NK Maddileti
-
ఈ జీవిత రహస్యాన్ని నేను కనిపెట్టాను!
తెలుగు భాషా పరిజ్ఞానం 1. శార్దూల పద్యంలో ప్రతి పాదంలో ఏ గణాలు వస్తాయి? 1) స భ ర న మ య వ 2) న జ భ జ జ జ ర 3) మ స జ స త త గ 4) భ ర న భ భ ర వ 2. ‘‘వ్యక్తికి బహువచనం శక్తి’’ అన్నారు. దీనికి పరోక్షానుకృతి రూపం? 1) }} అన్నారు వ్యక్తికి బహువచనం శక్తి 2) }} శక్తిని వ్యక్తికి బహువచనమన్నారు 3) వ్యక్తికి బహువచనం శక్తని శ్రీశ్రీ అన్నారు 4) బహువచనం వ్యక్తికి శక్తని శ్రీశ్రీ అన్నారు 3. ‘వాయువే ఆహారంగా గలవారు’ అనే వ్యుత్పత్యర్థం కలిగిన పదం ఏది? 1) పవనాంధసులు 2) అభ్రములు 3) పయోధులు 4) జీమూతములు 4. ఛందో పరిభాషలో మాత్ర అంటే? 1) క్షణంలో మూడో భాగం 2) క్షణంలో రెండో భాగం 3) క్షణంలో నాలుగో భాగం 4) క్షణంలో ఐదో భాగం 5. ద్విపదలో యతిస్థానం? 1) ప్రథమ గణాద్యక్షరం 2) తృతీయ గణాద్యక్షరం 3) ద్వితీయ గణాద్యక్షరం 4) చతుర్థ గణాద్యక్షరం 6. కోపం వచ్చినప్పుడు అనే అర్థంలో ప్రయో గించే జాతీయం ఏది? 1) బెల్లించడం 2) పులివాత పడటం 3) తోక తొక్కిన త్రాచు 4) కళ్లు నెత్తికెక్కు 7. శోకాగ్ని అనే పదంలోని సమాసం? 1) షష్టీతత్పురుషం 2) విశేషణ పూర్వపద కర్మధారయం 3) ఉపమాన పూర్వపద కర్మధారయం 4) రూపక సమాసం 8. అర్థాంతరన్యాసాలంకారంలో ఏది ఉంటుంది? 1) విశేష సామాన్య వాక్యాలను సమర్థించడం 2) ఉపమానోపమేయాలకు సాదృశ్యం చెప్పడం 3) ఉపమానోపమేయాలకు అభేదం చెప్పడం 4) ఉపమానోపమేయాలకు భేదం చెప్పడం 9. ‘‘వీరు పొమ్మనువారు కారు. వీరు పొగ బెట్టువారు’’. వీటిని సంయుక్త వాక్యంగా రాస్తే? 1) వీరు పొమ్మనువారు కారు కానీ పొగబెట్టువారు 2) వీరు పొమ్మనరు పొగ పెట్టరు 3) వీరు పొమ్మంటూనే పొగబెడతారు 4) వీరు పొమ్మనువారు కారు పొగ బెట్టువారు 10. అగ్నిభయం ఏ సమాసం? 1) చతుర్థీ తత్పురుషం 2) పంచమీ తత్పురుషం 3) షష్టీతత్పురుషం 4) ద్వితియాతత్పురుషం 11. ‘‘జలరుహ నాభు డిట్లు రభసంబున నందన పారిజాతముం’’ అనే పద్యపాదం ఏ వృత్తానికి చెందింది? 1) మత్తేభం 2) శార్దూలం 3) చంపకమాల 4) ఉత్పలమాల 12. ‘ఋణార్ణం’ అనే పదంలోని సంధి? 1) సవర్ణదీర్ఘ సంధి 2) వృద్ధి సంధి 3) విసర్గ సంధి 4) గుణ సంధి 13. ‘ప్రకాశింపజేయువాడు’ అనే వ్యుత్పత్యర్థం ఉన్న పదం ఏది? 1) భాస్కరుడు 2) ఇంద్రుడు 3) కృష్ణుడు 4) ప్రహ్లాదుడు 14. ‘పంకజము’ అనే పదానికి ‘తామరపూవు’ అనే అర్థమే వాడుకలో ఉంది. కాబట్టి అది? 1) రూఢ్యర్థం 2) వ్యుత్పత్యర్థం 3) నానార్థం 4) పర్యాయపదం 15. ఉపమాన ఉపమేయాలకు సంబంధం లేకున్నా ఉన్నదని చెప్పే అలంకారం? 1) అతిశయోక్తి 2) ఉపమ 3) ఉత్ప్రేక్ష 4) రూపకం 16. తెలుగు వ్యాకరణంలో ‘సంధి’ అంటే? 1) సమర్థమైన రెండు పదాల కలయిక 2) పూర్వ పర స్వరాలకు పరస్వరం ఏకాదేశమవడం 3) పరస్వరమునకు బదులు పూర్వస్వరం రావటం 4) రెండు స్వరాలకు బదులుగా మరొక స్వరం రావటం 17. ‘‘ప్రజలకు అభిమానం లేకపోతే ఓట్లు పడవు’’లో ఉన్న క్రియ? 1) వ్యతిరేక ఛేదర్థకం 2) ఛేదర్థకం 3) క్త్వార్థకం 4) వ్యతిరేకక్త్వార్థకం 18. విగ్రహవాక్యం ఉపయోగం? 1) సమాసం అర్థం వివరించటం 2) సమాసాన్ని గుర్తించటం 3) విభక్తులను గుర్తించటం 4) అలంకారాన్ని గుర్తించటం 19. ‘నలువ’ పదానికి విగ్రహ వాక్యం? 1) నాలుగు తలలు ఉన్నవాడు 2) నాలుగు నోర్లు ఉన్నవాడు 3) నాలుగు ముఖాలు ఉన్నవాడు 4) నాలుగు వరాలు ఇచ్చువాడు 20. ఒక వస్తువునే అనేకులు, అనేక విధాలుగా వర్ణిస్తే అది ఏ అలంకారం? 1) ఉపమ 2) ఉల్లేఖం 3) శ్లేష 4) రూపకం 21. ‘కుముదము’ పదానికి వ్యుత్పత్తి అర్థం? 1) సరస్సునందు పుట్టింది 2) చంద్రుణ్ణి సంతోషింపజేసేది 3) భూమిని సంతోషింపజేసేది 4) తెల్లని వర్ణం ఉన్నది 22. ‘శరము’ పదానికి నానార్థాలు? 1) బాణం, కప్పం, కీర్తి 2) బాణం, రెల్లు, నీరు 3) శోభ, చాపం, శరీరం 4) దేహం, సంపద, కిరణం 23. ‘‘నలుగురు నాలుగు వేదమ్ముల మంత్ర ములొప్ప బ్రహ్మముఖముల వోలెన్’’. ఈ వాక్యములోని అలంకారం? 1) అర్థాంతరన్యాస 2) ఉత్ప్రేక్ష 3) రూపక 4) ఉపమా 24. ‘తనూలత’ సమాసంలో ‘లత’ అనేది? 1) విశేషణం 2) విశేష్యం 3) ఉపమానం 4) ఉపమేయం 25. ‘దిక్కు’ పదానికి కిందివాటిలో అర్థాలు? 1) రక్షణం, ఏనుగు 2) దిశ, శరణం 3) దిశ, స్వభావం 4) స్వభావం, నారి 26. ‘ఇప్పుడ యెటయేని బోయె’ అనే కావ్య భాషా వాక్యాన్ని ఆధునిక భాషలోకి మారిస్తే? 1) ఇప్పుడే ఎక్కడికో పోయాడు 2) ఇప్పుడు యెటకో బోయాడు 3) ఇప్పుడు యాడకో బోయిండు 4) ఇప్పుడు ఎక్కడికో బోయాడు 27. ‘ముత్యము’కు పర్యాయ పదాలు? 1)బిల్వము,కువలము,పిశతము,కపిదూడ 2) ఆణె, చిలుము, అక్షీబము, కొలకము 3) ఆణె, కువలము, చినుకు, సారంగము 4) చినుకు,బిల్వము,కొలకము,శైలూషము 28. ‘ఈ జీవిత రహస్యాన్ని నేను కనిపెట్టాను’ ఈ వాక్యాన్ని నామ్నీకరిస్తే ఎలా ఏర్పడు తుంది? 1) ఇది నేను కనిపెట్టిన జీవిత రహస్యం 2) నేను ఈ జీవిత రహస్యాన్ని కనిపెట్టాను 3) ఈ జీవిత రహస్యమే నేను కనిపెట్టింది 4) నేను కనిపెట్టింది జీవిత రహస్యం 29. ‘ప్రభుత్వం పన్నులు తగ్గించింది. వస్తువుల ధరలు తగ్గలేదు’ ఈ సామాన్య వాక్యాలను కలిపి సంశ్లిష్ట వాక్యంగా రాస్తే? 1) {పభుత్వం పన్నులు తగ్గించినా ఇంకా వస్తువుల ధరలు తగ్గలేదు 2) {పభుత్వం పన్నులు తగ్గించినా వస్తువుల ధరలు తగ్గలేదు 3) {పభుత్వం పన్నులు తగ్గించింది కానీ వస్తువుల ధరలు తగ్గలేదు 4) {పభుత్వం పన్నులు తగ్గించింది. అయినా వస్తువుల ధరలు తగ్గలేదు 30. ‘తదసృగ్రుచులు’ అనే పదాన్ని విడదీస్తే? 1) తదసృగ్ + రుచులు 2) తత్ + ఆసృక్ + రుచులు 3) తత్ + అసృగ్ + రుచులు 4) తద్ + అసృక్ + రుచులు 31. ‘‘పాము, నిధి, ఒక వ్యూహము’’ అనే నానా ర్థాలున్న పదం? 1) పద్మము 2) అక్షౌహిణి 3) పణము 4) పన్నగము 32. ‘వుడుగుతున్నాయి’ అనే పదానికి ప్రామాణిక లేఖన రూపం? 1) పుడుగుతూన్నాయి 2) ఉడుకుతున్నవి 3) పుడుగుతున్నాయి 4) ఉడుగుతున్నాయి 33. దాహము అనే పదానికి వికృతి? 1) దట్టి 2) దగ 3) దహనం 4) దాగం 34. ఉకారము చివర ఉన్న తద్ధర్మార్థక విశేషణాలకు అచ్చుపరమైతే జరిగే సంధి? 1) నుగాగమ సంధి 2) దుగాగమ సంధి 3) టుగాగమ సంధి 4) రుగాగమ సంధి 35. నరేంద్ర మోడి భారతదేశ ప్రధానమంత్రి. ఇది ఏ వాక్యం? 1) ప్రార్థనార్థకం 2) విద్యర్థకం 3) భావార్థకం 4) నిశ్చయార్థకం 36. తేటగీతి పద్యంలోని ప్రతిపాదంలో గణాలు ఎలా ఉంటాయి? 1) 2 సూ, 2 ఇం, 1 సూ 2) 1 సూ, 2 ఇం, 2 సూ 3) 2 ఇం, 3 సూ 4) 3 సూ, 2 ఇం 37. ‘కీర్తికాయం’ ఏ సమాసం? 1) షష్టీతత్పురుష 2) విశేషణ పూర్వపద కర్మధారయ 3) విశేషణ ఉత్తరపద కర్మధారయ 4) రూపక సమాసం 38. సంశ్లిష్ట వాక్యంలో ప్రధానక్రియ సూచించే పని జరగడానికి షరతును సూచించడానికి ఉపయోగించే క్రియ? 1) హేత్వర్థకం 2) సందేహార్థకం 3) ఛేదర్థకం 4) వ్యతిరేకార్థకం 39. రంపము + పొట్టు = ? 1) రంపప్పొట్టు 2) రంపము పొట్టు 3) రంపం ప్పోటు 4) రంపపోటు 40. రెండు, నాలుగు పాదాల్లో ఐదు సూర్య గణాలున్న పద్యం? 1) తేటగీతి 2) కందం 3) మత్తకోకిల 4) ఆటవెలది సమాధానాలు 1) 3; 2) 3; 3) 1; 4) 3; 5) 2; 6) 3; 7) 4; 8) 1; 9) 4; 10) 2; 11) 3; 12) 2; 13) 1; 14) 1; 15) 3; 16) 2; 17) 1; 18) 2; 19) 2; 20) 2; 21) 3; 22) 2; 23) 4; 24) 3; 25) 2; 26) 1; 27) 3; 28) 4; 29) 2; 30) 2; 31) 1; 32) 4; 33) 2; 34) 1; 35) 4; 36) 2; 37) 4; 38) 3; 39) 1; 40) 4. -
‘సిరిసిరిమువ్వ’ శతకాన్ని రాసినవారు?
ఆధునిక కవులు - రచనా విశేషాలు 1. జరుక్ శాస్త్రి ‘సరదాపాట’ ఏ రచనకు పేరడి? 1) విశ్వనాథ కల్పవృక్షానికి 2) కృష్ణశాస్త్రి కృష్ణపక్షానికి 3) శ్రీశ్రీ నవకవితకు 4) గురజాడ ముత్యాలసరాలకు 2. మహెజబీన్ కవితల తొలి సంకలనం ఏది? 1) వసంతకాలం - 1997 2) అమృతం కురిసిన రాత్రి - 1991 3) ఆకురాలు కాలం - 1997 4) నీలిమేఘాలు - 1991 3. ‘పండరి భాగవతం’ రచయిత ఎవరు? 1) బమ్మెర పోతన 2) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 3) పుట్టపర్తి నారాయణాచార్యులు 4) విశ్వనాథ సత్యనారాయణ 4. దాదా కేలూస్కర్ ఎవరి చరిత్రను రాశారు? 1) అంబేద్కర్ 2) బుద్ధ చరిత్ర 3) జ్యోతిరావు పూలే 4) రాజా రామ్మోహనరావు 5. సర్వాల్టర్ స్కాట్ స్కాట్లాండ్కు చెందిన ప్రముఖ? 1) పరిశోధకుడు 2) నవలా రచయిత 3) రాజకీయ విశ్లేషకుడు 4) కథా రచయిత 6. ‘ది ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు లిటరసీ క్రిటిసిజమ్’ గ్రంథ రచయిత ఎవరు? 1) డాక్టర్ రావూరి భరద్వాజ 2) ఆచార్య సి. నారాయణరెడ్డి 3) ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం 4) ఆచార్య ఎస్వీ రామారావు 7. ‘గాథా సప్తశతి’పై సురవరం ప్రతాపరెడ్డి రాసిన వ్యాసాన్ని ఏ పత్రికలో ప్రచు రించారు? 1) శోభ 2) గోలకొండ 3) సుజాత 4) కృష్ణాపత్రిక 8. ముట్నూరి కృష్ణారావు మచిలీపట్నం నుంచి నడిపిన పత్రిక? 1) కృష్ణాపత్రిక 2) ఆంధ్రప్రభ 3) ఆంధ్రపత్రిక 4) ప్రజావాణి 9. ‘ఉడతమ్మ ఉపదేశం’ అనే కథా సంపుటాన్ని రచించినవారు? 1) కపిలవాయి లింగమూర్తి 2) మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి 3) రావూరి భరద్వాజ 4) ఆచార్య ఎస్వీ రామారావు 10. గంధర్వ నాట్యమండలి స్థాపకుడు? 1) కృత్తివెంటి నాగేశ్వరరావు 2) కందుకూరి వీరేశలింగం 3) వై. భద్రాచార్యులు 4) కొమర్రాజు లక్ష్మణరావు 11. బాలగంగాధర తిలక్ ఎక్కడ జన్మించారు? 1) మామిడాల, తూర్పు గోదావరి జిల్లా 2) కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా 3) మండపాక, పశ్చిమ గోదావరి జిల్లా 4) మారేడుపాక, ఖమ్మం జిల్లా 12. తన కథలను ‘స్కెచ్’లుగా పేర్కొన్నవారు ఎవరు? 1) నండూరి రామ్మోహనరావు 2) త్రిపురనేని గోపిచంద్ 3) విద్వాన్ విశ్వం 4) నార్ల వెంకటేశ్వరరావు 13. ‘దిద్దుబాటు’ కథానికను రచించినవారు? 1) కందుకూరి వీరేశలింగం 2) గురజాడ అప్పారావు 3) రఘుపతి వెంకటరత్నం నాయుడు 4) గోవిందుని రామశాస్త్రి 14. ‘సిరిసిరిమువ్వ’ శతకాన్ని రాసినవారు? 1) ఆత్రేయ 2) ఆరుద్ర 3) జొన్నవిత్తుల 4) శ్రీశ్రీ 15. కొండెగాడు, రాళ్లూ - రప్పలు మొదలైన వింత శీర్షికలు పెట్టినవారు? 1) తాపీ ధర్మారావు 2) కొండా బాలకృష్ణారెడ్డి 3) సురవరం ప్రతాపరెడ్డి 4) ముట్నూరి కృష్ణారావు 16. రావణ వధ అనంతరం శ్రీరాముడు శ్రీశైల ప్రదక్షిణం ఏ క్షేత్రం నుంచి ప్రారంభించినట్లు శ్రీశైల స్థల పురాణం చెబుతోంది? 1) ద్రాక్షారామం 2) అమరావతి 3) కాళేశ్వరం 4) ఉమామహేశ్వరం 17. ‘యక్ష ప్రశ్నలు’, ‘సెలవుల్లో’ లాంటి శాస్త్ర గ్రంథాలను రచించినవారు? 1) ఆచార్య రామారావు 2) మహీధర జగన్మోహనరావు 3) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 4) మహీధర రామ్మోహనరావు 18. ‘అరికాళ్ల కింద మంటలు’, ‘కీలెరిగిన వాత’, ‘తల్లిప్రాణం’, ‘మార్గదర్శి’ మొదలైన కథలను రచించినవారు ఎవరు? 1) ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం 2) శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 3) విద్వాన్ విశ్వం 4) త్రిపురనేని గోపీచంద్ 19. ఆంధ్రుల సాంఘిక చరిత్ర - గ్రంథ కర్త? 1) ఆరుద్ర 2) కందుకూరి వీరేశలింగం 3) సురవరం ప్రతాపరెడ్డి 4) సి. నారాయణరెడ్డి 20. మలేషియాలో నిర్వహించిన రెండో తెలుగు మహాసభలకు తెలుగు ప్రతినిధిగా హాజరైన వారు? 1) మహెజబీన్ 2) శ్రీశ్రీ 3) సి. నారాయణరెడ్డి 4) బోయ జంగయ్య 21. ‘తెలుగు సాహిత్య విమర్శ - అవతరణ వికాసము’ అంశంపై పరిశోధన చేసి నవారు? 1) ఆచార్య ఎస్వీ రామారావు 2) ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 3) మునిమాణిక్యం నరసింహారావు 4) డాక్టర్ రావూరి భరద్వాజ 22. ‘గోలకొండ కవుల సంచిక’ను వెలువరించిన వారు? 1) ముట్నూరి కృష్ణారావు 2) కొండా బాలకృష్ణారెడ్డి 3) సురవరం ప్రతాపరెడ్డి 4) సురవరం సుధాకరరెడ్డి 23. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం ఏ పత్రికలో ‘జీవీఎస్ కాలమ్’ను నిర్వహించారు? 1) ఆంధ్రపత్రిక 2) ఆంధ్రప్రభ 3) ఆంధ్రభూమి 4) ఆంధ్రజ్యోతి 24. భారత ప్రభుత్వం గుర్రం జాషువాను ఏ బిరుదుతో సత్కరించింది? 1) పద్మశ్రీ 2) పద్మభూషణ్ 3) పద్మవిభూషణ్ 4) జ్ఞానపీఠ్ 25. ‘అన్నా కెరీనినా’ ఎవరి ప్రసిద్ధ నవల? 1) సరోజినీ నాయుడు 2) విలియం షేక్స్పియర్ 3) ఆర్.కె. నారాయణ 4) టాల్స్టాయ్ 26. }పాద సుబ్రహ్మణ్య శాస్త్రి మొదటి నవల? 1) మిథునానురాగం 2) శ్మశాన వాటిక 3) రక్షాబంధనము 4) కలంపోటు 27. 1816లో ‘ఎ గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్’ పేరుతో ఇంగ్లిష్లో తెలుగుకు వ్యాకరణం రాసినవారు? 1) సీపీ బ్రౌన్ 2) థామస్ మన్రో 3) ఎ.డి. కాంబెల్ 4) చిన్నయసూరి 28. 1940 - 44 మధ్య కాలంలో ‘వెర్రి వెంగళప్ప’, ‘కివిలెకట్టలు’ శీర్షికలతో హాస్య వ్యంగ్యాత్మకమైన రచనలు చేసినవారు? 1) వేదం వెంకటరాయ శాస్త్రి 2) దేవులపల్లి రామానుజరావు 3) సురవరం ప్రతాపరెడ్డి 4) పానుగంటి లక్ష్మీనరసింహం 29. అష్టావధానంలోని ఎనిమిది పనుల్లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిని బాగా ఆకట్టుకుని భయసంభ్రమాలు కలిగించింది ఏది? 1) ఆకాశపురాణం 2) దత్తపది 3) కావ్యపాఠం 4) నిషిద్ధాక్షరి 30. రెండో ప్రపంచయుద్ధం దుష్ఫలితాలకు కలత చెందిన తిలక్ హృదయం నుంచి వెలువడిన కవిత ఏది? 1) పిలుపు 2) సరదాపాట 3) ప్రపంచ శాంతి 4) తిమిరంతో సమరం 31. ‘విసంధి వివేకం’ పుస్తకాన్ని రచించి తెలుగులో సంధులు పాటించనక్కర లేదని సంస్కృత వ్యాకరణ ప్రమాణాలు చూపిం చిన వారు? 1) కందుకూరి వీరేశలింగం 2) గిడుగు రామమూర్తి 3) వేదం వెంకటరాయశాస్త్రి 4) పానుగంటి లక్ష్మీనరసింహం 32. ‘సుజనరంజని’ సాహిత్య పత్రికను నడిపిన వారు? 1) వేంకట రామనుజాచార్యులు 2) కందుకూరి వీరేశలింగం 3) గురజాడ అప్పారావు 4) పరవస్తు చిన్నయసూరి 33. ఎవరి ప్రోత్సాహంతో సురవరం ప్రతాపరెడ్డి ‘గోలకొండ’ పత్రికను 1926 మే 10వ తేదీన ప్రారంభించారు? 1) రాజా వెంకట రంగారావు 2) రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి 3) మాడపాటి హనుమంతరావు 4) కొండా బాలకృష్ణారెడ్డి 34. బలిజేపల్లి వారి హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్ర ధరించడం ద్వారా దీర్ఘ యశస్సును సంపాదించి పెట్టిన కళాతపస్వి ఎవరు? 1) స్థానం నరసింహారావు 2) యండమూరి భద్రాచార్యులు 3) గోలి సత్తిరాజు 4) యండమూరి సుబ్బారావు 35. ‘నీవు ఎక్కదలచిన బస్సు ఒక జీవితకాలం లేటు’ అని ఎవరు అన్నారు? 1) ఆరుద్ర 2) ఆత్రేయ 3) దాశరథి 4) నండూరి రామ్మోహనరావు 36. సరస్వతీ పుత్రుడు బిరుదున్న కవి? 1) శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి 2) చాగంటి సోమయాజులు 3) అల్లసాని పెద్దన 4) పుట్టపర్తి నారాయణాచార్యులు 37. హేతువాది, కవి అయిన గోపీచంద్ తండ్రి పేరు? 1) త్రిపురనేని రామస్వామి చౌదరి 2) త్రిపురనేని శ్రీనివాస్ 3) ఆదిభట్ల నారాయణదాసు 4) అనంతరామ శాస్త్రి 38. సురవరం ప్రతాపరెడ్డి ఎప్పుడు జన్మించారు? 1) 1876, మే 28 2) 1886, మే 28 3) 1885, మే 28 4) 1896, మే 28 39. జరుక్ శాస్త్రి ఏ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు? 1) కథానిక 2) గల్పిక 3) పేరడి 4) విమర్శ 40. ‘దమ్మపదం’లోని సూక్తులను తెలుగులోకి గేయఖండికల రూపంలో అందించినవారు? 1) బాలగంగాధర తిలక్ 2) గజ్జెల మల్లారెడ్డి 3) చాగంటి సోమయాజులు 4) గజ్జెల కృష్ణారెడ్డి 41. ‘విరికన్నె’, ‘రాతలు - గీతలు’, ‘నా హృదయం’ కావ్యాలను రాసినవారు? 1) ఎస్వీ రామారావు 2) త్రిపురనేని గోపీచంద్ 3) నండూరి రామ్మోహనరావు 4) విద్వాన్ విశ్వం 42. తుమ్మచెట్టును ‘కరువేళం’ అని ఎక్కడ పిలుస్తారు? 1) కేరళ 2) కర్ణాటక 3) తమిళనాడు 4) ఆంధ్రప్రదేశ్ 43. రాయలసీమ జీవనగతికి అద్దంపట్టిన కవి, పండితుడు, పాత్రికేయుడు స్వాతంత్య్ర సమరయోధుడు ఎవరు? 1) విద్వాన్ విశ్వం 2)త్రిపురనేని గోపీచంద్ 3) జి.వి. చలం 4) ఆచార్య ఎస్వీ రామారావు 44. కవి కోకిల, కవితా విశారద, నవయుగ చక్రవర్తి ఎవరి బిరుదులు? 1) గురజాడ వేంకట అప్పారావు 2) కాసుల పురుషోత్తమ కవి 3) గుర్రం జాషువా 4) జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి 45. రోజూ జరిగే సంఘటనలపై పత్రికల్లో సంపాదకులు, ప్రత్యేక వ్యాసకర్తలు చేసే వ్యాఖ్యలను ఏమంటారు? 1) వార్తా వ్యాఖ్య 2) విమర్శ వ్యాఖ్యలు 3) సంపాదకీయం 4) నడుస్తున్న చరిత్ర సమాధానాలు 1) 3; 2) 3; 3) 3; 4) 2; 5) 2; 6) 4; 7) 3; 8) 1; 9) 3; 10) 3; 11) 3; 12) 2; 13) 2; 14) 4; 15) 1; 16) 4; 17) 2; 18) 2; 19) 3; 20) 4; 21) 1; 22) 3; 23) 3; 24) 2; 25) 4; 26) 1; 27) 3; 28) 3; 29) 4; 30) 1; 31) 3; 32) 4; 33) 2; 34) 2; 35) 4; 36) 4; 37) 1; 38) 4; 39) 3; 40) 2; 41) 4; 42) 3; 43) 1; 44) 3; 45) 1.