m.m.pallam raju
-
కేంద్ర మంత్రి పల్లంరాజు ఇంటి వద్ద ఉద్రిక్తత
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి పల్లంరాజు ఇంటిని సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు, జర్నలిస్ట్ సంఘాలు శనివారం ముట్టడించాయి. కేంద్రమంత్రి వెంటనే సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని, అలాగే ఏపీఎన్జీవో నేతపై దాడి చేసిన ఎంపీ హర్షకుమార్ తనయులను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పల్లంరాజు ఇంటిలోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
పళ్లంరాజు నివాసాన్ని ముట్టడించిన పాస్టర్ల సంఘం
రాష్ట్ర విభజనను నిరసిస్తూ కాకినాడలోని పాస్టర్లు సంఘం మంగళవారం కేంద్ర మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు నివాసాన్ని ముట్టడించింది. రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పళ్లంరాజు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పాస్టర్ల సంఘం డిమాండ్ చేసింది. మంత్రి నివాస ప్రాంతమంతా పాస్టర్ల నిరసలు, ఆందోళనలతో హోరెత్తింది. ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకునేలా పళ్లంరాజు ఒత్తిడి తీసుకురావాలని వారు సూచించారు. ఆ ముట్టడి కార్యక్రమంలో కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ నగర కన్వీనర్ ప్రూటీ కుమార్లు పాల్గొన్నారు.