రాష్ట్ర విభజనను నిరసిస్తూ కాకినాడలోని పాస్టర్లు సంఘం మంగళవారం కేంద్ర మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు నివాసాన్ని ముట్టడించింది. రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పళ్లంరాజు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పాస్టర్ల సంఘం డిమాండ్ చేసింది. మంత్రి నివాస ప్రాంతమంతా పాస్టర్ల నిరసలు, ఆందోళనలతో హోరెత్తింది.
ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకునేలా పళ్లంరాజు ఒత్తిడి తీసుకురావాలని వారు సూచించారు. ఆ ముట్టడి కార్యక్రమంలో కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ నగర కన్వీనర్ ప్రూటీ కుమార్లు పాల్గొన్నారు.