Mosquito Prevention
-
మశక.. మశక.. చీకటిలో..
మశకమన్నాక కుట్టక తప్పదు.. కుట్టాక దద్దుర్లూ రాకా తప్పదు.. అనివార్యమగు ఈ విషయము గురించి శోకింప తగదు.. జనన మరణాల గురించి భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని ప్రస్తుతమున్న పరిస్థితులకు తగ్గట్లు మార్చేసుకుని.. నగరవాసులు ఇలా సర్దుకుపోతున్నారు.. దోమ(మశకం).. బతికేది కేవలం 20 నుంచి 30 రోజులే.. అయితే, చప్పట్లు కొడితే చచ్చిపోయే ఈ చిన్నప్రాణి ఇప్పుడు నగరవాసులతో కబడ్డీ ఆడేస్తోంది.. పిసినారి చేత కూడా డబ్బులు ఖర్చు పెట్టిస్తోంది.. దోమల నియంత్రణ కోసం నగరవాసులు ఏడాదికి ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుసా? దాదాపుగా రూ.700 కోట్లు! అయితే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని ప్రతి కుటుంబం దోమల నివారణకు నెలకు రూ.100 నుంచి రూ.300 ఖర్చు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని ఆరోగ్య శాఖతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఎండాకాలం మరింత వ్యథే.. మళ్లీ దోమల టార్చర్ మొదలైంది. చలికాలంలో కొంత ఊపిరిపీల్చుకున్న ప్రజలకు.. వేసవి ప్రారంభంలోనే దోమల బాధ పట్టుకుంది. రాత్రిళ్లు అయితే.. వీర విజృంభణే.. గుంపులుగా వచ్చేస్తున్నాయి.. అలాగనీ పగటి పూట కనికరం చూపడం లేదు. గతంలో సీజనల్‌గా మాత్రమే కనిపించే దోమలు.. ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా గడిచిన నెలన్నర మొత్తం దోమలకు అనువుగా మారింది. అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న దోమలు.. ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఎనాఫిలిస్, క్యూలెక్స్ వంటి దోమలు పగటి పూట ఇళ్లల్లోనే మకాం వేసి రాత్రులు స్వైరవిహారం చేస్తుండడంతో జనాలు మలేరియా, డెంగీ బారిన పడుతున్నారు. అన్ని మార్గాల్లోనూ.. దోమలను శాశ్వతంగా వదిలించుకోవడం అంత సులభం కాకపోవడంతో తాత్కలిక ఉపశమనానికి పెట్టే ఖర్చు తెలియకుండానే కోట్లకు చేరిపోతోంది. అటు దోమలు సైతం ప్రజలు చేస్తున్న నివారణ చర్యలను ధీటుగానే ఎదుర్కొంటున్నాయి. దోమల నివారణకు జీహెచ్ఎంసీ చేసే ఫాగింగ్ ఓ పథకం ప్రకారం లేకపోవడంతో వాటి విజృంభణ మరింత పెరిగింది. ఇందుకు ప్రజలు కాయిల్స్ ప్రయోగించడం, అవి పనిచేయకపోవడంతో లిక్విడ్, మస్కిటో బ్యాట్స్ వాడకం పెంచారు. ఇలా రాజధానిలోని ఒక్కో కుటుంబం దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు ప్రతి నెలా రూ.100 నుంచి రూ.300 ఖర్చు చేస్తున్నట్టు జాతీయ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. అంటే ప్రతి కుటుంబం ఏటా కనీసం రూ.2 వేల నుంచి రూ.2,500 ఖర్చు చేస్తున్నాయని ఆరోగ్య సంస్థలు స్పష్టం చేశాయి. ఇలా రాజధానిలో నివసించే 35 లక్షల కుటుంబాలు దోమల నివారణకు ఏటా రూ.700 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నాయని జాతీయ ఆరోగ్య సంస్థల అధ్యయనంలో తేలింది. 20 నుంచి 30 రోజులు.. దోమల జీవితకాలం చాలా తక్కువే. ఓ దోమ 20 రోజుల నుంచి నెల రోజుల వరకే బతుకుతుంది. కానీ ఒకే సమయంలో వేల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. వాటి నుంచి పిల్ల దోమలు బయటకు రావడానికి 7 రోజులు పడుతుంది. ఆ లోపు యాంటీ లార్వా ఆపరేషన్ చేస్తేనే.. దోమల ఉత్పత్తిని నివారించగలం. కానీ సరైన సమయానికి మందులు చల్లకపోవడం వల్ల దోమలు వీరవిహారం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ తీసుకుంటున్న దోమల నియంత్రణ చర్యలు పెద్దగా ఫలితం చూపించడం లేదు. యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ వంటివి విఫలం అవుతున్నాయి. అక్కడా..ఇక్కడా అని లేదు.. జీహెచ్ఎంసీ పరిధిలోని శివారు ప్రాంతాల నుంచి సెంటర్ సిటీ వరకు అన్నీ చోట్లా దోమలు విజృంభిస్తున్నాయి. మెహిదీపట్నం, ఆసీఫ్‌నగర్, షాలిబండ, మారేడ్‌పల్లి, న్యూబోయిన్‌పల్లి, అల్వాల్, కీసర, కొండాపూర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లిలో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. దోమ పోటుతో ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. గత ఏడాది 296 మలేరియా కేసులు నమోదుకాగా, డెంగ్యూ కేసులు 117 నమోదయినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రతీ ఒక్కరు పరిశుభ్రత పాటిస్తేనే దోమల నివారణ సాధ్యమవుతుందని జీహెచ్ంఎసీ అధికారులు చెప్తున్నారు. నల్లా గుంతలు, నీటి సంపులు ఇంటి పరిసరాల్లోని టైర్లు, పూల కుండీలు, పాత బకెట్లలో ఉండే నీటిలో దోమలు వృద్ధి చెందుతాయని, నీరు నిలవకుండా చర్యలు చేపడితే దోమల నివారణ సగం పూర్తయినట్లే అని వైద్యులు సూచిస్తున్నారు. దోమల నివారణకు రాజధానిలో ఓ కుటుంబ నెల ఖర్చు రూ.100-300 దోమల నివారణకు రాజధానిలో ఓ కుటుంబ ఏడాది ఖర్చు రూ.2000-2500 దోమల నివారణకు రాజధానిలో ఏడాదికయ్యే ఖర్చు రూ.700 కోట్లు – సాక్షి, హైదరాబాద్ -
రోగాల పుట్ట
జిల్లాలో విజృంభిస్తున్న వ్యాధులు గతేడాదితో పోలిస్తే ప్రమాదకరంగా పెరుగుదల దోమల నివారణ చర్యలు నామమాత్రం విశాఖపట్నం: జిల్లా వాసులను రోగాలు పట్టిపీడుస్తున్నాయి. మైదానం, ఏజెన్సీ అనే తేడా లేకుండా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 5వేల మంది మలేరియా బారిన పడ్డారు. 36 డెంగ్యూ, 11 చికెన్‌గున్యా కేసులు నమోదయ్యాయి. టైఫాయిడ్ ఉనికిని చాటుకుంటోంది. దాదాపు 4వేల మంది దీనికి గురయ్యారు. ఫైలేరియా కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. పరిస్థితి అదుపుతప్పుతున్నప్పటికీ ప్రభుత్వం, వైద్యఆరోగ్య శాఖ చర్యలు నామమాత్రంగా కనిపిస్తున్నాయి. మలేరియా కారక దోమల నివారణ మందు ఈ ఏడాది 2505 గ్రామాల్లో పిచికారీ చేయాలని ఆశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం 299 గ్రామాల్లోనే పిచికారీ పూర్తి చేశారు. అధికారుల పోకడకు ఇది అద్దం పడుతోంది. జిల్లాలో వ్యాపిస్తున్న వ్యాధుల్లో మొదటి స్థానం మలేరియాదే. 2013లో జిల్లాలో ఈ కేసులు 5950 నమోదయ్యాయి. 2014కి ఆ సంఖ్య 8410కి చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ (జూన్ నెలాఖరు నాటికి)4901 మంది మలేరియా బారిన పడ్డారు. వీటిలో ఏజెన్సీలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అక్కడ 2013లో 2414 మందికి, 2014లో 5250 మందికి, ఈ ఏడాది 3948 మందికి మలేరియా సోకింది. రూరల్ ఏరియాలో 366, అర్బన్ ఏరియాలో 587 మలేరియా కేసులు నమోదయినట్లు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. తర్వాత స్థానంలో టైఫాయిడ్ ఉంది. ఈ ఏడాది దాదాపు 4వేల మందికి ఈ వ్యాధి సోకింది. ఇప్పటివరకూ జిల్లాలో 256 మందికి రక్త నమూనాలు సేకరించి పరీక్షించగా వారిలో 36 మందికి డెంగ్యూ ఉన్నట్లు తేలింది. 147 రక్త నమూనాల పరీక్షల్లో 11 మందికి చికెన్‌గున్యా కనిపించిం ది. ఫైలేరియా ప్రమాదకర స్థాయిలో లేనప్పటికీ గతేడాది 7 కేసులు, ఈ ఏడాది 2 కేసులు వెలుగుచూశాయి. రోగాలు ఇంత దారుణంగా వ్యాపిస్తున్నటికీ వైద్య, ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని హ్యూమన్‌రైట్స్ ఫోరం పరిశోధనలో వెలుగుచూసింది. ఇటీవల ఫోరం సభ్యులు ఏజెన్సీలోని 9 మండలాల్లో పర్యటించినప్పుడు దారుణమైన వాస్తవాలు వెలుగుచూశాయి. ఉత్తరాంధ్రలో 1999లో 4500 మంది గిరిజనులు మలేరియాతో చనిపోయారు. 2005, 2010 మధ్య వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కలుషిత తాగునీరు, వైద్య సదుపాయాలు లేకపోవడం, పోషకాహార లోపంతో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం, దోమల నుంచి రక్షణ లేకపోవడం, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నారని పలు అధ్యయనాలు నిరూపించాయి. ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయినా అధికారులు, పాలకులు కళ్లు తెరవడం లేదు. -
అబ్బా..ఇది ఏమి దోమ
* దోమల నివారణకు ‘పశ్చిమ’ వాసుల నెల ఖర్చు రూ.10 కోట్లు * వైద్య ఖర్చులు దీనికి 10 రెట్లు అధికం * అయినా జనం రక్తాన్ని పీల్చేస్తున్న మశకాలు తాడేపల్లిగూడెం : ఎండా.. వాన.. చలి.. రాత్రి.. పగలు అనే తేడా లేకుండా దోమలు జనాన్ని కుట్టి కుట్టి ఆసుపత్రుల పాలు చేస్తున్నాయి. వీటి తీవ్రత ఎంతగా ఉందంటే.. పగటిపూట కూడా మస్కిటో రిపెల్లెంట్స్, మేట్స్, కాయిల్స్ ఉపయోగించాల్సిన స్థాయిలో మశకాలు విజృం భిస్తున్నాయి. ఈ సమస్య దోమలగూడెంగా ప్రసిద్ధికెక్కిన తాడేపల్లిగూడెం పట్టణానికి మాత్రమే పరిమితం కాలేదు. ఏలూరు నగరం, భీమవరం, నరసాపురం, పాల కొల్లు, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం పట్టణాలతోపాటు ప్రతి గ్రామంలోనూ ప్రజలను వేధిస్తున్నాయి. వీటివల్ల వైరల్, టైఫాయిడ్ జ్వరాలు సోకుతున్నాయి. సకాలంలో వైద్యం చేయించుకోకపోతే కిడ్నీలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితి సంభవిస్తోంది. ప్రతి కుటుంబంలోనూ ఒక్కరైనా జ్వరం బారిన పడుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అవగతం చేసుకోవచ్చు. రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోయి జ్వర పీడితులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయి. వేరే వ్యక్తుల నుంచి ప్లేట్లెట్స్ దానంగా తీసుకుని.. వైద్య ఖర్చుల కోసం వేలాది రూపాయలు వెచ్చించి ప్రాణాలు నిలబెట్టుకుంటున్న వారెందరో ఉన్నారు. నెల బడ్జెట్ రూ.10 కోట్లు జిల్లా జనాభా 39 లక్షల 34 వేల 782. కుటుంబాల పరంగా చూస్తే జిల్లాలో మొత్తం 10 లక్షల 91 వేల 525 కుటుంబాలున్నాయి. జిల్లాలోని ప్రతి కుటుం బం దోమల నివారణకు మస్కిటో రిపెల్లెంట్, మేట్స్, కాయిల్స్‌లో ఏదో ఒకటి విధిగా వాడుతోంది. అధిక శాతం కుటుం బాల్లో గదికి ఒకటి చొప్పున వీటిని వాడుతున్నారు. కొందరైతే పగలు, రాత్రి కూడా వీటిని వెలిగిస్తున్నారు. ప్రతి కుటుంబం రోజుకు ఒక రిపెల్లెంట్ లేదా ఒక కాయిల్ చొప్పున మాత్రమే వాడుతున్నట్టు భావిస్తే నెలకు రూ.90 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. రిపెల్లెంట్ (లిక్విడ్) వాడకానికి అయితే రూ.70 నుంచి రూ.120 వరకూ ఖర్చవుతోంది. ఎవరు ఏది వాడుతున్నా నెలకు సగటు ఖర్చు రూ.90 చొప్పున లెక్కిస్తే.. మొత్తం కుటుంబాలు దోమల నివారణకు నెలకు రూ.9,85,97,250 ఖర్చు చేస్తున్నాయి. వాస్తవ పరిస్థితుల ఆధారంగా చూస్తే ఈ ఖర్చు ఇంతకంటే ఎక్కువే. కుదేలవుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు దోమల ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నారుు. దోమల వల్ల అనారోగ్యానికి గురవుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు మంచాన పడటంతో పనులకు వెళ్లలేకపోతున్నారు. దీనివల్ల పూట గడవటం కష్టంగా మారుతోంది. మరోవైపు వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలవుతున్నారు. దీని ప్రభావం పైకి సాదాసీదా విషయంగానే కనిపిస్తున్నప్పటికీ.. ఎన్నో కుటుం బాల జీవన పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఎన్నో కుటుం బాలను కుదేలు చేస్తున్నాయి. దిగజారిన పారిశుధ్యం పారిశుధ్య నిర్వహణకు నిధులు లేవంటూ మునిసిపాలిటీలు చేతులెత్తేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఖాళీ జాగాలు, వాటినిండా పిచ్చి మొక్కలు, మురికి గుంటలు దర్శనమిస్తున్నాయి. అవన్నీ దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. మురుగు కాలువల్లో దోమల లార్వాను నివారించే బెటైక్స్ వంటి మందులను మునిసిపాలిటీలు పిచికారీ చేయడం లేదు. దోమల నివారణకు ఫాగింగ్ చేయడం లేదు. ఫలితంగా దోమలు కుప్పలు తెప్పలుగా పెరుగుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో.. మరీ ముఖ్యంగా మునిసిపల్ కార్యాలయూల్లో సైతం పగటి పూట దోమల నివారణకు రిపెల్లెంట్స్, మేట్స్ వంటివి వాడుతున్నారు. మునిసిపాలిటీలు ఏం చేయూలి పారిశుధ్య పరిరక్షణకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నట్టు మునిసిపాలిటీలు గణాంకాల్లో పేర్కొంటున్నప్పటికీ.. దోమల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. దోమలను గుడ్డు దశ నుంచి లార్వా.. ఆ తరువాత దశల్లో నివారించేందుకు ప్రతి నిత్యం చర్యలు చేపట్టాల్సి ఉంది. డ్రెయిన్లలో గుడ్లు, లార్వాలు దోమలుగా వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలి. వీటిని వేయడం వల్ల నీటిపై ఆయిల్ తెట్టు కడుతుంది. తద్వారా లార్వా ఊపిరి అందక చనిపోతుంది. గుడ్లు లార్వాలుగా అభివృద్ధి చెందవు. గంబూషియా చేపలను తరచూ మురుగు కాలువలలో వదలాలి. ఇవి దోమల లార్వాలను తినేస్తుంటాయి. ఈ పనులు చాలాచోట్ల ప్రహసనంలా మారడంతో దోమల నివారణ ఎండమావిలా మారిందనే విమర్శలు ఉన్నాయి. -
కల్తీ నూనె అని తెలిసినా..
* ‘డెంగీ’ దోమల నివారణకు ఉపయోగించే నూనెలో నాణ్యత డొల్ల * ఇప్పటికే రూ.26 కోట్లు చెల్లించిన బీఎంసీ * పనిచేయడం లేదని తెలిసినా వాడుతున్న వైనం * బీఎంసీ తీరుపై విమర్శల వెల్లువ సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) దోమల నివారణకు ఉపయోగించే నూనెలో నాణ్యత లోపించిందని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో దోమల నివారణ జరగక రోజురోజుకు నగరంలో డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల నివారణకు కెమికల్స్‌ను సరఫరా చేస్తున్న సదరు కంపెనీపై గత ఏడాది కూడా తక్కువ నాణ్యత కెమికల్స్‌ను సరఫరా చేసినందుకు గాను జరిమానా విధించారు. అయినా కార్పొరేషన్‌కు ఆ కంపెనీ ఇప్పటికీ అదే నూనెను సరఫరా చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2013 మార్చిలో కార్పొరేషన్ 2.57 లక్షల లీటర్ల ఆయిల్‌ను సరఫరా చేసేందుకు ‘యూనివర్సల్ ఆర్గానిక్స్’ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది. రెండేళ్లకు గాను రూ.26 కోట్లను చెల్లించింది. కాగా ఈ కంపెనీ సరఫరా చేస్తున్న ఆయిల్లో కల్తీ ఉందని తేలడంతో సదరు కంపెనీకి అదే ఏడాది జూన్‌లో కార్పొరేషన్ జరిమానా విధించింది. రూ.65 లక్షల జరిమానాను డిపాజిట్ చేయాలని కార్పోరేషన్ సదరు కంపెనీని ఆదేశించింది. అయితే, ఇప్పటికీ అదే కంపెనీ సరఫరా చేస్తున్న ఆయిల్‌నే ఉపయోగించడం గమనార్హం. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేత మనోజ్ కోటక్ మాట్లాడుతూ.. గతంలో కల్తీ మందును సరఫరా చేయడంతో 2011లో పుణే మున్సిపల్ కార్పొరేషన్, సూరత్ ఈ కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించాయన్నారు. ఈ కంపెనీకి శక్తి వంతమైన మందును సరఫరా చేసే సామర్ధ్యం లేదని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా తేల్చి చెప్పిందన్నారు. నగరంలో రోజురోజు డెంగీ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతూఉంటే మరో పక్క బీఎంసీ దోమల నివారణకు కల్తీ ఆయిల్‌తో కూడిన పొగను విడుదల చేసేందుకు విస్తృతంగా డ్రైవ్‌ను ప్రారంభించిందని మనోజ్ కోటక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఎంసీ నిర్లక్ష్యం వల్లే దోమల వృద్ది జరిగి నగరంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆయిల్ అంత ప్రభావం చూపదని తెలిసినా ఇంకా దానిపై ప్రజాధనాన్ని వెచ్చించడంపై ఆయన ఆవేదన వ్యక్తం తెలిపారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని, నూనె నమూనాను పరీక్షలకు పంపించాలని డిమాండ్ చేశారు. అలాగే, కల్తీ నూనె వాడకానికి బాధ్యులైన వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ట్రెక్కింగ్‌కి ఈ వస్తువులు తప్పనిసరి...
వర్షాకాలం టూల్ టార్చ్: వర్షాకాలం ప్రయాణాలు పెట్టుకున్నవారికి ముఖ్యంగా ట్రెక్కర్స్‌కి టూల్ టార్చ్ చాలా అవసరం. టార్చ్‌లైట్, కత్తి, పట్టకార, ప్లైర్, కంపాస్ రోల్డ్... ఇవన్నీ ఒకే దాంట్లో కలిపి ఉంటే వెంట తీసుకెళ్లడం చాలా సులువు. హిట్‌ప్లే.ఇన్‌లో ఇది రూ.1,499కే లభిస్తుంది. దోమల నివారణ బ్యాండ్ ప్రయాణంలో ఎక్కడికెళ్లినా రాత్రిపూట దోమల బెడద తప్పదు. ఆరుబయట ఉన్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువ. అందులోనూ దోమలు ఎక్కువగా పిల్లలను టార్గెట్ చేస్తుంటాయి. దోమల నివారణ బ్యాండ్ (మస్కిటో రిపెల్లింగ్ బ్యాండ్) పిల్లల చేతికి తొడిగితే మీ ఆందోళన తీరుతుంది. ఇవి పిల్లలను ఆకట్టుకునే లిజార్డ్, కప్ప, బ్యాట్, సాలీడు.. వంటి రకరకాల మోడల్స్‌లో లభిస్తున్నాయి. రెండు బ్యాండ్స్ రూ.399కి లభిస్తున్నాయి. ఇవి నగరాలలోని పిల్లల వస్తువుల షాపుల్లోనూ, మెడికల్ స్టోర్లలోనూ లభిస్తాయి. పాదాలకు రక్ష... కాస్త రఫ్‌గా, ఇంకాస్త లైట్ వెయిట్‌గా, పాదాలకు సౌకర్యంగా, ఫ్యాన్సీ కలర్లలో లభించే షూని మగువ లు చాలా ఇష్టపడతారు. ట్రెక్కింగ్‌లో ఇలాంటి షూ కోసం వెదికేవారికి ఉడ్‌లాండ్ షాపులలో రూ.3,591 లకు లభిస్తున్నాయి. వీటిని స్నీకర్స్ అని అడిగి తీసుకోవాలి. బురదలోనూ, రాళ్లలోనూ పాదాలకు సౌకర్యంగా ఉండే ఈ షూలు మగవారికి సుఖంగా ఉంటాయి. వానాకాలపు ట్రెక్కింగ్‌లో రఫ్ అండ్ టఫ్ అనిపించే ఈ షూ ధర రూ.12,990. టింబర్లాండ్ ఔట్లెట్లలో లభిస్తున్నాయి. డ్రై బ్యాగ్... ప్రయాణానికి వెళ్లేటప్పుడు శుభ్రంగా సర్దుకున్న బ్యాగ్, మధ్యలోనే చిందరవందరగా మారిపోతుంది. విడిచిన దుస్తులు, వేసుకోవాల్సినవి అన్నీ ఒకే చోట పెడితే కొత్త ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి సమస్య లేకుండా ఈ డ్రై బ్యాగ్ ఉపయోగపడుతుంది. ఈ బ్యాగ్ 30 కేజీల బరువును ఆపగలుగుతుంది. పైగా వాటర్‌ప్రూఫ్ కూడా. హిట్‌ప్లే.ఇన్ లో లభించే ఈ బ్యాగ్ధర రూ.1,249. ఫోన్ సురక్షితం.. పర్వతారోహణలో ఫోన్లో జీపీఎస్ సిస్టమ్ ఆన్‌లో ఉంటే ఎంతో ఉపయుక్తం. కానీ, జిపిఎస్ సిస్టమ్ డెరైక్షన్స్ను ఫోన్లో అనుసరించడం వల్ల వర్షం పడుతున్నప్పుడు చూడటం కష్టం అవుతుంది. వర్షపునీటికి ఫోన్ పాడవుతుందనే భయం కూడా ఉంటుంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండటానికి ఈ వెదర్ ప్రూఫ్ ఫోన్ కేస్ సహాయపడుతుంది. హిట్‌ప్లే.ఇన్‌లో దీని ధర రూ.4,199. విశ్రాంతికి టెంట్... సాహస యాత్రికులకు ఈ టెంట్ ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. నీటిని, గాలిని తట్టుకునే సామర్థ్యం గల ఈ టెంట్ దారి మధ్యలో మీరెక్కడైనా రెస్ట్ తీసుకోవడానికి ఎంతో ఉపయోగకరం. ఈ టెంట్‌కి స్లీపింగ్ బ్యాగ్స్, బ్యాక్‌ప్యాక్స్ కూడా ఉన్నాయి. నైలాన్ ఫ్లోర్ ఉండటం వల్ల తడి నేలలోనూ అనువుగా ఉంటుంది. ఉడ్‌లాండ్ షాపులలో దీని ధర రూ.10 వేలు. -
నెత్తురు పీల్చేస్తా..!
విజయనగరం మున్సిపాల్టీ, న్యూస్‌లైన్: ‘దీని దుంపతెగ కుట్టికుట్టి సంపేత్తంది. రక్తం పీల్చేత్తంది. రాత్రంతా నిద్ర పట్టి చావదు’. విజయనగరం, పార్వతీపురం పట్టణాల ప్రజల అవస్థలు ఇవి. దోమల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో ఆయా పట్టణాల ప్రజలు ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను నష్టపోతున్నారు. పట్టణాల్లో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు సరిపడినన్ని వాహనాలు లేకపోవడం.. సిబ్బంది కొరత..వెరసి ఆ పట్టణాలు దోమల సంతాన వృద్ధి కేంద్రాలుగా మారిపోయాయి. దోమలు వృద్ధి చెందకుండా ప్రతి ఏడాదీ పట్టణాల్లో మలాథియన్ పిచికారీ చేసేవారు. అలాగే ఫాగింగ్ యంత్రం ద్వారా దోమలను నియంత్రించే చర్యలు చేపట్టేవారు. గత ఎనిమిది నెలలుగా ఫాగింగ్, మలాథియన్ పిచికారీ చేయకపోవడంతో దోమలు బాగా పెరిగిపోయాయి. విజయనగరం పట్టణంలో సుమారు 50వేల కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో ఇంట్లో ప్రతిరోజూ రాత్రి కనీసం ఒక మస్కిటో కాయిల్ ఉపయోగిస్తారు. ఈ కాయిల్ ధర రూ.2 ఉంటుంది. దోమలు కుట్టకుండా ఉండేందుకు ప్రజలు రోజుకు రూ.2 చొప్పున ఖర్చుచేస్తే నెలకు రూ.60 అవుతుంది. యాభై వేల కుటుంబాలకు నెలకు రూ.30లక్షలు ఖర్చు కాగా, సంవత్సరానికి సుమారు రూ.3,60,00,00 ఖర్చవుతుం ది. పట్టణ ప్రజలకు తెలియకుండానే అక్షలారా రూ.3 కో ట్లకు పైగా ఖర్చవుతోంది.పార్వతీపురం మున్సిపాల్టీలో సుమారు 11,400 ఇళ్లు ఉన్నాయి. పట్టణంలో ప్రజలకు రోజుకు రూ.2చొప్పున సంవత్సరానికి కాయిల్‌కు రూ.82,08,000 ఖర్చవుతోంది. బొబ్బిలి, సాలూరులలో ఫాగింగ్, మలాథియన్ కాలువలో జల్లుతున్నారు. ఫాగింగ్ యంత్రంతో నిర్మూలించరా.. విజయనగరం పట్టణంలో సుమారు రెండున్నర లక్షల మంది జనాభా, విలీన గ్రామాలను కలుపుకొని 40 వార్డులుగా విభజించారు. పట్టణంలో ఒక ఫాగింగ్ యంత్రం ఉంది. ఆ యం త్రం ద్వారా ఒక రోజులో రెండుమూడు వార్డులను మాత్రమే కవర్ చేస్తారు. ఫాగింగ్ యంత్రానికి రోజుకు రూ. పదివేల వరకు ఖర్చుఅవుతుంది. రోజుకు రూ.పదివేలు ఖర్చయిపోతోందని, ప్రజలెలా పోతే మనకేమిలే అని మున్సిపల్ అధికారులు ఫాగింగ్ చేయడం మానేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పురాతన కాలంనాటి కాలువలు.. విజయనగరం పట్టణంలోని కాలువలు పురాతన కాలంనాటివి కావడంతో ఎప్పుడూ చెత్తచెదారాలతోనే నిండి ఉంటున్నాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమలను నిర్మూలించడానికి మలాథియన్‌ను కాలువల్లో జల్లాలి. దీన్ని కూడా చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువల్లో ఉన్న చెత్తను తీయడానికి తగినంత సిబ్బంది లేకపోవడం కూడా దోమలు వృద్ధి చెందడానికి కారణంగా చెప్పవచ్చు. పెద్దచెరువు.. పెద్దచెరువులోకి పట్టణంలోని మురుగునీరంతా చేరుతుంది. మురుగు నీరు చేరడం వల్ల దోమలు వృద్ధి చెందుతున్నాయి. 2011లో అప్పటి కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య పెద్దచెరువులో మలాథియన్ జల్లించి దోమలు వృద్ధి చెందకుండా చూశారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులు ఆ పనిచేయడం మరిచిపోయారు. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. చర్యలు తీసుకుంటున్నాం.. పట్టణంలో దోమలను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఫాగింగ్ చేయడం వల్ల ప్రజలకు కేన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని కాలుష్య నియంత్రణ మం డలి అధికారులు చెప్పారు. దీంతో ఫాగింగ్ చేయడం నిలిపివేశాం. - ఎస్.గోవిందస్వామి, మున్సిపల్ కమిషనర్, విజయనగరం