‘సిరిసిరిమువ్వ’ శతకాన్ని రాసినవారు?
ఆధునిక కవులు - రచనా విశేషాలు
1. జరుక్ శాస్త్రి ‘సరదాపాట’ ఏ రచనకు పేరడి?
1) విశ్వనాథ కల్పవృక్షానికి
2) కృష్ణశాస్త్రి కృష్ణపక్షానికి
3) శ్రీశ్రీ నవకవితకు
4) గురజాడ ముత్యాలసరాలకు
2. మహెజబీన్ కవితల తొలి సంకలనం ఏది? 1) వసంతకాలం - 1997
2) అమృతం కురిసిన రాత్రి - 1991
3) ఆకురాలు కాలం - 1997
4) నీలిమేఘాలు - 1991
3. ‘పండరి భాగవతం’ రచయిత ఎవరు?
1) బమ్మెర పోతన
2) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
3) పుట్టపర్తి నారాయణాచార్యులు 4) విశ్వనాథ సత్యనారాయణ
4. దాదా కేలూస్‌కర్ ఎవరి చరిత్రను రాశారు?
1) అంబేద్కర్ 2) బుద్ధ చరిత్ర
3) జ్యోతిరావు పూలే
4) రాజా రామ్మోహనరావు
5. సర్‌వాల్టర్ స్కాట్ స్కాట్లాండ్‌కు చెందిన ప్రముఖ?
1) పరిశోధకుడు 2) నవలా రచయిత
3) రాజకీయ విశ్లేషకుడు
4) కథా రచయిత
6. ‘ది ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు లిటరసీ క్రిటిసిజమ్’ గ్రంథ రచయిత ఎవరు?
1) డాక్టర్ రావూరి భరద్వాజ
2) ఆచార్య సి. నారాయణరెడ్డి
3) ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం
4) ఆచార్య ఎస్వీ రామారావు
7. ‘గాథా సప్తశతి’పై సురవరం ప్రతాపరెడ్డి రాసిన వ్యాసాన్ని ఏ పత్రికలో ప్రచు రించారు?
1) శోభ 2) గోలకొండ
3) సుజాత 4) కృష్ణాపత్రిక
8. ముట్నూరి కృష్ణారావు మచిలీపట్నం నుంచి నడిపిన పత్రిక?
1) కృష్ణాపత్రిక 2) ఆంధ్రప్రభ
3) ఆంధ్రపత్రిక 4) ప్రజావాణి
9. ‘ఉడతమ్మ ఉపదేశం’ అనే కథా సంపుటాన్ని రచించినవారు?
1) కపిలవాయి లింగమూర్తి
2) మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
3) రావూరి భరద్వాజ
4) ఆచార్య ఎస్వీ రామారావు
10. గంధర్వ నాట్యమండలి స్థాపకుడు?
1) కృత్తివెంటి నాగేశ్వరరావు
2) కందుకూరి వీరేశలింగం
3) వై. భద్రాచార్యులు
4) కొమర్రాజు లక్ష్మణరావు
11. బాలగంగాధర తిలక్ ఎక్కడ జన్మించారు?
1) మామిడాల, తూర్పు గోదావరి జిల్లా 2) కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా
3) మండపాక, పశ్చిమ గోదావరి జిల్లా
4) మారేడుపాక, ఖమ్మం జిల్లా
12. తన కథలను ‘స్కెచ్’లుగా పేర్కొన్నవారు ఎవరు?
1) నండూరి రామ్మోహనరావు
2) త్రిపురనేని గోపిచంద్
3) విద్వాన్ విశ్వం
4) నార్ల వెంకటేశ్వరరావు
13. ‘దిద్దుబాటు’ కథానికను రచించినవారు?
1) కందుకూరి వీరేశలింగం
2) గురజాడ అప్పారావు
3) రఘుపతి వెంకటరత్నం నాయుడు 4) గోవిందుని రామశాస్త్రి
14. ‘సిరిసిరిమువ్వ’ శతకాన్ని రాసినవారు?
1) ఆత్రేయ 2) ఆరుద్ర
3) జొన్నవిత్తుల 4) శ్రీశ్రీ
15. కొండెగాడు, రాళ్లూ - రప్పలు మొదలైన వింత శీర్షికలు పెట్టినవారు?
1) తాపీ ధర్మారావు
2) కొండా బాలకృష్ణారెడ్డి
3) సురవరం ప్రతాపరెడ్డి
4) ముట్నూరి కృష్ణారావు
16. రావణ వధ అనంతరం శ్రీరాముడు శ్రీశైల ప్రదక్షిణం ఏ క్షేత్రం నుంచి ప్రారంభించినట్లు శ్రీశైల స్థల పురాణం చెబుతోంది?
1) ద్రాక్షారామం 2) అమరావతి
3) కాళేశ్వరం 4) ఉమామహేశ్వరం
17. ‘యక్ష ప్రశ్నలు’, ‘సెలవుల్లో’ లాంటి శాస్త్ర గ్రంథాలను రచించినవారు?
1) ఆచార్య రామారావు
2) మహీధర జగన్మోహనరావు
3) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
4) మహీధర రామ్మోహనరావు
18. ‘అరికాళ్ల కింద మంటలు’, ‘కీలెరిగిన వాత’, ‘తల్లిప్రాణం’, ‘మార్గదర్శి’ మొదలైన కథలను రచించినవారు ఎవరు?
1) ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం
2) శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
3) విద్వాన్ విశ్వం
4) త్రిపురనేని గోపీచంద్
19. ఆంధ్రుల సాంఘిక చరిత్ర - గ్రంథ కర్త?
1) ఆరుద్ర 2) కందుకూరి వీరేశలింగం
3) సురవరం ప్రతాపరెడ్డి
4) సి. నారాయణరెడ్డి
20. మలేషియాలో నిర్వహించిన రెండో తెలుగు మహాసభలకు తెలుగు ప్రతినిధిగా హాజరైన వారు?
1) మహెజబీన్ 2) శ్రీశ్రీ
3) సి. నారాయణరెడ్డి 4) బోయ జంగయ్య
21. ‘తెలుగు సాహిత్య విమర్శ - అవతరణ వికాసము’ అంశంపై పరిశోధన చేసి నవారు?
1) ఆచార్య ఎస్వీ రామారావు
2) ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం
3) మునిమాణిక్యం నరసింహారావు 4) డాక్టర్ రావూరి భరద్వాజ
22. ‘గోలకొండ కవుల సంచిక’ను వెలువరించిన వారు?
1) ముట్నూరి కృష్ణారావు
2) కొండా బాలకృష్ణారెడ్డి
3) సురవరం ప్రతాపరెడ్డి
4) సురవరం సుధాకరరెడ్డి
23. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం ఏ పత్రికలో ‘జీవీఎస్ కాలమ్’ను నిర్వహించారు?
1) ఆంధ్రపత్రిక 2) ఆంధ్రప్రభ
3) ఆంధ్రభూమి 4) ఆంధ్రజ్యోతి
24. భారత ప్రభుత్వం గుర్రం జాషువాను
ఏ బిరుదుతో సత్కరించింది?
1) పద్మశ్రీ 2) పద్మభూషణ్
3) పద్మవిభూషణ్ 4) జ్ఞానపీఠ్
25. ‘అన్నా కెరీనినా’ ఎవరి ప్రసిద్ధ నవల?
1) సరోజినీ నాయుడు
2) విలియం షేక్స్‌పియర్
3) ఆర్.కె. నారాయణ
4) టాల్‌స్టాయ్
26. }పాద సుబ్రహ్మణ్య శాస్త్రి మొదటి నవల?
1) మిథునానురాగం 2) శ్మశాన వాటిక
3) రక్షాబంధనము 4) కలంపోటు
27. 1816లో ‘ఎ గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్’ పేరుతో ఇంగ్లిష్‌లో తెలుగుకు వ్యాకరణం రాసినవారు?
1) సీపీ బ్రౌన్ 2) థామస్ మన్రో
3) ఎ.డి. కాంబెల్ 4) చిన్నయసూరి
28. 1940 - 44 మధ్య కాలంలో ‘వెర్రి వెంగళప్ప’, ‘కివిలెకట్టలు’ శీర్షికలతో హాస్య వ్యంగ్యాత్మకమైన రచనలు చేసినవారు?
1) వేదం వెంకటరాయ శాస్త్రి
2) దేవులపల్లి రామానుజరావు
3) సురవరం ప్రతాపరెడ్డి
4) పానుగంటి లక్ష్మీనరసింహం
29. అష్టావధానంలోని ఎనిమిది పనుల్లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిని బాగా ఆకట్టుకుని భయసంభ్రమాలు కలిగించింది ఏది?
1) ఆకాశపురాణం 2) దత్తపది
3) కావ్యపాఠం 4) నిషిద్ధాక్షరి
30. రెండో ప్రపంచయుద్ధం దుష్ఫలితాలకు కలత చెందిన తిలక్ హృదయం నుంచి వెలువడిన కవిత ఏది?
1) పిలుపు 2) సరదాపాట
3) ప్రపంచ శాంతి
4) తిమిరంతో సమరం
31. ‘విసంధి వివేకం’ పుస్తకాన్ని రచించి తెలుగులో సంధులు పాటించనక్కర లేదని సంస్కృత వ్యాకరణ ప్రమాణాలు చూపిం చిన వారు?
1) కందుకూరి వీరేశలింగం
2) గిడుగు రామమూర్తి
3) వేదం వెంకటరాయశాస్త్రి
4) పానుగంటి లక్ష్మీనరసింహం
32. ‘సుజనరంజని’ సాహిత్య పత్రికను నడిపిన వారు?
1) వేంకట రామనుజాచార్యులు
2) కందుకూరి వీరేశలింగం
3) గురజాడ అప్పారావు
4) పరవస్తు చిన్నయసూరి
33. ఎవరి ప్రోత్సాహంతో సురవరం ప్రతాపరెడ్డి ‘గోలకొండ’ పత్రికను 1926 మే 10వ తేదీన ప్రారంభించారు?
1) రాజా వెంకట రంగారావు
2) రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి
3) మాడపాటి హనుమంతరావు 4) కొండా బాలకృష్ణారెడ్డి
34. బలిజేపల్లి వారి హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్ర ధరించడం ద్వారా దీర్ఘ యశస్సును సంపాదించి పెట్టిన కళాతపస్వి ఎవరు?
1) స్థానం నరసింహారావు
2) యండమూరి భద్రాచార్యులు
3) గోలి సత్తిరాజు
4) యండమూరి సుబ్బారావు
35. ‘నీవు ఎక్కదలచిన బస్సు ఒక జీవితకాలం లేటు’ అని ఎవరు అన్నారు?
1) ఆరుద్ర 2) ఆత్రేయ
3) దాశరథి
4) నండూరి రామ్మోహనరావు
36. సరస్వతీ పుత్రుడు బిరుదున్న కవి?
1) శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి
2) చాగంటి సోమయాజులు
3) అల్లసాని పెద్దన
4) పుట్టపర్తి నారాయణాచార్యులు
37. హేతువాది, కవి అయిన గోపీచంద్ తండ్రి పేరు?
1) త్రిపురనేని రామస్వామి చౌదరి 2) త్రిపురనేని శ్రీనివాస్
3) ఆదిభట్ల నారాయణదాసు
4) అనంతరామ శాస్త్రి
38. సురవరం ప్రతాపరెడ్డి ఎప్పుడు జన్మించారు?
1) 1876, మే 28 2) 1886, మే 28
3) 1885, మే 28 4) 1896, మే 28
39. జరుక్ శాస్త్రి ఏ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు?
1) కథానిక 2) గల్పిక
3) పేరడి 4) విమర్శ
40. ‘దమ్మపదం’లోని సూక్తులను తెలుగులోకి గేయఖండికల రూపంలో అందించినవారు?
1) బాలగంగాధర తిలక్
2) గజ్జెల మల్లారెడ్డి
3) చాగంటి సోమయాజులు
4) గజ్జెల కృష్ణారెడ్డి
41. ‘విరికన్నె’, ‘రాతలు - గీతలు’, ‘నా హృదయం’ కావ్యాలను రాసినవారు?
1) ఎస్వీ రామారావు
2) త్రిపురనేని గోపీచంద్
3) నండూరి రామ్మోహనరావు
4) విద్వాన్ విశ్వం
42. తుమ్మచెట్టును ‘కరువేళం’ అని ఎక్కడ పిలుస్తారు?
1) కేరళ 2) కర్ణాటక
3) తమిళనాడు 4) ఆంధ్రప్రదేశ్
43. రాయలసీమ జీవనగతికి అద్దంపట్టిన కవి, పండితుడు, పాత్రికేయుడు స్వాతంత్య్ర సమరయోధుడు ఎవరు?
1) విద్వాన్ విశ్వం
2)త్రిపురనేని గోపీచంద్
3) జి.వి. చలం
4) ఆచార్య ఎస్వీ రామారావు
44. కవి కోకిల, కవితా విశారద, నవయుగ చక్రవర్తి ఎవరి బిరుదులు?
1) గురజాడ వేంకట అప్పారావు
2) కాసుల పురుషోత్తమ కవి
3) గుర్రం జాషువా
4) జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి
45. రోజూ జరిగే సంఘటనలపై పత్రికల్లో సంపాదకులు, ప్రత్యేక వ్యాసకర్తలు చేసే వ్యాఖ్యలను ఏమంటారు?
1) వార్తా వ్యాఖ్య 2) విమర్శ వ్యాఖ్యలు
3) సంపాదకీయం 4) నడుస్తున్న చరిత్ర
సమాధానాలు
1) 3; 2) 3; 3) 3; 4) 2; 5) 2;
6) 4; 7) 3; 8) 1; 9) 3; 10) 3;
11) 3; 12) 2; 13) 2; 14) 4; 15) 1;
16) 4; 17) 2; 18) 2; 19) 3; 20) 4;
21) 1; 22) 3; 23) 3; 24) 2; 25) 4;
26) 1; 27) 3; 28) 3; 29) 4; 30) 1;
31) 3; 32) 4; 33) 2; 34) 2; 35) 4;
36) 4; 37) 1; 38) 4; 39) 3; 40) 2;
41) 4; 42) 3; 43) 1; 44) 3; 45) 1.