mother arrested
-
మూడేళ్ల కూతురిని చంపి.. దాచిపెట్టిన తల్లి
మూడేళ్ల కూతురిని చంపి.. ఆ విషయాన్ని ఐదేళ్ల పాటు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిందో కన్నతల్లి. ఆలియా లన్స్ఫర్డ్ (3) అనే అమ్మాయిని ఆమె తల్లి లీనల్ లన్స్ఫర్డ్ స్వయంగా చంపిందన్న విషయాన్ని పోలీసులు ప్రకటించేసరికి అంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తలమీద బలమైన వస్తువుతో కొట్టి ఆమెను చంపేసిందని తెలిపారు. ఆమె మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి, తన కూతురు కనిపించడం లేదంటూ 2011 సెప్టెంబర్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి పోలీసులు ఆ చిన్నారి ఎక్కడుందా అని వెతుకుతూనే ఉన్నారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరకు.. కన్నకూతుర్ని చంపిన కేసులో లీనల్ లన్స్ఫర్డ్ను అరెస్టుచేశారు. అయితే, చిన్నారి మృతదేహం మాత్రం ఎక్కడుందన్న విషయం ఇంతవరకు తెలియలేదు. ఇంట్లోనే ఉన్న తన కూతురు కనిపించడం లేదని సెప్టెంబర్ 24న లన్స్ఫర్డ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆరు నెలల తర్వాత.. ఎవరో ఇంట్లోకి వచ్చి పిల్లను ఎత్తుకెళ్లిపోయారంటే నమ్మబుద్ధి కావడం లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. చిన్నారి ఎక్కడుందన్న సమాచారం తెలిపినా, నిందితుల అరెస్టుకు దారితీసే విషయాలు ఏవైనా వెల్లడించినా రూ. 13 లక్షల బహుమానం ఇస్తామని కూడా ప్రకటించారు. వయసు పెరిగేకొద్దీ ఆలియా ఎలా ఉంటుందో అనే ఊహా చిత్రాలను కూడా రూపొందించి.. వాటితో కూడిన పోస్టర్లు అన్నిచోట్లా అతికించారు. అయినా, ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు, ఎవరూ అరెస్టు కాలేదు. చివరకు పోలీసులకు స్టన్నింగ్ వాస్తవం తెలిసింది. కన్న తల్లే ఈ దారుణానికి పాల్పడిందని వెల్లడించి.. ఆమెను అరెస్టుచేశారు. కూతురిఉ కనిపించడం లేదని ఫిర్యాదు చేసే సమయానికి లన్స్ఫర్డ్ గర్భవతి. తర్వాత ఆమెకు కవలలు పుట్టారు. తర్వాత ఆమకు మొత్తం ఆరుగురు పిల్లలుండగా వారిపై మాతృత్వ హక్కులను కూడా ఆమె కోల్పోయింది. తల్లిగా ఉండే అర్హత ఆమెకు లేదని కోర్టు తెలిపింది. -
8 మంది పిల్లల్ని చంపిన తల్లి అరెస్టు!
ఆస్ట్రేలియాలోని కెయిర్న్స్ నగరంలో 8 మంది పిల్లలను పొడిచి చంపేసిన తల్లిని పోలీసులు అరెస్టుచేశారు. పిల్లలంతా 18 నెలల నుంచి 14 ఏళ్లలోపువారు. వాళ్లను చంపేందుకు ఆమె ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్యాస్థలం వద్ద టెడ్డీబేర్లు, పువ్వులు పడి ఉన్నాయి. పిల్లల్లో ఏడుగురు ఆమె కన్న బిడ్డలే కాగా, ఎనిమిదో బిడ్డ ఆమెకు సమీప బంధువు. నిందితురాలైన 37 ఏళ్ల మహిళను అరెస్టు చేసి, ప్రస్తుతం పోలీసు భద్రతతో కెయిర్న్స్ బేస్ ఆస్పత్రిలో ఉంచినట్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బ్రూనో ఆస్నికర్ తెలిపారు. ప్రస్తుతానికి ఆమె మీద తప్ప వేరెవ్వరి మీదా అనుమానాలు లేవని... ఆ ప్రాంతం అంతా సురక్షితంగాగానే ఉందని చెప్పారు. ఈ హత్యలు ఆస్ట్రేలియాను వణికించాయి. ఆ మహిళకున్న మరో కొడుకు (20) ఇంటికి వచ్చినప్పుడు పిల్లల మృతదేహాలు, ఆ పక్కనే టెడ్డీ బేర్లు, పూల బొకేలు కనిపించాయి. -
చంటోడిని కారులో వదిలి.. నైట్క్లబ్బుకు వెళ్లిన తల్లి!
పిల్లాడి కంటే ఆ మహాతల్లికి నైట్క్లబ్బే ఎక్కువ అయిపోయింది. మూడేళ్ల కొడుకును వేడిగా ఉన్న కారులో ఒంటరిగా వదిలిపెట్లి, క్లబ్బుకు వెళ్లిన ఆ తల్లిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఈశాన్య హారిస్ కౌంటీకి చెందిన ఉజ్మా షేక్ అనే మహిళ తన పిల్లవాడితో సహా నైట్ క్లబ్బులోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే, తలుపు వద్ద ఉన్న కాపలాదారు.. ఆమెను లోనికి వెళ్లనివ్వలేదు. దాంతో వెనక్కి తిరిగి వెళ్లి, ఈసారి ఒంటరిగా వచ్చింది. తన స్నేహితురాలి వద్ద పిల్లాడిని వదిలిపెట్టినట్లు అతడికి చెప్పింది. దాంతో ఆ కాపలాదారుకు అనుమానం వచ్చి, కారు వద్దకు వెళ్లాడు. తీరా చూస్తే కారులో పిల్లాడు ఒంటరిగా ఉన్నాడు. పిల్లాడిని నిర్లక్ష్యంగా అలా వదిలేసినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేసి.. తర్వాత 1.20 లక్షల రూపాయల బాండు సమర్పించడంతో వదిలిపెట్టారు.