ఈ జీవిత రహస్యాన్ని నేను కనిపెట్టాను! | Telugu language knowledge | Sakshi
Sakshi News home page

ఈ జీవిత రహస్యాన్ని నేను కనిపెట్టాను!

Published Sat, Jun 21 2014 4:17 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఈ జీవిత రహస్యాన్ని నేను కనిపెట్టాను! - Sakshi

ఈ జీవిత రహస్యాన్ని నేను కనిపెట్టాను!

 తెలుగు భాషా పరిజ్ఞానం
 1.    శార్దూల పద్యంలో ప్రతి పాదంలో ఏ గణాలు వస్తాయి?
     1) స భ ర న మ య వ
     2) న జ భ జ జ జ ర
     3) మ స జ స త త గ
     4) భ ర న భ భ ర వ
 
 2.    ‘‘వ్యక్తికి బహువచనం శక్తి’’ అన్నారు. దీనికి పరోక్షానుకృతి రూపం?
     1)    }} అన్నారు వ్యక్తికి బహువచనం శక్తి
     2)    }} శక్తిని వ్యక్తికి బహువచనమన్నారు
     3)    వ్యక్తికి బహువచనం శక్తని శ్రీశ్రీ అన్నారు
     4)    బహువచనం వ్యక్తికి శక్తని శ్రీశ్రీ అన్నారు
 
 3.    ‘వాయువే ఆహారంగా గలవారు’ అనే వ్యుత్పత్యర్థం కలిగిన పదం ఏది?
 1) పవనాంధసులు    2) అభ్రములు
 3) పయోధులు     4) జీమూతములు

 4.    ఛందో పరిభాషలో మాత్ర అంటే?
     1) క్షణంలో మూడో భాగం
     2) క్షణంలో రెండో భాగం
     3) క్షణంలో నాలుగో భాగం
     4) క్షణంలో ఐదో భాగం
 
 5.    ద్విపదలో యతిస్థానం?
     1) ప్రథమ గణాద్యక్షరం
     2) తృతీయ గణాద్యక్షరం
     3) ద్వితీయ గణాద్యక్షరం
     4) చతుర్థ గణాద్యక్షరం
 
 6.    కోపం వచ్చినప్పుడు అనే అర్థంలో ప్రయో గించే జాతీయం ఏది?
     1) బెల్లించడం     2) పులివాత పడటం
     3) తోక తొక్కిన త్రాచు    4) కళ్లు నెత్తికెక్కు
 
 7.    శోకాగ్ని అనే పదంలోని సమాసం?
     1) షష్టీతత్పురుషం
     2) విశేషణ పూర్వపద కర్మధారయం
     3) ఉపమాన పూర్వపద కర్మధారయం
     4) రూపక సమాసం
 
 8.    అర్థాంతరన్యాసాలంకారంలో ఏది ఉంటుంది?
     1)    విశేష సామాన్య వాక్యాలను సమర్థించడం
     2)    ఉపమానోపమేయాలకు సాదృశ్యం చెప్పడం
     3)    ఉపమానోపమేయాలకు అభేదం చెప్పడం
     4)    ఉపమానోపమేయాలకు భేదం చెప్పడం
 
 9.    ‘‘వీరు పొమ్మనువారు కారు. వీరు పొగ బెట్టువారు’’. వీటిని సంయుక్త వాక్యంగా రాస్తే?
     1)    వీరు పొమ్మనువారు కారు కానీ పొగబెట్టువారు
     2)    వీరు పొమ్మనరు పొగ పెట్టరు
     3)    వీరు పొమ్మంటూనే పొగబెడతారు
     4)    వీరు పొమ్మనువారు కారు పొగ బెట్టువారు
 
 10.    అగ్నిభయం ఏ సమాసం?
     1) చతుర్థీ తత్పురుషం
     2) పంచమీ తత్పురుషం
     3) షష్టీతత్పురుషం
     4) ద్వితియాతత్పురుషం
 
 11.    ‘‘జలరుహ నాభు డిట్లు రభసంబున నందన పారిజాతముం’’ అనే పద్యపాదం ఏ వృత్తానికి చెందింది?
     1) మత్తేభం     2) శార్దూలం
     3) చంపకమాల     4) ఉత్పలమాల
 
 12.    ‘ఋణార్ణం’ అనే పదంలోని సంధి?
     1) సవర్ణదీర్ఘ సంధి    2) వృద్ధి సంధి
     3) విసర్గ సంధి     4) గుణ సంధి
 
 13.    ‘ప్రకాశింపజేయువాడు’ అనే వ్యుత్పత్యర్థం ఉన్న పదం ఏది?
 1) భాస్కరుడు     2) ఇంద్రుడు
 3) కృష్ణుడు     4) ప్రహ్లాదుడు
 
 14.    ‘పంకజము’ అనే పదానికి ‘తామరపూవు’ అనే అర్థమే వాడుకలో ఉంది. కాబట్టి అది?
 1) రూఢ్యర్థం     2) వ్యుత్పత్యర్థం
 3) నానార్థం     4) పర్యాయపదం
 
 15.    ఉపమాన ఉపమేయాలకు సంబంధం లేకున్నా ఉన్నదని చెప్పే అలంకారం?
 1) అతిశయోక్తి     2) ఉపమ
 3) ఉత్ప్రేక్ష     4) రూపకం
 
 16.    తెలుగు వ్యాకరణంలో ‘సంధి’ అంటే?
     1)    సమర్థమైన రెండు పదాల కలయిక
     2)    పూర్వ పర స్వరాలకు పరస్వరం ఏకాదేశమవడం
     3)    పరస్వరమునకు బదులు పూర్వస్వరం రావటం
     4)    రెండు స్వరాలకు బదులుగా మరొక స్వరం రావటం
 
 17.    ‘‘ప్రజలకు అభిమానం లేకపోతే ఓట్లు పడవు’’లో ఉన్న క్రియ?
 1) వ్యతిరేక ఛేదర్థకం 2) ఛేదర్థకం
 3) క్త్వార్థకం     4) వ్యతిరేకక్త్వార్థకం
 
 18.    విగ్రహవాక్యం ఉపయోగం?
 1) సమాసం అర్థం వివరించటం
 2) సమాసాన్ని గుర్తించటం
 3) విభక్తులను గుర్తించటం
 4) అలంకారాన్ని గుర్తించటం
 
 19.    ‘నలువ’ పదానికి విగ్రహ వాక్యం?
 1) నాలుగు తలలు ఉన్నవాడు
 2) నాలుగు నోర్లు ఉన్నవాడు
 3) నాలుగు ముఖాలు ఉన్నవాడు
 4) నాలుగు వరాలు ఇచ్చువాడు
 
 20.    ఒక వస్తువునే అనేకులు, అనేక విధాలుగా వర్ణిస్తే అది ఏ అలంకారం?
 1) ఉపమ     2) ఉల్లేఖం
 3) శ్లేష     4) రూపకం
 
 21.    ‘కుముదము’ పదానికి వ్యుత్పత్తి అర్థం?
 1) సరస్సునందు పుట్టింది
 2) చంద్రుణ్ణి సంతోషింపజేసేది
 3) భూమిని సంతోషింపజేసేది
 4) తెల్లని వర్ణం ఉన్నది
 
 22.    ‘శరము’ పదానికి నానార్థాలు?
 1) బాణం, కప్పం, కీర్తి
 2) బాణం, రెల్లు, నీరు
 3) శోభ, చాపం, శరీరం
 
 4) దేహం, సంపద, కిరణం
 
 23.    ‘‘నలుగురు నాలుగు వేదమ్ముల మంత్ర ములొప్ప బ్రహ్మముఖముల వోలెన్’’. ఈ వాక్యములోని అలంకారం?
 1) అర్థాంతరన్యాస    2) ఉత్ప్రేక్ష
 3) రూపక    4) ఉపమా
 
 24.    ‘తనూలత’ సమాసంలో ‘లత’ అనేది?
 1) విశేషణం     2) విశేష్యం
 3) ఉపమానం     4) ఉపమేయం
 
 25.    ‘దిక్కు’ పదానికి కిందివాటిలో అర్థాలు?
 1) రక్షణం, ఏనుగు
 2) దిశ, శరణం
 3) దిశ, స్వభావం     4) స్వభావం, నారి
 
 26.    ‘ఇప్పుడ యెటయేని బోయె’ అనే కావ్య భాషా వాక్యాన్ని ఆధునిక భాషలోకి మారిస్తే?
 1) ఇప్పుడే ఎక్కడికో పోయాడు
 2) ఇప్పుడు యెటకో బోయాడు
 3) ఇప్పుడు యాడకో బోయిండు
 4) ఇప్పుడు ఎక్కడికో బోయాడు
 
 27.    ‘ముత్యము’కు పర్యాయ పదాలు?
     1)బిల్వము,కువలము,పిశతము,కపిదూడ
     2)    ఆణె, చిలుము, అక్షీబము, కొలకము
     3)    ఆణె, కువలము, చినుకు, సారంగము
     4) చినుకు,బిల్వము,కొలకము,శైలూషము
 
 28.    ‘ఈ జీవిత రహస్యాన్ని నేను కనిపెట్టాను’ ఈ వాక్యాన్ని నామ్నీకరిస్తే ఎలా ఏర్పడు తుంది?
     1) ఇది నేను కనిపెట్టిన జీవిత రహస్యం
     2) నేను ఈ జీవిత రహస్యాన్ని కనిపెట్టాను
 3) ఈ జీవిత రహస్యమే నేను కనిపెట్టింది
 4) నేను కనిపెట్టింది జీవిత రహస్యం
 
 29.    ‘ప్రభుత్వం పన్నులు తగ్గించింది. వస్తువుల ధరలు తగ్గలేదు’ ఈ సామాన్య వాక్యాలను కలిపి సంశ్లిష్ట వాక్యంగా రాస్తే?
     1)    {పభుత్వం పన్నులు తగ్గించినా ఇంకా వస్తువుల ధరలు తగ్గలేదు
     2)    {పభుత్వం పన్నులు తగ్గించినా వస్తువుల ధరలు తగ్గలేదు
     3)    {పభుత్వం పన్నులు తగ్గించింది కానీ వస్తువుల ధరలు తగ్గలేదు
     4)    {పభుత్వం పన్నులు తగ్గించింది. అయినా వస్తువుల ధరలు తగ్గలేదు
 
 30.    ‘తదసృగ్రుచులు’ అనే పదాన్ని విడదీస్తే?
 1) తదసృగ్ + రుచులు
 2) తత్ + ఆసృక్ + రుచులు
 3) తత్ + అసృగ్ + రుచులు
 4) తద్ + అసృక్ + రుచులు
 
 31.    ‘‘పాము, నిధి, ఒక వ్యూహము’’ అనే నానా ర్థాలున్న పదం?
 1) పద్మము     2) అక్షౌహిణి
 3) పణము     4) పన్నగము
 
 32.    ‘వుడుగుతున్నాయి’ అనే పదానికి ప్రామాణిక లేఖన రూపం?
 1) పుడుగుతూన్నాయి 2) ఉడుకుతున్నవి
 3) పుడుగుతున్నాయి    4) ఉడుగుతున్నాయి
 
 33.    దాహము అనే పదానికి వికృతి?
 1) దట్టి     2) దగ
 3) దహనం    4) దాగం
 
 34.    ఉకారము చివర ఉన్న తద్ధర్మార్థక విశేషణాలకు అచ్చుపరమైతే జరిగే సంధి?
 1) నుగాగమ సంధి    2) దుగాగమ సంధి
 3) టుగాగమ సంధి    4) రుగాగమ సంధి
 
 35.    నరేంద్ర మోడి భారతదేశ ప్రధానమంత్రి. ఇది ఏ వాక్యం?
 1) ప్రార్థనార్థకం    2) విద్యర్థకం
 3) భావార్థకం     4) నిశ్చయార్థకం
 
 36.    తేటగీతి పద్యంలోని ప్రతిపాదంలో గణాలు ఎలా ఉంటాయి?
 1) 2 సూ, 2 ఇం, 1 సూ
 2) 1 సూ, 2 ఇం, 2 సూ
 3) 2 ఇం, 3 సూ     4) 3 సూ, 2 ఇం
 
 37.    ‘కీర్తికాయం’ ఏ సమాసం?
 1) షష్టీతత్పురుష
 2) విశేషణ పూర్వపద కర్మధారయ
 3) విశేషణ ఉత్తరపద కర్మధారయ
 4) రూపక సమాసం
 
 38.    సంశ్లిష్ట వాక్యంలో ప్రధానక్రియ సూచించే పని జరగడానికి షరతును సూచించడానికి ఉపయోగించే క్రియ?
 1) హేత్వర్థకం     2) సందేహార్థకం
 3) ఛేదర్థకం     4) వ్యతిరేకార్థకం
 
 39.    రంపము + పొట్టు = ?
 1) రంపప్పొట్టు     2) రంపము పొట్టు
 3) రంపం ప్పోటు     4) రంపపోటు
 
 40.    రెండు, నాలుగు పాదాల్లో ఐదు సూర్య గణాలున్న పద్యం?
 1) తేటగీతి     2) కందం
 3) మత్తకోకిల     4) ఆటవెలది
 
 సమాధానాలు
 1) 3;    2) 3;    3) 1;    4) 3;    5) 2;
 6) 3;    7) 4;    8) 1;    9) 4;    10) 2;
 11) 3;    12) 2;    13) 1;    14) 1;    15) 3;
 16) 2;    17) 1;    18) 2;    19) 2;    20) 2;
 21) 3;    22) 2;    23) 4;    24) 3;    25) 2;
 26) 1;    27) 3;    28) 4;    29) 2;    30) 2;
 31) 1;    32) 4;    33) 2;    34) 1;    35) 4;
 36) 2;    37) 4;    38) 3;    39) 1;    40) 4.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement