
బాగేపల్లి: కాఫీ తాగి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం బాగేపల్లి తాలూకా చేళూరు హోబళి బత్తలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెంది న అక్కలమ్మ (80), తన కుమార్తె నరసమ్మ (55), మనవడు అరవింద్ (5), మనవరాలు ఆరతి(4)లు తమ తోటలోని ఇంట్లో కాఫీ చేసుకుని తాగారు. కొంతసేపటికే నలుగురూ వాంతులు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు కోలారులోని ఎస్‌ఎన్‌ఆర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కలమ్మ, నరసమ్మలు మరణించారు. మిగతా ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం దేవరాజ అరసు మెడికల్ కాలేజీకి తరలించగా చికిత్స పొందుతున్నారు. చేళూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాఫీలో ఎవరైనా విషం కలిపారా, లేక మరేదైనా కారణం ఉందా అన్నది తేలాల్సి ఉంది.