లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఈనెల 29న మాతృభాష దినోత్సవం సందర్భంగా లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్టు లయన్స్ క్లబ్ మాతృభాష విభాగం జిల్లా చైర్మన్ వి.వెంకటస్వామి తెలిపారు. శనివారం జిల్లా గవర్నర్ డాక్టర్ సీహెచ్.సత్యనారాయణమూర్తితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ లయన్స్క్లబ్ 5 రీజియన్లల్లో వేర్వేరుగా ఈ పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈనెల 21న మాతృభాష ప్రాముఖ్యత–దాని పరిరక్షణలో సమాజం పాత్ర అనే అంశంపై ఈ పోటీలు ఉంటాయని తెలిపారు. పాల్గొనదలిచిన విద్యార్థులు శశి టెక్నో స్కూలు, ఏలూరు (94901 79418), పెదవేగి ఎస్ఎంసీ పబ్లిక్ స్కూల్ (96181 16262), పాలకొల్లు సన్షైన్ పబ్లిక్ స్కూల్ (08814– 228700), ఐ.భీమవరం నంబూరి లక్ష్మీకాంతమ్మ లయన్స్ ఆడిటోరియం (98491 22038), తణుకు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల (95504 23235), చింతలపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (94405 83621), నారాయణపురం ఉషోదయ పబ్లిక్ స్కూల్ (94406 54800), భీమవరం ఆదిత్య పబ్లిక్ స్కూల్ (98489 55665), తాడేపల్లిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాల (98487 29399), నిడదవోలు విద్యాదీప్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ (93476 24459)లో సంప్రదించి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు.