రెండు కేజీల బంగారంతో వ్యాపారి అదృశ్యం
తెనాలి: రెండు కిలోల బంగారంతో నగల తాకట్టు వ్యాపారి అదృశ్యమైన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. తెనాలిలో సోమనాథ్ అనే వ్యాపారి గత పదిహేనేళ్లుగా ఉంటూ నగలు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇస్తున్నాడు.
అందరితో నమ్మకంగా ఉంటూ నగలు తాకట్టు పెట్టుకుని అప్పులిచ్చేవాడు. రెండు రోజుల నుంచి సోమనాథ్ కనిపించకుండా పోయాడు. పెద్ద మొత్తంలో అతని వద్ద తాకట్టు బంగారు నగలు ఉన్నాయని తెలుస్తోంది. అతని బాధితులు బుధవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుమారు రెండు కిలోల అభరణాలు అతడు తీసుకెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. సోమనాథ్పై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.