ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం: పురందేశ్వరి | we will waiting for central announcement over special package for ap, purandeswari | Sakshi
Sakshi News home page

ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం: పురందేశ్వరి

Published Wed, Sep 7 2016 1:46 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం: పురందేశ్వరి - Sakshi

ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం: పురందేశ్వరి

విశాఖ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. బుధవారం ఆమె విశాఖలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకోమని అన్నారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని పురందేశ్వరి తెలిపారు.

హోదా అనే పదాన్ని సాంకేతికంగా వాడలేమని అయితే హోదా లేకపోయినా అంతకన్నా ఎక్కువ సాయం వస్తుందన్నారు. కేంద్రం ప్రకటన కోసం ఎదురు చూస్తున్నామని, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేయకముందే తాను మాట్లాడటం సరికాదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము చివరి వరకూ పోరాడామని పురందేశ్వరి అన్నారు. ఇక ఏపీకి కచ్చితంగా రైల్వే జోన్ వస్తుందని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement