యాక్షన్ మోడ్ లో కమల్, బ్రహ్మీలు.. | Kamal Haasan, Brahmanandam to get into action mode | Sakshi
Sakshi News home page

యాక్షన్ మోడ్ లో కమల్, బ్రహ్మీలు..

Published Tue, May 17 2016 1:09 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

యాక్షన్ మోడ్ లో కమల్, బ్రహ్మీలు.. - Sakshi

యాక్షన్ మోడ్ లో కమల్, బ్రహ్మీలు..

చెన్నైః బలరామ్ నాయుడు క్యారెక్టర్ తో కనిపించనున్న నటుడు, నిర్మాత కమలహాసన్.. ట్రైలింగ్యువల్ యాక్షన్ కామెడీ సీక్వెన్స్ మొదటి షెడ్యూల్ ఈ వారం చివరిలో ఆమెరికాలో  ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో హాస్య నటుడు బ్రహ్మానందం మొదటిసారి కమలహాసన్ తో కనిపించనున్నారు.

కమల్ కొత్త సినిమా శభాష్ నాయుడులో అతడి పక్కనే ఉంటూ సందడి చేసే పాత్రను తెలుగు, తమిళ వెర్షన్స్ లో బ్రహ్మానందం పోషించనున్నారు.  అయితే హిందీలో మాత్రం ఈ పాత్రను సౌరభ్ శుక్లా చేస్తున్నారు. కమలహసన్, బ్రహ్మానందం కలసి నటించే ఈ చిత్రంలోని ఛేజ్ స్వీక్వెన్స్ ను మొదటి షెడ్యూల్ లో చిత్రించనున్నారు. షెడ్యూల్ లోని మొదటి భాగంలో... కొన్ని రోజులపాటు సమయాన్ని పూర్తిగా  సీన్స్ రిహార్సిల్స్ కు వినియోగించి, అనంతరం ఎటువంటి బాడీ డబుల్స్ లేకుండా నటించేందుకు  టీమ్ సిద్ధమౌతున్నట్లు సమాచారం.

కమల్ రియల్ డాటర్ శ్రుతీహాసన్ ఈ సినిమాలో రీల్ డాటర్ గా నటిస్తున్నారు. తండ్రీ కూతుళ్ళు కలసి నటిస్తున్న తొలి చిత్రంలో కమల్ భార్య పాత్రను రమ్యకృష్ణ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్... టికె రాజీవ్ కుమార్ దర్శకత్వంలో.. రాజ్ కమల్ ఇంట్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రంలో పాటలకు సంగీతం అందించేందుకు  ఇళయరాజా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. చిత్రాన్ని దాదాపు 80 శాతం అమెరికాలోనే చిత్రీకరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement