Chandrayaan-3: స్లీప్‌ మోడ్‌లోకి ప్రజ్ఞాన్‌.. | Chandrayaan-3: Pragyan completes assignments, goes to sleep | Sakshi
Sakshi News home page

Chandrayaan-3: స్లీప్‌ మోడ్‌లోకి ప్రజ్ఞాన్‌..

Published Sun, Sep 3 2023 6:31 AM | Last Updated on Sun, Sep 3 2023 8:21 AM

Chandrayaan-3: Pragyan completes assignments, goes to sleep - Sakshi

శ్రీహరికోట: చంద్రయాన్‌–3 మిషన్‌లోని ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై తన కార్యాచరణను పూర్తి చేసి స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లిందని ఇస్రో శనివారం తెలిపింది. లూనార్‌ మిషన్‌లోని రోవర్‌ ప్రజ్ఞాన్, ల్యాండర్‌ విక్రమ్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయని, చంద్రుడి ఉపరితలంపై రాత్రిళ్లు ఉండే అతిశీతల పరిస్థితులను తట్టుకుని ఉండేలా వాటిని స్లీప్‌ మోడ్‌లోకి పంపుతామని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ చెప్పారు.

ల్యాండర్‌ చుట్టూ 100 మీటర్ల మేర రోవర్‌ ఇప్పటివరకు ప్రయాణించిందని చెప్పారు. అందులోని రిసీవర్‌ను ఆన్‌లోనే ఉంచి, పేలోడ్స్‌ను ఆఫ్‌ చేసి ఉంచుతామన్నారు. అందులోని డేటా బేస్‌ ల్యాండర్‌ ద్వారా ఇప్పటికే తమకు చేరిందన్నారు. ప్రస్తుతం వీటి బ్యాటరీ పూర్తి స్థాయిలో చార్జి అయి ఉన్నాయని, ఈ నెల 22వ తేదీన తిరిగి అక్కడ సూర్య కిరణాలు ప్రసరించిన తర్వాత వాటికి తిరిగి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. చంద్రుడిపై భారత రాయబారిగా రిసీవర్‌ ఎప్పటికీ అక్కడే ఉంటుందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement