Most Wanted List
-
ఆస్పత్రిలో దావూద్!
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో అతన్ని రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌లోని కరాచీలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఒక ఫ్లోర్ మొత్తాన్నీ ఖాళీ చేయించి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఆస్పత్రి వర్గాలు, కుటుంబీకులకు తప్ప మరెవరికీ ప్రవేశం లేకుండా పోలీసులు భారీ సంఖ్యలో పహారా కాస్తున్నారట. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు ఈ మేరకు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. అంతేగాక 67 ఏళ్ల దావూద్‌కు విషప్రయోగం జరిగిందని, అందుకే ఉన్నపళాన ఆస్పత్రికి తరలించారని సోమవారమంతా జోరుగా పుకార్లు షికారు చేశాయి. చికిత్స పొందుతూ ఆదివారమే అతను మరణించినట్టు కూడా వార్తలొచ్చాయి! అయితే దావూద్‌పై విషప్రయోగం, అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం మాత్రం నిజమేనని నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దావూద్ చాలా ఏళ్లుగా కుటుంబంతో పాటుగా పాకిస్తాన్‌లోనే నివసిస్తున్నట్టు ఇప్పటికే తేలింది. అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్ వెల్లడించింది కూడా. భారత్‌తో పాటు ఐరాస భద్రతా మండలి కూడా 2003లోనే దావూద్‌ను మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం తెలిసిందే. అతని తలపై ఏకంగా 2.5 కోట్ల డాలర్ల రివార్డు ఉంది! రోజంతా కలకలం దావూద్‌పై విషప్రయోగం, మృతి వార్తలు సోమవారం ఉదయం నుంచే కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ యూట్యూబర్ వీటిని తొలుత బయట పెట్టాడు. పలు సోషల్ మీడియా వార్తలను ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రసారం చేసి దుమారం రేపాడు. ఆది, సోమవారాల్లో పాకిస్థాన్ అంతటా గంటల తరబడి ఇంటర్నెట్ మూగబోవడానికి, దావూద్ మృతికి లింకుందని చెప్పుకొచ్చాడు. ‘‘దేశంలో ఏదో పెద్ద ఉదంతమే జరిగింది. దాన్ని దాచేందుకే నెట్‌పై ఆంక్షలు విధించారు’’ అంటూ ప్రముఖ పాక్ జర్నలిస్టులు ఎక్స్ పోస్టుల్లో అనుమానాలు వెలిబుచ్చడంతో మరింత అలజడి రేగింది. దావూద్ విషమ పరిస్థితుల్లో కరాచీ ఆస్పత్రిలో చేరినట్టు పాక్ జర్నలిస్టు అర్జూ కాజ్మీ ఎక్స్ పోస్టులో నిర్ధారించారు. తొలిసారేమీ కాదు... దావూద్‌పై విషప్రయోగం జరిగిందని, అతను మరణించాడని వార్తలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఏటా కనీసం ఒకట్రెండుసార్లు ఇలాంటి వార్తలు రావడం, అవన్నీ పుకార్లేనని తేలడం పరిపాటిగా మారింది. కరాచీలోనే దావూద్: అల్లుడు పాక్ ఖండిస్తున్నా, దావూద్ కరాచీలో ఉండటం వాస్తవమేనని అతని అల్లుడు అలీ షా పార్కర్ గత జనవరిలో ధ్రువీకరించాడు. కరాచీలోని అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనక రహీం ఫకీ సమీపంలోని డిఫెన్స్ ఏరియాలో దుర్భేద్యమైన ఇంట్లో కొన్నేళ్లుగా దావూద్ నివాసముంటున్నట్టు తెలిపాడు. దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ కొడుకైన అలీ షా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు ఇచి్చన స్టేట్మెంట్లో ఇంకా పలు విషయాలు వెల్లడించాడు. ‘‘దావూద్ ఓ పాక్ పఠాన్ స్త్రీని రెండో పెళ్లి చేసుకున్నాడు. దావూద్‌కు ముగ్గురు సోదరులు, నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నారు. ఒక కూతురును పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారునికిచ్చి పెళ్లి చేశాడు’’ అని అలీ షా తెలిపాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యూపీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాపియా, క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే యూపీ పోలీసులు తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల జాబితాలో ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు చెందినవారు. హత్య, బెదిరింపులు, భూ కబ్జాలు వంటి తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉన్నారు. ఈ లిస్టులో టాప్‌లో ఉన్న వారిలో డాన్ నుంచి పొలిటీషియన్‌గా మారిన ముఖ్తర్ అన్సారీ, విజయ్ మిశ్రా, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే హాజి యాకూబ్ ఖురేషి, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ హాజి ఇక్బాల్, మాజీ ఎమ్మెల్సీ బ్రిజేష్ సింగ్, ఎస్పీ మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ ద్వివేది, సుధీర్ సింగ్, దిలీప్ విశ్రా ఉన్నారు. కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా నేర చరిత్ర ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నట్లు లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న 66 మంది నేరగాళ్లపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. వీరిపై ఉన్న కేసులు త్వరగా విచారణ పూర్తయ్యేలా చూసి కోర్టులో శిక్ష పడేలా చేస్తామన్నారు. ఈ 66 మందిలో అతీక్ అహ్మద్, అదిత్య రాణా ఇప్పటికే చనిపోయారని, 27 మంది జైలులో ఉన్నారని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఐదుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. కొందరిపై రూ.లక్షకుపైగా రివార్డు కూడా ఉన్నట్లు వివరించారు. చదవండి: మోదీ ఇంటి పేరు వివాదం.. రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట.. -
9/11 మాస్టర్ మైండ్ జవహరీ హతం.. 15 ఏళ్లకే జవహరీ ఉగ్రబాట
వాషింగ్టన్: అల్–జవహరీ ఈజిప్టు రాజధాని ౖకైరోలో 1951లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే ‘జమాత్ అల్–జిహాద్’ పేరిట సొంతంగా ఒక సంస్థను స్థాపించాడు. విరోధులను అంతం చేయడమే దీని లక్ష్యం. ఇది ఈజిప్టులో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థగా రూపాంతరం చెందింది. 1981 అక్టోబర్ 6న ఉగ్రవాద దాడుల్లో ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ బలయ్యారు. ఈ దాడుల్లో ‘జమాత్ అల్–జిహాద్’ హస్తం ఉన్నట్లు తేలింది. జవహరీ వైద్య విద్య అభ్యసించాడు. కొన్నాళ్లు సర్జన్‌గా పనిచేశాడు. జీవ ఆయుధాలను అభివృద్ధి చేయడానికి ఒక ల్యాబ్‌ను నడిపించాడు. గతంలో ఓ కేసు విచారణలో భాగంగా జవహరీ కోర్టుకు హాజరయ్యాడు. ‘‘మేము త్యాగాలు చేశాం. ఇస్లాం విజయం సాధించేవరకూ ఎన్ని త్యాగాలు చేయడానిౖకైనా సిద్ధంగా ఉన్నాం’’ అంటూ కోర్టు గదిలో గట్టిగా అరిచాడు. లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు గాను జవహరీకి మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలయ్యాక దక్షిణాసియాకు చేరుకున్నాడు. ఒసామా బిన్ లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించాడు. 1988లో ఒసామా బిన్ లాడెన్ అల్‌ఖైదాను స్థాపించాక అందులో చేరాడు. చురుగ్గా కార్యకలాపాలు సాగించాడు. 1990 తర్వాత తన ‘జమాత్ అల్–జిహాద్’ సంస్థను అల్‌ఖైదాలో విలీనం చేశాడు. అతి తక్కువ కాలంలోనే లాడెన్‌కు నమ్మిన బంటుగా మారాడు. 1990వ దశకంలో పశ్చిమ దేశాల నిఘా సంస్థలు తొలిసారిగా జవహరీపై దృష్టి పెట్టాయి. అల్‌ఖైదా ముఠాలో అతడి ప్రతిష్ట విపరీతంగా పెరిగిపోయింది. అల్‌ఖైదా నిర్వహించే విలేకరుల సమావేశాల్లో లాడెన్ పక్కనే జవహరీ తప్పనిసరిగా కనిపించేవాడు. 1997లో అఫ్గానిస్తాన్‌లో ఉన్నప్పుడు ఈజిప్టు పర్యాటకులను చంపేందుకు ప్లాన్ చేశాడు. 1998లో లాడెన్ అల్‌ఖైదా ఉప నాయకుడిగా జవహరీ పేరును ప్రకటించాడు. అంటే ఉగ్రముఠాలో లాడెన్ తర్వాతి స్థానం జవహరీదే కావడం గమనార్హం. అణ్వాయుధాలు సంపాదించుకోవాలన్న అల్‌ఖైదా ఆశయం వెనుక జవహరీ ప్రోత్సాహం ఉంది. ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో.. ఆత్మాహుతి దాడులకు వ్యూహాలు రచించడంలో జవహరీ దిట్ట. నిధులు సేకరించడంలోనూ నేర్పరి. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నిఘా దర్యాప్తు సంస్థ ‘ఎఫ్‌బీఐ’ అల్–జవహరీని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. పదేళ్ల క్రితం అమెరికా నేవీ సీల్స్ దాడుల్లో లాడెన్ హతమయ్యాక జవహరీ అల్‌ఖైదా పగ్గాలు తన చేతుల్లోకి తీసుకున్నాడు. చెల్లాచెదురైన అల్‌ఖైదాను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాడు. ఇస్లామిక్ దేశాల్లో ఉన్న అల్‌ఖైదా సభ్యులకు సుప్రీంలీడర్‌గా దిశానిర్దేశం చేశాడు. అఫ్గాన్‌పై అమెరికా సేనలు పట్టు బిగించడంతో జవహరీ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. వేర్వేరు దేశాల్లో తలదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. జవహరీ చనిపోయాడన్న వాదనలు సైతం వినిపించాయి. కానీ, అమెరికా నిఘా సంస్థలు నమ్మలేదు. ఓపికగా వేట కొనసాగించాయి. చివరకు అఫ్గానిస్తాన్‌లోనే అంతం చేశాయి. అమెరికన్లను హతమార్చడమే లక్ష్యం 1998 ఆగస్టు ఏడో తేదీన టాంజానియా, కెన్యాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడులు జరిగాయి. జవహరీ నేతృత్వంలోనే ఈ దాడులకు వ్యూహాలు రూపొందించారు. అప్పుడు అతడి వయసు 47 సంవత్సరాలు. ఇక అగ్రరాజ్యం అమెరికాను వణికించిన ‘2001 సెప్టెంబర్ 11’ దాడుల వెనుక లాడెన్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు. ‘‘అమెరికన్లను, వారి మిత్రులను అంతం చేయడమే ప్రతి ముస్లిం వ్యక్తిగత విధి. అమెరికన్లు ప్రపంచంలో ఎక్కడున్నా సరే హతమార్చాలి’’ అని 1998లో తన మేనిఫెస్టోలో జవహరీ స్పష్టంగా రాసుకున్నాడు. ‘సెప్టెంబర్ 11’ దాడుల తర్వాత అమెరికాలో మరిన్ని దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించాడు. అఫ్గానిస్తాన్‌లో జీవ ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాడు. కానీ, అఫ్గాన్‌పై అమెరికా దండెత్తడంతో అతడి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారసుడు ఆదెల్? జవహరీ మరణంతో అల్ ఖైదా నాయకునిగా ఈజిప్టు మాజీ సైనికాధికారి మహ్మద్ సలాహ్ అల్ దిన్ జైదన్ అలియాస్ సైఫ్ అల్ ఆదెల్ (60) పేరు గట్టిగా వినవస్తోంది. అల్ ఖైదా అగ్ర నేతల్లో పిన్న వయస్కుడితడే. ఎవరీ ఆదెల్? ఈజిప్టుకు చెందిన ఆదెల్ మాజీ కల్నల్. అల్‌ఖైదా వ్యవస్థాపక సభ్యుడు. అమెరికా, బ్రిటిష్ సైనికులనెందరినో చంపాడు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర రిక్రూట్మెంట్లు, నిధుల కోసం 1980ల్లో ఒసామా బిన్ లాడెన్ నెలకొల్పిన మక్తాబ్ అల్ ఖిద్మత్ (ఎంఏకే)తో కూడా అనుబంధముంది. లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గానూ వ్యవహరించాడు. అప్పుడే జవహరీతోనూ పరిచయమేర్పడింది. 1993లో సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు 19 మంది అమెరికా సైనికులను చంపి మృతదేహాలను వీధుల గుండా ఈడ్చుకెళ్లారు. ఈ దాడి ఆదెల్ కనుసన్నల్లోనే జరిగింది. కెన్యా, టాంజానియాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై 1998లో జరిగిన దాడులు, పెంటగాన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై జరిగిన దాడులతోనూ ఇతడికి సంబంధముంది. దీంతో అమెరికా ఆదెల్ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చి అతడి తలపై కోటి డాలర్ల నజరానా ప్రకటించింది. లాడెన్ మరణం తర్వాత కీలక వ్యూహకర్తగా ఎదిగాడు. 20 ఏళ్లుగా ఇరాన్‌లోనే ఉన్నట్టు అనుమానం. సిరియాలోని ఉగ్ర ముఠాలకు టెలిగ్రాం ద్వారా సూచనలిస్తాడని చెబుతారు. లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్‌ను కూడా 2019లో అమెరికా సైన్యం మట్టుబెట్టింది. అల్‌ఖైదా పగ్గాలు ఇతని చేతుల్లోకే వెళ్తాయని మిడిల్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ అంటోంది. -
‘ఆమె’ కోసం దేశవ్యాప్తంగా గాలింపు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంలో సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసుగా విధులు.. మావోయిస్ట్ ప్రభావితం ప్రాంతం మిడ్నాపూర్‌లో కూడా కీలక పోలీసాఫీసర్. కానీ ప్రస్తుతం ఆమె మోస్ట్ వాంటెడ్ . దీంతో సీఐడీ ఆమె కోసం దేశమంతా జల్లెడ వేసి మరీ వెతుకుతోంది. కానీ ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. ఆమెనే భారతీ ఘోష్. లెక్కల్లో చూపని ఆస్తుల కేసులో భారతీ ఘోష్ బుక్కయ్యారు. దీంతో అప్పటి నుంచి భారతీ ఘోష్, ఆమె భర్త ఎంఏవీ రాజు, వ్యక్తిగత గార్డుగా ఉన్న కానిస్టేబుల్ తో సహా ఆదృశ్యమైపోయారు. ఘోష్ కేవలం ఆడియో మెసేజ్‌ల ద్వారా మీడియాను కాంటాక్ట్ అవుతున్నారు. కానీ ఆ మెసేజ్‌లు ఎక్కడి నుంచి పంపుతున్న ప్రాంతాన్ని మాత్రం పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఈ మాజీ పోలీస్ ఆఫీసర్ విషయంలో తృణమూల్ కాంగ్రెస్ నిర్లక్ష్యం వహించవద్దంటూ.. సీబీఐ విచారణ జరుపాలంటూ విపక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌లు పట్టుబడుతున్నాయి. డీమానిటైజేషన్ అనంతరం జరిపిన దాడుల్లో భారీ మొత్తంలో బంగారు లావాదేవీలపై సమాచారంతో పాటు, సీనియర్ మావోయిస్ట్ నేత కిషన్‌జీ అలియాస్ కోటేశ్వరరావు మరణానికి సంబంధించి కీలక సమాచారం కూడా ఆమె వద్ద ఉన్నాయి. అంతేకాక ఘోస్ తన వద్ద ఉన్న కోట్ల రూపాయల నగదును కూడా లెక్కలో చూపలేదని, వాటిని సీజ్ చేసినట్టు సీఐడీ డీఐజీ(ఆపరేషన్స్) నిషాత్ పర్వేజ్ తెలిపారు. పశ్చిమ మిడ్నాపూర్‌కు చెందిన ఘటల్ సబ్ డివిజనల్ కోర్టులో ఫిబ్రవరి 1న చందన్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు భారతీ ఘోష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ పోలీసాఫీసర్‌కు వ్యతిరేకంగా చీటింగ్ కేసు నమోదు అయింది. రద్దయిన నోట్ల ద్వారా మొత్తం 375 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసాఫీసర్‌కి విక్రయించినట్లు చందన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే వాటికి సంబంధించిన నగదు చెల్లించలేదని తన ఫిర్యాదులో తెలిపాడు. దీంతో గత నెల 7న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఉత్తర 24 పర్గనాస్ నివాస్ యునల్ అలీ మండల్ అనే వ్యక్తి కూడా ఘటల్ కోర్టులో ఘోష్‌కు వ్యతిరేంగా ఫిర్యాదు చేశాడు. ఈ రెండు ఫిర్యాదుల అనంతరం భారతీ ఘోష్‌కు చెందిన నివాసాలపై పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో సీఐడీ తనిఖీలు చేపట్టింది. రూ.300 కోట్ల విలువైన 50 ఒరిజినల్ ల్యాండ్ సేల్ డీడ్స్, టాబ్లెట్లు, పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు, గోల్డ్ జువెల్లరీ, దిగుమతి చేసుకున్న 57 విస్కీ బాటిళ్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘోష్ లాకర్స్‌లో 1.1 కేజీల గోల్డ్, 2 కోట్ల నగదు, కోల్‌కత్తాకు దగ్గర్లో మదుర్దహలో రూ.2.4 కోట్ల ఫ్లాట్‌ను సీజ్ చేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు పోలీసులు కూడా అరెస్ట్ అయ్యారు. వీరిలో ఘటల్‌కు చెందిన సబ్ ఇన్పెక్టర్ రాథ్, అసిస్టెంట్ ఎస్ఐ దాస్, ఇద్దరు పోలీసు అధికారులు, ఘటల్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ చిత్త పాల్లు ఉన్నారు. అయితే ఘోష్ తరఫు న్యాయవాది పినాకి భట్టాచర్య మాత్రం సీఐడీపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఘోష్ 1994 నుంచి 2017 వరకూ అన్ని రకాల ఫ్లాట్స్‌ను, లాకర్ గోల్డ్‌ను లెక్కల్లో చూపారని, ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. కోర్టులో సీఐడీ కేసు గెలవదని తేల్చి చెబుతున్నారు. ఘోష్ కొనుగోలు చేసిన భూమి అంతా.. ప్రభుత్వ అనుమతితో, చట్టబద్ధంగానే జరిపినట్టు తెలిపారు. కాగా భారతీ ఘోష్ పోలీసాఫీసర్‌గా పలు అంతర్జాతీయ మిషన్లకు సేవలందించారు. ఐపీఎస్‌గా కూడా ప్రమోట్ అయ్యారు. మమతా సీఎం అయ్యాక ఘోస్‌కు సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసుగా ప్రమోషన్ వచ్చింది. డిసెంబర్ 25న 3వ బెటాలియన్ రాష్ట్ర సాయుధ దళాలకు కమాండింగ్ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు. అనంతరం ఆమె వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. రెండు నెలల తర్వాత ఘోష్ పై సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు తృణమూల్ కాంగ్రెస్ సుముఖంగా లేదు. -
ఎఫ్‌బీఐ మోస్ట్ వాటెండ్ లిస్ట్‌లో భద్రేష్
వాషింగ్టన్: భార్యను చంపి పరారీలో ఉన్న భారతీయ యువకుడి పేరును అమెరికా నేరపరిశోధక సంస్థ ఎఫ్‌బీఐ మోస్ట్‌వాంటెడ్ జాబితాలో చేర్చింది. గుజరాత్‌కు చెందిన భద్రేష్ కుమార్ చేతన్‌భాయ్ పటేల్ (26)ను పట్టిచ్చిన వారికి లక్ష అమెరికన్ డాలర్లు పారితోషికంగా అందజేస్తామని తెలిపింది. వివరాలివీ.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ సమీపంలోని వీరంగామ్కకు చెందిన భద్రేష్‌కుమార్ చేతన్భాయి పటేల్, పాలక్(21)ను వివాహం చేసుకుని 2015లో అమెరికా చేరుకున్నారు. వారిద్దరూ మేరీలాండ్ రాష్ట్రం హనోవర్‌లో ఉన్న పటేల్ బంధువుల రెస్టారెంట్లో ఉద్యోగులుగా చేరారు. అయితే, భద్రేష్‌కుమార్ అమెరికాలో ఉండిపోవాలని అంటుండగా, అతని భార్య పాలక్ స్వదేశం వెళ్లిపోవాలని పట్టుబడుతోంది. దీనిపై ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెస్టారెంట్లోపల ఉన్న గదిలో వారి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఉన్న భద్రేష్‌కుమార్ భార్యను తీవ్రంగా కొట్టటంతోపాటు కత్తితో పలుమార్లు పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రెండేళ్ల నుంచి వెతుకుతున్నా పోలీసులకు మాత్రం దొరకలేదు. అతడు అమెరికాలోనే ఉంటున్న పలువురు బంధువులు, పరిచయస్తుల వద్ద తలదాచుకుని ఉంటాడని, లేదా కెనడా వెళ్లిపోయి ఉంటాడని భావిస్తున్నామన్నారు. దీంతోపాటు కెనడా నుంచి తిరిగి ఇండియా వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నట్లు తెలిపారు. అతని ఆచూకీ కోసం స్థానికుల నుంచి పలుమార్గాల్లో వివరాలు సేకరించామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని, ఫలితం లేకపోవటంతో మోస్ట్వాంటెడ్లిస్ట్లో అతని పేరు ఉంచినట్లు చెప్పారు. భద్రేష్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి లక్ష అమెరికన్ డాలర్లు పారితోషికంగా అందజేస్తామని తెలిపింది. -
జమాతే ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్
సాక్షి, బళ్లారి : జమాతే ముజాహిదీన్ బంగ్లాదేశ్ అనే మిలిటెంట్ సంస్థకు చెందిన ఉగ్రవాదిని దావణగెరె జిల్లా హొన్నాళి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇతను పశ్చిమ బెంగాల్, అసోంలలో జరిగిన బాంబు పేలుడు ఘటనలకు బాధ్యుడిగా అనుమానిస్తున్నారు. ఇతడిని పల్బూర్ హుసేన్(28)గా గుర్తించారు. అస్సాంలోని బక్సా జిల్లా పోకలగి గ్రామానికి చెందిన ఇతను అక్కడి పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నట్లు వెల్లడైంది. రెండేళ్లుగా ఇతను హొన్నాళి తాలూకా కత్తిగె గ్రామ సమీపంలోని ఓ క్రషర్ యూనిట్లో లారీ డ్రైవర్గాపని చేస్తున్నాడని తెలిసింది.