motor vechicles
-
దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ (ఏపీడీఏఎస్‌సీఏసీ) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. 70 శాతంపైగా వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులు. కనీసం పదో తరగతి పాసవ్వాలి. రూ.3లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలి. లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వారికి సొంత వాహనం ఉండకూడదు. గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు. గతంలో దరఖాస్తు చేసినప్పటికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రం, ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ ధ్రువపత్రం, ఎస్సీ, ఎస్టీ అయితే కుల ధ్రువీకరణపత్రం, దివ్యాంగుల పూర్తి ఫొటోను పాస్‌పోర్టు సైజులో ఉన్నది దరఖాస్తుతోపాటు ఏపీడీఏఎస్‌సీఏసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఇదీ చదవండి: జగనన్న విద్యా కానుక.. 'ఇక మరింత మెరుగ్గా' -
బండి లాక్ తీయకుంటే బ్యాటరీ డౌన్
సాక్షి, హైదరాబాద్: నిత్యం రయ్యిన దూసుకుపోయే వాహనాలకు లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ బ్రేక్ పడింది. లక్షలాది వాహనాలకు ‘తాళం’ పడింది. ప్రస్తుతం అత్యవసరమైతే తప్ప ఎవరూ బండి బయటకు తీయట్లేదు. రవాణాశాఖ అంచనాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు 55 లక్షల వాహనాల్లో 85 శాతం ఇళ్లకే పరిమితమయ్యాయి. లాక్డౌన్ మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉన్న దృష్ట్యా వాహనాల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రవాణా రంగ నిపుణులు, మెకానిక్‌లు సూచిస్తున్నారు. రోజూ కొద్దిసేపు బండి బయటకు తీయాలని, ఇంజన్, బ్యాటరీ, బ్రేకులు, టైర్లు, ఇంధన సంరక్షణ అంశాల పనితీరును పరిశీలించాలని అంటున్నారు. బ్యాటరీ బాగుండాలంటే.. ఎలాగూ బయటికెళ్లే అవకాశం లేదు. ఇంక బండి బయటకు తీయడమెందుకని చాలామంది భావిస్తారు. పైగా పెట్రోల్, డీజిల్ ఆదా అవుతాయని అనుకుంటారు. కానీ రోజుల తరబడి వాహనాలు నడపకపోవడం వల్ల బ్యాటరీలు చెడిపోయి త్వరగా డిశ్చార్జి అవుతాయి. ఖరీదైన కార్లకు సైతం బ్యాటరీయే కీలకం. అకస్మాత్తుగా బ్యాటరీ డిశ్చార్జి అయిపోయి నడిరోడ్డుపై వాహనం ఆగిపోతే ఆ బాధెలా ఉంటుందో చెప్పక్కర్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రోజులో కొద్దిసేపైనా బండిని బయటకు తీయాలి. లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా కనీసం కిలోమీటర్ దూరం నడిపి తిరిగి ఇంట్లో పార్క్ చేసుకోవాలి. నిబంధనలు ఆ మేరకు కూడా అనుమతించకుంటే, కనీసం ఇంజన్ స్టార్ట్‌చేసి కొద్దిసేపు అలాగే ఆన్‌లో ఉంచాలి. ఏడాది దాటిన బ్యాటరీలైతే ఇంకా త్వరగా చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ జాగ్రత్త అవసరం. బ్యాటరీలు చెడిపోతే ఏసీలో గ్యాస్ డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది. ఇక, రోజూ వాహనాన్ని శుభ్రంగా తుడవడం వల్ల తప్పు, మరకలు పట్టవు. ఎలుకలతో జాగ్రత్త.. ♦ వాహనాలను ఎక్కువ రోజులు బయటకు తీయకపోతే ఇంజిన్ కూల్ అయిపోతుంది. అదే సమయంలో కార్ల బాయినెట్లోకి ఎలుకలు, బొద్దింకలు, ఇతర కీటకాలు చేరవచ్చు. ఇవి ఇంజిన్ కంపార్ట్మెంట్లో వైర్లను తెంచేసే ప్రమాదం ఉంది. ♦ తెగిపోయిన వైర్ల వల్లనే చాలావరకు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ అవుతుంది. కాబట్టి రోజుకు ఒక్కసారైనా బాయ్నెట్ తెరిచి పరిశీలించాలి. ♦ వాహనాల్లో ఇంజిన్ ఆయిల్ లెవల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. వాహనాల సామర్థ్యం, తయారీకి అనుగుణంగా కనిష్ట, గరిష్ట స్థాయిలను అంచనా వేసుకోవాలి. ♦ టైర్ల నాణ్యత, మన్నిక, వాటి సామర్థ్యం మేరకు గాలిపీడనం (పీఎస్ఐ) ఉండేలా చూసుకోవాలి. ♦ ముఖ్యంగా కార్లలో ఒక్కోసారి హ్యాండ్ బ్రేక్స్ జ్యామ్ కావచ్చు. అలాంటి టెక్నికల్ సమస్యలు రాకుండా జాగ్రతలు తీసుకోవాలి. ♦ బైక్‌ల్లో పెట్రోల్ ఆఫ్‌లో ఉంచాలి. వాహనం బయటకు తీయనప్పుడు ఆన్‌లో ఉంచడం వల్ల ఇంధనం ఓవర్‌ఫ్లో అయ్యే ప్రమాదం ఉంది. ♦ బ్యాటరీ ఆధారిత వాహనాలను రోజూ కొద్దిసేపైనా బయటకు తీయాలి. ♦ ద్విచక్ర వాహనాలను స్టార్ట్ చేసేటపుడు మొదట సెల్ఫ్ స్టార్ట్ కంటే కిక్ స్టార్ట్‌ను ఉపయోగించాలి. ♦ బండి ఎండలో ఉంచితే ఇంధనం ఆవిరవుతుంది. టైర్లలో గాలి తగ్గిపోతుంది. కాబట్టి వాహనాలకు రక్షణ తొడుగులు వాడాలి. బండి నడపకుంటే బ్యాటరీకి దెబ్బే వాహనాలను రోజుల తరబడి బయటకు తీయకపోవడం వల్ల బ్యాటరీలే మొదట దెబ్బతింటాయి. కొత్త వాహనాల్లో ఈ ఇబ్బంది వెంటనే రాకున్నా ఏడాది కంటే ఎక్కువ వినియోగంలో ఉన్న వాటిలో ఈ ఇబ్బందులొస్తాయి. రోజుకు ఒక్కసారైనా బండి స్టార్ట్ చేయాలి. ఏవైనా ఇబ్బందులుంటే రెగ్యులర్ మెకానిక్‌ను ఫోన్లో సంప్రదించి సలహా తీసుకోవాలి. ఆన్‌లైన్‌లోనూ మెకానిక్‌ల సలహా, సూచనలు లభిస్తాయి. – ప్రభాకర్, సీనియర్ మెకానిక్, వీఎస్టీ -
మోటారు వాహనాల చట్టం 2019 అమలుపై వ్యతిరేకత
-
నిబంధనలకు పొగ
తూప్రాన్ : శ్రీనివాస్ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం కొనుగోలు చేసిన బైక్‌పై వెళ్తున్నాడు. దారిలో పోలీసులు ఆయన వాహన పత్రాలను పరిశీలించారు. ఆయన వద్ద అన్ని ధ్రువీకరణ పత్రాలున్నాయి.. కానీ కాలుష్య స్థాయిని తెలిపేది మాత్రం లేదు. దీంతో కొత్త వాహనం అని చెప్పినా పోలీసులు రూ. 300 జరిమానా విధించారు. అదే శ్రీనివాస్ మరోసారి 2000 మోడల్ పాత ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జరిగిన తనిఖీలో కాలుష్య నిర్ధారణ ధ్రువీకరణ పత్రాన్ని చూపించాడు. అంతే ఆ వాహనానికి ఎలాంటి జరిమానా విధించకుండానే వదిలేశారు. కళ్ల ముందే వాహనం నుంచి పొగలు వస్తున్నా వారు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇలాంటి సంఘటనలు జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట జరుగుతున్నాయి. వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యం.. అధికారులు తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. వాహనాల కాలుష్య నియంత్రణ చర్యలు శూన్యం వాహన కాలుష్య నియంత్రణ కోసం కఠిన నిబంధనలు ఉన్నాయి. కానీ వాటిని అమలు పరచడంలో అధికారులు విఫలమవుతున్నారు. కాలుష్య ధ్రువీకరణ పత్రం ఉందా? లేదా? అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ వాటిలో ఎంత మోతాదు కాలుష్య కారకాలున్నాయనే అంశాన్ని విస్మరిస్తున్నారు. దీంతో కాలుష్యానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ క్రమంలో వాహనాలు కాలుష్యాన్ని చిమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని హరించేస్తున్నాయి. కఠినమైన కాలుష్య నియంత్రణ నిబంధనలు కొందరికి దోపిడీకి ఉపయోగపడుతున్నాయి. వాహనాల కాలుష్యాన్ని నిర్ధారించేందుకు ప్రభుత్వం సంచార తనిఖీ కేంద్రాలను అనుమతించింది. కానీ వారు వాహనాలకు ఎటువంటి పరీక్షలు జరపకుండానే కాలుష్య శాతాలను ముద్రించి వాహనదారులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. మరమ్మతులు చేయించుకోవాలి.. 2010 ఏప్రిల్ తర్వాత వచ్చిన భారీ వాహనాల్లో మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ల్యాంప్ ఉండాలనే నిబంధన ఉంది. శబ్ధ కాలుష్య నియంత్రణ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. వీటి అమలు మాత్రం ఎక్కడా జరగడం లేదు. తనిఖీ కేంద్రాల్లో ఈ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ల్యాంప్ ఆగినపుడు తనిఖీ చేసిన కాలుష్య విలువలు కచ్చితంగా రావనేది దీని అర్థం. తనిఖీ సమయంలో ల్యాంప్ పనిచేయకుంటే తప్పనిసరిగా వాహనాన్ని మరమ్మతులు చేసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని పరిశీలిస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. జిల్లాలో ఉన్న వాహనాల వివరాలిలా ఉన్నాయి. నాన్ ట్రాన్స్‌ఫోర్టు వాహనాలు కార్లు 4834, మోటార్ సైకిళ్లు 44,257, ఇతర వాహనాలు 426, టీటీ 6003, ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఆటోలు 5,688, గూడ్స్ 3,292, మ్యాక్సీ క్యాబ్స్ 237, మోటార్ క్యాబ్ 699 ఇతర వాహనాలు 35, స్టేజీ క్యారియర్లు 102, టీటీ 3,711 ఉన్నాయి. ఇప్పటి వరకు 2016 అక్టోబర్ నుంచి జిల్లాలో 352 కేసులు చేశామని జిల్లా ఆర్టీఏ అధికారి గణేశ్ తెలిపారు. అలాగే జరిమానాలు రూ. 2లక్షల 24వేల 395 వరకు విధించినట్లు తెలిపారు. కాలుష్య స్థాయి ఏమేరకు ఉండాలంటే.. 1989 మోటారు వాహన చట్టం 115(2) నిబంధనల ప్రకారం వాహన కాలుష్యాల స్థాయి ఏ మేరకు ఉండాలనేది నిర్ణయించారు. కార్బన్ మోనాక్సైడ్, హెచ్‌సీ నిల్వలు ఎంత ఉండాలో సూచించారు. ఈ చట్టాన్ని మళ్లీ 2001లో సవరించారు. ఈ రెండింటి ప్రకారం పెట్రోల్, గ్యాస్, ద్విచక్ర వాహనాల్లో కార్బన్ మోనాక్సైడ్ 3.0 శాతం నుంచి 4.5 శాతానికి మించి ఉండకూడదు. డీజిల్‌తో నడిచే భారీ వాహనాలకు 4.5 శాతం లోపు ఉండాలి. నాలుగు చక్రాల డీజిల్ వాహనాలకు పురాతన వాహనాలకైతే 0.5 నుంచి 3.0 శాతంలోపే కార్బన్ మోనాక్సైడ్ శాతం ఉండాలి. ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్న వాహనాల్లో ఎక్కడా వీటి స్థాయిలను పరిశీలించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మోతాదుకు మించితే కేసులు మోటారు వాహనాల చట్టం ప్రకారం.. వాహనాల నుంచి కాలుష్యం అధిక మోతాదులో వెదజల్లితే కేసులు నమోదు చేస్తాం. వాహనాలకు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి. లేనట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. –గణేష్, ఆర్టీఏ అధికారి -
తాడిపత్రిలో మోటార్ వాహనాల స్పెషల్ డ్రైవ్
తాడిపత్రి(అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రామబ్రహ్మం ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గురువారం తాడిపత్రి పట్టణం, మండలంలోని పలు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా లెసైన్స్, రిజిస్ట్రేషన్‌లేని 27 ద్విచక్రవాహనాలను గుర్తించారు. ఈ వాహనాలను అన్నింటిని సీజ్ చేసినట్లు ఇన్స్పెక్టర్ రామబ్రహ్మం తెలిపారు.