more funds
-
జీపీ భవనాలకు అదనపు నిధులు
మోర్తాడ్(బాల్కొండ) : ఉపాధి హామీ పథకం ద్వారా నిధులను కేటాయించి నిర్మిస్తున్న పంచాయతీలకు అదనంగా మరిన్ని నిధులను కేటాయించాలని ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో భవనానికి రూ. 3 లక్షల చొప్పున కేటాయించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరుకున్న పంచాయతీ భవనాలకు కొత్త భవనాలను నిర్మించడానికి ఉపాధి హామీ పథకం నుంచి రూ. 13 లక్షల చొప్పున కేటాయించారు. అయితే ఈ నిధులతో భవన నిర్మాణం పూర్తయినా చిన్న చిన్న సౌకర్యాలను కల్పించడానికి నిధులు సరిపోకపోవడంతో పంచాయతీ భవనాలు వినియోగంలోకి రాలేకపోయాయి. అదనంగా నిధులు కేటాయిస్తేనే పనులు పూర్తి చేసి భవనాలను వినియోగంలోకి తీసుకురావచ్చని అధికారులు భావించారు. జిలాŠోల్ల మొదటి విడతలో కొన్ని భవనాలను నిర్మించగా అప్పట్లో ఒక్కో భవనానికి రూ. 11 లక్షల చొప్పున నిధులను కేటాయించారు. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండడంతో నిధులు సరిపోయాయి. అయితే 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో మరో 52 పంచాయతీలకు నూతన భవనాలను నిర్మించడానికి నిధులు మంజూరు చేశారు. నిర్మాణ వ్యయం పెరగడంతో ఒక్కో పంచాయతీ భవనానికి రూ. 13 లక్షల చొప్పున జిల్లాలోని 52 భవనాలకు రూ. 6 కోట్ల 76 లక్షలను కేటాయించారు. భవనాల నిర్మాణం పూర్తయినా సానిటేషన్, ఫ్లోరింగ్, కలర్స్ వేయడానికి నిధులు సరిపోలేదు. అంచనాలకు మించి వ్యయం పెరిగిపోవడంతో అదనంగా మరింత నిధులు అవసరం అని ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. ఒక్కో పంచాయతీకి రూ. 3 లక్షల చొప్పున కేటాయిస్తే నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకురావచ్చని అధికారులు సూచిస్తున్నారు. సానిటేషన్, ఫ్లోరింగ్, కలర్స్ కోసం రూ. 3 లక్షల చొప్పున జిల్లాలోని 52 భవనాలకు రూ. 1.56 కోట్ల నిధులు అదనంగా అవసరం అవుతున్నాయి. ఈ నిధులను కేటాయిస్తే జిల్లాలోని పంచాయతీ భవనాల కోసం ఉపాధి హమీ పథకం ద్వారా రూ. 8.32 కోట్లు కేటాయించినట్లు జరుగుతుంది. ప్రభుత్వమే అదనపు నిధులను విడుదల చేయడానికి ప్రతిపాదనలు కోరగా ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ నిధులు తొందరలోనే విడుదల అవుతాయని నిధుల కేటాయింపు జరగగానే పంచాయతీ భవనాలను వినియోగంలోకి తీసుకు రావడానికి పనులను పూర్తి చేయిస్తామని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు వెల్లడించారు. అదనపు నిధులు కేటాయించడం సబబే.. గ్రామ పంచాయతీ భవనాలకు అదనంగా రూ. 3 లక్షల చొప్పున నిధులను కేటాయించడం సబబే. రూ. 13 లక్షలతో భవన నిర్మాణం పూర్తి కాగా ఇతర సౌకర్యాల కోసం అదనంగా నిధులు అవసరం ఉన్నాయి. పంచాయతీలకు ఆదాయం తక్కువగా ఉండడంతో ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించడం సమంజసమే. – నాగం పోశన్న, సర్పంచ్, వడ్యాట్ నిధులు మంజూరైతేనే భవనాలు వినియోగంలోకి ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా కేటాయించిన రూ. 13 లక్షల నిధులతో భవనాలను నిర్మించారు. కానీ సౌకర్యాలు మెరుగుపడలేదు. ఇప్పుడు రూ. 3 లక్షల అదనపు నిధులు మంజూరైతే సౌకర్యాలు వృద్ధి చెంది భవనాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తాయి. – లింగన్న, సర్పంచ్, దోన్పాల్ -
హోదా కన్నా ఎక్కువ ప్యాకేజీ ఇస్తున్నాం: పురంధేశ్వరి
గుంటూరు : పోలవరంపై చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి సరైన వివరణ ఇవ్వలేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి ఆరోపించారు. అందువల్ల కేంద్రం నిధుల విడుదల్లో జాప్యం ఏర్పడిందన్నారు. గురువారం పురందేశ్వరి గుంటూరు విచ్చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ ప్యాకేజీ ఇస్తున్నామన్నారు. -
‘పంచాయతీరాజ్’కు నిధులు పెంచండి
- ఆర్థిక శాఖకు మంత్రి కేటీఆర్ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీ రాజ్ విభాగానికి భారీగా నిధులు కేటాయించాలని ఆ శాఖ మంత్రి కేటీఆర్ ఆర్థిక శాఖకు విన్నవించారు. ఈ మేరకు శనివారం పలు ప్రతిపాదనలను ఆర్ధిక మంత్రికి, ప్రణాళికా సంఘ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ వివరించారు. గ్రామాల్లోని పంచాయతీ రహదారుల విస్తరణ, కొత్త వాటి నిర్మాణం, మరమ్మతు పనులకు రూ.5,470 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ వర్గాలకు చెందిన 30 లక్షల మందికి ‘ఆసరా’ పింఛను ద్వారా భరోసా కల్పిస్తున్నామన్నారు. దీనికోసం రూ.4.9 వేల కోట్లు అవసరమవుతాయని వివరించారు. బీడీ కార్మికులకు మార్చి 1 నుంచి పింఛను వర్తింపజేయాలని నిర్ణయించినందున మరో రూ.400 కోట్లు కేటాయించాలన్నారు. పల్లె ప్రగతికి 100 కోట్లు: ‘తెలంగాణ పల్లె ప్రగతి’ ద్వారా ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టనున్న కార్యక్రమాలకు ప్రభుత్వ వాటా కింద రూ.100 కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కోరారు. పల్లెల్లో జీవనోపాధి పెంపు, వ్యవసాయంలో లాభ సాటి పద్ధతులు, గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న గ్రామ సేవా కేంద్రాల గురించి ఆర్థికశాఖ, ప్రణాళికా సంఘం ప్రతినిధులకు మంత్రి వివరించారు. శ్రీ రామానంద తీర్థ శిక్షణ సంస్థ (నల్లగొండ) స్థాయిని పెంచేందుకు రూ.3 కోట్లు కేటాయించాలని కోరారు. ‘సెర్ప్’కు ప్రస్తుతం ఇస్తున్న నిధులను రెట్టింపు చేయాలని ప్రతిపాదించారు. ‘ఉపాధిహామీ’ కింద గిడ్డంగుల నిర్మాణం, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు, హరిత హారం తదితర శాశ్వత ఆస్తుల కల్పనకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని కోరారు. వాటర్‌గ్రిడ్‌కు 6 వేల కోట్లు: తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును మూడేళ్లలోగా పూర్తి చేయాల్సి ఉన్నందున, రానున్న బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించాలని కేటీఆర్ ప్రతిపాదించారు. దీనికి నిధుల కొరత లేకుండా చూస్తామని ఆర్థిక మంత్రి ఈటెల ఆయనకు హామీ ఇచ్చారు. వేసవిలో తాగునీటి ప్రణాళికలకు రూ.150 కోట్లు కావాలని కేటీఆర్ కోరారు. ఐటీ అభివృద్ధికి 250 కోట్లు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు రూ.250 కోట్లు అవసరమని కేటీఆర్ ప్రతిపాదనలను సమర్పించారు. మౌలికవసతుల ఏర్పాటుకు రూ.150 కోట్లు, టాస్క్ కోసం రూ.9 కోట్లు, సాప్‌నెట్ కోసం రూ.4 కోట్లు, ఈ-సేవా కింద రూ.రెండు కోట్లు, ఈ- గవర్నెన్స్ కోసం రూ.30 కోట్లు కావాలని మంత్రి తన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.