breaking news
mode
-
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆటో మోడ్‌లో!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం 15 ఏళ్లుగా స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోందని, ప్రస్తుతం ఇతర అంశాల సహాకారం లేకుండా కూడా నిర్దిష్టమైన వృద్ధిని నమోదు చేసే ఆటో మోడ్‌లో ఉందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO, నరెడ్కో) అధ్యక్షుడు మేకా విజయ సాయి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నరెడ్కోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఆర్ఈడీఏ అని పిలిచేవారు. నరెడ్కో ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న ప్రాపర్టీ షో వివరాలు తెలిపేందుకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేకా విజయ సాయి మాట్లాడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విస్తీర్ణం ఇప్పుడు ఏకంగా 1,28,000 చదరపు కిలోమీటర్ల వరకూ ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడి టారిఫ్‌లు, ఐటీ ఉద్యోగాల్లో అనిశ్చితి వంటివి ఒడిదుడుకులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఈ రంగం స్థిరమైన అభివృద్ధిని నమోదు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వ విధానాలు, రీజనల్ రింగ్ రోడ్డు వంటివి ఇందుకు దోహదపడతాయని అన్నారు. వృద్ధి విషయంలో హైదరాబాద్, ముంబైను దాటిపోయిందన్నారు. హైదరాబాద్‌లో భూమి అందుబాటులో ఉండటం, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండటం ఇందుకు కారణమని తెలిపారు. గత ఏడాది జూలై సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అమ్మకం ధరలు ఎనిమిది శాతం వరకూ పెరిగాయని, దేశవ్యాప్తంగా ఈ పెరుగుదల నాలుగు నుంచి 24 శాతం వరకూ ఉందన్నారు.ఐటీ అనిశ్చితి, ట్రంప్ విధానాలు ఒక రకంగా హైదరాబాద్ రియల్ ఎస్టే్ట్ రంగానికి ఉపయోగపడేవని అభిప్రాయపడ్డారు. అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారైలు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి పెంచుకుంటున్నారని తెలిపారు.అమ్మకాలపై నెగటివ్ ప్రచారం..హైదరాబాద్‌లో లక్ష వరకూ రియల్ ఎస్టేట్ యూనిట్లు అమ్ముడు పోకుండా ఉన్నాయని ఇటీవల వచ్చిన వార్తలను మేకా విజయ సాయి ఖండించారు. నగరంలో ఎన్ని యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి? ఎన్ని అమ్ముడుపోయాయి? ఎన్ని కాదు? అన్నది తెలుసుకునేందుకు తగిన శాస్త్రీయ సమాచారం ఏదీ అందుబాటులో లేదని తెలిపారు. ప్రభుత్వ సంస్థల నుంచి భవన నిర్మాణానికి తీసుకున్న అనుమతుల ఆధారంగా కొందరు రియల్ ఎస్టేట్ యూనిట్లు అమ్ముడుపోవడం లేదన్న వార్తలు సృష్టించారని చెప్పారు. తమకున్న సమచారం మేరకు డెవలపర్లు స్థిరంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. నగరంలో అపార్ట్మెంట్ల ధరలు మధ్యతరగతి వారికి అందుబాటులో లేకుండా పోయాయన్న విమర్శకు ఆయన బదులిస్తూ.... 600 - 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన అపార్ట్మెంట్లు చాలా వరకూ అమ్ముడుపోవడం లేదని, దీన్నిబట్టి ప్రజలు మరింత విశాలమైన ఆపార్ట్మెంట్లు కోరుకుంటున్నట్లు తెలుస్తోందని అన్నారు.ఎస్బీఐ ప్రత్యేక ఆఫర్: కె.శ్రీధర్ రెడ్డినరెడ్కో 15వ ప్రాపర్టీ షో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుందని సంస్థ ప్రధాన కార్యదర్శి కె.శ్రీధర్ రెడ్డి తెలిపారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో 74 మంది బిల్డర్లు, డెవలపర్లు పాల్గొంటున్నారని తెలిపారు. వీరితోపాటు బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఆరు, సరఫరాదారులు ఐదుగురు, పర్యాటక రంగానికి చెందిన రెండు, భవన నిర్మాణ సామాగ్రీ, టెక్నాలజీలకు సంబంధించిన ఎనిమిది స్టాళ్లు ఏర్పాటు కానున్నాయని వివరించారు. ఈ ప్రదర్శనలో రియల్ ఎస్టేట్ యూనిట్ కొనుగోలుదారులు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణం తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజ్‌లో ప్రత్యేక రాయితీ అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నరెడ్కో ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ కాళీ ప్రసాద్, కోశాధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
జొమాటోలో ‘హెల్దీ మోడ్’ ఫీచర్
యూజర్లు పౌష్టికాహారాన్ని అన్వేషించడానికి, ఆర్డర్ చేయడానికి వీలుగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో తమ యాప్‌లో కొత్తగా ‘హెల్దీ మోడ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి గురుగ్రామ్ యూజర్లకు ఇది అందుబాటులో ఉందని, త్వరలో మిగతా మార్కెట్లలోనూ ప్రవేశపెడతామని కంపెనీ తెలిపింది.మెట్రో నగరాల్లోని 18–45 ఏళ్ల వారు ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. భాగస్వామ్య రెస్టారెంట్లు ఇచ్చే వివరాలను బట్టి ఒక్కో వంటకానికి ‘కనిష్టం’ నుంచి ‘సూపర్’ వరకు ‘హెల్దీ స్కోరు’ ఉంటుందని జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. ఈ ఫీచరులో మార్పులు, చేర్పులకు సంబంధించి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని యూజర్లను కోరారు.ఇదీ చదవండి: ఆర్బీఐ రూటెటు..? -
డీఎన్డీ మోడ్..! ఈజీగా నోటిఫికేషన్స్, ఫోన్‌కాల్స్ మ్యూట్ చెయ్యొచ్చు..
పనిచేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్మార్ట్ఫోన్ల నుంచి తరచుగా వచ్చే నోటిఫికేషన్లు దృష్టిని మరల్చుతుంటాయి. అలా అని ఫోన్‌ను ఏరోప్లేన్ మోడ్‌లో ఉంచడం మంచిది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎన్డీ మోడ్‌గా ప్రసిద్ధి చెందిన ‘డూ నాట్ డిస్టర్బ్ మోడ్’ అవసరం. అప్లికేషన్ల నుండి నోటిఫికేషన్లను బ్లాక్ చేయడానికి, ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు దృష్టిని మరల్చే ఫోన్‌కాల్‌లను మ్యూట్ చేయడానికి డీఎన్డీ ఉపయోగపడుతుంది. డీఎన్డీ సెట్టింగ్ బ్రాండ్ నుంచి బ్రాండ్‌కు భిన్నంగా ఉంటుంది. కానీ బేసిక్స్ మాత్రం అలాగే ఉంటాయి.డీన్డీ సెట్ చేయడానికి...ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చెయ్యాలి ∙ ‘డోన్ట్ డిస్టర్బ్’ అని సెర్చ్బార్లో టైప్ చేయాలి. ∙ఆండ్రాయిడ్ ఫోన్లోని క్విక్ సెట్టింగ్ ప్యానెల్లో కూడా డీఎన్డీ కనిపిస్తుంది. ∙ఇప్పుడు డీఎన్డీ మోడ్ ఆన్ చేయవచ్చు డీఎన్డీని షెడ్యూల్డ్ చేయడానికి ‘షెడ్యూల్డ్’ను క్లిక్ చేయాలి ప్లస్(+) సైన్లోకి వెళ్లి యాక్టివిటీని ఎంపిక చేసుకోవాలి. ఉదా: వర్కింగ్, స్లీపింగ్, స్టడీ... మొదలైనవి డీఎన్డీ మోడ్ టైమింగ్స్ ఎంపిక చేసుకోవచ్చు ∙ఎక్సెప్షెన్స్ను యాడ్ చేసుకోవచ్చు. ఉదా: బాస్, వైఫ్, ఫాదర్, మదర్... మొదలైనవి ∙నోటిఫికేషన్ రిసీవ్ చేసుకోవాలనుకునే యాప్‌లను కూడా యాడ్ చేసుకోవచ్చు.(చదవండి: డైట్ సెన్స్ ఉంటే చాలు..! ఆరోగ్యం మన చేతిలోనే..) -
Chandrayaan-3: స్లీప్ మోడ్‌లోకి ప్రజ్ఞాన్..
శ్రీహరికోట: చంద్రయాన్–3 మిషన్‌లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై తన కార్యాచరణను పూర్తి చేసి స్లీప్ మోడ్‌లోకి వెళ్లిందని ఇస్రో శనివారం తెలిపింది. లూనార్ మిషన్‌లోని రోవర్ ప్రజ్ఞాన్, ల్యాండర్ విక్రమ్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయని, చంద్రుడి ఉపరితలంపై రాత్రిళ్లు ఉండే అతిశీతల పరిస్థితులను తట్టుకుని ఉండేలా వాటిని స్లీప్ మోడ్‌లోకి పంపుతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. ల్యాండర్ చుట్టూ 100 మీటర్ల మేర రోవర్ ఇప్పటివరకు ప్రయాణించిందని చెప్పారు. అందులోని రిసీవర్‌ను ఆన్‌లోనే ఉంచి, పేలోడ్స్‌ను ఆఫ్ చేసి ఉంచుతామన్నారు. అందులోని డేటా బేస్ ల్యాండర్ ద్వారా ఇప్పటికే తమకు చేరిందన్నారు. ప్రస్తుతం వీటి బ్యాటరీ పూర్తి స్థాయిలో చార్జి అయి ఉన్నాయని, ఈ నెల 22వ తేదీన తిరిగి అక్కడ సూర్య కిరణాలు ప్రసరించిన తర్వాత వాటికి తిరిగి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. చంద్రుడిపై భారత రాయబారిగా రిసీవర్ ఎప్పటికీ అక్కడే ఉంటుందని చెప్పారు. Chandrayaan-3 Mission: 🏏Pragyan 100* Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ — ISRO (@isro) September 2, 2023 -
పాకిస్థాన్ లేకుండానే ఆసియా కప్ ఇండియా ఆలా చేస్తే పాకిస్థాన్ కి బారి నష్టమే..!
-
యాక్షన్ మోడ్ లో కమల్, బ్రహ్మీలు..
చెన్నైః బలరామ్ నాయుడు క్యారెక్టర్ తో కనిపించనున్న నటుడు, నిర్మాత కమలహాసన్.. ట్రైలింగ్యువల్ యాక్షన్ కామెడీ సీక్వెన్స్ మొదటి షెడ్యూల్ ఈ వారం చివరిలో ఆమెరికాలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో హాస్య నటుడు బ్రహ్మానందం మొదటిసారి కమలహాసన్ తో కనిపించనున్నారు. కమల్ కొత్త సినిమా శభాష్ నాయుడులో అతడి పక్కనే ఉంటూ సందడి చేసే పాత్రను తెలుగు, తమిళ వెర్షన్స్ లో బ్రహ్మానందం పోషించనున్నారు. అయితే హిందీలో మాత్రం ఈ పాత్రను సౌరభ్ శుక్లా చేస్తున్నారు. కమలహసన్, బ్రహ్మానందం కలసి నటించే ఈ చిత్రంలోని ఛేజ్ స్వీక్వెన్స్ ను మొదటి షెడ్యూల్ లో చిత్రించనున్నారు. షెడ్యూల్ లోని మొదటి భాగంలో... కొన్ని రోజులపాటు సమయాన్ని పూర్తిగా సీన్స్ రిహార్సిల్స్ కు వినియోగించి, అనంతరం ఎటువంటి బాడీ డబుల్స్ లేకుండా నటించేందుకు టీమ్ సిద్ధమౌతున్నట్లు సమాచారం. కమల్ రియల్ డాటర్ శ్రుతీహాసన్ ఈ సినిమాలో రీల్ డాటర్ గా నటిస్తున్నారు. తండ్రీ కూతుళ్ళు కలసి నటిస్తున్న తొలి చిత్రంలో కమల్ భార్య పాత్రను రమ్యకృష్ణ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్... టికె రాజీవ్ కుమార్ దర్శకత్వంలో.. రాజ్ కమల్ ఇంట్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రంలో పాటలకు సంగీతం అందించేందుకు ఇళయరాజా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. చిత్రాన్ని దాదాపు 80 శాతం అమెరికాలోనే చిత్రీకరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


