' ఉద్యమాన్ని అశోక్ బాబు కాంగ్రెస్కు తాకట్టు పెట్టారు' | Ashokbabu mortgaged Samaikyandhra stir to congress party | Sakshi
Sakshi News home page

' ఉద్యమాన్ని అశోక్ బాబు కాంగ్రెస్కు తాకట్టు పెట్టారు'

Published Fri, Jan 3 2014 12:05 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Ashokbabu mortgaged Samaikyandhra stir to congress party

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు కాంగ్రెస్ పార్టీకి తాకట్టుపెట్టాడని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కార్యదర్శి రాజారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ... రాజకీయ పదవుల కోసం ఉద్యోగులను స్వార్థప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు.

 

సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చింది అశోక్బాబే అంటూ ఆయనపై రాజారెడ్డి నిప్పులు చెరిగారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన 66 రోజుల సమ్మె అశోక్బాబు వల్ల బుడిదలో పోసిన పన్నీరు చందంగా మారిందని పేర్కొన్నారు. అనంతరం అశోక్బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement