mohan nayak
-
నిష్పక్షపాతంగా విచారించండి
సాక్షి, బెంగళూరు: పాత్రికేయురాలు గౌరి లంకేశ్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్ బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి ప్రభావాలకు లోనుకాకుండా పరిష్కరించాలని కర్ణాటక రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. గౌరి లంకేశ్ సోదరి కవితా లంకేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా నిందితుడు మోహన్ నాయక్‌పై కేసు కొట్టివేతను నిష్పక్షపాతంగా విచారించాలని సూచించింది. సంఘటిత నేరాల నియంత్రణ చట్టం ప్రకారం మోహన్ నాయక్‌పై దాఖలైన కేసును కర్ణాటక హైకోర్టు ఏప్రిల్ 22న రద్దు చేసింది. దీన్ని ప్రశ్నిస్తూ కవితా లంకేశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాని మోహన్ నాయక్ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు పిటిషనర్ కవిత లంకేశ్ ఎస్ఎల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయడంతో పాటు బెయిల్ రద్దు చేస్తూ మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరగా దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది. కాగా, 2017 సెప్టెంబర్ 5న గౌరి లంకేశ్ బెంగళూరు రాజరాజేశ్వరి నగరలోని తన నివాసంలో దండుగుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఆరిన ఆశాకిరణం
ముస్తాబాద్, న్యూస్‌లైన్: మారుమూల గిరిజన తండాకు చెందిన ఆ యువకుడు ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ.. ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అవకాశం రావడంతో ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు స్నేహితుడితో కలిసి బైక్‌పై బయల్దేరాడు. కల సాకారం అవుతున్న వేళ.. లారీ రూపంలో ఎదురొచ్చిన వృుత్యువు యువకిశోరాన్ని బలిగొన్నది. ముస్తాబాద్ మండలం సేవాలాల్‌తండాకు చెందిన భూక్య మోహన్‌నాయక్(23) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం వృుతి చెందాడు. గ్రామ సర్పంచ్ భూక్య మంగ్యానాయక్ కుమారుడైన మోహన్‌నాయక్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి చదువులో ముందుంటూ.. ఉన్నతోద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇటీవల ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగావకాశం రావడంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన బి.రాజేశ్(23) ఓయూలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరు స్నేహితులు మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం ఉదయం 9గంటలకు జరగనున్న ఇంటర్వ్యూ కోసం బైక్‌పై బయల్దేరారు. 8.45గంటలకు కొంపల్లి ఫ్లైఓవర్ సమీపంలోని ఎస్ఎన్ఆర్ గార్డెన్ ముందు నుంచి వెళ్తున్న వీరిని మేడ్చల్ నుంచి ఎదురుగా వచ్చిన రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మోహన్‌కుమార్ అక్కడికక్కడే వృుతి చెందాడు. రాజేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో పేట్ బషీరాబాద్‌లోని ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన తర్వాత కుటుంబసభ్యులు మోహన్‌కుమార్ వృుతదేహాన్ని సాయంత్రం తండాకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మోహన్‌కుమార్‌కు ఇద్దరు సోదరులున్నారు. పెద్దన్న సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తుండగా, రెండో అన్న మండలంలోని చీకోడులో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు.