mother committed suicide
-
కొడుకు వివాహం చేసుకోవడం లేదని తల్లి షాకింగ్ నిర్ణయం
తాడేపల్లి రూరల్: ఓ కన్న తల్లి తన కొడుకు వివాహం చేసుకోవడం లేదని మనస్తాపం చెంది కొడుకుతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లి ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు.. మంగళగిరి మురుగుడు హనుమంతరావు కాలనీకి చెందిన ఆకురాతి వెంకటరమణమ్మ(45) తన చిన్న కుమారుడు లక్ష్మణ్ వివాహం చేసుకోవడం లేదని మనస్తాపం చెంది కొడుకుతో గొడవపడి ఇంట్లో నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బయటకు వెళ్లింది. అప్పటి నుంచి పెద్ద కొడుకు రాము, చిన్న కుమారుడు లక్ష్మణ్ బంధువుల ఇళ్లలోను, ఇతర ప్రాంతాల్లో ఎంక్వయిరీ చేశారు. ఎటువంటి సమాచారం లభించలేదు. సోమవారం ఉదయం కృష్ణానది దిగువ ప్రాంతంలోని సీతానగరం పుష్కర ఘాట్ల సమీపంలో రైల్వే బ్రిడ్జి కింద మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రమేష్ ఘటనా స్థలానికి వెళ్లి నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీసి సమాచారం కోసం మహిళా పోలీసుల గ్రూపులో వెంకటరమణమ్మ మృతదేహం ఫొటోను పోస్ట్ చేశారు. మంగళగిరి మహిళా పోలీసులు వెంకటరమణమ్మగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ బలవన్మరణం -
విషాదం: బిడ్డ మరణాన్ని తట్టుకోలేక...
యశవంతపుర (కర్ణాటక): బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. మండ్యకు చెందిన సంతోశ్, పల్లవిలు ఇక్కడి సుద్దగుంటె పాళ్యంలో నివాసం ఉంటున్నారు. పల్లవికి నెలలు నిండాకుండానే కాన్పు జరిగింది. ఆరు నెలలకే పుట్టిన బిడ్డ సోమవారం మరణించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
పరిమళించిన మానవత్వం
సరా లేని చిన్నారులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన దాతలు - ‘రెక్కలు తెగిన పక్షులు’ కథనానికి దేశ విదేశాల నుంచి విశేష స్పందన - బాధిత కుటుంబం ఇంటికి తరలివచ్చిన మానవతావాదులు - ఆర్థికసాయం అందజేస్తామని, పిల్లలను చదివిస్తామని హామీ హైదరాబాద్: మానవత్వం రెక్క తొడిగింది.. ‘రెక్కలు తెగిన పక్షుల’ను ఆదుకునేందుకు ముందుకొచ్చింది.. ఆసరా లేని కుటుంబానికి తామున్నామంటూ భరోసానిచ్చింది. కుటుంబాన్ని పోషించలేని స్థితిలో అమ్మ ఆత్మహత్య చేసుకోగా, అనారోగ్యంతో నాన్న మంచానికే పరిమితమవగా అనాథలైన ఇద్దరు చిన్నారుల దీనగాథపై ‘రెక్కలు తెగిన పక్షులు’ శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై దేశ విదేశాలలో ఉన్న మానవతా వాదులు, దాతలు విశేషంగా స్పందించారు. హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ముందుకొచ్చారు. ‘సాక్షి’ వెబ్ పోర్టల్‌లో ఈ కథనాన్ని చదివిన బెంగళూరు, మద్రాసు, ముంబై తదితర ప్రాంతవాసులు, వ్యాపారస్తులు, డాక్టర్లు, సినీ నిర్మాతలు, స్వచ్ఛంద సంస్థలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వినోద్ కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తామని, వారి బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పాలని కోరారు. ఇక హైదరాబాద్ నుంచి చాలా మంది నేరుగా రాంనగర్‌లోని వినోద్ నివాసానికి వచ్చి చిన్నారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ ట్రస్టుల యజమానులు, అనాథ ఆశ్రమాలు, పాఠశాలల నిర్వాహకులు పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తామని, తామే పెంచి పెద్ద చేస్తామని హామీ ఇచ్చారు. పాప పెళ్లి కూడా చేయిస్తామని ఆ తండ్రికి భరోసా ఇచ్చారు. బ్యాంక్ ఖాతాను ప్రారంభించింది దాతలే.. వినోద్ కుటుంబానికి బ్యాంక్ ఖాతా లేదని తెలియడంతో అడిక్‌మెట్ డివిజన్ బ్రాహ్మణ సేవా సమాఖ్య నాయకులు కౌండిన్య ప్రసాద్, మాధవ్‌లు రాంనగర్‌లోని ఆంధ్రాబ్యాంక్‌లో చిన్నారి సాయి నిఖిత పేరుతో ఖాతాను తెరిచారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ స్వయంగా ఆ చిన్నారుల ఇంటికి వచ్చి తండ్రి నామినీగా సంతకం తీసుకున్నారు. వెంటనే ఖాతా నంబర్‌ను ఇచ్చారు. సహాయం చేస్తామని ఫోన్ చేసిన వారికి బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను తెలియజేశారు. అకౌంట్ నంబర్: 133910100081668 తల్లిని కోల్పోయి, తండ్రి ఆసరాకు దూరమైన ఆ ఇద్దరు చిన్నారులను ఆదుకోవాలనుకునే దాతలు ఆర్. సాయి నిఖిత, అకౌంట్ నంబర్ 133910100081668 - ఐఎఫ్ఎస్ కోడ్ - ఏఎన్‌డీబీ 0001339, ఆంధ్రాబ్యాంక్ రాంనగర్ శాఖకు నేరుగా ఆర్థికసాయం అందజేయవచ్చు. -
కూతురుని చంపి, తల్లి ఆత్మహత్య
చౌటుప్పల్ : భర్త వేధింపులకు తాళలేక 11నెలల పసిగుడ్డును చంపి, ఓ మాతృమూర్తి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన కాసోజు అనిత (21), రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామానికి చెందిన కొండోజు ప్రవీణ్‌చారి (26)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈమెకు ప్రస్తుతం 11నెలల పాప స్పందన ఉంది. ప్రవీణ్‌చారి కులవృత్తి చేస్తున్నాడు. అనితకు తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తాత నానమ్మలే పెంచిపెద్దచేశారు. ఇంటర్మీడియట్ వరకు చదివించి పెళ్లిచేశారు. పెళ్లయిన నాటినుంచి ప్రవీణ్‌చారి వరకట్నం కోసం వే ధిస్తున్నాడు. గత 15రోజుల క్రితం అనిత కూతురుతో కలిసి, పుట్టింటికి వచ్చింది. సోమవారం ఉదయం తాత నానమ్మలతో అత్తవారింటికి వెళ్తున్నానని చెప్పింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, కూతురు ఊపిరి ఆడకుండ చేసి చంపింది. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాతనానమ్మలు వచ్చి చూసి, లబోదిబోమన్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలను నమోదు చేసుకున్నారు.పోస్టుమార్టం నిమిత్తం మృ తదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.