Mohammad Akhlaq died
-
అఖ్లాక్ కుటుంబంపై చర్య తీసుకోవాలి
దేశంలో 'అసహనం' వ్యాఖ్యలకు దారితీసిన దాద్రి ఘటన గుర్తుండే ఉంటుంది కదూ. హత్యకు గురైన మహ్మద్ అఖ్లాక్(50) కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్థానిక కోర్టు ఆదేశించింది. గతేడాది యూపీలోని దాద్రి ప్రాంతంలో 50 ఏళ్ల మహ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి ఇంట్లో ఆవు మాంసం ఉందని కొందరు వ్యక్తులు అతడిని ఇంట్లోంచి బయటకు లాగి హత్యచేశారు. ఆ దాడిలో ఆయన కుమారుడు డానిష్ అక్లాక్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందాడు. బిసాడాకు చెందిన కొందరు వ్యక్తులు అఖ్లాక్ కుటుంబంపై కేసు నమోదు చేయాలని, చర్యలు తీసుకోవాలని పిటీషన్ దాఖలు చేశారు. అఖ్లాక్ ఫ్యామిలీ ఆవును చంపేశారని, అతడి సోదరుడు జాన్ మహ్మద్ జంతువు తలను పారవేయడం చూశామని బిసాడా గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన స్థానిక కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఆవు లేదా దూడ మాంసమేనని ఫోరెన్సిక్ పరీక్షలో గత నెలలో వెల్లడైంది. తొలుత అది మటన్ అనే తాము భావించామని, కానీ తర్వాత అది ఆవుమాంసం అన్న విషయం తేలిందని యూపీ డీజీపీ జావేద్ అహ్మద్ ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం తెలిపారు. యూపీలో ఆవుమాంసం తినడం నేరం కాదు గానీ, ఆవులను చంపడం మాత్రం నేరమే. అఖ్లాక్ హత్య కేసులో అరెస్టయిన 18 మందిలో స్థానిక బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు. -
'మా ఇంటికి ఎప్పటికీ వెళ్లను'
లక్నో: దాద్రి ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ యువకుడు డానిష్ అక్లాఖ్ తిరిగి ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదంటున్నాడు. గత సెస్టెంబర్ 28న దాద్రి సమీపంలోని బిసడ గ్రామంలో గోవధ వదంతుల నేపథ్యంలో సుమారు వంద మంది స్థానికులు వీరి కుటుంబంపై దాడిచేశారు. ఈ ఘటనలో తండ్రి మహ్మద్ అక్లాఖ్(50) చనిపోగా, కుమారుడు డానిష్ అక్లాక్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ దుర్ఘటన నుంచి కోలుకున్న డానిష్ మాట్లాడతూ... మాపై దాడి చేసిన వాళ్లు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ దాడి జరుగుతున్నప్పుడు.. 'ఈ రోజు నేను చచ్చిపోయినట్లే' అని భావించినట్లు తెలిపాడు. మా తప్పు లేకుండానే మమ్మల్ని కొట్టారు. అకారణంగా మమ్మల్ని కొట్టిన ఆ గ్రామానికి తాను వెళ్లనని అక్లాక్ పేర్కొన్నాడు. ఆ రోజు జరిగిన దాడిలో తల, గుండెపై, కంటిపై గాయాలయ్యాయని.. రెండు నెలల చికిత్స తర్వాత కోలుకున్నట్లు చెప్పాడు. ఆదివారం నాడు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇంటికి వెళ్లాడు. తమపై జరిగిన దాడి గురించి సీఎంకి వివరించాడు. తన తండ్రిని చంపినవాళ్లలో 6౦-70 శాతం మంది తనకు తెలుసునని, స్కూళ్లో కూడా ఎప్పుడు తాను ఎవరితోనూ గొడవకు దిగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో విధులు నిర్వహిస్తున్న తన సోదరుడు సర్తాజ్తో కలిసి చెన్నైలో నివాసం ఉంటున్నాడు. చుట్టుపక్కల వారి నుంచి భయాందోళనలకు గురవుతున్నారా అని సర్తాజ్ని అడిగిన ప్రశ్నకు.. 'సారే జహాసే అచ్చా హిందుస్తాన్ హమారా' అని సమాధానమిచ్చాడు.