Monaco
-
అక్కడికి వెళితే లవ్‌లో పడతారు!
ఎక్కడికి? మొనాకో! ఎక్కడుంది? ఫ్రాన్స్‌లో! తమన్నా ఎప్పుడు వెళ్లారు? ఈ మంత్ స్టార్టింగ్‌లో! ఇప్పుడు అక్కడే ఉన్నారు. తెలుగు ‘క్వీన్’ షూటింగ్ ఫ్రాన్స్‌లో జరుగుతోందిప్పుడు. ఆల్మోస్ట్ మరో 30 రోజులు ఫ్రాన్స్‌లోనే ఉండబోతున్నారీ రాణి! మొన్న గురువారం ఒక్కరోజు షూటింగ్‌కి సెలవు దొరికితే... మొనాకో వెళ్లారు. సముద్రపు ఒడ్డున ఉందీ సిటీ. చాలామంది సిటీ గురించి చాలా చాలా చెప్పారట! దాంతో ఎప్పటి నుంచో అక్కడికి వెళ్లాలనుకుంటున్నారట! ‘క్వీన్’ షూటింగుకి కాస్త గ్యాప్ దొరకడంతో వెళ్లడం కుదిరింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఎవరైనా లవ్‌లో పడాల్సిందేనని పేర్కొన్నారు. అంతా చెబుతున్నారు కానీ.. ‘అసలు తమన్నా ఎవరితో లవ్‌లో పడ్డారో?’ చెప్పడం లేదనుకుంటున్నారా? ‘మొనాకో సిటీ’తోనే లవ్‌లో పడ్డారట! ‘‘సంతోషంగా ఉండడానికి ఎన్నో కారణాలున్నాయి. ఈ ట్రిప్‌లో అలాంటివి కొన్ని ఉన్నాయి. ఈ ప్రదేశాలు (మొనాకోలో అందాలు) నాలో సంతోషాన్ని నింపుతున్నాయి. ఈ అందమైన ప్రదేశంతో ఎవరైనా ప్రేమలో పడకుండా ఉండడం కష్టమే’’ అని తమన్నా పేర్కొన్నారు. ‘షో, మిస్సమ్మ’ సినిమాల ఫేమ్ నీలకంఠ దర్శకత్వంలో మను కుమారన్ నిర్మిస్తున్న ‘క్వీన్’ హిందీ హిట్ ‘క్వీన్’కి రీమేక్ అనే సంగతి తెలిసిందే. తమిళ రీమేక్‌లో క్వీన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. -
మొనాకో ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ విశేషాలు..
-
పెంట్‌హౌస్@ రూ.2,424 కోట్లు!
సముద్రం పక్కనే అద్దాలతో కూడిన అందమైన ఆకాశ హర్మ్యం.. ఆపై అందులో ఓ భారీ ఈతకొలను.. చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది కదూ? ఇది మొనాకోలోని ఓడియన్ టవర్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్. సౌకర్యా లు, ధర పరంగా ఇందులోని ఫ్లాట్లన్నీ ఒక ఎత్తయితే, పెంట్‌హౌస్ ఒక్కటీ మరో ఎత్తు. ఏకంగా ఐదు అంతస్తుల పొడవులో నిర్మించిన ఈ పెంట్‌హౌస్‌ను చూడటానికి రెండు కళ్లూ చాలవు. స్విమ్మింగ్‌పూల్‌తో సహా అత్యంత విలాసవంతమైన సమస్త సౌకర్యాలూ ఇందులో ఉన్నాయి. వచ్చే ఏడాదికి పూర్తికానున్న ఈ పెంట్‌హౌస్ ధర ఎంతో తెలుసా? 24 కోట్ల పౌండ్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే.. దాదాపు రూ. 2,424 కోట్లు అన్నమాట. ధర చూస్తే గుండె గుభేల్మంటోంది కదూ..? -
'వాడా’ వార్నింగ్ సరికాదు: బోల్ట్
మొనాకో: జమైకా స్టార్, స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా) హెచ్చరికలపై మండిపడ్డాడు. తాజాగా ఐదో సారి ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికైన ఒలింపిక్ చాంపియన్... వాడా వార్నింగ్‌లతో తను రూ. కోట్ల విలువైన స్పాన్సర్‌షిప్‌లు కోల్పోతానని వాపోయాడు. జమైకాకు చెందిన చాలా మంది అథ్లెట్లు ఇటీవల డోప్ టెస్టుల్లో పట్టుబడ్డారు. దీంతో విచారణకు అదేశించిన వాడా డోపీలపై కఠిన చర్యలుంటాయని, ఏకంగా జమైకా అథ్లెట్లందరినీ రియో ఒలింపిక్స్ (2016)లో పాల్గొనకుండా వేటు వేస్తామని గట్టిగా హెచ్చరించింది. దీనిపై స్పందించిన బోల్ట్ ‘వాడా నిర్ణయం నన్ను నిరాశపరిచింది. అది నిజంగా నా ఆదాయానికి గండికొట్టే హెచ్చరిక. నాకు తెలిసిందల్లా ట్రాక్ అండ్ ఫీల్డే. అదే నా లోకం. ఇందులో రాణించేందుకు ఎంతో కష్టపడతా. వాడా, ఐఏఏఎఫ్ల నుంచి ఎన్నో పరీక్షలెదుర్కొంటా’నని అన్నాడు. కానీ వ్యక్తిగత పరీక్షల ఆధారంగా కాకుండా ఏకంగా టీమ్ మొత్తాన్ని నిషేధిస్తామనడం సబబు కాదని అన్నాడు. దీని వల్ల తనకు ఎండార్స్మెంట్లు తెచ్చే ఏజెంట్లు అయోమయానికి గురవుతారని... తాను ఆ జాబితాలో ఉన్నాననే అనుమానంతో స్పాన్సర్‌షిప్‌లు కట్టబెట్టరని బోల్ట్ వివరించాడు. తప్పుచేసినవారిపైనే చర్యలుండాలని, అంతే గానీ టీమ్ మొత్తంపై వేటు తగదన్నాడు.