కేంద్ర మంత్రి పల్లంరాజు ఇంటి వద్ద ఉద్రిక్తత | High tensions at central minister M.M.Pallam raju house at kakinada | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి పల్లంరాజు ఇంటి వద్ద ఉద్రిక్తత

Published Sat, Oct 5 2013 2:36 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

High tensions at central minister M.M.Pallam raju house at kakinada

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి పల్లంరాజు ఇంటిని సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు, జర్నలిస్ట్ సంఘాలు శనివారం ముట్టడించాయి. కేంద్రమంత్రి వెంటనే సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని, అలాగే ఏపీఎన్జీవో నేతపై దాడి చేసిన ఎంపీ హర్షకుమార్ తనయులను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పల్లంరాజు ఇంటిలోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement