molecular structure
-
‘కాంతి స్వభావం- విద్యుదయస్కాంత వర్ణపటం’ అధ్యయనం?
రసాయనశాస్త్రంలో పరమాణు నిర్మాణానికి సంబంధించి ‘కాంతి స్వభావం- విద్యుదయ స్కాంత వర్ణపటం’ పాఠ్యాంశాన్ని పోటీ పరీక్షల కోణంలో ఎలా అధ్యయనం చేయాలి? - కె.సుప్రియ, మూసాపేట అన్ని పోటీ పరీక్షల్లో ‘కాంతి స్వభావం- విద్యుదయస్కాంత వర్ణపటం’ నుంచి ఎక్కువసార్లు ప్రశ్నలు వచ్చాయి. ముఖ్యంగా కాస్మిక్ కిరణాలు, గామా కిరణాలు, గీ-కిరణాలు, ్ఖగ కిరణాలు, దృగ్గోచర కిరణాలు, పరారుణ(ఐఆర్) కిరణాలు, మైక్రో తరంగాలు, రేడియో తరంగాల గురించి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఈ పాఠ్యాంశాన్ని అధ్యయనం చేయడం ఏంత తేలికో, అందులోని అంశాలను గుర్తుంచు కోవడం కూడా అంతే సులభం. ఉదాహరణకు ఒక గదిలో విద్యుత్ స్విచ్ వేస్తే మరో గదిలో విద్యుదయస్కాంత సిగ్నల్ ఆధారంగా పనిచేసే టీవీలో అలజడిని గమనించొచ్చు. అదేవిధంగా అత్యధిక శక్తి(అల్ప తరంగదైర్ఘ్యం) ఉన్న గామా కిరణాలను క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి ఉపయోగిస్తే, అత్యధిక తరంగదైర్ఘ్యం(అల్పశక్తి) ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను సెల్ఫోన్లలో ఉపయోగిస్తారు. ఈ అంశాలన్నీ మన నిత్యజీవితంతో ముడిపడినవే కాబట్టి వీటి ధర్మాలు, ఉపయోగాలపై తరచుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు 2012 సివిల్స్ ప్రిలిమ్స్‌లో ‘నీటి శుద్ధి ప్రక్రియలో అతినీలలోహిత కిరణాల పాత్ర ఏమిటి? అనే ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం... ్ఖగ కాంతి నీటిలోని సూక్ష్మజీవులను అంతం చేస్తుంది. మురికిని అవక్షేపించడంలో, వాసనను తొలగించడంలో దీని పాత్ర ఉండదు. 2010లో ఓజోన్ పొర ఉపయోగం, రేడియో తరంగాల ధర్మానికి సంబంధించి కింది ప్రశ్న అడిగారు. ప్రశ్న: అయనోవరణమనే భూ వాతావరణంలోని ఒక పొర, రేడియో కమ్యూనికేషన్లకు వీలు కలిగిస్తుంది, ఎందువల్ల? సమాధానం: రేడియో తరంగాలకు సుదీర్ఘమైన తరంగదైర్ఘ్యం ఉంటుంది. ఓజోన్ పొర కాస్మిక్, ్ఖగ కిరణాలను మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. రేడియో తరంగాలకు అధిక తరంగదైర్ఘ్యం ఉండటం వల్ల సుదూర కమ్యూనికేషన్లకు ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా 2010లో మైక్రోతరంగాలకు(మైక్రోవేవ్ ఓవెన్ పని చేసే సూత్రం) సంబంధించి కింది విధంగా అడిగారు. ప్రశ్న: తెల్లని, ముద్రించని, స్వచ్ఛమైన పేపర్ ప్లేట్ మీద బంగాళదుంపను ఉంచి, దాన్ని మైక్రో ఓవెన్లో పెడితే బంగాళదుంప వేడెక్కుతుంది కానీ, పేపర్ ప్లేట్ వేడెక్కదు, కారణమేంటి? సమాధానం: ఆహార పదార్థంలోని నీటి అణువులు మైక్రోతరంగాలను గ్రహించి అత్యంత వేగంగా కంపనం చెందడం వల్ల జనించిన ఉష్ణం కారణంగా ఆహారం వేడెక్కుతుంది. కాబట్టి బంగాళదుంపల్లోని నీటికారణంగా అవి వేడెక్కుతాయి. పేపర్లో నీటి అణువులు లేకపోవడంతో అది వేడెక్కదు. రాత్రివేళ చూడటానికి ఉపయోగించే పరికరాల్లో వాడే కిరణాలు ఏవి? అని 2009లో ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం పరారుణ తరంగాలు. పై ప్రశ్నలను గమనిస్తే విద్యుదయస్కాంత వర్ణపటంలోని వివిధ వికిరణాల ధర్మాలు, ఉపయోగాలు, వాటిని ఉపయోగించి పనిచేసే వస్తువులు, ఆ వస్తువులు పని చేసే సూత్రాలు లాంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. కాబట్టి గామా, ఎక్స్, యూవీ, ఐఆర్, మైక్రో, రేడియో తరంగాల ధర్మాలకు సంబంధించిన మౌలిక సూత్రాలపై పట్టు సాధించాలి. దీనికోసం ఎన్సీఈఆర్టీ పుస్తకాలతో పాటు, సీఎస్ఐఆర్ ప్రచురించిన How? What? అనే పుస్తకాలు కూడా ఉపయుక్తంగా ఉంటాయి. ఇన్పుట్స్: డాక్టర్ బి.రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వివిధ పోస్టుల భర్తీకి డిజేబుల్డ్ పర్సన్స్ (మహిళలు) నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు: లైబ్రరీ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ హెల్పర్ వాచ్మెన్ క్లీనర్ దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఆగస్టు 11 వెబ్సైట్: www.svuniversity.ac.in సర్దార్ వల్లభాయ్ పటేల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్స్ పోస్ట్: స్టాఫ్ నర్స్ ఖాళీలు: 111 అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరిలో డిప్లొమా లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉండాలి. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: జూలై 30 వెబ్సైట్: www.svppgip.org ఇండియన్ లా ఇన్స్టిట్యూట్-న్యూఢిల్లీ కోర్సులు: ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ది ఇంటర్నెట్ ఏజ్ సైబర్ లాస్ కాలపరిమితి: మూడు నెలలు అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా ఇంటర్ తర్వాత డిప్లొమా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఆగస్టు 18 వెబ్సైట్: www.ili.ac.in -
ఐన్‌స్టీన్‌కు ఏ పరిశోధనకు నోబెల్ లభించింది?
క్వాంటం సిద్ధాంతం కాంతి విద్యుత్ ఫలితం: ఒక లోహ ఉపరితలాన్ని కాంతి కిరణపుంజంతో ఢీకొట్టించినప్పుడు, దాని ఉపరితలం నుంచి ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. ఈ దృగ్విషయాన్నే కాంతి విద్యుత్ ఫలితం(Photo Electric Effect) అంటారు. * అన్ని రకాల కాంతి కిరణాలు అన్ని లోహాల ఉపరితలాల నుంచి ఎలక్ట్రాన్లను ఉద్గారం చేయవు. * ఎలక్ట్రాన్లను తేలికగా కోల్పోయే స్వభావం అంటే అతి తక్కువ అయనీకరణ శక్మం (ఒక వాయుస్థితిలోని ఒంటరి పరమాణువు చిట్ట చివరి కక్ష్యలోని ఎలక్ట్రాన్‌ను తొలగించడానికి కావాల్సిన శక్తి) ఉన్నటువంటి లోహాలే కాంతి విద్యుత్ ఫలితాన్ని చూపిస్తాయి. * {పతి లోహానికి సంబంధించి ఒక అభిలాక్షణిక (దానికే ప్రత్యేకమైన) పౌనఃపున్యం ఉంటుంది. లోహ ఉపరితలాన్ని ఢీకొట్టే పతనకాంతి పౌనఃపున్యం, ఆ లోహానికి సంబంధించిన అభిలాక్షణిక పౌనఃపున్యం కంటే ఎక్కువ ఉన్నప్పుడే లోహ ఉపరిత లం నుంచి ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. * ఉదాహరణకు పొటాషియం లోహ ఉపరితలం నుంచి ఊదారంగు కిరణాలు ఎలక్ట్రాన్లను విడుదల చేస్తాయి. కానీ, ఎరుపు రంగు కిరణాలు ఎలక్ట్రాన్లను విడుదల చేయవు. * దీనికి కారణాలను ఆయా కాంతి కిరణాల పౌనఃపున్యాల (లేదా తరంగదైర్ఘ్యం లేదా శక్తి) ఆధారంగా విశ్లేషించొచ్చు. * కింది పట్టికను పరిశీలిస్తే ఎరుపు కిరణాల పౌనఃపున్యం లేదా శక్తి తక్కువ (తక్కువ తరంగదైర్ఘ్యం) కాబట్టి పొటాషియం లోహ ఉపరితలం నుంచి ఎలక్ట్రాన్లు విడుదల కావని తెలుస్తుంది. * సాధారణంగా తక్కువ అయనీకరణ శక్మం ఉన్న క్షార లోహాలు ఫొటో విద్యుత్ ఫలితాన్ని చూపిస్తాయి. అవి పొటాషియం, రుబీడియం, సీజియం. ఈ క్రమంలోనే పరమాణు సైజు పెరిగి అయనీకరణ శక్మాలు పెరగడం వల్ల కాంతి విద్యుత్ ఫలితం చూపించే సామర్థ్యం కూడా ఎక్కువ. అంటే క్షార లోహాలైన లిథియం, సోడియం దాదాపుగా కాంతి విద్యుత్ ఫలితాన్ని చూపించవు. సీజియం తేలికగా కాంతి విద్యుత్ ఫలితాన్ని చూపిస్తుంది. * కాంతి విద్యుత్ ఫలితాన్ని ‘సాధారణీకృత క్వాంటం సిద్ధాంతం’ ద్వారా ఐన్‌స్టీన్ వివరించాడు. ఆయన కృషి ఫలితంగా 1905 లో నోబెల్ బహుమతి లభించింది. * ఈ సిద్ధాంత ప్రకారం ఫోటాన్లుగా భావించే కాంతి కణాల శక్తి (E), పౌనఃపున్యానికి (u) అనులోమానుపాతంలో ఉంటుంది. [E = hu, h ప్లాంక్ స్థిరాంకం * లోహం నుంచి ఎలక్ట్రాన్‌ను బయటకు తొలగించడానికి అవసరమైన శక్తి ఫోటాన్ కు ఉన్నప్పుడే లోహ ఉపరితలాన్ని ఫోటాన్ ఢీకొట్టినప్పుడు దాని నుంచి ఎలక్ట్రాన్లు బహిర్గతమవుతాయి. ఫోటాన్ శక్తి అవసరమైన దానికంటే తక్కువగా ఉంటే అది లోహం నుంచి ఎలక్ట్రాన్లను విడుదల చేయదు. * ఒక ఫోటాన్ లోహ ఉపరితలాన్ని ఢీకొట్టినప్పుడు అది రెండు పనులు చేయాలి. ఎలక్ట్రాన్ల మీద ఉన్న లోహ కేంద్రక ఆకర్షణ బలాలను అధిగమించి విడుదల చేయగలగాలి. తర్వాత వాటికి కొంత శక్తి(గతిజశక్తి) నిచ్చి లోహ ఉపరితలానికి దూరంగా(తిరి గి లోహంలో చేరకుండా) తీసుకెళ్లగలగాలి. అంటే ఈ రెండు పనులు చేయగలిగిన శక్తి లోహాన్ని ఢీకొట్టే ఫోటాన్లకు ఉండాలి. * దీనికి సమీకరణ రూపం: hu = W + KE hu = ఫోటాన్ల శక్తి W = ఎలక్ట్రాన్లపై ఉన్న లోహ ఆకర్షణ బలాలను అధిగమించే శక్తి (పని ప్రమేయం) KE = విడుదలైన ఎలక్ట్రాన్ల గతిజశక్తి కాంతి విద్యుత్ ఫలితానికి సంబంధించిన ముఖ్య విషయాలు * {పతి లోహం, కొంత కనీస పౌనఃపున్యం లేదా శక్తి ఉన్న కాంతి పడినప్పుడే ఎలక్ట్రాన్లను ఉద్గారం చేస్తుంది. దీన్నే ఆరంభ లేదా ద్వార పౌనఃపున్యం (ఖీజిట్ఛటజిౌఛీ ఊట్ఛ్ఞఠ్ఛఛిడ) అంటారు. ఈ ఆరంభ పౌనఃపున్యం కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న కాంతిని ఎంతసేపు ప్రసరింపజేసినా లోహ ఉపరితలం నుంచి ఎలక్ట్రాన్లను ఉద్గారం చేయలేం. * వేర్వేరు లోహాలకు ఈ ఆరంభ పౌనఃపున్యం వేరుగా ఉంటుంది. విడుదలైన ఎలక్ట్రాన్ల గతిజశక్తి పతన (ఢీకొట్టిన) కాంతి పౌనఃపున్యం పై ఆధారపడి ఉంటుంది. దాని తీవ్రతపై ఆధారపడదు. * ఒక సెకనులో విడుదలైన ఎలక్ట్రాన్ల సంఖ్య కాంతి తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. దాని పౌనఃపున్యంపై ఆధారపడి ఉండదు. * ఒకవేళ ఎలక్ట్రాన్ విడుదలకు కావాల్సిన శక్తికంటే తక్కువ శక్తి ఉన్న ఫోటాన్‌ను వస్తువు గ్రహించినప్పుడు ఎలక్ట్రాన్లు భూస్థాయి (అల్ప శక్తిస్థాయి) నుంచి ఉత్తేజిత శక్తిస్థాయి (అధిక శక్తిస్థాయి)లోకి పరివర్తనం చెందుతాయి. అయితే అధిక శక్తి స్థాయిల్లో ఎలక్ట్రాన్లు ఎక్కువసేపు ఉండలేవు (అస్థిరం). కాబట్టి తిరిగి భూస్థాయికొస్తాయి. ఈ ప్రక్రియలో అంటే ఎలక్ట్రాన్లు అధికశక్తి నుంచి తిరిగి భూస్థాయిలోకి వస్తున్నప్పుడు గ్రహించిన శక్తి విడుదలవుతుంది. ఈ విడుదలయ్యే శక్తి వికిరణ రూ పంలో ఉంటుంది. తద్వారా వర్ణపటాలు ఏర్పడతాయి. కాబట్టి వివిధ మూలకాలను వేడిచేసినప్పుడు అవి విలక్షణమైన రంగులనిస్తాయి. (దీపావళి టపాకాయలు) లోహం - జ్వాల రంగు మెగ్నీషియం - తెలుపు కాల్షియం - ఇటుక ఎరుపు {స్టాన్షియం - కెంపు రంగు బేరియం - లేత ఆకుపచ్చ లిథియం - సింధూర ఎరుపు సోడియం - పసుపు పొటాషియం - ఊదా రుబీడియం - ఎరుపు - ఊదా సీజియం - నీలి వర్ణం మాదిరి ప్రశ్నలు 1. ప్లాంక్ సిద్ధాంతం ప్రకారం సరైన వాక్యాలు ఏవి? ఎ) కాంతి ఫోటాన్లు (క్వాంటా) అనే చిన్న చిన్న శక్తి ప్యాకెట్ల రూపంలో ఉద్గారం లేదా శోషణం చెందుతుంది బి) ఫోటాన్లు కాంతి వేగానికి సమానమైన వేగంతో ప్రయాణిస్తాయి. సి) పదార్థ కాంతి శోషణం లేదా ఉద్గారం అవిచ్ఛిన్నంగా ఉంటుంది. 1) ఎ, సి 2) ఎ, బి 3) బి, సి 4) ఎ, బి, సి 2. తనపై పడిన వికిరణాలను సంపూర్ణంగా శోషించుకునే లేదా ఉద్గారం చేసే వస్తువును ఏమంటారు? 1) ఉత్సర్గ నాళిక 2) శీతల వస్తువు 3) కృష్ణ వస్తువు 4) హరిత వస్తువు 3. క్వాంటా అనేది? 1) శక్తి ప్యాకెట్ 2) కరెన్సీ 3) క్వింటాలు 4) కాంతి ప్రమాణం 4. ఫొటో విద్యుత్ ఫలితంలో ఫొటో ఎలక్ట్రాన్ల ఉద్గారం దేనిపై ఆధారపడి ఉంటుంది? 1) ఆరంభ పౌనఃపున్యం 2) పతన కాంతి తీవ్రత 3) లోహ స్వభావం 4) అన్నీ 5. ఐన్‌స్టీన్‌కు ఏ పరిశోధనకు నోబెల్ బహుమతి లభించింది? 1) సాపేక్షతా సిద్ధాంతం 2) కాంతి పరిక్షేపణం 3) కాంతి విద్యుత్ ఫలితం 4) క్వాంటం సిద్ధాంతం 6. ఒక ఫోటాన్ శక్తి ..... కు అనులోమాను పాతంలోనూ ..... కు విలోమాను పాతంలోనూ ఉంటుంది? 1) పౌనఃపున్యం, తరంగదైర్ఘ్యం 2) తరంగదైర్ఘ్యం, పౌనఃపున్యం 3) కాంతి తీవ్రత, తరంగదైర్ఘ్యం 4) పౌనఃపున్యం, కాంతి తీవ్రత 7. ఎక్కువ పౌనఃపున్యం (తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న) దృగ్గోచర కాంతి రంగు? 1) నారింజ 2) ఎరుపు 3) పసుపు 4) ఊదా 8. అల్యూమినియం (అ) తలం పని ప్రమే యం 4.2్ఛఠి. సోడియం (ూ్చ) తలం పని ప్రమేయం 2.0్ఛఠి ఈ రెండు లోహాల తలాలపై వికిరణాలు పడి ఫొటో విద్యుత్ ఫలితం ఇవ్వగా కింది పరిశీలనలు వచ్చాయి. (Group–1, 1999) 1) Al, Naలకు ఒకే ద్వార పౌనఃపున్యం ఉంది. 2) Al ద్వార పౌనఃపున్యం ా ూ్చ ద్వార పౌనఃపున్యం 3) Na ద్వార పౌనఃపున్యం ా అ ద్వార పౌనఃపున్యం 4) ఏదీకాదు 9. లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియంల ప్రథమ అయనీకరణ శక్మాలు (eV) వరుసగా 5.39, 5.13, 4.34, 6.11 అయితే ఏది కాంతి విద్యుత్ ఫలితాన్ని సులభంగా ప్రదర్శిస్తుంది? 1) పొటాషియం 2) లిథియం 3) సోడియం 4) కాల్షియం 10. సీజియం, సోడియం, అల్యూమినియంల పని ప్రమేయాలు వరుసగా 1.9eV, 2.0eV, 4.2eV అయితే అతి తక్కువ ఆరంభ పౌనఃపున్యం ఉన్నది? 1) సీజియం 2) సోడియం 3) అల్యూమినియం 4) చెప్పలేం సమాధానాలు: 1) 2; 2) 3; 3)1; 4) 2; 5)3; 6) 1; 7) 4; 8) 2; 9) 1; 10) 1; -
సిగ్నల్స్‌లో ఎరుపు రంగు వాడటానికి కారణం?
పరమాణు నిర్మాణం ద్రవ్యరాశి ఉండి కొంత ప్రదేశాన్ని ఆక్రమించే ధర్మమున్న దేనినైనా పదార్థం అంటారు. పురాతన కాలం నుంచే పదార్థ నిర్మాణాన్ని గురించి, పదార్థ మౌలిక కణాల గురించి వివిధ సిద్ధాంతాలు ప్రతిపాదించారు. పదార్థం అతిసూక్ష్మ కణాలైన ‘అణువు’, ‘పరమాణువు’ల సమ్మిళితమని ‘కణాదుడు’ అనే మహర్షి వేదకాలంలోనే ప్రతిపాదించాడు. తర్వాత గ్రీక్ తత్వవేత్త ‘డిమోక్రటిస్’ పదార్థాలు అతి సూక్ష్మమైన ‘పరమాణువులు’ కలిగి ఉంటాయని ప్రతిపాదించాడు. గ్రీక్ భాషలో ‘అౌ్టఝ (పరమాణువు)’ అంటే విభజించే వీలు కానిది అని అర్థం. ఒక సిద్ధాంత రూపంలో వివరించింది మాత్రం ‘జాన్ డాల్టన్’ (క్రీ.శ. 1808) అనే శాస్త్రవేత్త. ఈ సిద్ధాంతం ప్రకారం పదార్థం ‘అవిభాజ్యమైన అత్యంత సూక్ష్మ కణమే’ పరమాణువు. ఒక మూలకానికి చెందిన పరమాణువులన్నీ ఒకేరకంగా ఉండి ఒకే ధర్మాలను కలిగి ఉంటాయి. 20వ శతాబ్దం లో జరిగిన అనేక పరిశోధనల ఫలితాల్లో పరమాణువులో ఎన్నో మౌలిక కణాలున్నాయని తేలింది. వాటిలో ముఖ్యమైనవి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు. వీటినే ప్రాథమిక లేదా మౌలిక కణాలంటారు. * జె.జె. థామ్సన్ ‘విద్యుత్ ఉత్సర్గ నాళికా’ ప్రయోగంలో కనుగొన్న ‘రుణ విద్యుత్ కిరణాల’కు జె.జె. స్పోనీ అనే శాస్త్రవేత్త ‘ఎలక్ట్రాన్లు’అని నామకరణం చేశాడు. ఏకమాత్ర రుణావేశం ఉన్న ఈ కణాలు అత్యంత తేలికైనవి. ప్రోటాన్ ద్రవ్యరాశిలో 1/1836వ వంతు ఉంటుంది. * గోల్డ్ స్టెయిన్ కనిపెట్టిన ధన ధృవకిరణాలే ప్రోటాన్లు. ఇవి ఏకమాత్ర ధనావేశం ఉన్న ఎలక్ట్రాన్ల ద్రవ్యరాశి కంటే 1837 రెట్లు అధిక ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. * ప్రాథమిక కణాల్లో అత్యంత భారమైన, ఆవేశరహిత కణాలు న్యూట్రాన్లు. వీటిని జేమ్స్ చాడ్విక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. * పరమాణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల అమరికను ‘పరమాణు నమూనా’ అంటారు. జె.జె. థామ్సన్, రూథర్ ఫర్డ, నీల్స్బోర్లు ప్రతిపాదించిన పరమాణు నమూనాలు ముఖ్యమైనవి. * ‘పుచ్చపండు’ నమూనాగా ప్రసిద్ధి చెందిన థామ్సన్ నమూనాలో పుచ్చపండు గుజ్జు లో గింజలు పొదిగినట్లు ధనావేశ పూరిత పరమాణు కేంద్రకంలో ఎలక్ట్రాన్లన్నీ పొ దిగి ఉంటాయని ప్రతిపాదించారు. వ్యతిరేక ఆవేశాలు ఉన్న ఎలక్ట్రానులు, ప్రోటాన్లను కలిపి ఉంచడం సాధ్యం కాదు. కా బట్టి ఈ నమూనా తిరస్కారానికి గురైంది. * ‘గ్రహమండల నమూనా’గా పేరు గాంచిన రూథర్‌ఫర్‌డ నమూనా ప్రకారం పరమాణు ద్రవ్యరాశి, ధనావేశ పరమాణు కేంద్రం వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. దీన్నే పరమాణు కేంద్రకం అంటారు. దాని చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయని ప్రతిపాదించారు. ఈ నమూనాలోని లోపాలను సవరిస్తూ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు సంచరించడానికి వృత్తాకార మార్గాల (కర్పరాలు)ను బోర్ నమూనా ప్రతిపాదించింది. బోర్ నమూ నా విజయవంతానికి కాంతి స్వభావం, పరమాణు వర్ణపటం, ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం, ఐన్‌స్టీన్ కాంతి విద్యుత్ ఫలితం మొదలైన అంశాలు కారణమయ్యాయి. కాంతి స్వభావం విద్యుదయస్కాంత వర్ణపటం * కాంతికి కణ స్వభావంతో పాటు, తరంగ స్వభావం కూడా ఉంటుంది. కాంతి వివిధ విద్యుదయస్కాంత వికిరణాల సమూ హం. వీటి శక్తి తగ్గే క్రమం: కాస్మిక్ కిరణాలు ా జ కిరణాలు ా గీ ృ కిరణాలు ా అతి నీలలోహిత(్ఖగ) కిరణాలు ా దృగ్గోచర కిరణాలు ా పరారుణ (ఐఖ) కిరణాలు ా సూక్ష్మ తరంగాలు (కజీఛిటౌ ఠ్చీఠ్ఛిట) టి.వి. తరంగాలు ా రేడియో తరంగాలు. * వీటి శక్తి తగ్గుతున్న కొద్దీ తరంగధైర్ఘ్యం పెరుగుతుంది. అంటే జ కిరణాల శక్తి ఎక్కు వ, తరంగధైర్ఘ్యం తక్కువ. రేడియో తరంగాలకు శక్తి తక్కువ,తరంగధైర్ఘ్యం ఎక్కువ. * కోబాల్ట్-60 అనే రేడియో ధార్మిక మూలకం ఉద్గారం చేసే జ కిరణాలను క్యాన్సర్ కారక కణాలను నశింప చేయడానికి, కూరగాయలు, గింజధాన్యాలను ఎక్కువకాలం నిల్వ ఉంచేందుకు క్రిమిరహితం చేయడానికి ఉపయోగిస్తారు. లెడ్ నుంచి జ కిరణాలు ప్రయాణించవు. * గీ కిరణాలను రాంట్జన్ కనిపెట్టాడు. కంటికి కనిపించని ఈ కిరణాలు మామూలు కాంతి చొచ్చుకుపోని పదార్థాల ద్వారా చొచ్చుకుని పోగలవు. విరిగిన ఎముకల గురించి, శరీరంలో ఇతర అంగవైకల్యాలు, పరిశ్రమల్లో పరికరాల్లోని పగుళ్ల గురించి తెలుసుకోవడానికి ఈ కిరణాలను విరివిగా వాడతారు. అణువుల నిర్మాణం, స్ఫటిక నిర్మాణం తెలుసుకోవచ్చు. కస్టమ్స్ శాఖ అధికారులు గీృకిరణాలను ఉపయోగించి దొంగ రవాణా చేస్తున్న వస్తువులు, ఆయుధాల గురించి తెలుసుకుంటారు. * అతినీలలోహిత కిరణాల (్ఖగ)ను నీటిని క్రిమిరహితం చేయడానికి, నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగిస్తారు. * దృగ్గోచర కాంతి కంటికి కనిపిస్తుంది. ఇది గఐఆఎ్గైఖ అనే ఏడురంగుల సమ్మిళితం. * పరారుణ (ఐఖ) కిరణాలను టి.వి. రిమోట్లలో, చీకట్లో చూడడానికి ఉపయోగించే ‘నైట్ విజన్’ కళ్లద్దాలలో ఉపయోగిస్తారు. * వంట చేయడానికి మైక్రో తరంగాలను ఉపయోగిస్తారు. నీరు, కొవ్వు కణాలను మైక్రో తరంగాలు కంపనం చెందించడం వల్ల వేడి జనించి పదార్థాలు ఉడుకుతాయి. * అయనోస్ఫియర్ నుంచి అధిక తరంగ ధైర్ఘం ఉన్న రేడియో తరంగాలు పరివర్తనం చెందుతాయి. అందువల్ల వీటిని కమ్యూనికేషన్ల వ్యవస్థలో ఉపయోగిస్తారు. మాదిరి ప్రశ్నలు 1. పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు ఉంటా యని తెలిపిన శాస్త్రవేత్త? 1) బోర్ 2) రూథర్‌ఫర్‌డ 3) థాంసన్ 4) చాడ్విక్ 2. మానవ శరీర అంతర నిర్మాణాన్ని చూడ టానికి ఉపయోగించే కంప్యూటర్ టోమో గ్రఫీ (ఇఖీ)కి ఆధారం? (సివిల్స్ 2007) 1) గీృకిరణాలు 2) ధ్వని తరంగాలు 3) అయస్కాంత అనునాదం 4) రేడియో ఐసోటోపులు 3. రాత్రి చూడటానికి ఉపయోగించే పరికరాల్లో వాడే కిరణాలు? (సివిల్స్ 2009) 1) రేడియో తరంగాలు 2) మైక్రో తరంగాలు 3) పరారుణ తరంగాలు 4) ఏవీ కావు 4. సిగ్నల్స్‌లో ఎరుపు రంగును వాడటానికి కారణం? 1) ఎరుపు డేంజర్‌ను సూచించడానికి సింబాలిక్‌గా వాడతారు 2) అల్ప తరంగధైర్ఘ్యం ఉండటం 3) అధిక తరంగధైర్ఘ్యం ఉండటం 4) చవకైంది 5. అయనోవరణం అనే భూ వాతావరణం లోని ఒక పొర, రేడియో కమ్యూనికేషన్లకు వీలు కలిగిస్తుంది. ఎందుకు? (సివిల్స్ 2011) ఎ) ఓజోన్ ఉనికి వల్ల రేడియో తరంగాలు భూమిపైకి పరావర్తనం చెందడం బి) రేడియో తరంగాలకు సుదీర్ఘమైన తరంగధైర్ఘ్యం ఉండటం. పై వాటిలో సరైంది? 1) ఎ మాత్రమే 2) బి మాత్రమే 3) ఎ, బి 4) రెండూ కాదు 6. రాడార్‌లో ఉపయోగించే విద్యుదయ స్కాంత కిరణాలు? 1) గీృకిరణాలు 2) పరారుణ 3) మైక్రో తరంగాలు 4) గామా 7. కాంతి విస్తరణను అధ్యయనం చేయడానికి ఉపయోగించే సాధనం? 1) మైక్రోస్కోప్ 2) స్పెక్ట్రోమీటర్ 3) టెలిస్కోప్ 4) ఫొటోమీటర్ 8. కిందివాటిలో సరైన వాక్యం? ఎ) కాస్మిక్ కిరణాలు అతి తక్కువ తరంగ ధైర్ఘ్యం, అత్యధికశక్తి కలిగిన ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలు బి) అన్ని విద్యుదయస్కాంతాలు కాంతి వేగం (3ప108 మీ/సె)తో ప్రయాణి స్తాయి సి) ఓజోన్ పొర కాస్మిక్ కిరణాలను, అతి నీలలోహిత కిరణాలను భూమిని చేరకుండా ఫిల్టర్ చేస్తుంది డి) ఏదైనా పదార్థాన్ని మైక్రో తరంగాలు వేడి చేయాలంటే అందులో తప్పని సరిగా నీటి అణువులుండాలి 1) ఎ మాత్రమే 2) ఎ, బి 3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి 9. సూక్ష్మ తరంగ భట్టీ (కజీఛిటౌఠ్చీఠ్ఛి ైఠ్ఛి) ఏ గుణకాన్ని ఉపయోగిస్తుంది? (గ్రూప్-1, 1999) 1) నీళ్ల సూక్ష్మ తరంగ శోషణం 2) వంటచేసే పాత్ర సూక్ష్మ తరంగ శోషణం 3) వంట సూక్ష్మ తరంగ పరావర్తనం 4) ఏదీ కాదు 10. సెల్ఫోన్లలో ఉపయోగించే విద్యుద యస్కాంత తరంగాలు? 1) మైక్రో తరంగాలు 2) పరారుణ కాంతి 3) రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు 4) కాస్మిక్ కిరణాలు సమాధానాలు 1) 2; 2) 1; 3) 3; 4) 3; 5) 2; 6) 3; 7) 2; 8) 4; 9) 1; 10) 3