Moved In
-
కదిలిన ఓడ.. దృశ్యాలు వైరల్
సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిన ఎవర్ గ్రీన్ భారీ ఓడ ఎట్టకేలకు కదిలింది. ఆ ఓడ కదలడంతో ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇక వాణిజ్య ఓడలు రాకపోకలు సాగించేందుకు మార్గం సుగమమైంది. దాదాపు వారం పాటు సముద్రంలో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ క్లియర్ కానుంది. ఓడ కదులుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మధ్యదరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం మధ్య ఉన్న ఈ కాలువలో పెద్ద ఎత్తున ఓడలు ప్రయాణిస్తుంటాయి. వాణిజ్య ఓడల ప్రయాణం కోసం ఈ కాలువ నిర్మించారు. కాలువలో చిక్కుకున్న భారీ నౌకతో రోజుకు రూ.72 వేల కోట్ల చొప్పున వారం రోజులుగా నష్టం ఏర్పడింది. దీంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైంది. ప్రపంచంలో పదోవంతు వ్యాపారం జరిగే సూయజ్ కాలువలో ఇరుక్కున్న ఈ భారీ నౌక ఎట్టకేలకు కదిలింది. ఈ ఓడను కదిలించడంలో భారతదేశానికి చెందిన నౌక నిపుణులు కూడా వెళ్లారని తెలుస్తోంది. ఈ నౌకను కదిలించేందుకు పలు దేశాలు కూడా ముందుకు వచ్చి చర్యలు తీసుకున్నాయి. సమష్టి కృషితో ఎట్టకేలకు ఎవర్ గ్రీన్ ఓడను కదిలించారు. ఆ ఓడ నీటిలోకి చేరడంతో అక్కడి శ్రామికులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సూయజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ ఒసామా రాబీ తెలిపారు. మధ్యదరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం మధ్య ఈ సూయజ్ కాలువ ఉంది. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. 🎥: The #EVERGIVEN vessel is sailing North in the #SuezCanel. #Suez #SuezUnblocked #SuezBLOCKED #Evergreen pic.twitter.com/jm3AgOgAJZ — Mohammed Soliman (@ThisIsSoliman) March 29, 2021 🌇 #مشاريع_مصر🇪🇬| The Suez Canal Authority (SCA) announced that Ever Given container ship is currently sailing north on its way to the Bitter Lakes in the canal.#Egypt #Suez #SuezCanal #EVERGIVEN #Evergreen #قناة_السويس #السفينة_الجائحة pic.twitter.com/1flUiNliFv — مشاريع مصر Egypt (@EgyProjects) March 29, 2021 -
జకార్తా జలవిలయం!
జకార్తా: ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో శుక్రవారం కీలక ప్రకటన చేశారు. పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ..‘దేశ రాజధానిని జకార్తా నుంచి బోర్నియో దీవిలోని కలిమంతన్కు తరలించేందుకు పార్లమెంటు అనుమతి కోరుతున్నాను. రాజధాని అంటే కేవలం ఓ జాతికున్న గుర్తింపు మాత్రమే కాదు. అది దేశం సాధించిన ప్రగతికి చిహ్నం కూడా’ అని విడోడో తెలిపారు. ఏకంగా అధ్యక్షుడే ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి చాలా ముఖ్యమైన కారణముంది. పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా జకార్తా సముద్రంలో శరవేగంగా మునిగిపోతోంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం పలుచర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతమున్న పరిస్థితులే కొనసాగితే, 2050 నాటికి నగరంలోని మూడో వంతు ప్రాంతం సముద్రగర్భంలోకి జారిపోతుందని పర్యావరణవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో రాజధానిని తరలించాలని ఇండోనేసియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాలకుల వైఫల్యమే శాపం.. కోటి మందికిపైగా ప్రజలు నివసిస్తున్న జకార్తా భూకంపాలు అధికంగా సంభవించే జోన్లో ఉంది. చిత్తడినేలపై నిర్మితమైన ఈ నగరానికి సమీపంలో 13 నదులు కలుస్తున్నాయి. పాలకులు జకార్తా నిర్మాణం సమయంలో తాగునీటి సరఫరాపై దృష్టి సారించకపోవడం ఈ నగరం పాలిట శాపంగా మారింది. నీటి సరఫరా జరగకపోవడంతో పరిశ్రమలు, ప్రజలు తమ అవసరాల కోసం బోర్లు వేసి భూగర్భ జలాన్ని విచ్చలవిడిగా తోడేశారు. స్థానిక జలాశయాల్లోని నీటిని కోలుకోలేని రీతిలో వాడేశారు. దీంతో చాలాచోట్ల భూగర్భ జలాలు ఇంకిపోయాయి. దీనికితోడు రాజధాని కావడంతో పెద్దఎత్తున ఆకాశ హర్మ్యాల నిర్మాణం జరిగింది. ఈ చర్యల కారణంగా జకార్తాలో భూమి క్రమంగా కుంగడం ప్రారంభమైంది. ప్రస్తుతం జకార్తాలో ఏటా 25 సెం.మీ. మేర భూమి కుంగిపోతోంది. కొన్నిచోట్లయితే నేల సముద్రమట్టానికి 4 మీటర్ల దిగువకు చేరుకుంది. భూతాపం కారణంగా సముద్రమట్టం పెరుగుతోంది. ఫలించని ప్రయత్నాలు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జకార్తాను కాపాడుకునేందుకు ఇండోనేసియా ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. జవా సముద్రం ఆటుపోట్లను అడ్డుకునేలా ఓ పొడవైన గోడతో పాటు కృత్రిమ దీవులను నిర్మించాలని అధ్యక్షుడు జోకో విడోడో ప్రతిపాదించారు. ఇందుకు రూ.2.84 లక్షల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులోభాగంగా ఇప్పటివరకూ 32 కిలోమీటర్ల మేర భారీ సముద్రపు గోడను, 17 కృత్రిమ దీవులను నిర్మించారు. అయితే ఇది సమస్యకు అనుకున్న పరిష్కారం చూపలేకపోయింది. ఈ భారీ సముద్రపు గోడ నుంచి చాలాచోట్ల నీరు ఊరటం ప్రారంభమైంది. మరికొన్ని చోట్ల ఈ గోడే నేలలోకి కుంగిపోవడం ప్రారంభించింది. దీంతో రాజధానిని తరలించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చేసింది. అయితే జకార్తాలోని మూడోవంతు ప్రాంతం మునిగిపోతే లక్షలాది మంది ఇండోనేసియా ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదముంది. వీరందరికీ ఆశ్రయం కల్పించడం ఇండోనేసియా ప్రభుత్వానికి నిజంగానే సవాలుగా మారనుంది. -
గాలి ఎటు వస్తే అటు తిరిగే ఈ ఇళ్లు అద్భుతం
న్యూయార్క్: మన ఇల్లు కాస్తంత కదిలేతేనే ఒళ్లంతా జలదరించిపోయి బయటకు పరుగులు తీస్తాం.. అలాంటిది గాలి ఎటు వస్తే అటు వైపే ఇళ్లు మొత్తం తిరిగేలా ఉండి అందులో ఉండాల్సి వస్తే.. ఉండగలరా.. అసలు అలాంటి నిర్మాణం సాధ్యమేనా.. అంటే అది సాధ్యమని చూపించడమే కాదు అందులో ఉండవచ్చని కూడా ఓ ఇద్దరు వ్యక్తులు నిరూపించారు. అలెక్స్ షెవెదర్, వార్డ్ షెల్లీ అనే ఇద్దరు 2007నుంచి కలిసి పనిచేస్తున్న ప్రముఖ ఆర్టిస్టులు. అద్భుతంగా గృహనిర్మాణాలు చేయడంలో వీరు సిద్ధహస్తులు. ఇప్పటి వరకు భిన్న విధాల నిర్మాణాలను ఆవిష్కరించిన ఆ ఇద్దరు సరికొత్తగా ఆలోచించారు. అంతరిక్షంలో తేలియాడే వస్తువుపై ఉంటే ఎలాంటి ప్రభావం పడుతుందో అన్న ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే గాల్లో తేలియాడే నివాస నిర్మాణానికి తెరతీశారు. న్యూయార్క్ లోని గెంట్ లో గల ఓమి ఇంటర్నేషనల్ ఆర్ట్స్ సెంటర్ లో ఒక పెద్ద గుండ్రటి సిమెంట్ పిల్లర్ ఏర్పాటుచేసి దానిపై గాలి ఎటువస్తే అటు తిరిగేలా రియాక్టర్ అనే ఓ ఇంటిని నిర్మించారు. 8అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటుచేశారు. అనంతరం ఏంచక్కా వారిద్దరు ఆ ఇంట్లో ఐదు రోజులు గడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది కేవలం గాలికి తిరగడమే కాదు.. వీరు నడుస్తున్న సందర్భంగా వారి బరువుకు తగినట్లుగా వంగిపోవడం కూడా జరుగుతోంది. ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు పలువురు రాగా ఆ ఐదు రోజుల్లో తాము పొందిన అనుభవాలను వారికి వివరించారు. రెండు సంవత్సరాలపాటు ఈ గృహాన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ లో కొద్ది రోజులు వారిద్దరు ఈ ఇంట్లోనే ఉంటారంట. ఈ ఐదు రోజుల్లో వారు ఆ ఇంట్లో ఉండి తుపానును కూడా సమర్థంగా ఎదుర్కున్నారు.