బోధనా పద్ధతులు
టెట్, డీఎస్సీ పరీక్షలకు సంబంధించి తెలుగు బోధనా పద్ధతులు విభాగంలో ‘ప్రణాళికా రచన- పాఠ్యగ్రంథాలు’, ‘పాఠ్యబోధనా ప్రక్రియలు- ఆధునిక బోధనా పద్ధతులు’ పాఠ్యాంశాలు కీలకమైనవి. ఈ అధ్యాయాల నుంచి గతంలో అడిగిన ప్రశ్నలు, మాదిరి ప్రశ్నలను పరిశీలిద్దాం.
మాదిరి ప్రశ్నలు
1. తరగతి బోధనకు మార్గనిర్దేశనం చేసి, ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆ శిస్తున్న ప్రవర్తనా మార్పుల్ని సూచించేవి?
1) ఉద్దేశాలు 2) గమ్యాలు
3) లక్ష్యాలు 4) స్పష్టీకరణలు
2. విద్యార్థికి సంబంధించిన మొత్తం పాఠశాల జీవితమే విద్యాప్రణాళిక అని పేర్కొంది?
1) ఫిలిప్స్ టేలర్ 2) పౌల్ హార్‌ట్స
3) జె.ఎస్. కేర్ 4) సెకండరీ విద్యా కమిషన్
3. ఉపాధ్యాయుని పని తీరు, సామర్థ్యాన్ని తెలిపే ప్రణాళిక?
1) సమగ్ర పథకం 2) పాఠ్యపథకం
3) వార్షిక ప్రణాళిక 4) సంస్థాగత ప్రణాళిక
4. భాషా బోధనలో యూనిట్ అంటే?
1) ఒక పద్యభాగం 2) ఒక గద్యభాగం
3) ప్రతిపాఠం ఒక యూనిట్
4) ఒక పద్యపాఠం, ఒక గద్యపాఠం రెండూ కలిపి
5. అభ్యాసం చేయడం ద్వారా విద్యార్థుల్లో పునర్బలనం చేకూర్చడానికి తోడ్పడే గ్రంథం?
1) వాచక పుస్తకం 2) ఉపవాచకం
3) కృషి పుస్తకం 4) ఉపాధ్యాయ కరదీపిక
6. ఉపవాచక బోధనోద్దేశాలకు అనుగుణమైన పఠన విధానం?
1) విస్తార - మౌన పఠనం
2) క్షుణ్న పఠనం
3) ప్రకాశ - మౌన పఠనం
4) విస్తార - బాహ్య పఠనం
7. పాఠశాల, సమాజానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచడం ఏ ప్రణాళిక ముఖ్య లక్షణం?
1) విద్యా 2) సంస్థాగత
3) విషయ 4) వార్షిక ప్రణాళిక
8. తరగతి గదుల్లో సంప్రదాయంగా బోధించే విషయాలే కాకుండా పాఠశాలలో విద్యార్థి అన్ని అనుభవాల మొత్తాన్ని ఏమంటారు?
1) విద్యా ప్రణాళిక 2) వార్షిక ప్రణాళిక
3) సంస్థాగత ప్రణాళిక 4) సమగ్ర ప్రణాళిక
9. కృత్యాధార బోధనను మొదట ఏ దశలో ప్రవేశపెట్టారు?
1) ప్రాథమిక స్థాయి
2) ప్రాథమికోన్నత స్థాయి
3) ఉన్నత స్థాయి
4) ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలు
10. {పస్తుతం బోధన ఉపాధ్యాయ కేంద్రీకృతం కాకుండా, శిశు కేంద్రీకృతంగా సాగాలని ఎవరన్నారు?
1) రూసో
2) పెస్టాలజీ
3) బెంజిమన్ బ్లూమ్ 4) ప్రోబెల్
11. వ్యాకరణ బోధనకు అనుకూలమైన పద్ధతి?
1) నిగమనోపపత్తి
2) అనుమానోపపత్తి
3) ప్రయోగ పద్ధతి
4) అనుసంధాన
12. పాఠశాల స్థాయిలో ప్రయోజనకరం కాని పద్ధతి?
1) చర్చా పద్ధతి 2) ఉపన్యాస పద్ధతి
3) ఉదాహరణ పద్ధతి 4) ప్రశ్నోత్తర పద్ధతి
13. ఏ బోధనలో వ్యాకరణాంశాల చర్చ ఉండకూడదు?
1) పద్యబోధన 2) గద్యబోధన
3) ఉపవాచకం 4) వ్యాసరచన
14. ఉపాధ్యాయుడి బోధనా సాఫల్యం ఏ సోపానంపై ఆధారపడి ఉంటుంది?
1) మూల్యాంకనం 2) ప్రదర్శనం
3) ఉన్ముఖీకరణం 4) పునర్విమర్శ
15. వపన్ అనే విద్యార్థికి సాహితీవేత్తలపట్ల గౌరవ భావం ఉంది. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
1) భాషాభిరుచి 2) సాహిత్యాభిరుచి
3) సృజనాత్మక శక్తి
4) సముచిత మనోవైఖరి
16. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములుగా చేసే పద్ధతి?
1) చర్చా పద్ధతి 2) ప్రశ్నోత్తర 3) కథాకథన 4) నాటకీకరణ పద్ధతి
17. ఉపాధ్యాయుడు పల్లె గొప్పదా! పట్నం గొప్పదా! అనే అంశంపై రచన చేయిస్తే.... అది?
1) ఊహాత్మక వ్యాసం 2) సంవాదాత్మక వ్యాసం
3) వర్ణనాత్మక వ్యాసం
4) ఆలోచనాత్మక వ్యాసం
18. పూర్వ జ్ఞానపరిశీలనం, ఉన్ముఖీకరణం, శీర్షి కా పఠనం... అనేవి ఎందులోని ఉప సోపానాలు?
1) ప్రదర్శనం 2) గైహికం
3) ప్రవేశం 4) పునర్విమర్శ
19. దేన్ని పాఠశాల స్థాయిలో అన్ని తరగతు లకు, అన్ని రకాల పాఠ్యాంశాల బోధనకు బహుళ ప్రయోజనకారిగా పేర్కొంటారు?
1) పఠన పద్ధతి 2) ప్రశ్నోత్తర పద్ధతి
3) చర్చా పద్ధతి 4) కథాకథన పద్ధతి
20. కృత్యాధార బోధన ముఖ్య ఉద్దేశం?
1) ప్రాతిపదిక విద్య
2) స్వయం అధ్యయన శక్తి
3) గుణాత్మక విద్యాసాధన
4) ప్రయోగాత్మక విద్య
21. {పాజెక్టు పద్ధతికి ఎవరు ప్రతిపాదించిన విద్యాతత్వ మూల సూత్రాలే ఆధారం?
1) పెస్టాలజీ 2) రూసో
3) ప్రోబెల్ 4) జాన్‌డ్యూయి
22. స్వయం వివర్తనం, స్వయం ప్రకాశం, స్వయం ప్రకటన అనేవి ఏ పద్ధతి ప్రధానాంశాలు?
1) క్రీడా పద్ధతి 2) కిండర్‌గార్డెన్
3) మాంటిసోరి 4) ప్రాజెక్టు పద్ధతి
23. గద్యబోధనలో వ్యాకరణాన్ని ఎప్పుడు బోధించాలి?
1) పాఠ్యాంశం చివర
2) యూనిట్ చివర
3) ప్రత్యేక పీరియడ్‌లో
4) బోధనలో అంతర్భాగంగా
24. ‘కవికి గీటురాయి గద్యం అయితే, గద్యానికి గీటురాయి వ్యాసం’ అని ఎవరన్నారు?
1) పరవస్తు రంగాచార్యులు
2) ఆచార్య రామచంద్ర వర్మ
3) ఆచార్య రామచంద్ర శుక్లా
4) కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి
25. ఉపాధ్యాయుడు విద్యార్థులతో వ్యాకరణ బోధనలో లక్షణ, లక్ష్య సమన్వయం చేయ డాన్ని ఏమంటారు?
1) ప్రయోగ పద్ధతి
2) అనుసంధాన పద్ధతి
3) నిగమనోపపత్తి పద్ధతి
4) అనుమానోపపత్తి పద్ధతి
గతంలో అడిగిన ప్రశ్నలు
పాఠ్య ప్రణాళిక - పాఠ్యగ్రంథాలు
1. యం.బి.బచ్ నిర్వచనం ఆధారంగా పాఠశాల కార్యక్రమాలను అభివృద్ధి చేయ డానికి ఒక పాఠశాల తన అవసరాలను, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తయారుచేసుకునే అభివృద్ధి ప్రణాళిక?
1) పాఠ్యప్రణాళిక 2) విషయ ప్రణాళిక
3) సమగ్ర పథకం
4) సంస్థాగత ప్రణాళిక
2. ఉపాధ్యాయులు ఒక అంశాన్ని బోధించే టప్పుడు దానికి సంబంధించిన అదనపు సమాచారం, జ్ఞానం, వివరణకు ఉపకరించేవి?
1) పరామర్శ గ్రంథాలు
2) పాఠ్యపుస్తకాలు
3) సమస్యాపురాణం 4) కృషి పుస్తకాలు
3. బ్యూచాంపీ నిర్వచనాన్ని అనుసరించి పాఠశాలలో విద్యార్థులకు విద్యానుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం రూప కల్పన?
1) విద్యా ప్రణాళిక
2) సాంఘిక ప్రణాళిక
3) యూనిట్ ప్రణాళిక
4) సంస్థాగత ప్రణాళిక
4. క్షుణ్న పఠనాభివృద్ధి, భాషా సామర్థ్యాల సాధనకు తోడ్పడేది?
1) అధ్యాపక దర్శిని 2) ఉపవాచకం
3) కృషిపుస్తకం 4) వాచకం
5. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేది విద్యాప్రణాళిక అయితే పాఠ్యప్రణాళిక?
1) శాశ్వత ప్రయోజనానికి తోడ్పడేది
2) పాక్షిక ప్రయోజనానికి తోడ్పడేది
3) సాంకేతిక ప్రయోజనానికి తోడ్పడేది 4) అలౌకిక ప్రయోజనానికి తోడ్పడేది
పాఠ్యబోధన ప్రక్రియలు - ఆధునిక
బోధనా పద్ధతులు
6. మనోవైజ్ఞానిక సూత్రాలకు విరుద్ధమైన గద్యబోధనా పద్ధతి?
1) పఠన పద్ధతి 2) ఉదాహరణ పద్ధతి
3) చర్చా పద్ధతి 4) ప్రవచన పద్ధతి
7. పద్య బోధనలో ఉన్నత తరగతులకు ఉత్త మమైన ఆధునిక పద్ధతి?
1) తాత్పర్య పద్ధతి 2) పఠన పద్ధతి
3) ఖండ పద్ధతి 4) పూర్ణ పద్ధతి
8. పఠనౌత్సుక్యం పెంపొందించి, పఠన సామర్థ్యం ఎక్కువ చేయడం ద్వారా విద్యార్థుల వినోద విజ్ఞానాలను పెంపొందించడమే ప్రధాన లక్ష్యం కలిగిన బోధన?
1) పద్యబోధన 2) వ్యాస బోధన
3) గద్యబోధన 4) ఉపవాచక బోధన
9. {ఫాన్సిస్‌చాస్, జె.లైడ్ ట్రంప్ అనే విద్యావేత్తలు వ్యాప్తి చేసిన భావన?
1) కార్యక్రమయుత భావన 2) బృంద బోధన 3) సూక్ష్మబోధన
4) పర్యవేక్షణాత్మక అధ్యయనం
10. విద్యార్థుల శక్తియుక్తులను బలోపేతం చేయడానికి వారి జ్ఞానేంద్రియాలు ప్రేరేపిస్తే వారు అత్యంత సమర్థంగా అభ్యసించ గలుగుతారని భావించినవారు?
1) కాల్డ్‌వెల్ కుక్
2) హెలెన్ పార్‌క హర్‌ట్స
3) మాంటిసోరి 4) ప్రోబెల్
11. వ్యాకరణ సూత్రం చెప్పి, సూత్రంలోని పారిభాషిక పదాలు వివరించి, ఆ సూత్రంతో లక్ష్య లక్షణ సమన్వయం చేయడం?
1) అనుమానోపపత్తి పద్ధతి
2) నిగమోపపత్తి పద్ధతి
3) చారిత్రక వ్యాకరణం
4) ప్రాయోగిక పద్ధతి
12. కాలక్రమంలో ఒక యుగం నుంచి మరో యుగం వరకు భాషలో పరిణామాలను గుర్తించి, తెలిపే భాగం?
1) ప్రాయోగిక వ్యాకరణం
2) వర్ణనాత్మక వ్యాకరణం
3) చారిత్రక వ్యాకరణం
4) తులనాత్మక వ్యాకరణం
13. గద్యబోధన ఉద్దేశం?
1) విద్యార్థుల్లో భాషా జ్ఞానం అభివృద్ధి చేయడం
2) పదస్వరూప, స్వభావాలను గ్రహింప జేయడం
3) రచనా నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడం
4) కవితా ప్రశంస మార్గాలు తెలిపి ఉత్తమ విమర్శకులు కావడానికి సహాయ పడటం
14. వ్యాఖ్యాన పద్ధతి ఉపకరించే బోధన?
1) కథాబోధన 2) నాటక బోధన
3) వ్యాకరణ బోధన
4) ఉపవాచక బోధన
15. పాఠశాల బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా విద్యార్థులు సంవత్సరమంతా నిర్వహించే తోటపని, పాఠశాల బ్యాంకు వంటి ఉద్యమాలు?
1) సంకీర్ణ ఉద్యమాలు
2) సాంస్కృతిక ఉద్యమాలు
3) పర్యావరణ ఉద్యమాలు
4) భాషోద్యమాలు
సమాధానాలు:
1) 4; 2) 1; 3) 1; 4) 4;
5) 2; 6) 4; 7) 4; 8) 4;
9) 2; 10) 3; 11) 2; 12) 3;
13) 1; 14) 2; 15) 1.
‘మొత్తం పాఠశాల జీవితమే.. విద్యాప్రణాళిక’
Published Fri, Oct 10 2014 11:03 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement