Battalapalli
-
ఆటోను ఢీకొన్న లారీ
బత్తలపల్లి: ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామానికి చెందిన దంపతులు సాకే నారాయణస్వామి (45), సాకే ఆదెమ్మ (40) బొప్పాయి కాయలు అమ్ముకునేందుకు సొంత ఆటోలో రోజూ బత్తలపల్లికి వస్తుంటారు. రోజులాగే ఆదివారం తెల్లవారుజామున ఆటోలో బత్తలపల్లికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన చెన్నకేశవులు (46), పెద్దక్క (44) వ్యక్తిగత పనులపై వెళ్తూ అదే ఆటోలో ఎక్కారు. ఆటో బత్తలపల్లి ఇందిరమ్మ కాలనీ వద్దకు రాగానే బెంగళూరు నుంచి తాడిపత్రి వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా నారాయణస్వామి, ఆదెమ్మలు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో పిన్నదరి గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఘటన వివరాలు .. ఎక్కడ?: అనంతపురం జిల్లా బత్తలపల్లిలో ఎప్పుడు?: ఆదివారం తెల్లవారుజామున కారణం: లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొనడం పర్యవసానం: ఆటోలో ఉన్న ఒకే గ్రామానికి చెందిన నలుగురు దుర్మరణం -
కాఫీ తాగి తల్లీకూతురు మృతి
బాగేపల్లి: కాఫీ తాగి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం బాగేపల్లి తాలూకా చేళూరు హోబళి బత్తలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెంది న అక్కలమ్మ (80), తన కుమార్తె నరసమ్మ (55), మనవడు అరవింద్ (5), మనవరాలు ఆరతి(4)లు తమ తోటలోని ఇంట్లో కాఫీ చేసుకుని తాగారు. కొంతసేపటికే నలుగురూ వాంతులు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు కోలారులోని ఎస్ఎన్ఆర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కలమ్మ, నరసమ్మలు మరణించారు. మిగతా ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం దేవరాజ అరసు మెడికల్ కాలేజీకి తరలించగా చికిత్స పొందుతున్నారు. చేళూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాఫీలో ఎవరైనా విషం కలిపారా, లేక మరేదైనా కారణం ఉందా అన్నది తేలాల్సి ఉంది. -
బైక్, లారీ ఢీ: ముగ్గురు మృతి
సాక్షి, అనంతపురం: జిల్లాలోని బత్తలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుమ్మళ్లకుంట వద్ద సోమవారం సాయంత్రం బైక్‌పై వెళ్తున్న వారిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వివరాలు తెలియాల్సి ఉంది. -
ఘోరం..
ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు గుంతకల్లుకు చెందిన ఇద్దరు దుర్మరణం నలుగురికి గాయాలు.. వారిలో ఒకరి పరిస్థితి విషమం నల్లబోయినపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘటన బత్తలపల్లి (ధర్మవరం ) : బత్తలపల్లి మండలం నల్లబోయనపల్లి బస్‌స్టేజీ సమీపాన అనంతపురం – కదిరి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు... సోమవారం సాయంత్రం గుంతకల్లు పట్టణానికి చెందిన నాగరాజు (40), మస్తాన్‌ఖాన్(43), బోయ శ్రీనివాసులు మదనపల్లి నుంచి కారులో స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. నల్లబోయనపల్లి బస్‌స్టేజీ సమీపంలోకి రాగానే డ్రైవింగ్ చేస్తున్న నాగరాజు కంటిమీద రెప్పవాల్చాడు. స్టీరింగ్‌పై పట్టుతప్పింది. ఎదురుగా అనంతపురం నుంచి తిరుపతి వెళ్తున్న కదిరి ఆర్టీసీ డిపో బస్సు డ్రైవర్ గమనించి తాను మరింత రోడ్డుపక్కగా వచ్చాడు. అయినా వేగంగా వచ్చి బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ నాగరాజు ఎగిరి కిందపడి ప్రాణం విడిచాడు. పక్కనే కూర్చున్న మస్తాన్‌ఖాన్ కూడా తీవ్రంగా గాయపడి సీటులోనే మృతి చెందాడు. వెనుక సీటులో కూర్చున్న బోయ శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్టీసీ బస్సులో 51 మంది ప్రయాణికులుండగా వారిలో మొలకలవేముల మండలం ఓలేటివారిపల్లికి చెందిన లలితమ్మ, మహబూబ్‌బాషా, మహమ్మద్ స్వల్పంగా గాయపడ్డారు. బస్సులో మరికొందరు స్వల్పంగా గాయపడినా వారు మరో బస్సులో వెళ్లిపోయారు. గాయపడిన వారిలో బోయ శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉంది. ముదిగుబ్బ, బత్తలపల్లికి చెందిన 108 వాహనాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులును మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారికి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ధర్మవరం రూరల్ సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ హారున్‌బాషా తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారును జేసీబీ సాయంతో పక్కకు తొలగించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.