అక్కడికి వెళితే లవ్‌లో పడతారు! | Tamannaah Bhatia in Monaco France | Sakshi
Sakshi News home page

అక్కడికి వెళితే లవ్‌లో పడతారు!

Published Sun, Nov 12 2017 12:21 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

Tamannaah Bhatia in Monaco France  - Sakshi

ఎక్కడికి? మొనాకో! ఎక్కడుంది? ఫ్రాన్స్‌లో! తమన్నా ఎప్పుడు వెళ్లారు? ఈ మంత్‌ స్టార్టింగ్‌లో! ఇప్పుడు అక్కడే ఉన్నారు. తెలుగు ‘క్వీన్‌’ షూటింగ్‌ ఫ్రాన్స్‌లో జరుగుతోందిప్పుడు. ఆల్మోస్ట్‌ మరో 30 రోజులు ఫ్రాన్స్‌లోనే ఉండబోతున్నారీ రాణి! మొన్న గురువారం ఒక్కరోజు షూటింగ్‌కి సెలవు దొరికితే... మొనాకో వెళ్లారు. సముద్రపు ఒడ్డున ఉందీ సిటీ. చాలామంది సిటీ గురించి చాలా చాలా చెప్పారట! దాంతో ఎప్పటి నుంచో అక్కడికి వెళ్లాలనుకుంటున్నారట! ‘క్వీన్‌’ షూటింగుకి కాస్త గ్యాప్‌ దొరకడంతో వెళ్లడం కుదిరింది.

అక్కడికి వెళ్లిన తర్వాత ఎవరైనా లవ్‌లో పడాల్సిందేనని పేర్కొన్నారు. అంతా చెబుతున్నారు కానీ.. ‘అసలు తమన్నా ఎవరితో లవ్‌లో పడ్డారో?’ చెప్పడం లేదనుకుంటున్నారా? ‘మొనాకో సిటీ’తోనే లవ్‌లో పడ్డారట! ‘‘సంతోషంగా ఉండడానికి ఎన్నో కారణాలున్నాయి. ఈ ట్రిప్‌లో అలాంటివి కొన్ని ఉన్నాయి. ఈ ప్రదేశాలు (మొనాకోలో అందాలు) నాలో సంతోషాన్ని నింపుతున్నాయి. ఈ అందమైన ప్రదేశంతో ఎవరైనా ప్రేమలో పడకుండా ఉండడం కష్టమే’’ అని తమన్నా పేర్కొన్నారు. ‘షో, మిస్సమ్మ’ సినిమాల ఫేమ్‌ నీలకంఠ దర్శకత్వంలో మను కుమారన్‌ నిర్మిస్తున్న ‘క్వీన్‌’ హిందీ హిట్‌ ‘క్వీన్‌’కి రీమేక్‌ అనే సంగతి తెలిసిందే. తమిళ రీమేక్‌లో క్వీన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement