Moghalpura
-
ఎయిర్ రివాల్వర్‌తో ఆటలు.. బల్లిని కాల్చబోతే బాలుడికి గాయం..
సాక్షి, హైదరాబాద్: క్రీడల కోసమంటూ ఖరీదు చేసిన ఎయిర్ రివాల్వర్‌తో ఓ పాతబస్తీ వాసి ఆటలాడాడు. అప్పటి వరకు వీధికుక్కలపై కాల్పులు జరిపిన అతగాడు గోడపై ఉన్న బల్లిని కాల్చాలని ప్రయత్నించాడు. గోడకు తగిలిన చెర్రా రికోచెట్ కావడంతో సమీపంలో ఉన్న బాలుడి వీపులోకి దూసుకుపోయింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలుడు డిశ్చార్జ్ అయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మొఘల్‌పుర పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇన్స్పెక్టర్ ఎ.శివ కుమార్ వివరాలు వెల్లడించారు. సుల్తాన్‌షాహీ కైసర్ హోటల్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీం కుమారుడు మహ్మద్ అఫ్జల్ అఫ్సర్ వాటర్ ప్లాంట్, పాన్ షాపు నిర్వహిస్తుంటాడు. ఇతడు 2021 అక్టోబర్ 21న అబిడ్స్‌లోని ఏషియన్ ఆరమ్స్ దుకాణం నుంచి 0.117 క్యాలిబర్ ఎయిర్ రివాల్వర్ ఖరీదు చేశాడు. ఆ సందర్భంలో క్రీడల కోసమంటూ (స్పోర్ట్స్) రూ.17,700 వెచ్చించి దీనిని కొన్నాడు. ఈ రివాల్వర్‌లో చెర్రాలను తూటాల మాదిరిగా వినియోగించే అఫ్సర్ ఇంట్లో గోడలపై ఉన్న బల్లులు, వీధికుక్కలను కాలుస్తుంటాడు. సోమవారం (ఈ నెల 1వ తేదీ) ఉదయం 10.30–11 గంటల మధ్య ఇలానే చేస్తున్న అఫ్సర్‌ను ఓ బాలుడు కలిశాడు. గోడపై ఉన్న బల్లిని కాల్చాల్సిందిగా కోరాడు. ఇతడు అదే పని చేయగా.. గోడకు తగిలిన చెర్రా రికోచెట్ కారణంగా దిశ మార్చుకుని దూసుకుపోయింది. ఇంటి పక్కన ఉండే సయ్యద్ మోహసీన్ అలీ కుమారుడు ఆజాన్ (9) బయటకు ఆడుకుంటున్నాడు. ఈ చెర్రా వేగంగా వెళ్లి ఆజాన్ వీపులోకి దూసుకుపోయింది. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న క్లీనిక్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆపై మెరుగైన వైద్య సేవల చికిత్స నిమిత్తం బుధవారం బహదూర్‌పురాలోని మరో ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న బాలుడిని వైద్యులు శుక్రవారం డిశ్చార్జి చేశారు. చదవండి: ఉస్మానియా ఆస్పత్రిలో మహిళపై దాడి ఆజాన్ తండ్రి సయ్యద్ మెహసీన్ అలీ ఫిర్యాదు మేరకు మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అఫ్సర్ కోసం గాలిస్తున్నారు. ఎయిర్ రివాల్వర్, పిస్టల్, గన్స్కు లైసెన్స్ అవసరం లేదని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇలా జంతువులను కాల్చడం, ఎదుటి వారిని గాయపరచడం మాత్రం నేరమేనని స్పష్టం చేస్తున్నారు. నిందితుడు చిక్కిన తర్వాత విచారణలో, పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడికి బాలుడి కుటుంబానికి మధ్య ఆరి్థక లావాదేవీలు ఉన్నాయని, వీటి నేపథ్యంలోనే కొన్ని స్పర్థలు కూడా వచ్చాయని తెలుస్తోంది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశాలపై ఫిర్యాదుదారుడి నుంచి వాంగ్మూలం సేకరించాలని నిర్ణయించారు. -
Hyderabad: మొన్న జూబ్లీహిల్స్.. నిన్న మొఘల్‌పుర... తాజాగా కాలాపత్తర్
సాక్షి, హైదరాబాద్: మొన్న జూబ్లీహిల్స్.. నిన్న మొఘల్‌పుర... తాజాగా కాలాపత్తర్... కామాంధుల చేతుల్లో ముగ్గురు బాలికలు నలిగిపోయారు. లైంగిక దాడుల నుంచి మైనర్లకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన పోక్సో యాక్ట్–2012 అమలులో ఉన్నా ఘోరాలు ఆగట్లేదు. ఏదైనా కొత్త చట్టం తీసుకురావడంలో నిందితుల్ని కఠినంగా శిక్షించడానికి అనేది పైకి కనిపించే అంశమైతే... అంతర్గతంగా ఉండే దీని ప్రధాన ఉద్దేశం ఆ తరహా నేరాలు పునరావృతం కాకుండా చూడటమే. కేంద్ర ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పోక్సో యాక్ట్ ఈ కోణంలో ఆశించిన స్థాయి ఫలితాలు ఇవ్వట్లేదనే వాదన వినిపిస్తోంది. ఈ పరిస్థితులు తలెత్తడానికి ప్రధాన కారణం అవగాహన లోపమని నిపుణులు చెబుతున్నారు. ప్రేమ పేరుతో వల.. బాలికలపై జరుగుతున్న ఘోరాల్లో అనేకం ప్రేమ పేరుతో వలలో పడేసుకుని చేసేవే ఉంటున్నాయి. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణనే ప్రేమగా భావిస్తున్న మైనర్లు ఈ వలలో పడుతున్నారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావంతో విపరీత పోకడలు అనుసరించి భవిష్యత్తును బుగ్గి చేసుకుంటున్నారు. ఓ బాలికను ఆమె అనుమతితో పెళ్లి చేసుకున్నా, సన్నిహితంగా గడిపినా కూడా అది నేరమే అవుతుంది. అభ్యంతరకంగా కామెంట్స్ చేయడమూ పోక్సో చట్ట ప్రకారం తీవ్రమైన అంశమే. ఇలాంటి చట్టాన్ని చేసిన యంత్రాంగాలు అక్కడి తమ పని అయిపోయిందన్నట్లు చేతులు దులుపుకొన్నాయి. అవగాహనలో విఫలం.. కేంద్ర ప్రభుత్వం అత్యంత శక్తిమంతమైందని చెప్పుకున్న పోక్సో చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చినప్పటికీ చిన్నారులు, బాలికలపై అఘాయిత్యాలు తరచూ జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ‘పోక్సో’పై అందరికీ అవగాహన కల్పించడంలో విఫలం ఒక కారణమైతే... మిగిలిన కీలకాంశాలను పట్టించుకోక మరో కారణం. కేవలం ఓ చట్టాన్ని తీసుకురావడం ద్వారా కుటుంబ, సామాజిక తదితర పరిస్థితుల్లో పూర్తి మార్పు తీసుకురావడమనేది దుర్లభమని నిపుణులు చెబుతున్నారు. ఇవి మారాలంటే సమస్యని లోతుగా అధ్యయనం చేయాలి. ఇలాంటివి పునరావృతం కావడానికి కారణాలను గుర్తించాలని సూచిస్తున్నారు. వాటిని సాధ్యమైనంత వరకు కూకటివేళ్లతో సహా పెకిలించి వేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. చదవండి: లవ్ ఫెయిల్యూర్.. యువతి ఆత్మహత్య.. మృతిపై భిన్న కథనాలు.. అఘాయిత్యాలకు కారణాలు అనేకం... చిన్నారులపై అఘాయిత్యాలకు ప్రధానంగా అనేక కారణాలు ఉంటున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, విదేశీ సంస్కృతి మోజులో యువత దారి తప్పడం, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సరైన సత్సంబంధాలు లేకపోవడం, మత్తుమందులు, వ్యసనాలకు బానిసైన యువకులు, సినిమా, సోషల్ మీడియాల్లో మితిమీరుతున్న అశ్లీలం, మహిళల్ని వ్యాపార వస్తువుగా చిత్రీకరిస్తున్న ప్రకటనలు, చదువుకునే వయసులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఆకర్షణ, ప్రలోభాలకు లోనుకావడం ప్రధానమైనవని వివరిస్తున్నారు. ఇళ్లల్లో పిల్లలపై పెద్దలు శ్రద్ధ పెట్టాలి. ఆడపిల్లల్ని గౌరవించడం, మహిళలతో మర్యాదగా ప్రవర్తించడం, సమాజంలో వారికి ఉండాల్సిన సముచిత స్థానం తెలియజేస్తూ సభ్యత, సంస్కారాలకు నేర్పించాలి. మహిళలపై అఘాయిత్యాలు జరిగిన తరవాత బాధపడేకంటే... జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణుడు ప్రతాప్‌కుమార్ తెలిపారు. చిన్నారులు, మహిళలపై జరుగుతు న్న దారుణాల్లో సగం కూడా పోలీసు వరకు రావడం, రికార్డుల్లోకి ఎక్కడం జరగట్లేదు. దీనికి పరువు, కుటుంబ నేపథ్యం వంటి ఎన్నో కారణాలు ఉంటున్నాయి. బాధితుల మౌనంతో వస్తున్న ఈ ఉదాసీనత ముష్కరులు మరింతగా రెచ్చిపోవడానికి ఊతం ఇచ్చినట్లేనని గుర్తుంచుకోవాలి. -
వాలీబాల్ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి
సాక్షి, హైదరాబాద్: వాలీబాల్ ఆడుతున్న ఓ బాలుడు గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ సంఘటన మెఘల్‌పుర పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఎస్ఐ ముఖేశ్ తెలిపిన మేరకు.. ఆలిజాకోట్లా ప్రాంతానికి చెందిన నవాజ్ అహ్మద్ (14) నవాజ్ అహ్మద్ ఆలిజాకోట్లా అంధేరీ గల్లీలో ఉండే గ్రౌండ్‌కు వెళ్లి తోటి స్నేహితులతో వాలీబాల్ ఆడాడు. వాలీబాల్ ఆడుతుండగానే ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వైద్యుల ప్రాథమిక నివేదిక ప్రకారం నీరసం వల్ల కళ్లు తిరిగి పడిపోవడంతో మరణించినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఇద్దరు యువకుల నడుమ జరిగిన ఘర్షణతో మృతిచెందినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. సీసీ కెమెరాలు పరిశీలించిన అనంతరం సాధారణ మరణంగా తేల్చారు. -
‘ఒంటిపై ఉన్న ఖాకీ చొక్కాను తొలగిస్తా జాగ్రత్త’
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఇన్స్పెక్టర్ను వాట్సాప్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన రౌడీషీటర్‌పై మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఒంటిపై ఉన్న ఖాకీ చొక్కాను తొలగిస్తా జాగ్రత్త... అంటూ దురుసుగా మాట్లాడటమే కాకుండా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఆర్ఎస్ఎస్ నాయకుడిలా వ్యవహరిస్తున్న మీరు మాతో పెట్టుకుంటే తగిన మూల్యం చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్ సంభాషణ వైరలైంది. వివరాల ప్రకారం... రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా నమోదైన ఆసిఫ్ ఇక్బాల్ రెండు రోజుల క్రితం మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ రవి కుమార్‌ను దూషిస్తూ హెచ్చరించారు. మొఘల్‌పురా పరిధిలో జరిగిన ఒక సంఘటన విషయంలో స్థానిక మజ్లిస్ పార్టీ కార్పొరేటర్‌తో పాటు రౌడీషీటర్ ఆసిఫ్ ఇక్బాల్ ఫోన్లో అమర్యాదగా మాట్లాడారు. పోలీసుల విచారణలో ఆసిఫ్ ఇక్బాల్‌గా రౌడీషీటర్ అని గుర్తించారు. ఇతనిపై ఇప్పటికే రెయిన్‌బజార్, చాంద్రాయణగుట్ట, మొఘల్‌పురా పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసిఫ్ ఇక్బాల్ యెమెన్ దేశంలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ రవి కుమార్ తెలిపారు. ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. చదవండి: కరోనాతో గాంధీ భవన్ అటెండర్ షబ్బీర్ మృతి నాన్నా.. ఇక రావా..? మమ్మల్ని ఎవరు చూస్తారు? -
హైదరాబాద్‌లో ఘర్షణ: గణేశుడి విగ్రహం ధ్వంసం?
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రభావం ఈసారి వినాయక చవితి మీద బాగానే పడింది. గళ్లీకో రూపంలో దర్శనమిచ్చే గణపయ్య ఇప్పుడు ఊరంతా వెతికినా కనిపించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే హైదరాబాద్‌లో గణేశుడిని ప్రతిష్టాపించే క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. వినాయకుని విగ్రహం ముందే రెండు గ్రూపులవారు ఒకరినొకరు తన్నుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకున్నారు. పోలీసులు వారించినప్పటికీ ఎవరూ వినిపించుకునే పరిస్థితిలోనే లేరు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే గణేశుడిని ప్రతిష్టించడం కొందరికి ఇష్టం లేదని, దీంతో హిందూ వ్యతిరేక శక్తులు గొడవకు దిగాయంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రతిమను కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇది నిజమేనని నమ్మిన నెటిజన్లు ఆ ఇరు వర్గాలను హిందూ, ముస్లింలుగా భావిస్తూ, ఈ ఘర్షణకు మతం రంగు పులుముతున్నారు. కానీ వాస్తవాలను పరిశీలిస్తే ఈ ప్రచారంలో నిజం లేదని తేలింది. ఈ గొడవకు ముస్లిం వ్యక్తులకు సంబంధమే లేదని నిర్ధారణ అయింది. (ఏనుగు అతడిపైకి ఎలా వచ్చిందో చూడండి) అసలేం జరిగిందంటే.. మొఘల్‌పురలోని బాలగంజ్ ప్రాంతంలో 20 ఏళ్లుగా ప్రభుత్వ భూమిలోనే గణపయ్యను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం ఆ మండపానికి సమీపంలోని భూమిని ఓ వ్యక్తి కొనుగోలు చేసి నివాసమేర్పరుచుకున్నారు. ఇంటి ముందే ఉండే మండపంలో జరిగే వేడుకల వల్ల తమ కుటుంబ గోపత్య దెబ్బ తింటోందని ఆయన స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్ని నెలల క్రితం వాళ్లు అక్కడ మండపాన్ని తీసివేశారు. ఇదిలా వుండగా తాజాగా వినాయక చవితి రోజు ఎప్పటిలాగే విగ్రహాన్ని తీసుకుని ఆ మండపం ప్రాంతానికి చేరుకోగా సదరు వ్యక్తి, ఆయన కుటుంబం వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ రాజుకుందని ఓ పోలీసు తెలిపారు. అంతేకాక గణేశుడి విగ్రహం దారి మధ్యలోనే విరిగిపోయినట్లు బాలాగంజ్ ఆలయ కమిటీ సభ్యుడు జిత్తూ తెలిపారు. (ఆ దెయ్యం బొమ్మ తిరిగి వచ్చేసిందా?) వాస్తవం: హైదరాబాద్‌లోని మొఘల్‌పురలో వినాయక చవితి నాడు జరిగిన ఘర్షణ హిందువులకు మధ్యే జరిగింది. This is happening in Hyderabad & not Pakistan Some local goons were opposing to the installation of Shri Ganesha’s statue & damaged it too,then some brothers had to bash them KCR thinks that he’s the next Nizam is teaming up with Razakars#AntiHinduKCR pic.twitter.com/0gEIQJ4IRX — Ashish Jaggi (@AshishJaggi_1) August 23, 2020 -
డీజేఎస్ కార్యాలయం వద్ద పోలీసులు మొహరింపు
సాక్షి, హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై మీడియా సమావేశానికి సిద్ధమైన డీజేఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మొగల్పురా డీజేఎస్ కార్యాలయాన్ని మోహరించి పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ మజీద్, ఎండీ మొహమోద్దీన్ ఒమర్, జాయింట్ సెక్రటరీ షాన్వాగ్ ఖాన్‌లను నిర్భందించారు. దీంతో మొగల్పురా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
మొబైల్‌షాప్‌లో చోరీ - సేల్స్ మెన్ అరెస్టు
పనిచేస్తున్న మొబైల్ షాపునకే కన్నం వేశారు. తాము ఉద్యోగం వెలగబెడుతున్న మొబైల్ షాపులో చోరీకి పాల్పడ్డ ఇద్దరు సేల్స్‌మెన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్‌జోన్ పరిధిలోని మొఘల్‌పురా పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి 80 సెల్ఫోన్లను, రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
400 ఏళ్ల అమ్మవారి బంగారు విగ్రహం చోరీ
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీ గౌలిపురాలోని మైసమ్మ ఆలయంలో చోరీ జరిగింది. 400ఏళ్ల నాటి అమ్మవారి బంగారు విగ్రహాన్ని దుండగులు అపహరించుకు వెళ్లారు. చోరీ విషయాన్ని గమనించిన ఆలయ నిర్వహకులు శుక్రవారం మొఘల్‌పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తులపై ఆరా తీస్తున్నారు.