MPHA
-
ఆత్మహత్యలే శరణ్యం
సాక్షి, అమరావతి: ‘మేం 22 ఏళ్లుగా పనిచేస్తున్నాం. దాదాపు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నాం. కోర్టు తీర్పు అమలుకు గడువు ఉన్నా కనీసం ప్రత్యామ్నాయం చూపకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా మమ్మల్ని ఆగమేఘాల మీద రోడ్డుపాలు చేసింది. ఈ వయసులో ఎక్కడికి వెళ్లగలం... కుటుంబాలను ఎలా పోషించుకోగలం... ఇక మాకు ఆత్మహత్యలే శరణ్యం...’ అంటూ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ (ఎంపీహెచ్ఏ) మేల్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎంపీహెచ్ఏ నియామకాల్లో విద్యార్హతల వివాదంపై తెలంగాణ హైకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా 982 మందిని ప్రభుత్వం ఇటీవల విధుల నుంచి తొలగించింది. తీర్పు అమలుకు మూడు నెలలు సమయం ఉన్నా వారం రోజుల వ్యవధిలోనే తమను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీహెచ్ఏలు మండిపడుతున్నారు. హైకోర్టు తీర్పు పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని, అయితే అక్కడి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. కానీ, రెండు దశాబ్దాలకు పైగా ప్రజలకు సేవలు అందించామన్న సానుభూతి చూపించకుండా కూటమి ప్రభుత్వం తొలగించిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.రెండేళ్లలో రిటైర్ కావాల్సి ఉందినా వయసు 58 ఏళ్లు. రెండేళ్లలో రిటైర్ అవ్వాలి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం నుంచి అక్రమంగా తొలగించారు. నాపై ఆధారపడి పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులున్నారు. ఈ వయసులో మమ్మల్ని రోడ్డున పడేస్తే మేం ఏం చేయాలి. నాలాంటి వాళ్లు ఎందరో ఉన్నారు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. లేదంటే మా అందరికీ ఆత్మహత్యలే శరణ్యం. – జీవీవీ ప్రసాద్, రాష్ట్ర కన్వీనర్, ఏపీ పారా మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్జీవితం తలకిందులైందినా వయసు 48 ఏళ్లు. మా అబ్బాయి ఎంబీఏ చేస్తున్నాడు. ఉన్నపళంగా రోడ్డునపడేశారు. జీవితం అగమ్యగోచరంగా మారింది. ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు. వచ్చే అరకొర వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటూ నా కుమారుడిని చదివించుకుంటూ నెట్టుకొస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం నుంచి తొలగించడంతో జీవితం తలకిందులైంది. ఈ వయసులో మేం బయట ఏ ఉద్యోగాలకు వెళ్లగలం. ప్రభుత్వం తీరు బాధాకరం. – బి.వెంకటరత్నం, ఆచంట, పశ్చిమ గోదావరి జిల్లాకోర్టు ఆదేశాల మేరకే: ఎంటీ కృష్ణబాబుతెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకే ఎంపీహెచ్ఏ (మేల్)లను విధుల నుంచి తొలగించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఒరిజినల్ నోటిఫికేషన్లో రాష్ట్రవ్యాప్తంగా 1,378 ఖాళీలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అయితే జీవో నంబర్ 1,207, కోర్టు ఆదేశాల పేరిట 1,832 మంది అదనంగా విధుల్లో చేరారని తెలిపారు. ఈ నియామకాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని కోర్టు స్పష్టం చేసిందన్నారు. అంతేకాకుండా ఎస్ఎస్సీ విద్యార్హతతో మెరిట్ ఆధారంగా నోటిఫై చేసిన పోస్టులను భర్తీ చేయాలని తీర్పులో పేర్కొన్నారని వివరించారు.ఈ నియామకాలకు సంబంధించి ఇప్పటికే 299 రిట్ పిటిషన్లు, కోర్టుధిక్కరణ కేసులు నమోదు కాగా, ఒక డీఎంహెచ్‌వోకు జైలు శిక్ష విధించడంతోపాటు ఐఏఎస్ అధికారులకు జరిమానాలను కూడా కోర్టు విధించిందని తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పటికీ రోజూ కోర్టులో కేసులు పడుతున్న క్రమంలో వివాదానికి పుల్‌స్టాప్ పెట్టడం కోసం తెలంగాణ హైకోర్టు తీర్పును అమలు చేస్తూ 982 మంది ఎంపీహెచ్ఏలను తొలగించామని చెప్పారు. తెలంగాణలో కోర్టు కేసుల బెడద లేదని, అందుకే అక్కడ వేగంగా కోర్టు తీర్పు అమలు చేయలేదన్నారు. ఈ అంశంపై భవిష్యత్‌లో సుప్రింకోర్టు తుది తీర్పును ఇస్తే దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. -
ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఏఎన్ఎంలు, ఎంపీహెచ్‌ఏల ధర్నా
సుల్తాన్‌బజార్(హైదరాబాద్): కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఏ, ఏఎన్ఎంలను క్రమబద్ధీకరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో గురువారం కోఠి డీఎంహెచ్ఎస్ ప్రాంగణంలో ఏఎన్ఎంలు పెద్దఎత్తున ఆందోళన చేశారు. సమస్యలు పరిష్కరించాలని నినదించారు. సంఘం ప్రధానకార్యదర్శి యాదనాయక్ మాట్లాడుతూ ఏఎన్ఎంలు, ఎంపీహెచ్ఏలు పని ఒత్తడికి గురవుతున్నారని, వారి పనిభారాన్ని తగ్గించాలని అన్నారు. జాబ్‌చార్ట్ ప్రకారం పనిచేయించాలని, సిబ్బంది సెలవులు రద్దు చేయొద్దని కోరారు. పీహెచ్సీ, యూపీహెచ్‌సీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంపీహెచ్(ఎఫ్)ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరారు. బదిలీలు, వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఎంపీహెచ్ఏ(ఎఫ్) శిక్షణకు ధరఖాస్తు చేసుకొండి
భద్రాచలం : భద్రాచలంలో నిర్వహిస్తున్న ఎంపీహెచ్ఏ (ఎఫ్) శిక్షణకు అర్హులైన గిరిజన మహిళా అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ ఇంచార్జి పీవో రాజీవ్ గాంధీ హన్ముంతు తెలిపారు. 2017–18 సంవత్సరానికి గాను మొదటి సంవత్సరంలో ప్రవేశానికి గాను ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఇంటర్ ఏ గ్రూపు చదివిన వారైనా ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 17 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలన్నారు. అడ్మిషనల్ కోసం http:chfw.telengana.gov.in వెబ్ సైట్లో ధరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని, వాటిని పూర్తి చేసి, భద్రాచలంలోని ఎంపీహెచ్ఏ ట్రైనింగ్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు అందజేయాలన్నారు. ఈ నెల 17 సాయంత్రం 5గం.ల్లోపు అందిన ధరఖాస్తులనే పరిగణలోకి తీసుకోవటం జరుగుతుందని, అర్హులైన గిరిజన మహిళాఅభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
కలెక్టరేట్ నుంచి దూకిన ఉద్యోగ సంఘాల నేత
-
కలెక్టరేట్ నుంచి దూకిన ఉద్యోగ సంఘాల నేత
కాకినాడ: పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చటర్జీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన కాకినాడ కలెక్టరేట్ భవనం వద్ద చోటు చేసుకుంది. గత 10 నెలలుగా పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంపై చటర్జీ గత కొద్దికాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటూ కాకినాడ కలెక్టరేట్ భవనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కలెక్టరేట్ భవనంపై నుంచి దూకినట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన చటర్జీని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పది నెలల నుంచి జీతాలు రాకపోవడంతో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు(ఎంపీహెచ్ఏ) ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం నుంచి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం వద్ద బైఠాయించిన వీరు రాత్రి డీఎంహెచ్ఓ కార్యాలయ భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ నిరసన తెలిపారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డి.చటర్జీ మాట్లాడుతూ మే 15 నాటికి జీతాలు చెల్లిస్తామని కలెక్టర్ నీతూ ప్రసాద్ గత నెల 17న తమకు హామీ ఇచ్చారని.. అయితే జీతాల కు సంబంధించిన బడ్జెట్ ఇంకా విడుదల కాలేదన్నారు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అవస్థలు పడుతున్నారని...సక్రమంగా జీతాలు రాకపోవడంతో గండేపల్లి పీహెచ్సీలో ఎంపీహెచ్‌ఏగా విధులు నిర్వహిస్తున్న జగన్ మురళి సుమారు 15 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులకు వెల్లడించారు. తమకు జీతాలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని, మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన చటర్జీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఉద్యోగులను విషాదంలోకి నెట్టింది.