బాబు నిర్దోషిత్వం నిరూపించుకుంటారనుకున్నాం: పురందేశ్వరి
విజయవాడ : టెక్నికల్గా ప్రత్యేక హోదా పదం వాడలేకపోతున్నామని బీజేపీ మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి డి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని తెలిసి కూడా కొందరు వివాదం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. శనివారం విజయవాడలో రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది.
ఈ సమావేశానికి హాజరైన పురందేశ్వరి సాక్షి ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా కేంద్రం సహయం చేస్తుందని పురందేశ్వరి వెల్లడించారు. ఓటుకు కోట్లు కేసులో నిర్దోషిత్వం నిరూపించుకునేందుకు.. చంద్రబాబుకు మంచి అవకాశమని తాము భావించినట్లు చెప్పారు. అయితే ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని విమర్శించారు.