అనంతపురం జిల్లాలో వేరుశెనగ విత్తనాల సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి తెలిపారు.
అనంతపురం: అనంతపురం జిల్లాలో వేరుశెనగ విత్తనాల సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి తెలిపారు. అనంతపురంలో సోమవారం ఆమె మాట్లాడుతూ ఏపీకీ ప్రత్యేక హోదా పై అన్ని మంత్రిత్వశాఖలతో చర్చిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం నిరాకరించినా ప్రయత్నాలు కొనసాగిస్తామని హామి ఇచ్చారు. ప్రజా సంక్షేమం కోసం గత ప్రభుత్వం 70 శాతం నిధులిస్తే , మోదీ ప్రభుత్వం 90 శాతం నిధులిస్తుందన్నారు.