Modern poets
-
ఎప్పటికీ ఎగిరే సంగీత పతాకం
పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, ప్రముఖ సంగీత, సాహిత్య, కళా విమర్శకులు దక్షిణదేశ సంగీతాకాశంలో రజనీకాంతరావు గారు ఒక విశిష్టమైన పతాకం ప్రతిష్ఠించారు. అది అలా ఎగురుతూ ఉండటాన్ని తానే స్వయంగా చూడగల్గిన అదృష్టవంతులు. తనే ఇప్పటికీ తన పాటలూ, చరణాలూ, ఒక్కొక్కసారి పూర్తి పాఠం సంగీతపు వరుసలతో సహా పాడటం ఈ వంద సంవత్సరాల వేడుకల సమయంలో ఆయనను దర్శించేవారికి ఒక విందు. డెబ్బయ్ ఏళ్ళ ఆధునిక కవులు, 80 ఏళ్ళ అమెరికా తల్లులు వచ్చి ఆయన పాటలు ఆయన దగ్గరే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే, ఆయన కూడా గొంతు కలపడం వచ్చిన వారికి ఎంతో ఆత్మీయమైన అనుభూతినిస్తుంది. పదేళ్ళ క్రితం వరకూ ఆయన దగ్గరకు వచ్చిన మిత్రులు గంటల తరబడి ఆయన పాటలు ఆయన చేత పాడించుకొని కదలలేక, కదలలేక వెళ్ళేవారు. ఆయనను గంభీరమైన ప్రశ్నలతోటి,చిలిపి ప్రశ్నలతోటి విసిగించే నాలాటి వాళ్ళ సంగతి సరేసరి. ‘‘ఆ ‘విశ్వయానం’లో చివరన ‘మార్వా’ రాగంలో ఓలేటి చేత పాడించేందుకూ, అంత గొప్పగా వచ్చిన జంత్రగాత్ర వాద్యమేళనానికీ సరిపోయిందా? ‘మార్వా’ రాగం ఎందుకూ’’ అంటే, ‘‘ఎందుకుండరాదు? వై నాట్’’అని సమాధానం ఇచ్చారు. ఇంకొకసారి నేను ‘మీరు సినిమా పరిశ్రమను వదిలేయడం మీకు వ్యక్తిగతంగా నష్టం కలిగించినదండీ!’’ అన్నాను. ‘‘ఇలా మిగిలేవాణ్ణి కాదులే! దుర్గాబాయి గారు కూడా అనేది’’ అని నవ్వుతూ తేల్చేవారు. ప్రముఖ దర్శక - నిర్మాత బి.యన్. రెడ్డిగారు తమ రికార్డింగ్ స్టూడియోను కట్టించిన కొత్తలో ఈయను తీసుకెళ్ళి ‘ఇదిగో స్టూడియో’ అన్నారట! కానీ ఆయన తర్వాత సినీమాకు ఆయనను సంగీతం సమకూర్చమనలేదు. ‘‘బాధపడ్డారా?’’ అన్నాను. ‘‘లేదు. సాలూరి రాజేశ్వరరావు నా కంటే సీనియర్. బాగా చేశాడు’’ అన్నారు. జీవితంలో అంతటి కపటం లేనితనం, తనకు సంక్రమించిన దాని పట్ల తృప్తి, వివాదాలకు దూరంగా ఉండడం - ఆయన సహజ గుణాలు. ఒక పెద్ద కవి గారికి కోపం వచ్చింది. ఆ కోపానికి ఈయన కారణం కాదు. కానీ ఈయనే అని ఆ కవి గారి చెవిలో ఒక ఆప్తుడు ఊదాడు. ఈయన మేలు కోరే పెద్దమనిషి పెద్ద కవి గారికి రజని గార్ని క్షమాపణ చెప్పి సర్దుకోమన్నాడు. ఈయన క్షమాపణ చెప్పలేదు. మేలుకోరిన పెద్దమనిషి మీద కోపం తెచ్చుకోలేదు. ఇది చెప్పి నాకు హితవు చెప్పారు - ‘‘నువ్వు చేయనిదానికి కూడా నీ మీద నిందలు వేస్తారు. తెలుసుకో’’ అని! పిఠాపురంలో తండ్రిగారి నుండి వచ్చిన ఇల్లు అవసరం లేకపోయినా అమ్మివేశారు. ఆయనకి ఇష్టం లేదు. భార్య సుభద్రమ్మ గారికీ ఇష్టం లేదు. ‘‘ఏమిటండీ! అమ్మడం ఎందుకండీ’’ అంటే ప్రాప్తం ఉండాలి కదా అని ‘లైటు’ తీసుకున్నారు. చాలామందికి తెలుసు ఆయన జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రవీణులని. నేను తేలికగా ‘‘ఎన్ని చెప్పండి... మీ పిల్లల్ని మీ స్థాయిలో చదివించలేదండి. మీరు అప్పుడే వాల్తేరులో ఆనర్సు చదివినవారు. ఏమిటిది?’’ - అంటూ చనువు తీసుకుని ఒకసారి నిరాశ వ్యక్తం చేశాను. ‘‘ఏం? చీకూచింతా లేని ఆరోగ్యమైన జీవితం సాగిస్తారు. అంతకంటే కావాల్సింది ఏమిటి?’’ అని సమాధానమిచ్చారు. ఎంతటి సాధారణమైన అసాధారణ జీవితం ఆయన గడిపారో చెప్పే ప్రయత్నంలో అందరికీ తెలిసిన ఆయన సంగీతమయ ప్రపంచం గురించి వివరించలేదు. ఆయన సంగీత పతాకం రచించిన దశాబ్దాలు దర్శించలేదు. ఆయన ఒక చిత్రమైన స్వయంభువు. ఎవరిదీ - చివరికి తండ్రి గారిది కూడా ప్రభావం పడకుండా దారి ఎంచుకున్న కాల్పనిక ఉద్యమకాల రచయిత. ఆయన పాటల్లో ఎవరి ప్రభావం లేకుండా, ఆ కాలంలో 1940-’90ల మధ్య వ్రాయడం దాదాపు అసాధ్యం. ఆఖరికి రవీంద్రుడి ప్రభావం కూడా లేదు. ఊహల ఆంతర్య కల్పనల విస్తృతీ పరిమితమైన కాలంలో కూడా, సుదూర తీరాలకు మీ మనసును తీసుకుపోయే భావాలతో పాటలు రాశారు. ఆ పాటలకు సంగీతం సమకూర్చారు. ఏవో వరుసలు కట్టడం కాదు, ఆయన సంగీతంలో ఉన్నది. సంగీత కల్పనలో కూడా లోతైన, మనసైన, సొగసైన, ఆశ్చర్యం కల్గించే పోకడలు నిలుపుకోగల పద, భావ, ఆలోచనా శక్తిని నింపారు. ఆ పతాకం అవిశ్రాంతంగా ఎగరడానికి, రెపరెపలాడుతూ ‘ఆచంద్రార్కమూ’ ఉండడానికి ఆయనే పాడగలిగారు. ఆయన పాటలో పాఠం- పల్లవి,అనుపల్లవుల బంధాల నుండి ముక్తి పొంది అనిర్వచనీయమైన ఏదో ఆధారంతో, మాంసంతో, ఆభరణాలతో, తేజంతో దర్శనమిస్తూనే ఉంటుంది. ఎక్కడో వెండి తీగలా ఒకొక్కసారి పాట అంతా పదసిద్ధ సంభారాలో, ‘చరణ’ మంజీరాలో, నిష్ర్కమణ గీత శకలాలో వేరే లోకాల్లోకి మిమ్మల్ని లాక్కుపోతాయి. స్మృతిగీతాలైనా, సంవాద గీతాలైనా చివరికి దేశభక్తి గీతాలయినా - ఆ అలంకార శయ్య పరిమళ ద్రవ్యంగా మత్తు కలిగిస్తుంది. ఇక ఆ సంగీతపు పూత వెనుకనున్న రసాయన మేళనం ఎవరికి వారు పరిశోధించుకోవలసినదే. లేకపోతే బాలమురళి నుండి సూరిబాబు దాకా ఆయన సంగీత కూర్పుకి ఎందుకు పరవశులవుతారు? పాటలకు ఆయన సమకూర్చిన ఆరంభ వాద్యగోష్ఠి నుండి చరణాంతర సంగీత తీర్మానాలకు, నాటకీయ పరికల్పనలకు ముగ్ధులు కానివారు లేరు. రవీంద్రుని గీతాలకు తెలుగు అనువాదం, సంగీతం రజని సమకూర్చినట్లు పట్టుగా ఏ ఇతర భారతీయ భాషలలోనూ వచ్చి ఉండవు. అందుకే కేంద్ర సంగీత అకాడెమీ తరఫున రవీంద్రుడి 150వ జయంతికి పురస్కారం లభించింది. అలాటి పాటల బెంగాలీ సంగీతమూ, చిక్కటి అనువాదమూ ఒక్కరే సమకూర్చే అవకాశం ఇతర భాషారచయితలకు ఉండదు కదూ! ‘‘చిత్తమెచట భయశూన్యమో... గృహప్రాచీరము తన ప్రాంగణ తలమును దివారాత్ర మృత్తికాధూళిలో క్షుద్ర ఖండములు చేయదో’’ అంటూ రవీంద్రుడి సంగీత వరుస కట్టడం - మామూలు వారికి సాధ్యం కాని పని. మరో అసాధ్యమైనదీ ఎవరూ చేయలేనిదీ ఒకటి ఉంది. రామాయణ అవతరణ గాథను వాద్యగోష్ఠిలో ‘ఆదికావ్యావతరణం’ అని వివిధ రాగాలలో క్రౌంచ మిథునంతోటి ఆరంభించి ఘట్టాలుగా విభజించి కల్పన చేశారు. అలాగే శివుడి కోపంతో మన్మథుడు దహనం కావటం - ‘కామదహనం’గా స్వరపరిచారు. గొంతుకలు లేని, కేవలం వాద్యగోష్ఠిలో సాగే విషయాత్మక సంగీత రచనలకు దారుఢ్యాన్నీ, పుష్టినీ, విషయనిష్ఠనీ సమకూర్చిన భారతీయ వాద్యబృంద సంగీత రచయితలలో రజని ఒకరు. ఎక్కువ సంఖ్యలో ఈ గోష్ఠులు నిర్వహించే అవకాశం ఆయనకు రాలేదు కానీ, రవిశంకర్, పన్నాలాల్ ఘోష్, ఈమని శంకరశాస్త్రి, అనిల్ బిస్వాస్ల సరసన ఆయనది గౌరవనీయమైన స్థానం. కీర్తనలు పాడుకుంటూ అదే కర్ణాటక సంగీత, హిందూస్థానీ సంగీత పారమ్యం అని భావించే శ్రోతల సముద్రంలో ఈ ఆర్కెస్ట్రా అనే విషయాత్మక సంగీత కల్పనాపటిమ మరుగున పడిపోయింది. నాలుగు దశాబ్దాలుగా 1940ల నుంచి ’80ల దాకా సాగిన వాద్యగోష్ఠి కల్పనలలో రజని గారిది ప్రత్యేక పీఠం. రాగం తెచ్చే లయాత్మక సమ్యగ్దృష్టికి, ఆ రాగ స్వరాల జాడలు విసిరే లోచూపులకు ఆయన సంగీత రచనలు బంగారం గీటు చూపుతాయి. భారతీయ సంగీత పరిణామ చరిత్రను వీక్షించడంలోనూ, ఆంధ్ర వాగ్గేయకార చరిత్రలోని ధాన్యరాశులను ఎగురవేయడంలోనూ, లలిత సంగీత నిర్మాణ ఫలకాలను స్థాపించడంలోనూ ఏడు దశాబ్దాల విరామమెరుగని సేవ ఆయనది. అందుకే ఆయనకంత పేరు. అందుకే ఆయన వేరుదారులు ఈ నేలలో బలంగా పాదుకొన్నాయి. పూర్ణ జీవితంలో సంపూర్ణ తృప్తితో జీవిస్తూ ఉండడం ఆయనకే పట్టిన అదృష్టం. -
‘సిరిసిరిమువ్వ’ శతకాన్ని రాసినవారు?
ఆధునిక కవులు - రచనా విశేషాలు 1. జరుక్ శాస్త్రి ‘సరదాపాట’ ఏ రచనకు పేరడి? 1) విశ్వనాథ కల్పవృక్షానికి 2) కృష్ణశాస్త్రి కృష్ణపక్షానికి 3) శ్రీశ్రీ నవకవితకు 4) గురజాడ ముత్యాలసరాలకు 2. మహెజబీన్ కవితల తొలి సంకలనం ఏది? 1) వసంతకాలం - 1997 2) అమృతం కురిసిన రాత్రి - 1991 3) ఆకురాలు కాలం - 1997 4) నీలిమేఘాలు - 1991 3. ‘పండరి భాగవతం’ రచయిత ఎవరు? 1) బమ్మెర పోతన 2) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 3) పుట్టపర్తి నారాయణాచార్యులు 4) విశ్వనాథ సత్యనారాయణ 4. దాదా కేలూస్కర్ ఎవరి చరిత్రను రాశారు? 1) అంబేద్కర్ 2) బుద్ధ చరిత్ర 3) జ్యోతిరావు పూలే 4) రాజా రామ్మోహనరావు 5. సర్వాల్టర్ స్కాట్ స్కాట్లాండ్కు చెందిన ప్రముఖ? 1) పరిశోధకుడు 2) నవలా రచయిత 3) రాజకీయ విశ్లేషకుడు 4) కథా రచయిత 6. ‘ది ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు లిటరసీ క్రిటిసిజమ్’ గ్రంథ రచయిత ఎవరు? 1) డాక్టర్ రావూరి భరద్వాజ 2) ఆచార్య సి. నారాయణరెడ్డి 3) ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం 4) ఆచార్య ఎస్వీ రామారావు 7. ‘గాథా సప్తశతి’పై సురవరం ప్రతాపరెడ్డి రాసిన వ్యాసాన్ని ఏ పత్రికలో ప్రచు రించారు? 1) శోభ 2) గోలకొండ 3) సుజాత 4) కృష్ణాపత్రిక 8. ముట్నూరి కృష్ణారావు మచిలీపట్నం నుంచి నడిపిన పత్రిక? 1) కృష్ణాపత్రిక 2) ఆంధ్రప్రభ 3) ఆంధ్రపత్రిక 4) ప్రజావాణి 9. ‘ఉడతమ్మ ఉపదేశం’ అనే కథా సంపుటాన్ని రచించినవారు? 1) కపిలవాయి లింగమూర్తి 2) మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి 3) రావూరి భరద్వాజ 4) ఆచార్య ఎస్వీ రామారావు 10. గంధర్వ నాట్యమండలి స్థాపకుడు? 1) కృత్తివెంటి నాగేశ్వరరావు 2) కందుకూరి వీరేశలింగం 3) వై. భద్రాచార్యులు 4) కొమర్రాజు లక్ష్మణరావు 11. బాలగంగాధర తిలక్ ఎక్కడ జన్మించారు? 1) మామిడాల, తూర్పు గోదావరి జిల్లా 2) కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా 3) మండపాక, పశ్చిమ గోదావరి జిల్లా 4) మారేడుపాక, ఖమ్మం జిల్లా 12. తన కథలను ‘స్కెచ్’లుగా పేర్కొన్నవారు ఎవరు? 1) నండూరి రామ్మోహనరావు 2) త్రిపురనేని గోపిచంద్ 3) విద్వాన్ విశ్వం 4) నార్ల వెంకటేశ్వరరావు 13. ‘దిద్దుబాటు’ కథానికను రచించినవారు? 1) కందుకూరి వీరేశలింగం 2) గురజాడ అప్పారావు 3) రఘుపతి వెంకటరత్నం నాయుడు 4) గోవిందుని రామశాస్త్రి 14. ‘సిరిసిరిమువ్వ’ శతకాన్ని రాసినవారు? 1) ఆత్రేయ 2) ఆరుద్ర 3) జొన్నవిత్తుల 4) శ్రీశ్రీ 15. కొండెగాడు, రాళ్లూ - రప్పలు మొదలైన వింత శీర్షికలు పెట్టినవారు? 1) తాపీ ధర్మారావు 2) కొండా బాలకృష్ణారెడ్డి 3) సురవరం ప్రతాపరెడ్డి 4) ముట్నూరి కృష్ణారావు 16. రావణ వధ అనంతరం శ్రీరాముడు శ్రీశైల ప్రదక్షిణం ఏ క్షేత్రం నుంచి ప్రారంభించినట్లు శ్రీశైల స్థల పురాణం చెబుతోంది? 1) ద్రాక్షారామం 2) అమరావతి 3) కాళేశ్వరం 4) ఉమామహేశ్వరం 17. ‘యక్ష ప్రశ్నలు’, ‘సెలవుల్లో’ లాంటి శాస్త్ర గ్రంథాలను రచించినవారు? 1) ఆచార్య రామారావు 2) మహీధర జగన్మోహనరావు 3) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 4) మహీధర రామ్మోహనరావు 18. ‘అరికాళ్ల కింద మంటలు’, ‘కీలెరిగిన వాత’, ‘తల్లిప్రాణం’, ‘మార్గదర్శి’ మొదలైన కథలను రచించినవారు ఎవరు? 1) ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం 2) శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 3) విద్వాన్ విశ్వం 4) త్రిపురనేని గోపీచంద్ 19. ఆంధ్రుల సాంఘిక చరిత్ర - గ్రంథ కర్త? 1) ఆరుద్ర 2) కందుకూరి వీరేశలింగం 3) సురవరం ప్రతాపరెడ్డి 4) సి. నారాయణరెడ్డి 20. మలేషియాలో నిర్వహించిన రెండో తెలుగు మహాసభలకు తెలుగు ప్రతినిధిగా హాజరైన వారు? 1) మహెజబీన్ 2) శ్రీశ్రీ 3) సి. నారాయణరెడ్డి 4) బోయ జంగయ్య 21. ‘తెలుగు సాహిత్య విమర్శ - అవతరణ వికాసము’ అంశంపై పరిశోధన చేసి నవారు? 1) ఆచార్య ఎస్వీ రామారావు 2) ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 3) మునిమాణిక్యం నరసింహారావు 4) డాక్టర్ రావూరి భరద్వాజ 22. ‘గోలకొండ కవుల సంచిక’ను వెలువరించిన వారు? 1) ముట్నూరి కృష్ణారావు 2) కొండా బాలకృష్ణారెడ్డి 3) సురవరం ప్రతాపరెడ్డి 4) సురవరం సుధాకరరెడ్డి 23. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం ఏ పత్రికలో ‘జీవీఎస్ కాలమ్’ను నిర్వహించారు? 1) ఆంధ్రపత్రిక 2) ఆంధ్రప్రభ 3) ఆంధ్రభూమి 4) ఆంధ్రజ్యోతి 24. భారత ప్రభుత్వం గుర్రం జాషువాను ఏ బిరుదుతో సత్కరించింది? 1) పద్మశ్రీ 2) పద్మభూషణ్ 3) పద్మవిభూషణ్ 4) జ్ఞానపీఠ్ 25. ‘అన్నా కెరీనినా’ ఎవరి ప్రసిద్ధ నవల? 1) సరోజినీ నాయుడు 2) విలియం షేక్స్పియర్ 3) ఆర్.కె. నారాయణ 4) టాల్స్టాయ్ 26. }పాద సుబ్రహ్మణ్య శాస్త్రి మొదటి నవల? 1) మిథునానురాగం 2) శ్మశాన వాటిక 3) రక్షాబంధనము 4) కలంపోటు 27. 1816లో ‘ఎ గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్’ పేరుతో ఇంగ్లిష్లో తెలుగుకు వ్యాకరణం రాసినవారు? 1) సీపీ బ్రౌన్ 2) థామస్ మన్రో 3) ఎ.డి. కాంబెల్ 4) చిన్నయసూరి 28. 1940 - 44 మధ్య కాలంలో ‘వెర్రి వెంగళప్ప’, ‘కివిలెకట్టలు’ శీర్షికలతో హాస్య వ్యంగ్యాత్మకమైన రచనలు చేసినవారు? 1) వేదం వెంకటరాయ శాస్త్రి 2) దేవులపల్లి రామానుజరావు 3) సురవరం ప్రతాపరెడ్డి 4) పానుగంటి లక్ష్మీనరసింహం 29. అష్టావధానంలోని ఎనిమిది పనుల్లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిని బాగా ఆకట్టుకుని భయసంభ్రమాలు కలిగించింది ఏది? 1) ఆకాశపురాణం 2) దత్తపది 3) కావ్యపాఠం 4) నిషిద్ధాక్షరి 30. రెండో ప్రపంచయుద్ధం దుష్ఫలితాలకు కలత చెందిన తిలక్ హృదయం నుంచి వెలువడిన కవిత ఏది? 1) పిలుపు 2) సరదాపాట 3) ప్రపంచ శాంతి 4) తిమిరంతో సమరం 31. ‘విసంధి వివేకం’ పుస్తకాన్ని రచించి తెలుగులో సంధులు పాటించనక్కర లేదని సంస్కృత వ్యాకరణ ప్రమాణాలు చూపిం చిన వారు? 1) కందుకూరి వీరేశలింగం 2) గిడుగు రామమూర్తి 3) వేదం వెంకటరాయశాస్త్రి 4) పానుగంటి లక్ష్మీనరసింహం 32. ‘సుజనరంజని’ సాహిత్య పత్రికను నడిపిన వారు? 1) వేంకట రామనుజాచార్యులు 2) కందుకూరి వీరేశలింగం 3) గురజాడ అప్పారావు 4) పరవస్తు చిన్నయసూరి 33. ఎవరి ప్రోత్సాహంతో సురవరం ప్రతాపరెడ్డి ‘గోలకొండ’ పత్రికను 1926 మే 10వ తేదీన ప్రారంభించారు? 1) రాజా వెంకట రంగారావు 2) రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి 3) మాడపాటి హనుమంతరావు 4) కొండా బాలకృష్ణారెడ్డి 34. బలిజేపల్లి వారి హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్ర ధరించడం ద్వారా దీర్ఘ యశస్సును సంపాదించి పెట్టిన కళాతపస్వి ఎవరు? 1) స్థానం నరసింహారావు 2) యండమూరి భద్రాచార్యులు 3) గోలి సత్తిరాజు 4) యండమూరి సుబ్బారావు 35. ‘నీవు ఎక్కదలచిన బస్సు ఒక జీవితకాలం లేటు’ అని ఎవరు అన్నారు? 1) ఆరుద్ర 2) ఆత్రేయ 3) దాశరథి 4) నండూరి రామ్మోహనరావు 36. సరస్వతీ పుత్రుడు బిరుదున్న కవి? 1) శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి 2) చాగంటి సోమయాజులు 3) అల్లసాని పెద్దన 4) పుట్టపర్తి నారాయణాచార్యులు 37. హేతువాది, కవి అయిన గోపీచంద్ తండ్రి పేరు? 1) త్రిపురనేని రామస్వామి చౌదరి 2) త్రిపురనేని శ్రీనివాస్ 3) ఆదిభట్ల నారాయణదాసు 4) అనంతరామ శాస్త్రి 38. సురవరం ప్రతాపరెడ్డి ఎప్పుడు జన్మించారు? 1) 1876, మే 28 2) 1886, మే 28 3) 1885, మే 28 4) 1896, మే 28 39. జరుక్ శాస్త్రి ఏ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు? 1) కథానిక 2) గల్పిక 3) పేరడి 4) విమర్శ 40. ‘దమ్మపదం’లోని సూక్తులను తెలుగులోకి గేయఖండికల రూపంలో అందించినవారు? 1) బాలగంగాధర తిలక్ 2) గజ్జెల మల్లారెడ్డి 3) చాగంటి సోమయాజులు 4) గజ్జెల కృష్ణారెడ్డి 41. ‘విరికన్నె’, ‘రాతలు - గీతలు’, ‘నా హృదయం’ కావ్యాలను రాసినవారు? 1) ఎస్వీ రామారావు 2) త్రిపురనేని గోపీచంద్ 3) నండూరి రామ్మోహనరావు 4) విద్వాన్ విశ్వం 42. తుమ్మచెట్టును ‘కరువేళం’ అని ఎక్కడ పిలుస్తారు? 1) కేరళ 2) కర్ణాటక 3) తమిళనాడు 4) ఆంధ్రప్రదేశ్ 43. రాయలసీమ జీవనగతికి అద్దంపట్టిన కవి, పండితుడు, పాత్రికేయుడు స్వాతంత్య్ర సమరయోధుడు ఎవరు? 1) విద్వాన్ విశ్వం 2)త్రిపురనేని గోపీచంద్ 3) జి.వి. చలం 4) ఆచార్య ఎస్వీ రామారావు 44. కవి కోకిల, కవితా విశారద, నవయుగ చక్రవర్తి ఎవరి బిరుదులు? 1) గురజాడ వేంకట అప్పారావు 2) కాసుల పురుషోత్తమ కవి 3) గుర్రం జాషువా 4) జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి 45. రోజూ జరిగే సంఘటనలపై పత్రికల్లో సంపాదకులు, ప్రత్యేక వ్యాసకర్తలు చేసే వ్యాఖ్యలను ఏమంటారు? 1) వార్తా వ్యాఖ్య 2) విమర్శ వ్యాఖ్యలు 3) సంపాదకీయం 4) నడుస్తున్న చరిత్ర సమాధానాలు 1) 3; 2) 3; 3) 3; 4) 2; 5) 2; 6) 4; 7) 3; 8) 1; 9) 3; 10) 3; 11) 3; 12) 2; 13) 2; 14) 4; 15) 1; 16) 4; 17) 2; 18) 2; 19) 3; 20) 4; 21) 1; 22) 3; 23) 3; 24) 2; 25) 4; 26) 1; 27) 3; 28) 3; 29) 4; 30) 1; 31) 3; 32) 4; 33) 2; 34) 2; 35) 4; 36) 4; 37) 1; 38) 4; 39) 3; 40) 2; 41) 4; 42) 3; 43) 1; 44) 3; 45) 1.