Mother and daughter Dies
-
అయ్యో తల్లీ.. ఎంత పని చేశావ్?
సాక్షి, బళ్లారి అర్బన్: తాలూకాలోని మోకా పోలీస్టేషన్ పరిధిలో సింధవాళ దగ్గర తుంగభద్ర ఎల్ఎల్సీ కాలువలోకి తల్లి ఇద్దరు బిడ్డలతో దూకింది. తల్లి గల్లంతు కాగా ఒక చిన్నారి చనిపోగా, మరో చిన్నారి సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. నగరంలోని గుగ్గరహట్టికి చెందిన లక్ష్మి(27)కి కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హత్తిబెళగల్ గ్రామానికి చెందిన వెంకటేష్‌తో పెళ్లయింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. రెండురోజుల కిందట భర్తతో గొడవపడి లక్ష్మి తన నలుగురు పిల్లల్లో ఇద్దరిని తీసుకుని గుగ్గరహట్టిలోని పుట్టింటికి వచ్చింది. తమ్ముడు సురేష్ బుజ్జిగించి భర్త ఇంటికి వెళ్లాలని ఆలూరు బస్సు ఎక్కించి పంపించాడు. భర్త వద్దకు వెళ్లడం ఇష్టం లేని ఆమె మధ్యలో దిగిపోయి సింధవాళ దగ్గర ఉన్న కాలువలోకి పిల్లలతో కలిసి దూకింది. సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులు పరుగున వచ్చి కాపాడేందుకు యత్నించారు. ఇద్దరు పిల్లలు వారి చేతికి దొరకగా, తల్లి కాలువలో కొట్టుకుపోయింది. అయితే వారిలో శాంతి అనే చిన్నారి మృతి చెందింది. వెన్నెల అనే చిన్నారి బతికినట్లు మోకా ఎస్ఐ పరశురామ్ తెలిపారు. ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. (చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా?) -
విషాదం: తల్లీకూతుళ్లను కబళించిన మృత్యువు
సాక్షి, ఆరిలోవ(విశాఖ): విశాఖనగరంలోని ఆరిలోవ ప్రాంతం దీన్‌దయాల్‌పురం వద్ద బీఆర్టీఎస్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి చెందారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. ఆరిలోవ ఎస్ఐ గోపాలరావు తెలిపిన వివరాలివీ.. పెందుర్తి దరి సుజాతనగర్ ప్రాంతం పాపయ్యరాజుపాలేనికి చెందిన సత్యవేణి(45) ఆమె చిన్న కుమార్తె మౌనిక(22)తో కలసి ద్విచక్రవాహనంపై నగరానికి వచ్చారు. తిరిగి హనుమంతవాక, పెదగదిలి, సింహాచలం మీదుగా బీఆర్టీఎస్లో పెందుర్తి వెళ్లడానికి బయలుదేరారు. చినగదిలి దాటిన తర్వాత దీన్‌దయాల్‌పురం వద్ద హెల్త్‌సిటీలో క్యూ1 ఆస్పత్రి ఎదురుగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ద్విచక్రవాహనం నడుపుతున్న మౌనిక వీఐపీలకు కేటాయించిన సెంటర్ రోడ్డులో ప్రయాణిస్తున్నారు. అదే రోడ్డులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు. కిందపడిన మౌనిక, ఆమె తల్లి సత్యవేణిలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సంఘటన స్థలంలోనే మౌనిక ప్రాణాలు విడిచింది. సత్యవేణిని ఆరిలోవ పోలీసులు హెల్త్‌సిటీలో ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ గోపాల్ తెలిపారు. సత్యవేణి పెద్ద కుమార్తె తేజస్విని, భర్త శ్రీరాములున్నారు. శ్రీరాములు హుకుంపేటలో ఉద్యోగం చేస్తున్నారు. హెల్మెట్ ఉన్నా... ద్విచక్రవాహనం నడుపుతున్న మౌనిక హెల్మెట్ ధరించింది. అయినా ప్రమాదం జరిగే సమయంలో ఆ హెల్మెట్ ప్రాణాలు కాపాడలేకపోయింది. తలకు ధరించిన హెల్మెట్ బలంగా రోడ్డును తాకడంతో ముక్కలైపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలపై సంఘటన స్థలంలోనే మౌనిక ప్రాణాలు కోల్పోయింది. వాహనానికి వెనుక కూర్చొన్న ఆమె తల్లి సత్యవేణి కొంత దూరం తుల్లిపోయి ప్రమాదానికి గురయ్యారు. పాడేరులో విషాదఛాయలు పాడేరు: గిరిజన ఉపాధ్యాయురాలు కంకిపాటి సత్యవేణి, ఆమె కుమార్తె మౌనికలు మృతి చెందడంతో పాడేరు, లగిశపల్లిల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీటెక్ చదివిన మౌనికకు ఇటీవల బెంగళూరులో ఉద్యోగం లభించింది. లగిశపల్లికి చెందిన సత్యవేణి జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పాడేరు లోచలిపుట్టులోని ఐటీడీఏ రెంటల్ క్వార్టర్స్‌లో తన భర్త, కాఫీ సబ్ అసిస్టెంట్ కంకిపాటి శ్రీరాములుతో కలిసి నివసిస్తున్నారు. విశాఖపట్నం సుజాత నగర్‌లోని గతంలో కొనుగోలు చేసిన ఫ్లాట్‌కు శని,ఆదివారాలు, సెలవు దినాల్లో వెళుతుంటారు. అలా వెళ్లిన వారు మృతి చెందడంతో బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంపీ, ఎమ్మెల్యేల సంతాపం సత్యవేణి, ఆమె కుమార్తె మౌనికలు మృతి చెందిన సంఘటనపై అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణలు వేర్వేరు ప్రకటనల్లో విచారం వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ సభ్యురాలు కిముడు గాయత్రిదేవి, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నేత కిముడు దేముళ్లునాయుడు, లగిశపల్లి సర్పంచ్ లకే పార్వతమ్మతో పాటు ఉపాధ్యాయ, గిరిజన ఉద్యోగ సంఘాల నేతలు సంతాపం తెలిపారు. పాడేరు, జి.మాడుగుల ఎంఈవోలు సీహెచ్ సరస్వతిదేవి, కురుసా నాగభూషణంలు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. -
కరోనాతో తల్లీకూతుళ్ల మృతి.. వారం తర్వాత వెలుగులోకి
సాక్షి, ముథోల్: కరోనా మహమ్మారితో నిర్మల్ జిల్లా ముథోల్ మండలం రాంటెక్ గ్రామంలో తల్లీకూతుళ్లు మృతిచెందారు. వారంరోజుల అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీఐ అజయ్‌బాబు కథనం ప్రకారం.. రాంటెక్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి(70), భారతీబాయి (50) తల్లీకూతుళ్లు. లక్ష్మీబాయి కుమారుడు కూడా వారితోపాటే ఉంటున్నాడు. అయితే అతను గత కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయి ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. వారంరోజుల క్రితం తల్లీకూతుళ్లు ఇద్దరూ జ్వరంతో బాధపడుతూ మంచంపట్టారు. కరోనా అని అనుమానించి గ్రామస్తులు ఎవరూ ఆ ఇంటి వైపు వెళ్లలేదు. కాగా, ఆదివారం వారి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా తల్లీకూతుళ్ల మృతదేహాలు కుళ్లిపోయి కనిపించాయి. గ్రామ సర్పంచ్ భుజంగరావ్ పటేల్ ఆధ్వర్యంలో స్థానిక స్వచ్ఛంద సంస్థకు చెందిన యువకులు మృతదేహాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అవి కుళ్లిపోయి ఉండడంతో వీలుపడలేదు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించడంతో వైద్య సిబ్బంది సాయంతో మృతదేహాలను ఇంట్లో నుంచి తీసి గ్రామ పొలిమేరలో దహనం చేశారు. దహనానికి ముందు మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు భైంసా ఏఎస్పీ కిరణ్ ప్రభాకర్ తెలిపారు. చదవండి: (టీకా రెండో డోస్ వేసుకున్నాక కోవిడ్‌తో మృతి) -
ఏం కష్టం వచ్చింది బిడ్డా!
భూపాలపల్లి: ‘బిడ్డా.. మనకేం కష్టమొచ్చింది. బతకడం కన్నా.. చావడమే శరణ్యం’అని ఓ మహిళ బిడ్డతో సహా తనువు చాలించింది. రెండున్నరేళ్ల కుమార్తెకు ఉరి బిగించి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. డీఎస్పీ ఎ.సంపత్‌రావు, సీఐ ఎస్.వాసుదేవరావు కథనం ప్రకారం.. భూపాలపల్లిలోని జవహర్‌నగర్ కాలనీలో నివాసం ఉండే కుమారస్వామికి జగిత్యాల జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌కు చెందిన లాస్య (25)తో 2015లో వివాహం జరిగింది. కేటీకే 1వ గనిలో కుమారస్వామి జనరల్ మజ్దూర్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం అతను విధులకు వెళ్లగా భార్య లాస్య మధ్యాహ్నం తన కూతురు మహితతో కలసి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చిన కుమారస్వామి తలుపుకొట్టినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా భార్య, కుమార్తె ఉరి వేసుకుని కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను కిందికి దింపారు. మృతురాలి సోదరుడు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త వేధింపుల కారణంగానే లాస్య, తన కూతురికి ఉరి వేసి.. తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని కాలనీవాసులు అనుమానిస్తున్నారు. -
గుంటూరులో విషాదం: తల్లి, బిడ్డ మృతి
-
అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్ల మృతి
పట్నంబజారు(గుంటూరు): అనుమానాస్పద స్థితిలో తొమ్మిది నెలల చిన్నారి సహా తల్లి మృతి చెందిన ఘటనపై కేసు నమోదయింది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంభొట్లవారిపాలెంకు చెందిన నర్రా కల్యాణ్‌చంద్రకు అదే జిల్లా పంగులూరు గ్రామానికి చెందిన మనోజ్ఞ(29)కు మూడేళ్ల కిందట వివాహం జరిగింది. కల్యాణ్‌చంద్ర నేవీలో ప్రైవేట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. వీరికి తొమ్మిది నెలల తులసి అనే కుమార్తె ఉంది. అయితే హైదరాబాద్‌లో మనోజ్ఞ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. కల్యాణ్ విధుల నిమిత్తం వెళ్లి కొద్ది నెలల తర్వాత వస్తుండేవాడు. ఈ క్రమంలో కరోనా లాక్డౌన్ సమయం నుంచి గుంటూరు నగరంలోని లక్ష్మీపురం కమలేష్ అపార్ట్‌మెంట్స్‌లో కల్యాణ్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. వివాహ సమయంలో 50 సవర్ల బంగారం, ఐదు సెంట్ల స్థలం, రూ.2 లక్షల నగదు, ఒక ఇల్లును కట్నంగా ఇచ్చారు. అయినప్పటికీ మనోజ్ఞను భర్త కల్యాణ్ అతని తల్లిదండ్రులు శ్రీమన్నారాయణ, కామేశ్వరి అనేక రకాలుగా హింసించేవారని, తమతో ఏ మాత్రం మీ కుటుంబం సరితూగదని నిత్యం వేధింపులకు గురిచేసేవారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట మృతురాలు ఇక్కడ ఉండలేకపోతున్నాని తల్లిదండ్రులు బాచిన రమేష్‌బాబు, విజయలక్ష్మితో ఫోన్లో మాట్లాడి కన్నీరుమున్నీరయింది. ఆ సమయంలో మనోజ్ఞను తీసుకువెళ్లేందుకు వచ్చిన ఆమె తల్లిదండ్రులను వియ్యంకుడు శ్రీమన్నారాయణ సర్దిచెప్పి పంపించి వేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మనోజ్ఞ, ఆమె కుమార్తె తులసి అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందపడి మృతి చెందగా విషయాన్ని తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుంటూరుకు చేరుకున్నారు. తమ బిడ్డను భర్త, అత్తమామలే చంపేసి కింద పడేసి ఉంటారని మనోజ్ఞ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టాభిపురం ఎస్‌హెచ్‌వో ఇ.పూర్ణచంద్రరావు తెలిపారు. -
ప్రేమ వ్యవహారం: తల్లీకూతుళ్ల బలి
సాక్షి, షాద్‌నగర్: కుమార్తెను బాగా చదివించాలనుకున్నారు ఆ తలిదండ్రులు.. భవిష్యత్‌లో మంచి ప్రయోజకురాలిగా చేయాలనుకున్నారు.. కానీ, ఆ అమ్మాయి ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమ వ్యవహారం ఆ ఇంట్లో ఇద్దరిని బలి తీసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మొగిలిగిద్ద గ్రామానికి చెందిన స్రవంతి అదే గ్రామానికి చెందిన రాందాసు అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయమై స్రవంతి (17), ఆమె తల్లి చంద్రకళ (35) తరచూ గొడవపడుతుండేవారు. ఈ నెల 15న తల్లీకూతురు మళ్లీ ఘర్షణ పడ్డారు. అదే సమయంలోనే చంద్రకళ భర్త పాండు ఇంటికి వచ్చీరాగానే స్రవంతిపై కిరోసిన్ పోయడానికి ప్రయత్నించాడు. పక్కనే ఉన్న చంద్రకళపై కూడా కిరోసిన్ పడింది. ప్రేమ వ్యవహారంపై కోపంతో ఉన్న చంద్రకళ.. కూతురుకు నిప్పంటించగా తనకు కూడా మంటలంటుకున్నాయి. దీంతో ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో 4 రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. పాండుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు. ప్రేమ వ్యవహారమే కారణమా? మొగిలిగిద్ద గ్రామానికి చెందిన చంద్రకళ దంపతులకు ఒక కుమార్తె స్రవంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త పాండు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటర్ చదువుతున్న స్రవంతి అదే గ్రామానికి చెందిన రాందాసుతో ప్రేమలో పడింది. అయితే వారిని తల్లిదండ్రులు మందలించడంతో ఇటీవల గ్రామం నుంచి వెళ్లిపోయారు. పెద్దలు నచ్చచెప్పి వీరిని మళ్లీ గ్రామానికి తీసుకువచ్చారు. తర్వాత కూడా వీరిలో మార్పురాకపోవడంతో తల్లిదండ్రులు కుమార్తెను పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలోనే తండ్రి క్షణికావేశంలో చేసిన పని ఇద్దరి మృతికి కారణం కాగా, తండ్రిపై కేసు నమోదు కావడంతో కుటుంబం ఛిన్నాభిన్నమైంది. -
కాఫీ తాగి తల్లీకూతురు మృతి
బాగేపల్లి: కాఫీ తాగి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం బాగేపల్లి తాలూకా చేళూరు హోబళి బత్తలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెంది న అక్కలమ్మ (80), తన కుమార్తె నరసమ్మ (55), మనవడు అరవింద్ (5), మనవరాలు ఆరతి(4)లు తమ తోటలోని ఇంట్లో కాఫీ చేసుకుని తాగారు. కొంతసేపటికే నలుగురూ వాంతులు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు కోలారులోని ఎస్ఎన్ఆర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కలమ్మ, నరసమ్మలు మరణించారు. మిగతా ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం దేవరాజ అరసు మెడికల్ కాలేజీకి తరలించగా చికిత్స పొందుతున్నారు. చేళూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాఫీలో ఎవరైనా విషం కలిపారా, లేక మరేదైనా కారణం ఉందా అన్నది తేలాల్సి ఉంది. -
కృష్ణా నదిలో బోటు ప్రమాదం