monster. com
-
రాబోయే రోజుల్లో ఈ రంగాల్లో భారీ ఉద్యోగ అవకాశాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది టెక్నాలజీ ఆధారిత రంగాల్లో నియామకాలు జోరుగా ఉంటాయని మాన్స్టర్.కామ్ నివేదిక తెలిపింది. ‘ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి రంగాల్లో నియామకాల డిమాండ్ పెరుగుతుంది. వేగవంతమైన సాంకేతికతను స్వీకరించడంతో ఏఐ, మెషీన్ లెర్నింగ్ పాత్ర 2022లో వృద్ధి చెందుతుంది. నూతన సాధారణ స్థితికి అనుగుణంగా కంపెనీలు సంస్థాగత వ్యూహాలు, లక్ష్యాలను మార్చుకున్నప్పుడు సాంకేతికతను స్వీకరించడం మళ్లీ రెట్టింపు అయింది. ఉద్యోగాల మార్పు, ఉపాధి సంక్షోభం నేపథ్యంలో నిపుణులైన మానవ వనరుల కోసం వేట పెరగడంతో నైపుణ్యం పెంచుకునే ప్రక్రియ కొత్త స్థాయికి చేరుకుంది. భవిష్యత్తులో ప్రతిభను నిలుపుకోవడంలో ఉద్యోగి సౌలభ్యం కీలకం. మార్కెట్లో ఉన్న భారీ డిమాండ్‌తో ఉద్యోగులు తమకు నచ్చిన వృత్తిని ఎంచుకోవడానికి తలుపులు తెరుస్తోంది. మూడవ అతిపెద్ద మార్కెట్‌గా.. ఏఐ, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లో పెట్టుబడులు వచ్చే రెండేళ్లు ఏటా 33.49 శాతం అధికం అవుతాయి. చాట్‌బోట్స్ వినియోగం పెరుగుతుంది. వేగంగా విస్తరిస్తున్న భారతీయ ఫిన్‌టెక్ రంగం 2025 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని అంచనా. 2022లో ఐటీ పరిశ్రమ ఏడు శాతం వృద్ధి చెందుతుంది. 2021–22 ద్వితీయార్థం 4,50,000 మంది స్థూల ఉద్యోగుల చేరికను చూసే అవకాశం ఉంది. బిగ్ డేటా అనలిటిక్స్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉండొచ్చు. ఫిన్‌టెక్, రిటైల్, ఈ–కామర్స్, సోషల్ కామర్స్‌లో సేల్స్ నిపుణుల అవసరం అధికం కానుంది. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకే ఉత్సాహం చూపుతుండడంతో ద్వితీయ శ్రేణి నగరాల్లో చిన్న కార్యాలయాల ఏర్పాటు లేదా కో–వర్కింగ్ స్పేస్‌ను వినియోగించుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి. ఫ్రెషర్ల కోసం నియామకాలు గడిచిన మూడు నెలల్లో పెరిగాయి. ఈ ఏడాది ఇవి మరింత అధికం కానున్నాయని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. చదవండి: బెంగళూరుకి ఝలక్ ! నియామకాల్లో హైదరాబాద్ టాప్ -
ఆన్లైన్ హైరింగ్‌లో 11 శాతం వృద్ధి
మాన్స్టర్.కామ్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఆన్లైన్ హైరింగ్ పెరిగింది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో 11 శాతం వృద్ధి నమోదైందని జాబ్ పోర్టల్ మాన్స్టర్.కామ్ వెల్లడించింది. ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ 15 పాయింట్లు(11 శాతం) పెరిగింది. జనవరి నుంచి నియామకాల్లో హెచ్చుదల కనపడుతోందని వివరించింది. రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనడానికి ఏప్రిల్ నియామకాల సూచి(ఇండెక్స్) నిదర్శనమని మాన్స్టర్ ఇండియా ఎండీ సంజయ్ మోడి పేర్కొన్నారు. ఐటీ, ట్రావెల్/టూరిజం రంగాల్లో నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, సిమెంటు, నిర్మాణ రంగం, ఐరన్/స్టీలు రంగాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే సీనియర్ మేనేజ్మెంట్ పోస్టులకు డిమాండ్ 51 శాతం వృద్ధి కనబరిచింది. హైదరాబాద్‌లో 11 శాతం.. ఐటీ, ఐటీఈఎస్, టెలికం రంగంలో హైదరాబాదీయులకు ఎక్కువ అవకాశాలు వరిస్తున్నాయి. ఆన్లైన్ మార్కెటింగ్ పోర్టల్స్ నుంచి భాగ్యనగరంలో నియామకాలు పెరిగాయని హెచ్ఆర్ రంగ సంస్థ టీఎంఐ గ్రూప్ డీజీఎం అపర్ణ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఆన్లైన్ నియామకాల్లో 50-60 శాతం ఈ పోర్టల్స్ నుంచే ఉంటాయని చెప్పారు. తయారీ, మౌలిక రంగంలో నియామకాల ఊసే లేదని చెప్పారు. కాగా, మాన్స్టర్ నియామక సూచి ప్రకారం గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది 13 నగరాలకుగాను 10 నగరాలు వృద్ధి కనబరిచాయి. అహ్మదాబాద్ అత్యధికంగా 26 శాతం, బెంగళూరు 22, పునే 15, ముంబై 14, హైదరాబాద్‌లో 11% హెచ్చుదల నమోదైంది. -
కొత్త కొలువుల కళకళ...
న్యూఢిల్లీ: ఈ ఏడాది జాబ్ మార్కెట్ ఆశావహంగా కన్పిస్తోంది. ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలు జనవరిలో వరుసగా నాలుగో నెల కూడా పెరగడం ఇందుకు నిదర్శనం. దేశంలో ఆన్లైన్ జాబ్ డిమాండుకు ఓ ప్రామాణికమైన మాన్స్టర్.కామ్ ఉద్యోగ సూచీ జనవరిలో 7 పాయింట్లు (5.18 శాతం) వృద్ధిచెంది 142 పాయింట్లకు చేరింది. వరుసగా ఆరు సంవత్సరాలు దిగువముఖంలో ఉన్న రిక్రూట్మెంట్ సూచీ గతేడాది 11 శాతం పెరగడం గమనార్హం. ఐటీ (సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్), రిటైల్ రంగాల్లో ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయని మాన్స్టర్.కామ్ ఎండీ సంజయ్ మోడీ తెలిపారు. ఉద్యోగ సూచీ గత అక్టోబర్ నుంచి క్రమంగా పెరుగుతోందని చెప్పారు. వివిధ కార్పొరేట్ సంస్థలు, హెచ్ఆర్ కన్సల్టెంట్ల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ఏడాది ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నట్లు వివరించారు. ఐటీ, హెల్త్‌కేర్, విద్య, మౌలిక సౌకర్యాలు, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) రంగాలు జాబ్ మార్కెట్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లోనూ జోరు.. మాన్స్టర్.కామ్ సూచీ పర్యవేక్షణలోని 13 నగరాలకు గాను 11 సిటీల్లో ఆన్లైన్ జాబ్ డిమాండ్ భారీగా పెరిగింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో దీర్ఘకాలిక అభివృద్ధి రేటు గతేడాది రెండంకెల స్థాయిలో ఉందని మాన్స్టర్.కామ్ నివేదిక పేర్కొంది. బరోడా, కోయంబత్తూరు నగరాలు మాత్రమే తిరోగమనంలో ఉన్నాయని తెలిపింది.