mortgaged
-
మార్టిగేజ్ ల్యాండ్ మాయం?
సాక్షి, సిరిసిల్లటౌన్:మున్సిపల్ ఆస్తులకు రక్షణ కరువైంది. కొందరు మధ్యవర్థుల అడ్డగోలు వ్యవహారం.. అధికారుల గుడ్డినమ్మకం ఇందుకు కారణమైంది. రూ.25 లక్షల విలువ చేసే మార్టిగేట్ స్థలం వివాదంలో చిక్కింది. టౌన్ ప్లానింగ్ వైఫల్యంతో.. మున్సిపల్‌కు చెందిన ఆస్తుల రక్షణలో టౌన్‌ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలకు ఈసంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. సాయినగర్‌లో 729/ఏ, 729/బి తదితర సర్వే నంబర్లలో 2000, 2001 ప్రాంతంలో పలువురు తమ స్థలాలను ప్లాట్లుగా మార్చుతూ అనుమతులు పొందారు. ఈప్రాంతం అభివృద్ధి కోసం మున్సిపల్‌కు 31 గుంటలు కేటాయించినట్లు సమాచారం. మున్సిపల్ స్థలాలకు రక్షించే చర్యలో భాగంగా సదరు సర్వే నంబర్లలోని లేఅవుట్ భూమి 31 గుంటలు ఉండగా మున్సిపల్ కేవలం 16 గుంటలకే ప్రహరీ నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం నర్సరీ నిర్వహిస్తున్నారు. ఇదే స్థలాన్ని ఆనుకుని మిగతా 15 గుంటలకు ప్రహరీ నిర్మించకపోవడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నలోటు.. పెద్దతప్పు.. సాయినగర్ ప్రాంతంలోని రెండు వేర్వేరు వెంచర్ల ద్వారా మున్సిపల్‌కు 31 గుంటల స్థలం సంక్రమించింది. ఇందులో ఒక వెంచర్‌ను ముగ్గురి తరఫున ప్లాట్ నంబరు 21 పేరుతో మున్సిపల్ ఫీజు కింద కమిషనర్ పేరిట మార్టిగేజ్ చేశారు. ప్లాటింగ్ అనుమతిలో డీటీసీపీ నుంచి అనుమతి వచ్చినపుడు సదరు ప్లాటు నంబరు 25గా మారిం ది. హద్దులు మాత్రం వెనకాల మున్సిపల్ నర్సరీ, ముందు భాగంలో రోడ్డు వంటివి ప్లాన్‌లో నిర్ధారణ చేసినట్లు మిగతా ఇద్దరు బాధితులు తెలిపారు. అయినా మూడోవ్యక్తి కమిషనర్ పేరిట మార్టిగేజ్ చేసిన స్థలాన్ని విక్రయించడం..ఇటీవలే ఆ ప్లాటులో టౌన్‌ప్లానింగ్ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి రావడం వివాదానికి తెరలేపింది. అడ్డదారులు పట్టిస్తున్న గుడ్డినమ్మకం.. మధ్యవర్థులపై అధికారులకు ఉన్న గుడ్డినమ్మకం అడ్డదారులకు తావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఇంటి నిర్మాణ అనుమతి మంజూరులో స్థానిక మున్సిపల్ ప్లానర్స్తోపాటు మరికొందరు మధ్యవర్థిత్వం నెరుపుతున్నట్లు సమాచారం. ఈవిషయంలో ఓ ప్లానర్ అ«ధికారులు, ప్లాటు విక్రయదారులకు మధ్యవర్థిత్వం నెరిపి విచారణ లేకుండా ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరు చేయించినట్లు చర్చసాగుతోంది. సాయినగర్‌లోని మున్సిపల్ మార్టిగేజ్ ల్యాండ్‌ను ఇతరులకు అమ్మిన వ్యక్తి ప్రముఖుడు కావడంతో ఎలాంటి వి చారణ లేకుండానే ఇంటిపర్మిషన్ ఇచ్చినట్లు విమర్శలున్నాయి. ప్రస్తుతం సదరు మార్టిగేజ్ ల్యాండ్ విడుదల కోసం ఇద్దరు బాధితులు దరఖాస్తు చేసుకుని న్యాయం కావాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం మార్టిగేజ్ ల్యాండ్ విక్రయంపై మాకు ఫిర్యాదు రాలేదు. ఈవిషయంలో విచారణ చేపట్టి చర్యలు చేపడతాం. మున్సిపల్‌కు సంబం««ధించిన స్థలాలను ఆక్రమించినా..దుర్వినియోగం చేసినా కఠినంగా వ్యవహరిస్తాం. – రమణాచారి, మున్సిపల్ కమిషనర్ -
గిల్టు నగలు తాకట్టు: రూ.39 లక్షలకు టోకరా
అన్నానగర్: బ్యాంకులో గిల్టు నగలు తాకట్టుపెట్టి రూ.39 లక్షల రుణం తీసుకున్నాడో ఉద్యోగి. తమిళనాడులోని నాగై జిల్లా తిరుక్కడైయూర్ మేలవీధికి చెందిన బాలాజి (40) అదే ప్రాంతంలో ఉన్న ఓ బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను గిల్టు నగలను బ్యాంకులో కుదువబెట్టి మోసానికి పాల్పడ్డట్టు బ్యాంక్ అధికారి కబాలీశ్వరన్‌కు సమాచారం అందింది. దీనిపై విచారణ జరపగా బాలాజీ కవరింగ్ నగలను కుదువబెట్టి రూ.39 లక్షల 46 వేల 206ల రుణం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై బ్యాంకు అధికారి కబాలీశ్వరన్ నాగై జిల్లా నేర విభాగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ముణియాండి, ఎస్ఐ సుమతి బ్యాంకుకు వచ్చి కేసు నమోదు చేసి బాలాజీని అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు కార్లు, వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్వచ్ఛ భారత్ కోసం మేకలు, నగలు తాకట్టు!
జైపూర్: ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ నినాదంతో ప్రేరణ పొందిన ఓ గిరిజనుడు తన వద్ద ఉన్న మేకలను, భార్య ఆభరణాలను తాకట్టు పెట్టి మరుగుదొడ్డి నిర్మించుకున్నాడు. రాజస్థాన్ లోని దుంగార్పూర్ జిల్లాకు చెందిన కాంతిలాల్ రాట్ తన అన్నయ్యతో కలిసి ఉమ్మడిగా ఉంటున్నాడు. అతనికి ప్రధానమంత్రి క్లీన్ ఇండియా మిషన్ గురించి స్థానిక కార్యకర్త వివరించారు. మరుగుదొడ్డి నిర్మిస్తే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీల నుంచి రూ.4000 వస్తాయని చెప్పాడు. దీంతో కాంతిలాల్ పనులు ప్రారంభించాడు. ముందుగా అతనికి రూ.5000 వచ్చాయి. తర్వాత డబ్బులు రాలేదు. ఎలాగైనా టాయిలెట్ పూర్తి చేయాలనుకున్న అతను తన దగ్గరున్న నాలుగు మేకలను, భార్య వెండి ఆభరణాలను రూ.5000కు తాకట్టు పెట్టి టాయిలెట్ పనులను పూర్తిచేశాడు. విషయం తెలుసుకున్న దుంగార్పూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కేకే గుప్తా అతని ఇంటికి వెళ్లి అభినందించారు. అతనికి రూ. 4000 ఇచ్చి అతని మేకలను, ఆభరణాలను తాకట్టు నుంచి విడిపించారు. -
' ఉద్యమాన్ని అశోక్ బాబు కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారు'
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు కాంగ్రెస్ పార్టీకి తాకట్టుపెట్టాడని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కార్యదర్శి రాజారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ... రాజకీయ పదవుల కోసం ఉద్యోగులను స్వార్థప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చింది అశోక్‌బాబే అంటూ ఆయనపై రాజారెడ్డి నిప్పులు చెరిగారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన 66 రోజుల సమ్మె అశోక్‌బాబు వల్ల బుడిదలో పోసిన పన్నీరు చందంగా మారిందని పేర్కొన్నారు. అనంతరం అశోక్‌బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.