Mobile chargers
-
చార్జర్లు లేకుండానే ఫోన్ల విక్రయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పన్ను పెరిగిన స్థాయిలోనే మొబైల్స్ ధరలూ అధికం కానున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్లపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. బడ్జెట్ ఫోన్లను అతి తక్కువ లాభాలపై కంపెనీలు విక్రయిస్తున్నాయి. పన్ను భారాన్ని మోసే స్థాయిలో వీటి తయారీ కంపెనీలు లేవు. దీంతో అంతిమంగా కస్టమర్‌పైనే భారం పడనుంది. అయితే కంపెనీలు చార్జర్లు లేకుండానే మొబైల్స్‌ను విక్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు కంపెనీలు ఎంపిక చేసిన మోడళ్లపై ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి కూడా అని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. దేశీయంగా చాలా సంస్థలు చార్జర్లను స్థానికంగా తయారు చేస్తున్నాయి. స్వల్పంగా ధరలు అధికమైనప్పటికీ మొబైల్స్ అమ్మకాలు తగ్గే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రతిపాదనలకు వ్యతిరేకంగా.. మొబైల్స్ విడిభాగాలు, చార్జర్ల తయారీకి కావాల్సిన కొన్ని పరికరాలపై సుంకం విధించడాన్ని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకించింది. తమ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ అన్నారు. మొబైల్ ఫోన్ల రేట్లు స్వల్పంగా పెరగనున్నాయి. మొబైల్స్‌లో వాడే కొన్ని విడిభాగాలు, చార్జర్ల తయారీకి ఉపయోగించే కొన్ని పరికరాలపై 2.5 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్టు బడ్జెట్లో ప్రకటించారు. అలాగే మదర్బోర్డ్గా పిలిచే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పీసీబీఏ), కెమెరా మాడ్యూల్స్, కనెక్టర్స్, వైర్డ్ హెడ్ సెట్స్, యూఎస్బీ కేబుల్, మైక్రోఫోన్, రిసీవర్లపైనా 2.5% కస్టమ్స్ డ్యూటీ విధించారు. మొబైల్ చార్జర్లపై ఏకంగా 10% దిగుమతి సుంకం ప్రకటించారు. చార్జర్/అడాప్టర్ల తయారీకి ఉపయోగించే మౌల్డెడ్ ప్లాస్టిక్ ముడి పదార్థాలు, విడిభాగాలపై 10% సుంకం వసూలు చేయనున్నారు. చార్జర్ల పీసీబీఏ ముడిపదార్థాలు, విడిభాగాలపై సుంకం 10% అధికమైంది. పెంచిన సుంకం.. చార్జర్లు, మొబైల్ ఫోన్ విడిభాగాలపై ఫిబ్రవరి 2 నుంచి, మిగిలినవాటిపై ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. -
ఫోన్ యూజర్లకు షాక్.. అవి కూడా..!
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త ఫోన్ కొన్నప్పుడు బాక్సులో ఇకపై చార్జర్ ఉండదు! అవును. యాపిల్, శాంసంగ్ సంస్ధలు ఈ దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని మొబైల్స్ బాక్సుల్లో ఇయర్ ఫోన్స్ ఇవ్వడాన్ని నిలిపేసిన ఈ సంస్ధల కన్ను ఇప్పుడిక చార్జర్లపై పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి వచ్చే కొన్ని ఫోన్ల బాక్సుల్లో చార్జర్లు లేకుండా పంపాలని శాంసంగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. (‘నేను అమెరికాకు ఎలా వెళ్లగలను?’) యాపిల్ ఈ ఏడాదిలో తెచ్చే కొత్త తరం మొబైల్స్ నుంచే చార్జర్లు లేకుండా హ్యాండ్ సెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు టెక్ వర్గాల బొగట్టా. వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇరు కంపెనీలు ఈ నిర్ణయానికి వచ్చాయని తెలిసింది. ప్రస్తుతం యాపిల్ ఐదు వాట్లు, 18 వాట్లు సామర్ధ్యం కలిగిన చార్జర్లను మొబైల్స్‌తో పాటు అందజేస్తోంది. వీటిని సాధ్యమైనంత త్వరగా నిలిపేసి, 20 వాట్ల సామర్ధ్యం కలిగిన ఒకే ఒక చార్జర్‌ను మార్కెట్లోకి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. (రెమిడిసివిర్‌కు తీవ్ర కొరత) ఏదేమైనా రెండు కంపెనీలు తీసుకున్న నిర్ణయం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఫోన్ల ప్యాకేజింగ్‌లో మార్పులు, రవాణాకు అయ్యే ఖర్చు, చార్జర్లను ఎక్కువగా తయారు చేయడం వల్ల ఉత్పత్తి అయ్యే ఈ వేస్ట్ గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఫోన్లకు ఒకే రకమైన చార్జింగ్ మెకానిజమ్ ఉండే దిశగా యూఎస్బీ–సీ టైప్‌ను యాపిల్, శాంసంగ్, గూగుల్, మోటరోలా, సోనీ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. 2021 నాటికి పూర్తి స్థాయిలో సీ టైప్ చార్జింగ్ కలిగిన ఫోన్లను మాత్రమే ఈ కంపెనీలు ఉత్పత్తి చేస్తాయి. మరి ఫోన్లకు చార్జర్ ఎలా? ఫోన్లను కొనుగోలు చేస్తున్న వివియోగదారులే చార్జర్లకు అయ్యే ఖర్చులను కూడా భరించాలని టెక్ కంపెనీలు భావిస్తున్నాయి. అంటే ఫోన్‌తో పాటు చార్జర్‌ను ఎక్స్ట్రాగా కొనుక్కోవాలన్నమాట. చాలామంది యూజర్లు కొత్త ఫోన్లను కొన్నా తమ వద్ద ఉన్న పాత చార్జర్లనే వాడుతున్నారు. కొందరు థర్డ్ పార్టీ బ్రాండ్స్ ఏఎంఎక్స్ ల్యాబ్స్, యాంకెర్ తదితర కంపెనీల మల్టీ చార్జర్లను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
చార్జ్ & ఎంజాయ్
నేతలకు పదవులు.. హీరోలకు హిట్లు.. హీరోయిన్లకు గాసిప్స్.. ఎంత ఇంపార్టెంటో.. యూత్‌కు ‘చార్జింగ్’ అంతేముఖ్యం. చేతిలో ఉన్న ఫోన్లో బ్యాటరీ ఫుల్‌గా ఉంటే చాలు. ఇక రోజంతా ఆన్లైన్లో చక్కర్లుకొట్టొచ్చు. చార్జింగ్ ఇండికేషన్‌లో ఒక్క పుల్ల తగ్గినా.. ఫుల్ చార్జింగ్ పెట్టేవరకూ వదిలిపెట్టరు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఏది మరచిపోయినా ఫర్లేదు.. కానీ ఫోన్ విత్ ఫుల్ చార్జింగ్ లేకపోతే మాత్రం కుదరదు. అరచేతిలో ప్రపంచాన్ని ఉంచుతున్న స్మార్ట్ డివైజ్‌ను కరెంట్‌తో నింపేసి అన్ని పనులూ కానిచ్చేస్తున్నారు. వేలు వెచ్చించి కొన్న స్మార్ట్ గాడ్జెట్స్ పని చేయాలంటే కావాల్సింది బ్యాటరీలో పవర్. అది ఫోన్ అయినా, డిజిటల్ కెమెరా అయినా.. చార్జింగ్ ఉంటేనే కదా మన అవసరాలు తీరేది. స్మార్ట్ఫోన్ల విషయానికి వస్తే 3జీ సేవలు విస్తరించిన వేళ, సమాచారం ఎంత వేగంగా అందుతుందో.. చార్జింగ్ అంతే వేగంగా పడిపోతుంది. 24 గంటలూ ఆన్లైన్లో ఉంటున్న యువత చార్జింగ్‌ను పెద్ద సమస్యగా ఫీలవుతున్నారు. ఫోన్లతో పాటు చార్జర్లను కూడా క్యారీ చేస్తూ అవసరం కాగానే చార్జింగ్ పెట్టేస్తున్నారు. బ్యాటరీ ప్రాధాన్యం గుర్తించే బస్సుల్లో, రైళ్లలోనూ చార్జింగ్ పాయింట్లు పెట్టేశారు. ఇంకొందరైతే డబుల్ బ్యాటరీలనూ మెయింటైన్ చేస్తున్నారు. ఒక బ్యాటరీలో చార్జింగ్ ఇంకిపోగానే.. స్టెప్నీ బ్యాటరీని తగిలించేస్తున్నారు. మొబైల్ చార్జర్స్.. పేరుమోసిన కంపెనీ అప్డేటెడ్ స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త మొబైల్ తెచ్చిందనగానే.. ఫీచర్ల గురించి కాకుండా.. బ్యాటరీ బ్యాకప్ ఎంత టైం వస్తుందనేవారు కోకొల్లలు ఉంటున్నారు. ఒక రకంగా బ్యాటరీ బ్యాకప్ మీద కూడా సదరు స్మార్ట్ వస్తువు సేల్స్ ఆధారపడి ఉంటున్నాయి. అందుకే కొన్ని కంపెనీలు ఒక్కసారి చార్జింగ్ పెడితే వారాలకు వారాలు.. బ్యాటరీ నడుస్తుందంటూ ప్రకటనలతో ఊదరగొడుతున్నాయి. ఇంకొన్ని కంపెనీలు మొబైల్ బ్యాటరీ పవర్ బ్యాంక్ లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. ఇవి ఒక్కసారి ఫుల్ చార్జింగ్ అయితే.. వీటి ద్వారా ఏకకాలంలో నాలుగు ఫోన్లు చార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. దూరప్రయాణాల్లో ఈ అడాప్టర్లు యూజ్‌ఫుల్‌గా మారుతున్నాయి. అందుకే స్మార్ట్ మార్కెట్లో వీటి విక్రయాలు కూడా రికార్డుస్థాయిలోనే సాగుతున్నాయి. అన్నట్టు నేడు నేషనల్ బ్యాటరీ డే. లెట్స్ చార్జ్ ద బ్యాటరీస్.. - త్రిగుళ్ల నాగరాజు