
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి :
జీవితమే ఒక ఆట సాహసమే పూబాట (2)
నాలో ఊపిరి ఉన్నన్నాళ్లూ ఉండవు మీకు కన్నీళ్లు
అనాధలైనా అభాగ్యులైనా అంతా నావాళ్లు
ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు (2)
॥
చరణం : 1
అనాధజీవుల... ఉగాది కోసం...
అనాధజీవుల ఉగాది కోసం
సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడిసె గుడిసెనూ గుడిగా మలచి
దేవుడిలా నే దిగి వస్తా ॥
బూర్జువాలకూ... భూస్వాములకూ...
బూర్జువాలకూ భూస్వాములకూ
బూజు దులపక తప్పదురా
తప్పదురా తప్పదురా తప్పదురా...
॥
చరణం : 2
న్యాయదేవతకు... కన్నులు తెరిచే...
న్యాయదేవతకు కన్నులు తెరిచే
ధర్మదేవతను నేనేరా
పేద కడుపుల ఆకలిమంటకు
అన్నదాతనై వస్తారా
॥
దోపిడిరాజ్యం... దొంగ ప్రభుత్వం...
దోపిడిరాజ్యం దొంగ ప్రభుత్వం
నేలకూల్చక తప్పదురా
తప్పదురా తప్పదురా తప్పదురా...
॥
చిత్రం : కొండవీటి దొంగ (1990)
రచన : వేటూరి, సంగీతం : ఇళయురాజా
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం