mocks
-
జుకర్‌బర్గ్‌పై ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు!
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా.. ట్విటర్ తరహా వికేంద్రీకృత సోషల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించే యోచనలో ఉంది. సాధ్యాసాధ్యాలపై మెటా కసరత్తు చేస్తోంది. అయితే దీనికి సంబంధించిన వార్తను ట్విటర్లో షేర్ చేయగా ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: Jayanti Chauhan: రూ.7 వేల కోట్ల కంపెనీని వద్దన్న వారసురాలు.. ఇప్పుడిప్పుడే.. ట్విటర్ లాంటి సోషల్ నెట్‌వర్క్‌ను మెటా ప్రారంభించనున్నట్లు వచ్చిన వార్తలపై డిజీ కాయిన్ సహ వ్యవస్థాపకుడు బిల్లీ మార్కస్ ట్విటర్లో షిబెటోషి నకమోటో పేరుతో ఓ మీమ్ వీడియోను పోస్ట్ చేశారు. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ట్విటర్‌కు పోటీగా అలాంటి నెట్వర్క్ ప్రారంభిస్తే ఎలాన్ మస్క్‌తో విసుగు చెందిన యూజర్లు జకర్బర్గ్ను అమితంగా ఇష్టపడతారని రాశారు. దీనికి ఎలాన్ మస్క్ బదులిస్తూ జుకర్‌బర్గ్‌ను ‘కాపీ క్యాట్’ అని సంభోదించారు. అయితే పిల్లి అని అక్షరాల్లో రాయకుండా పిల్లి ఎమోజీని ఉపయోగించారు. ఇదీ చదవండి: Microsoft: మరీ దారుణం భయ్యా! టీం అంతటినీ పీకేశారు.. టెక్కీ ఆవేదన ఫేస్బుక్ కసరత్తు చేస్తున్న ఈ కొత్త సోషల్ నెట్‌వర్క్‌కు ‘P92’ అనే కోడ్‌నేమ్‌ను పెట్టింది. దీనిపై అప్పుడప్పుడూ కొంతమంది తమ అభిప్రాయాలతో అప్డేట్లు ఇస్తున్నారు. కొత్త సోషల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మెటా ప్రతినిధి సైతం ధ్రువీకరించారు. అయితే ఇతర వివరాలేవీ ఆయన చెప్పలేదు. Copy 🐈 — Elon Musk (@elonmusk) March 11, 2023 -
ఖతం.. టాటా.. వీడ్కోలు..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి పునఃర్వైభవం తీసుకొచ్చేందుకు భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్ర చేపడుతున్నారు రాహుల్ గాంధీ. యాత్ర మొదలైనప్పుటి నుంచి రాహుల్‌పై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ.. తాజాగా ఓ యానిమేటెడ్ ఫన్నీ వీడియోను విడుదల చేసింది. అందుకు కాంగ్రెస్ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భారత్ జోడో యాత్ర లక్ష్యంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతల వీడియోను అధికార బీజేపీ విడుదల చేసింది. దానికి కౌంటర్‌గా ఎన్నికల హామీలను నెరవేర్చటంలో ప్రధాని మోదీ విఫలమైనట్లు సూచిస్తూ కాంగ్రెస్ మరో వీడియోను షేర్ చేసింది. బీజేపీ అధికారిక ట్విటర్ ఖాతాలో విడుదల చేసిన వీడియోలో.. కాంగ్రెస్‌లో కొద్ది రోజులుగా నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్న తీరును వివరించింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌లో నేతల రాజీనామాలు, రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల తిరుగుబాటును సూచిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సుమారు 2 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో.. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ఓదార్చుతున్నట్లు చూపించారు. ఈ సందర్భంగా.. ‘ అమ్మా చెడ్డ రోజులు ఎందుకు అంతం కావు? ఇది ముగిసింది, టాటా.. వీడ్కోలు..’ అంటూ సోనియాను రాహుల్ అడిగినట్లు పేర్కొంది. मम्मी ये दुःख खतम काहे नहीं होता है? खतम…टाटा…गुडबाय! pic.twitter.com/J4tFqQgPOQ — BJP (@BJP4India) October 16, 2022 కాంగ్రెస్ కౌంటర్ వీడియో.. బీజేపీ వీడియో విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ కౌంటర్ అటాక్ చేసింది. ప్రజలు గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరల పెరుగుదల, నిరుద్యోగిత వంటి వాటిపై ప్రశ్నిస్తుంటే ప్రధాని మోదీ అక్కడి నుంచి దూరంగా పరిగెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందులో చూపించింది కాంగ్రెస్. దుష్మాన్ సినిమాలోని ‘వాదా తేరా వాదా’ పాట వస్తుండగా మోదీ పరుగులు పెట్టినట్లు పేర్కొంది. दौड़ा दौड़ा भागा भागा सा.. pic.twitter.com/xYXLY5dWdf — Congress (@INCIndia) October 16, 2022 ఇదీ చదవండి: Himachal Pradesh Election 2022: మంచుకొండల్లో ఎన్నికల వేడి -
విలీనంపై స్పందించిన కమల్
చెన్నై: తమిళ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై నటుడు కమల్ హాసన్ మరోసారి ఘాటుగా స్పందించారు. అన్నా డీఎంకే విలీనంపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. తమిళనాడు తలపై మూర్ఖుల టోపీ(ఫూల్స్ టోపీ) కూర్చుందని.. తమిళనాట ఇంతకంటే ఏం కావాలంటూ మండిపడ్డారు. అంతేకాదు ఇది చాలదా.. ఇంకా కావాలా.. దయచేసి స్పందించండంటూ తమిళులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పళని స్వామి, పన్నీరు సెల్వం వర్గాల విలీంపై సోమవారం కమల్ ట్విట్టర్లో స్పందించారు. "గాంధీ టోపీ! కాషాయ టోపీ! కాశ్మీర్ టోపీ! ఇప్పుడు ఫూల్స్ టోపీ! ఇది చాలదా? మరింత కావాలా? తమిళులారా దయచేసి నిలబడండి అని సోమవారం మధ్యాహ్నం తమిళంలో ట్వీట్ చేశారు. కాగా కమల్‌హాసన్‌కు, అధికారంలో ఉన్న అన్నాడీఎంకే వర్గం మధ్య గత కొన్ని రోజులుగా విమర్శలు ప్రతివిమర్శలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అవినీతిలో కూరుకుపోయారని ఇటీవల కమల్ విమర్శిస్తే, దీనిపై రాష్ట్ర మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పరిపాలన శాఖామంత్రి ఎస్పీ వేలుమణి కమల్ ఆదాయం, పన్నులు చెల్లింపు తదితర అంశాలపై తనిఖీ చేయడానికి ఆడిట్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అలాగే వివిధ ప్రభుత్వశాఖల్లో ఉన్న అవినీతిపై సాక్ష్యాలుంటే బయటపెట్టాలని మంత్రి సవాల్ చేశారు. మరోవైపు కమల్ రాజకీయాల్లోకి రావడం ఖాయమనే అంచనాలు కూడా భారీగానే నెలకొన్న సంగతి విదితమే. காந்திக்குல்லா!காவிக்குல்லா!கஷ்மீர்குல்லா!! தற்போது கோமாளிக்குல்லா, தமிழன் தலையில் . போதுமா இன்னும் வேண்டுமா? தயவாய் வெகுள்வாய் தமிழா. — Kamal Haasan (@ikamalhaasan) August 21, 2017 -
రాహుల్ ఇంకా బచ్చా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాకూర్ బస్తీలో మురికివాడల్లోని అక్రమ గుడిసెల తొలగింపు వ్యవహారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇరకాటంలో పెట్టింది. సోమవారం బస్తీ వాసుల పరామర్శ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. రాహుల్ ఇంకా 'బచ్చా' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాహుల్ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రైల్వేశాఖ తమ పరిధిలోకి రాదనే చిన్న విషయం కూడా తెలికయపోవడాన్ని తప్పుబట్టారు. రైల్వే శాఖ కేంద్రం ఆధీనంలో ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండదనే విషయాన్ని పాపం కాంగ్రెస్ పార్టీ అతనికి చెప్పినట్టు లేదంటూ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. బాధితులను పరామర్శించేందుకు సోమవారం రాహుల్ గాంధీ షాకూర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జరిగిన నష్టానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించాలంటూ ఆప్, ఎన్డీయే ప్రభుత్వాలను విమర్శించారు. మరోవైపు షాకూర్ బస్తీ ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించాలంటూ ఆప్ ఆందోళన చేయడాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్.. ధర్నాచేయడం, ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన ఢిల్లీ సీఎం.. తన ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీపై వ్యంగ్య బాణాలు సంధించారు. राहुल गांधी जी अभी बच्चे हैं। उनकी पार्टी ने शायद उन्हें बताया नहीं की रेल्वे केंद्र सरकार के अंडर आती है, दिल्ली सरकार के नहीं। — Arvind Kejriwal (@ArvindKejriwal) December 14, 2015