అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది... ఏడు రంగులు కలిస్తేనే ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. అలాగే అన్ని కులాల వారు కలిసిమెలసి జీవిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఎవరు ఏ కులంలో పుట్టినా భూమ్మీదే పుడతారు, చనిపోయినప్పుడు అందరూ పైకే వెళతారు అనే జీవిత సత్యాన్ని అందంగా చెప్పారు. ఆది నుంచి ఆకాశం మూగది/ అనాదిగా తల్లిధరణి మూగది/నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు/ ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... అనే వాక్యాల్లో నాకు అర్థమైందేంటంటే అనాది నుండీ ఉన్న ఆకాశం, భూమి అలాగే ఉన్నాయి. ఆ నింగికి, ఈ నేలకు మధ్యలో వచ్చిన మబ్బులు ఎలా అయితే వచ్చి ఉరిమి మాయమైపోతూంటాయో... అలాగే మనం కూడా శాశ్వతం కాదు... అలాంటప్పుడు ఈ కులాల గురించి కొట్లాడుకోవడం ఎందుకు? అని కవి ఈ సమాజాన్ని ప్రశ్నించిన తీరు అమోఘం. వేటూరిగారు రాసిన మరొక పాట కూడా ఈ వర్ణవ్యవస్థను ఎత్తి పొడిచేలా ఉంటుంది. అది గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన/ గోధూళి ఎర్రన ఎందువలన... ఈ పల్లవిలో గోవులు తెల్లగా ఉంటాయి, కృష్ణుడు నల్లగా ఉంటాడు. అలాగే పొద్దుపోయేటప్పుడు గోవులన్నీ ఇంటికి చేరే సమయంలో ఎర్రటి నేలపై అవి వెళ్తునప్పుడు పైకి లేచే ధూళి, ఆ సూర్యుడి కాంతికి మరింత ఎర్రగా మారుతుంటుంది. అన్ని వర్ణాలు ఎందుకని అమాయకంగా చిన్నపిల్లాడిలా కవి ప్రశ్నించాడు. గోపయ్య ఆడున్నా గోపెవ్ము ఈడున్నా/ గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా... అనే వాక్యాలలో గోవుల వెంట ఉన్న ఆ గోపయ్య అక్కడ ఉన్నా, గోపెమ్మ ఇంట్లో ఉన్నా... ఆ గోధూళి ఈ గోపెమ్మకి కుంకుమలాగ అంటదా అని నర్మగర్భంగా చెప్పారు. ఆ పొద్దు పొడిచేనా.. ఈ పొద్దు గడిచేనా... అనే దానిలో పొద్దుపొడవడం అంటే సూర్యాస్తమయం కోసం గోపయ్య ఎదురుచూడటం, పొద్దుగడవడం అంటే గోవులను తోలుకెళ్లిన గోపయ్య ఆలోచనల్లో గోపెమ్మకు కాలం గడవకపోవటం అని మనిషికి, ప్రకృతికి ఉన్న సంబంధాన్ని కవితాత్మకంగా చెప్పారు. పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు/అల్లన మోవికి తాకితే గేయాలు... అనే వాక్యాలలో ఆ మురళికి ఉండే ఏడు రంధ్రాలు గాయాలు అనగలిగే ధైర్యం ఉన్నవారు వేటూరి మాత్రమే. ఆ మురళి మూగైనా... ఆ పెదవి మోడైనా... లో ఆ మురళి మూగదైపోయినా, మన పెదాలు మోడై పోయినా...ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా అని ప్రశ్నించడంలోనే వేటూరి అంతరంగం అర్థమవుతుంది. అదేవిధంగా ‘ఈ కడిమి పూసేనా... ఆ కలిమి చూసేనా’ లో కడిమి పూలు త్వరగా పూయవు... అలాగే ఐశ్వర్యం వెనువెంటనే రాదు... అంటే చెట్టుకు పూలే అందం కదా, మోడువారిన ఆ చెట్టు పూలు పూయడమంటే అన్నీ కోల్పోయి నిరుపేదగా మిగిలిన వాడు కూడా తిరిగి ఐశ్వర్యంతో తులతూగడం లాంటిదే! అది ఎందుకూ అంటే దైవలీల అంటూ అలవోకగా దైవం మీదకు దృష్టిని మళ్లించేశారు కవి. నాకు తెలిసి పాటె లా రాయాలో తెలియనివారికీ వేటూరి చూపించిన... ‘వే’టూరిస్టు గైడులాంటిది ఈ పాట. లక్ష్మీభూపాల్ సినీ గేయ రచయిత -
అచ్చెఱువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ..!
మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని బలభద్రపురం. ఆరేళ్ల వయసు నుంచి పదిహేడు సంవత్సరాలు వచ్చే వరకు సంస్కృతం అభ్యాసం చేశాను. చిన్నప్పటి నుండి వేటూరిగారి పాటలు వింటూ పెరిగాను. ఆయన వల్లనే నాకు సాహిత్యంపై మక్కువ ఏర్పడింది. నా మనసు సరిగా లేనప్పుడు ఎప్పుడైనా వేటూరి గారి పాట వింటే చాలు, నాలో నూతనోత్సాహం, ఉత్తేజం కలిగేవి. ఆయన ప్రతి పాటలోనూ నూతనత్వం, పరిపూర్ణత్వం కనిపిస్తాయి. నేను చిన్నప్పటి నుంచీ సప్తపది (1981) చిత్రంలోని ‘వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి’ గీతాన్ని వినేవాణ్ణి. ఇది ఒక మురళీగానం. కృష్ణుడు ఎక్కడెక్కడ తిరిగాడో, ఏ వస్తువులు ఎలా ఉపయోగించాడో వర్ణించిన పాట ఇది. వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి/ నవరస ముర ళి ఆ నందన మురళి... అనే వాక్యాలలో కృష్ణుని వేణుగాన రవళిని విని రేపల్లె ఎద ఝల్లున పొంగిందనీ, ఆ మురళి... నవరసాలను పలికించేటట్లు నందకుమారుడైన శ్రీకృష్ణుడు చేశాడనీ వర్ణించారు వేటూరి. కాళింది మడుగున కాళీయుని పడగల/ ఆబాలగోపాల మా బాలగోపాలుని/ అచ్చెఱువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ/ తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి... అనే చరణంలో వేటూరి గారి పదప్రయోగం అద్భుతం. కాళింది అనే మడుగులో ఉన్న కాళీయుడనే సర్పం మీద చిన్ని కృష్ణుడు తాండవమాడుతూ ఉంటే, బాలల నుంచి పెద్దల వరకు అందరూ ఆశ్చర్యంతో కళ్లు ఆర్పకుండా చూస్తూ ఉండిపోయారట. ఆ వాక్యాలు వింటుంటే... కృష్ణుడు కాళీయుని పడగపై నాట్యం చేసే దృశ్యం కళ్ల ఎదుట సాక్షాత్కరిస్తుంది. పోతన భాగవతంలోని కృష్ణ లీలల్ని కళ్లకు కట్టినట్టుగా వేటూరి అద్భుతంగా వర్ణించారు. ఆబాలగోపాల మా బాలగోపాల... అచ్చెఱువున అచ్చెరువున... అనే పదాల్లో సంగీతాత్మక నడక, అలంకారం ఉన్నాయి. అనగల రాగమై తొలుత వీనులలరించి/అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి... ఈ వాక్యాలలో కృష్ణుడు ఊదిన ఆ వేణువు నుండి వినిపించిన రాగాలు మన చెవులకు వీనులవిందు చేస్తాయి. మధురానగరిలో యమునా లహరిలో/ఆ రాధ ఆరాధనా గీతి పలికించి/సంగీతనాట్యాల సంగమ సుఖవేణువై చరణంలో... శ్ల్లేషాలంకారాన్ని ఎంతో అందంగా ఉపయోగించారు. ఈ పాటను ఒక కావ్యం అని చెప్పినా తప్పు కాదనుకుంటాను. ఎందుకంటే ‘వాక్యం రసాత్మకం కావ్యం’ కదా! పదబంధాలు, పద ప్రయోగాలు, అలంకారాలు... ముఖ్యంగా యమకాలంకారం, శ్లేషాలంకారాలను... ఎంతో అందంగా ప్రయోగించారు వేటూరి. ఆయన ఉపయోగించిన అలంకారాలు ఈ పాటకి అలంకారాలు. ఎక్కడా ఛందస్సు తేజస్సుని దెబ్బ తీయని... తీయని అక్షరాలు.... స్వరానికి తగ్గట్టు పొదిగిన సంగీత తమక పద ప్రయోగం... వేటూరి వారిది ఎవరికీ అంతుపట్టని స్వరాక్షర మైత్రి. పదజాలం సరే... భావజాలం? అది ఒక ఇంద్రజాలంలా మనల్ని కట్టిపడేస్తుంది. ఆహా ఎన్ని దృశ్యాలు... ఎన్ని దృశ్యచిత్రాలు... వీటన్నిటినీ సంధానిస్తూ వినిపించే పదాలు... ఏ పదానికి ఆ పదమే... ఆ కృష్ణ మురళికి ఎన్ని విశేషణాలు ఎన్ని విశేషాలు! అక్షర లక్షలు విలువ చేసే... ఈ పాటనిండుగా తెలుగుతనం... తెనుంగు కమ్మదనం... పోతన భాగవతానికి నూతన స్వాగతం పలికిన అక్షరామృతం. చెవులను తాకేదొకటి... హృదయాన్ని మీటేదొకటి. వేణుగానం చెవుల్ని సోకినప్పుడు రాధ రాగాలు తీస్తుంది... పారవశ్యంతో, హృదయాన్ని మీటినప్పుడు మూగబోతుంది తన్మయత్వంతో! అదే మరి అంతరంగమంత సాగరంలో తరంగం రేపడం అంటే... కొండమ్మనీ కోనమ్మనీ గోపెమ్మనీ గొబ్బెమ్మనీ... అంద ర్నీ... అన్నిటినీ... లాగేసే గుణం ఆ కృష్ణమురళిది... (లాగేసేవాడు కృష్ణుడు) పదాలు, భావాలు మాత్రమే కాదు... ఇందులో రసాలు కూడా చూడొచ్చు. రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి... అన్న చోట ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే అందులో ఎంత శృంగారం! ఇక కృష్ణతాండవం... అప్పడు జనుల కనులు విప్పారినప్పుడు వీరం, రౌద్రం, బీభత్సం, కరుణ, భక్తి వంటి ఎన్ని రసాలు? నవరసాల్ని ఒలికించిన న వరస మురళిలో ఎక్కడ చూసినా నవ (నూతన) రసమే... సరసమే... ఈ పాట రాయడానికి పాండిత్యం కావాలి. ఐతే అది కృతకంగా ఉండకూడదు. అయత్నకృతంగా ఉండాలి. అదే వేటూరి బలం... ఆయన కలం... కలకలం. తెలుగు అక్షరానికి పట్టాభిషేక జలం. అందుకే ఆయన కవి పండితుడు. ఐతే పాటంటే పాండిత్యం కాదు, ప్రజలతో సాన్నిహిత్యం, పాడుతుంటే పారవశ్యం ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన పాటకే బహుమతులు, ప్రజలు గుర్తించిన పాటకి బహు ప్రణతులు. అదీ ప్రాచుర్యం, ప్రాశస్త్యం అంటే. ప్రజల గుండెల్లో గుచ్చుకుపోయి ఆ తర్వాత చొచ్చుకుపోయి విచ్చుకుపోయి, రెచ్చి పోయిన పుంభావ సరస్వతి వేటూరి. ఆ ఋషికి ప్రణమామ్యహం... సంభాషణ : నాగేష్