Mohammed Mahmood Ali
-
అది నాకు సెంటిమెంట్.. ఆయన వస్తే గెలుపు తథ్యం: మంత్రి పువ్వాడ
సాక్షి, ఖమ్మం: తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మైనార్టీల అభివృద్ధి ఎంతగానో జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు అధికారంలో ఉండి మైనార్టీలకు ఎటువంటి పథకాలు అందించలేదని విమర్శించారు. ఈ మేరకు ముస్లిం, మైనార్టీ సభలో మహమూద్ అలీ మాట్లాడుతూ.. ముస్లింల కోసం సీఎం రూ. 32 వందల కోట్లు ఖర్చు చేశారని.. అదే ముస్లింల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రూ. 50 లక్షలు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. తెలంగాణలో ముస్లిం పిల్లలకు సీఎం కేసీఆర్ మంచి విద్యను అందిస్తున్నారని తెలిపారు. పేద వాడి కోసం పని చేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆరేనని అన్నారు. షాదీముబారక్‌తో ముస్లిం మహిళలకు ఆసరాగా నిలిచారన్నారు. ‘నా తమ్ముడు అజయ్, ఆయన 10 సంవత్సరాలుగా మీ మధ్యలో ఉన్నాడు. నా తమ్ముడికి తోడుగా మీరంతా ఉండాలి. సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు ఎన్నో నిధులు ఇచ్చారు. హైదరాబాద్ వ్యక్తులు వచ్చి ఇక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకుని వెళ్తున్నారు. నేను తెలంగాణ మొత్తం తిరుగుతున్నా, అన్నింటి కంటే ఎక్కువగా ఖమ్మం అభివృద్ధి చెందింది. పువ్వాడ అజయ్ సీఎం కేసీఆర్ దగ్గరకు వచ్చిన ప్రతిసారీ ఖమ్మం అభివృద్ధికి కావాల్సిన నిధులు అడుగుతుంటారు. కాంగ్రెస్ పార్టీవి మొత్తం మాటలే. ముసలి పార్టీని పట్టించుకునే వాడు లేడు. వీల్ చైర్లో తిరిగే ముసలి వాడు మీకు కావాలా? యువకుడైన పువ్వాడ అజయ్ కావాలా నిర్ణయించుకోండి. చదవండి: తెలంగాణను ఏడిపించేదే కాంగ్రెస్ పార్టీ: సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మంచి మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం నియోజకవర్గం పట్ల అతనికి ఉన్న నిబద్దత ఇంకా ఎవరికి లేదు. ముస్లిం, క్రిస్టియన్లు ఇరువురు అన్నా దమ్ములు వారి పండుగ మేము, మా పండుగ వారు జరుపుకుంటారు. అన్నాదమ్ములు, అక్కా చెల్లెలు మీ ఓటు వృథా చేయకుండా కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. అజయ్ అన్నకు మరోసారి అవకాశం ఇవ్వండి. పోయినసారి కంటే భారీ మెజార్టీతో నా తమ్ముడు పువ్వాడ అజయ్‌ను గెలిపించండి’ అని హోంమంత్రి కోరారు. 2018 నవంబర్‌లో ఖమ్మం ప్రాంతంలో పెట్టిన మైనార్టీ సభ తనకు సెంటిమెంట్ సభ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో హోం మంత్రి మహమూద్ అలీ వచ్చి ప్రచారం చేస్తే 16కు 16 సీట్లు గెలుచుకున్నామని తెలిపారు. ఆయన వస్తే గెలుపు తథ్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి డిప్యూటీ సీఎం పదవి ముస్లింలకు సీఎం కేసీఆర్ కేటాయించారని అన్నారు. దీన్ని బట్టి ఆయనకు మైనార్టీల పట్ల ఉన్న నిబద్దత అర్థమవుతోందన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ స్థానం కేసీఆర్ గుండెల్లో పదిలలంగా ఉంటుందన్నారు. -
పంజాగుట్టలో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మొట్టమొదటి స్టీల్ బ్రిడ్జి శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్టీల్ బ్రిడ్జ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా లాక్డౌన్ తరుణంలో జీహెచ్ఎంసీ వేగంగా చేసిన ప్రాజెక్టుల్లో ఇదొకటి. పంజగుట్ట శ్మశానవాటిక (చట్నీస్) సమీపం నుంచి రహదారి విస్తరణకు అవకాశం లేక తీవ్ర బాటిల్‌నెక్‌తో బ్లాక్‌స్పాట్‌గా మారింది. దీంతో వాహన ప్రమాదాలు జరుగుతుండేవి. సమస్య పరిష్కారం కోసం క్యారేజ్‌వే పెంచేందుకు చిన్న ఫ్లైఓవర్ అవసరమని భావించారు. ట్రాఫిక్ రద్దీ, ఇతరత్రా సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని స్టీల్‌బ్రిడ్జి నిర్మాణాన్ని తలపెట్టారు. బ్రిడ్జి మొత్తం పొడవు వంద మీటర్లు. స్టీల్‌బ్రిడ్జి స్పాన్ 43 మీటర్లు. గత ఫిబ్రవరి నెలాఖరులో పనులు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్లో ట్రాఫిక్ లేకపోవడం, మంత్రి కేటీఆర్, మేయర్ రామ్మోహన్ ప్రత్యేక శ్రద్ధ వహించిన నేపథ్యంలో అధికారులు వడివడిగా పనులు పూర్తిచేశారు. ఈ నెల మొదటి వారంలోనే ప్రారంభించాలనుకున్నప్పటికీ.. తుది మెరుగుల కోసం ఆగాల్సి వచ్చింది. ఈ బ్రిడ్జి వినియోగంతో ముఫకంజా కాలేజ్ వైపు నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వైపు వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు వాహనదారులకు ప్రయాణ సమయం కలిసివస్తుందని జీహెచ్ఎంసీ పేర్కొంది. లాక్డౌన్ సమయాన్ని సమర్థంగా వినియోగించుకొని మూడు నెలల్లోనే బ్రిడ్జిని పూర్తి చేసినట్లు తెలిపింది. బ్రిడ్జి ఆరు మీటర్లతో పాటు మొత్తం 12 మీటర్ల క్యారేజ్‌వేతో బాటిల్‌నెక్ సమస్య తీరుతుందని పేర్కొంది. మెయిన్‌గర్డర్లు, క్రాస్‌గర్డర్లు స్టీల్‌వి వాడినట్లు తెలిపింది. స్టీల్ బ్రిడ్జి విశేషాలు.. మొత్తం పొడవు: 100 మీటర్లు స్టీల్ బ్రిడ్జి స్పాన్: 43 మీటర్లు (సింగిల్ స్పాన్) అప్రోచెస్ పొడవు: 57 మీటర్లు (ఎన్ఎఫ్సీఎల్ వైపు 35 మీటర్లు, ముఫకంజా కాలేజ్ వైపు 22 మీటర్లు) వెడల్పు: 9.60 మీటర్లు క్యారేజ్ వే: 6 మీటర్లు (రెండు లేన్లు, వన్‌వే), 1 మీటరు ఫుట్‌పాత్ రద్దీ సమయంలో ట్రాఫిక్: 11,305 పీసీయూ 2035– 36 నాటికి ట్రాఫిక్: 17,613 -
నిజాం రుబాత్ వివాదానికి తెర
జెడ్డాలో రుబాత్ ఆర్గనైజర్‌తో డిప్యూటీ సీఎం చర్చలు సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియాలోని మక్కా నిజాం రుబాత్ భవనంలో రాష్ట్ర హజ్ యాత్రికుల ఉచిత వసతి వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. సోమవారం అక్కడి జెడ్డా పట్టణంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, అక్కడి భారత రాయబారి ముబారక్‌తో కలిసి రుబాత్ కార్యనిర్వాహకుడు హుస్సేన్ మహ్మద్ అల్ షరీఫ్‌తో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా హజ్-2015లో 600 మంది యాత్రికులకు రుబాత్‌లో ఉచిత వసతి కల్పించేందుకు అంగీకారం కుదిరింది. ఈ యాత్రికులను ఎంపిక చేసేందుకు హైదరాబాద్‌కు రావాలని హుస్సేన్ మహ్మద్‌ను మహమూద్ అలీ కోరగా.. ఆయన అంగీకరించారు. ఈ మేరకు ఈ నెల 22న లేదా 23న రాష్ర్ట హజ్ హౌస్‌లో జరిగే లక్కీడ్రా కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ఏమిటీ వివాదం: హైదరాబాద్ సంస్థానం నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం 1857లో నిజాం నవాబు మక్కాలో 14 ధర్మసత్రాలు నిర్మించారు. అందులో 13 సత్రాలు అన్యాక్రాంతమయ్యాయి. మిగిలిన దానినే నిజాం రుబాత్‌గా పిలుస్తుంటారు. హైదరాబాద్‌లోని నిజాం నవాబు ధార్మిక కమిటీ ఆ రుబాత్ నిర్వహణ బాధ్యతలను చూసేది. ఆ పనుల నిమిత్తం మక్కాకు ప్రత్యేకంగా ఉద్యోగులను పంపేది. అలా చివరగా వెళ్లిన ఉద్యోగి ఒకరు సౌదీ పౌరసత్వాన్ని తీసుకుని, అక్కడే ఉండిపోయారు. ఆయన కుమారుడు హుస్సేన్ మహ్మద్ అల్ షరీఫ్ ప్రస్తుతం నిజాం రుబాత్‌కు కార్యనిర్వాహకుడిగా ఉన్నారు. అయితే తొలి నుంచి డీజీపీ, మతపెద్దలతో కూడి కమిటీ.. రాష్ట్రం నుంచి హజ్‌కు వెళ్లేవారిలో కొందరిని లాటరీ ద్వారా రుబాత్‌లో ఉచిత వసతి కోసం ఎంపిక చేసేది. కానీ మూడేళ్లుగా రుబాత్ నిర్వాహకుడే నేరుగా ఎంపిక చేయడం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జోక్యంతో ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. -
నిజాం పాలన స్వర్ణ యుగం
ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: ఏడో నిజాం కాలం నాటి అభివృద్ధి, మత సామరస్యం, సంస్కృతులను ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఆదివారం మైనారిటీస్ ఎంపవర్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ భవనంలో జరిగిన ‘మైనారిటీ సదస్సు’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. నిజాం పాలన స్వర్ణ యుగమని, వారి కాలంలో అభివృద్ధితో పాటు మత సామరస్యం వెల్లివిరిసిందని కొనియాడారు. ఏడో నిజాం పాలనలో పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందేదని తెలిపారు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీతో పాటు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి సమానంగా ఆర్థిక చేయూతనిచ్చిన ఘనత నిజాం నవాబుకే దక్కుతుందన్నారు. 14 ఏళ్ల టీఆర్ఎస్ ఉద్యమంలో ఒక్క ఆంధ్రుడికీ నష్టం జరగలేదన్నారు. ఒకప్పుడు తెలంగాణను ఏలిన ముస్లింలు ఇప్పుడు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1956లో ముస్లింలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలుగు భాషను బలవంతంగా రుద్ది, 55 వేల మంది ఉర్దూ భాష వచ్చిన ఉద్యోగులను తొలగించారన్నారు. అప్ప ట్లో ఉద్యోగాలలో ముస్లింలు 33 శాతం ఉండగా, ప్రస్తుతం ఒక్క శాతం కూడా లేరన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించి తీరుతామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 40 వేల మంది పేద ముస్లిం యువతులకు వివాహాలు జరిపిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ లాంటి నేతను చూడలేదు: మైనార్టీస్ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ అన్ని రంగాల్లోనూ వెనుకబడ్డ ముస్లింలకు చేయూతనిచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ అన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఆయన చలవేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఖాజా మహ్మద్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు. -
నిక్కచ్చే నా పనితీరు..ప్రజల కోసమే పనిచేస్తా:మహమూద్ అలీ
‘సాక్షి’తో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు కోట్లు ఖర్చవుతున్న ఈ రోజుల్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తానీ పదవిలోకి వచ్చినట్టు, అలాగే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేదల అభ్యున్నతి కోసమే పనిచేస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ చెప్పారు. ఎమ్మెల్యేల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఎన్నికకావడం, ఉప ముఖ్యమంత్రిగా నియమితులవడంతోపాటు కీలకమైన రెవెన్యూ శాఖ రావడం తన పూర్వ పుణ్యఫలమన్నారు. ఒక్కరూపాయి ముట్టుకోకుండా, అట్టడుగు ప్రజల కోసం, నిజాయతీగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేకాంశాలను ప్రస్తావించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఆరునెలలు ఆగండి... రాష్ట్రవిభజన నేపథ్యంలో ఇంకా పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం ఏర్పాటు కాలేదు. ఇప్పటిదాకా ఉన్నతాధికారులతో మాట్లాడగా, రెవెన్యూశాఖలో వేల సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించడంపై అధ్యయనం చేస్తున్నాం. భూముల సర్వే నంబర్లు, వాటికి హద్దులు వంటివాటిపై రీసర్వే నిర్వహిస్తాం. ఎప్పుడో 80 ఏళ్ల కింద నిజాం కాలంలో సర్వే జరిగింది. ముందుగా అన్ని గ్రామాల్లో రీసర్వే చేసి, 100 శాతం కచ్చితమైన రికార్డులను తయారుచేస్తాం. దీనితో ప్రభుత్వ భూ ముల కబ్జాలు, వ్యక్తుల మధ్య భూ తగాదాలు చాలావరకు పరిష్కారం అవుతాయి. 60 గజాల్లో ఇల్లు కట్టుకోవాలంటే 100 ఏళ్ల రికార్డులు అడుగుతున్నారు. పుట్టకముందు నుంచీ రికార్డులు అడిగితే ఎక్కడి నుండి తెస్తారు? వీటిని సులభతరం చేస్తాం. భూములకు ప్రభుత్వం నిర్ధారించిన ధరలు కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ ధరల కంటే చాలా ఎక్కువగా ఉం డగా.. మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నాయి. మండల స్థాయి లో నివేదికలు తెప్పించి సవరిస్తాం. ఆరునెలలు ఆగాలి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కబ్జాలపై ఉక్కుపాదం అతివిలువైన భూములున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1,700 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అయినటు చెబుతున్నా రు. ఇతర జిల్లాల్లోని వక్ఫ్, దేవాలయ భూములను కూడా కబ్జాదారుల నుండి కాపాడుతాం. కబ్జా చేసిన వారెంతటి పలుకుబడి కలిగిన వారైనా ఉక్కుపాదం మోపుతాం. మొక్కుబడి ఇళ్లు కాదు.. బ్రహ్మాండమైన కాలనీలు.. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు 120 గజాల జాగాలో రెండు బెడ్రూములతో ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇస్తుంది. డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, విద్యుత్తు, విశాలమైన రహదారులతో ఏర్పాటుచేస్తాం. రెండేళ్లలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తెలంగాణలో జిల్లాలను 24 జిల్లాలకు పెంచుతాం. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ప్రణాళికలు వేశారు. ఇప్పుడు 25-30 లక్షల జనాభాకు మించిన జిల్లాలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వసేవలు కిందిస్థాయికి చేరడంలేదు. సుమా రు 15 లక్షల మందికి ఒక జిల్లా ఉండే విధంగా రెండేళ్లలోగా జిల్లాల పునర్విభజనను పూర్తిచేస్తాం. పదవి కొంటే.. పైసలెట్ల వసూలు చేస్తవో చెప్పు? మొన్న ఒకాయన వచ్చి ఓ కార్పొరేషన్ పదవి కావాలని అడిగిండు. నాకు అర్థంకాక.. ‘పార్టీలో 14 ఏళ్ల నుంచి ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసిన వాళ్లున్నరు. పార్టీలో పనిచేయని వాళ్లకు పదవులు ఎలా వస్తయి?..’ అని అడిగిన. దానితో ఆయన నవ్వి ‘రెండు కోట్లు ఇస్తా..’ అని ఆశపెట్టిండు. నాకు చాలా ఆశ్చర్యం వేసి.. ‘నాకు రెండు కోట్లు ఇస్తనంటున్నవు. వాటిని ఎవరిదగ్గర వసూలు చేస్తవో లిస్టు కూడా ఇవ్వు. ఎవరి దగ్గర, ఎందుకు, ఎట్లా వసూలు చేసుకుంటవో చెప్తే ఆ లిస్టును కేసీఆర్‌కు చూపిస్త. ఆయనకు నచ్చితే నీకు ఇస్తడేమో..’ అని చెప్పిన. దానితో గమ్మున వెళ్లిపోయిండు. నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుంటనే ఎమ్మెల్సీ అయిన, ఉప ముఖ్యమంత్రి కూడా అయిన. దేవుని దయ వల్ల ఇబ్బందులు లేవు. నాతోని అయ్యే పనికి ఒక్క రూపాయి కూడా లేకుంట పనిచేస్తా. చెప్పులకు 80 వేల రూపాయలట..! నేను ఉప ముఖ్యమంత్రిని అయిన్నని అభినందించడానికి నా దగ్గరి మిత్రుడొకడు మొన్న వచ్చాడు. మంచీచెడూ మాట్లాడుకున్నంక పోతుంటే సాగనంపడానికి నేనూ బయటకు వచ్చిన. అప్పుడు చెప్పులేసుకుంటుంటే వాటిని నా మిత్రుడు చూస్తూ ‘నిన్న మొన్నటిదాకా ఏ చెప్పులేసుకున్నా నడిచింది. ఇప్పుడు నువు తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివి. మన బస్తీకి ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్నవాళ్లు తొడుక్కుంటున్న చెప్పులెప్పుడన్న సూసినవా? 70-80 వేలు పెట్టి దుబాయి నుండి తెప్పించుకుంటరు. 50 వేలకు తక్కువగా ఉన్న చెప్పులు ఎప్పుడూ తొడుక్కోరు. వాళ్ల కన్నా ఎక్కువగా మెయిన్టేన్ చెయ్యాలె’ అని అన్నడు. ‘చెప్పులు కాళ్లకు రక్షణగా ఉండాలె. నలుగుర్లో తిరుగుతున్న కనుక కొంచెం హూందాగా ఉంటే చాలు. వ్యాపారంలో ఉన్నప్పటి సంది మెట్రో షాపుల వెయ్యి, పన్నెండొందల చెప్పులు యేసుకుంటున్న. రేపు కూడా అవే యేసుకుంట. అన్యాయంగా వచ్చిన సొమ్ము ఒక్క రూపాయి కూడా నాకొద్దు’ అని చెప్పి పంపిన. -
'కేసీఆర్ సెక్యులర్ అని ప్రూవ్ చేసుకున్నారు'
తెలంగాణలో ప్రభుత్వ స్థలాల సర్వేను ఏడాదిలోగా పూర్తి చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ స్ఫష్టం చేశారు. ఆక్రమాలు, అన్యాక్రాంతమైన భూమును స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఆదివారం హైదరబాద్ సచివాలయంలో రెవెన్యూ శాఖ, డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహమూద్ ఆలీ మాట్లాడారు. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీ అభివృద్ధీ తన బాధ్యత అని వెల్లడించారు. మైనార్టీ అయిన తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్యులర్‌గా నిరూపించుకున్నారని మహమూద్ అన్నారు.