
హోదా కన్నా ఎక్కువ ప్యాకేజీ ఇస్తున్నాం: పురంధేశ్వరి
గుంటూరు : పోలవరంపై చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి సరైన వివరణ ఇవ్వలేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి ఆరోపించారు. అందువల్ల కేంద్రం నిధుల విడుదల్లో జాప్యం ఏర్పడిందన్నారు. గురువారం పురందేశ్వరి గుంటూరు విచ్చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ ప్యాకేజీ ఇస్తున్నామన్నారు.