Mourning Amma
-
దుఃఖించే దేహం
తంబుడ్జయ్ సిగౌకి బాగా చదువుకున్న మహిళ. వయసులో ఉన్న అమ్మాయి ఏం కాదు కానీ పెద్దావిడ అయితే కాదు. ఉద్యోగం లేదు. ఒక చిన్న హాస్టల్లో ఉంటోంది. ఇంతకుముందు ఆమె ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేసేది. కానీ అక్కడ తెల్లవాళ్ల నుంచి రకరకాల వేధింపులు. ఆ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చింది. నల్లజాతికి చెందిన తనకు ఇప్పుడొక కొత్త ఉద్యోగం కావాలి. అందుకు ఇక్కణ్నుంచే, ఇన్ని అవమానాలు ఎదుర్కొన్న చోటు నుంచే ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టాలి. మొదలుపెట్టింది. ‘దిస్ మోర్నబుల్ బాడీ’ (దుఃఖించే ఈ దేహం) తంబుడ్జయ్ సిగౌకి కథ చెప్పే నవల. సిస్టీ డేంగారెంబా రాసిన ఈ నవల ఈమధ్యే విడుదలైంది. జింబాబ్వేకి చెందిన రచయిత్రి. ఈ పుస్తకంలో ‘‘మనకు ఇండిపెండెన్స్ డే గురించి ఏం తెలుసు? అదొక తేదీ మాత్రమే!’’ అనే లైన్ ఉంది. తంబుడ్జయ్ పరిస్థితిని ఉద్దేశించి వస్తుంది ఈ లైన్. కథంతా సెకండ్ పర్సన్లో మెయిన్ లీడ్ మనతోనే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. స్వాతంత్య్రాన్ని పోరాడి తెచ్చుకున్న జింబాబ్వే దేశాన్ని, ఒక స్త్రీ ప్రయాణాన్ని కలిపి చూపిస్తుంది ఈ కథ. మనం స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. తంబుడ్జయ్ లాంటి పరిస్థితి చాలా మందీ ఎదుర్కొంటున్నారు. వాళ్లంతా కూడా స్వాతంత్య్రాన్ని తెచ్చుకొని నిలబడే రోజు ఈ దేహం ఆనంది స్తుంది! -
అమ్మకోసం మెరినా బీచ్ దగ్గర ..
చెన్నై: అమ్మకోసం కన్నీటి సంద్రమైన తమిళనాడులో మరో అరుదైన ఘట్టం నమోదైంది. జయలలితకు అంత్యక్రియలు నిర్వహించిన మెరీనా బీచ్ వేలాదిమందితో మరోసారి పోటెత్తింది. దీంతో ఎంజీఆర్, జయలలితను సమాధుల ప్రదేశం పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. వేలాదిగా తరలి వచ్చిన మహిళలు, పురుషులు అమ్మకు నివాళిగా తలనీలాలు సమర్పిస్తూ ప్రియమైన అమ్మపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జయలలిత ఆఖరి విశ్రాంత స్థలంవద్ద అన్నా డీఎంకే కార్యాకర్తలు, ఇతర అభిమానులు గౌరవం సూచకంగా తలనీలాలు సమర్పిస్తూ నివాళులర్పిస్తున్నారు. అసంఖ్యాకంగా హాజరైన ఆమె అభిమానులు సమాధిని దర్శించుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. దీంతో అన్నాసలై జనసంద్రమైంది. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి నియంత్రణ చర్యల్ని చేపట్టారు.